Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గణతంత్ర వేడుకల్లో అపశృతి! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2022

గణతంత్ర వేడుకల్లో అపశృతి!

భారత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గణతంత్ర వేడుకల్లో ఈసారి అపశృతి నెలకొనబోతున్నదా? అవును నిజమే అనే సమాధానం వస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత. ఎన్ని వేలసార్లు చెప్పుకునా ఈ భావన చెక్కుచెదరదు. ఉపఖండాన్ని పోలిన ఈ సువిశాల భారతావని భిన్న జాతుల, భిన్న మతాల, భిన్న భాషల, భిన్న సంస్కృతుల సంగమం సామరస్యం సహజీవనం మహౌత్కృష్టమైనదని వివేకానందుడు ఏనాడో చెప్పాడు.
   ప్రతిఏటా గణతంత్ర వేడుకలు వీటినే ప్రతిబింబిస్తాయి. ఎక్కడ, ఏ మూలన ఉన్నా మన దేశ ప్రజల శక్తి సామర్థ్యాలు ఒకేచోట ఎలుగెత్తి చూపడానికి ఇదో వేదిక అవుతుంది. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రం, ఒక సంస్కృతి నుండి మరో సంస్కృతి పరస్పరం స్ఫూర్తి పొందడమే గాకుండా బాహ్య ప్రపంచానికి కూడా భారతీయత అంటే ఇది కదా..! అని తేటతెల్లమవుతుంది.
   ఈసారి జనవరి 26న రాజధాని ఎర్రకోటలో జరిగే 73వ గణతంత్ర దినోత్సవం ఈ ఘన సాంప్రదాయానికి నీళ్ళు వదలనున్నదా..? అనే అనుమానం రాక మానడం లేదు.
   మొదటిది బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సాంస్కృతిక ప్రజ్ఞా పాటవాలు, వైజ్ఞానిక ప్రగతి బాటలు తెలియజెప్పే నమూనా శకటాల ప్రదర్శనలకు గణతంత్ర వేడుకలో తావివ్వలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొరపెట్టుకున్నా రక్షణమంత్రిత్వశాఖ ససేమిరా... కుదరదు అని మొండిగా అంటున్నది. ఆయా రాష్ట్ర ప్రజల సృజన శీలతను ఇది అవమానించడమేకాదు, మనోభావా లను గాయపరచడం కూడా అవుతుందని రాజకీయ విజ్ఞులు అంటున్నారు.
   ముఖ్యంగా ఈ విరుద్ద పద్ధతిని పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, విజయన్‌, స్టాలిన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ అంశం చినికి చినికి గాలివాన కాకముందే ప్రధాని మంత్రి మోడీ జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. కాని అనేక జాతీయ, సర్తసత్తాక, సారన్వభౌమ, ప్రజాస్వామ్య అత్యవసర విషయాల్లో ప్రధాని ఎలా ఉలుకు పలుకు లేకుండా మిన్నకున్నారో ఇప్పుడూ అలాగే మిన్నకుంటున్నారు. ఇలా అయితే మన జాతీయ సమైక్యతను దేశ సమగ్రతను సంరక్షించేదెవరు? ఇక ప్రజలే రక్షించుకోవాలి అని ఆ విజ్ఞులు భావిస్తున్నారు.
   గణతంత్రం అంటే రిపబ్లిక్‌. ప్రజారాజ్యం. దేనిలోనైతే అత్యున్నత రాజ్యాధికార సంస్థలు ఒక నిర్దిష్ట కాలానికి ప్రజలచే ఎన్నుకోబడతాయో ఆ ప్రభుత్వ రూపాన్నే మనం రిపబ్లిక్‌ అంటున్నాం. దేశాధ్యక్షుడైన రాష్ట్రపతి ఈ సందర్భంగా జాతికి ప్రత్యక్ష సందేశం ఇస్తారు. రాజకీయాలకు అతీతమైన సమకాలీన భారత విశిష్టతను అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పే శుభ తరుణమది. కాని ఇలాంటి మహౌన్నత సమయాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత సంకుచితంగా స్వార్థపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? భారతీయతకు కళంకం కాదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.
   కాగా, ఆజాదీ అమృతోత్సవ్‌ పేరిట 75ఏండ్ల దేశ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్నది. నిజం చెప్పుకోవాలంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిస్తేనే దేశం, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదురించడంలో ఎక్కడవారికి అక్కడ లెక్కలేనన్ని సాహసోపేతమైన వీరోచిత అనుభవాలు ఉన్నాయి. అశేష ప్రాణత్యాగాలు ఉన్నాయి. అసలు ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటమే భారత ప్రజలనందరిని ఒక్క తాటిపై నిలిపిందనే విషయం మరువరాదు. అలాగే దోపిడీ, పీడనల వ్యతిరేకంగా సాగిన పారంపర్య పోరాటా లను తమ జాతి గర్వకారణాలుగా ఇలాంటప్పుడు చెప్పుకోవడం ప్రతీతి. ఇప్పుడు ఈ శకటాలను అడ్డుకోవడం ద్వారా మా ఘనమైన వారసత్వ విజయాలను మరుగుపర్చాలన్న కేంద్రం దుష్టతలంపు కనిపిస్తున్నదని ఆ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. స్వాతంత్య్రపోరాటం అనుభవంలేని పార్టీకి ప్రజల త్యాగాల గురించి, సాహసాల గురించి ఏం తెలుస్తాయి? అని అడుగుతున్నాయి.
   సామాజిక రుగ్మతలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నారాయణ గురు కేరళ శకటాన్ని తిరస్కరించడమంటే ఏమిటి? దేశంలో ఇంకా సామాజిక వివక్షలు కొనసాగాలని బీజేపీ కోరుకుంటుందా? అని ఆగ్రహంతో అడుగుతున్న ప్రశ్నకు కేంద్రం జవాబు చెప్పలేకున్నది. ఎటు నుండి ఎటు చెప్పుకున్నా రాష్ట్రాలమీద కేంద్రం చేసే ఈ చర్య అ ప్రజాస్వామ్య, అవాంచనీయ రాజకీయ ఆధిపత్యం తప్ప మరేమీ కాదనేది స్పష్టమవుతున్నది.
   మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలకు ప్రదర్శనలో చోటుండాలి. కానీ కొన్ని శకటాలకే.. అవి బీజేపీ ఏలుబడిలో ఉన్న వాటికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే వేడుకలు ముగింపు సందర్భంగా అబైడ్‌ విత్‌ మీ (నాతోనే ఉండు) అనే కీర్తన ఆలపించి బీటెంగ్‌ రిట్రీట్‌తో సమాప్తం చేస్తారు. మహాత్మాగాంధీకి ఇది చాలా ఇష్టమైన కీర్తన. 1847లో ఆంగ్లకవి హెన్రీ ప్రాన్సిస్‌ ఈ కీర్తన రచించారు. 1950 నుండి ఇది వేడుకల్లో ఆనవాయితీగా వస్తున్నది. గాంధీ సిద్ధాంతాలను, భావనలను గ్రోసిపుచ్చి గాడ్సే ఆలోచనలకు పట్టంకట్టే దుర్మార్గానికి బీజేపీ పూనుకుంటున్నదని కాంగ్రెస్‌ విమర్శించింది. 'అబైడ్‌ విత్‌ మీ' కీర్తనను తొలగించడాన్ని చివరకు శివసేన సైతం తప్పుపట్టింది. కరుడుకట్టిన మూసబోసిన భావనలు అమలు చేయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతున్నది.
కొసమెరుపు: వైవిద్యమనేది ప్రాకృతిక సమాజ ధర్మం. ప్రాణులన్నింటికీ ఇది వర్తిస్తుంది. వనంలో ఎన్నో రకరకాల వృక్షాలు, జీవాలు ఉన్నాయి. ఉదాహరణకు బోధి వృక్షాలు ఎన్ని ఉన్నా రూపంలోను, ఫలవంతంలోను ఎంతో వ్యత్యాసం. మానవులూ అంతే. ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ మనిషి మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అయితే ఆ ఆలోచన, ఆచరణ, సృజనశీలత మానవ కళ్యాణానికి వినియోగించాలి గాని విధ్వంసానికి కాదు.
   వేల సంవత్సరాల క్రితమే బుద్ధుడు చేసిన బోధ ఇది. ఆ క్రమంలోనే 'సత్యం - అహింస' తన తత్వజ్ఞాన ప్రచారానికి వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకుని విభిన్న గుణాల గలవారిని శిష్యులుగా స్వీకరించి వారి అంతర్గత సామర్థ్యాన్ని ఎరుకపరిచి రుజు మార్గంలో పయనించేలా కర్తవ్య బోధ చేశాడు.
కాని ఇప్పుడు ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తత్‌విరుద్ధంగా అపసవ్య దిశలో పయనిస్తున్నది కదూ....
- కె. శాంతారావు
సెల్‌:9959745723

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.