Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యూపీ సమాజంలో బీజేపీ నిర్మించిన కులాల కోటగోడకు బీటలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

యూపీ సమాజంలో బీజేపీ నిర్మించిన కులాల కోటగోడకు బీటలు

త్వరలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల్లో మిక్కిలి ఆసక్తికరమైన రాష్ట్రంగా నిలుస్తున్నది ఉత్తరప్రదేశ్‌ అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ ఎన్నికలు 80శాతం ప్రజలకి, 20శాతం ప్రజలకు మధ్య పోరాటంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యానిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలమధ్య మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టైనా విజయం సాధిస్తామన్నదే దీని అంతరార్థం.
   కానీ గతవారం వారు ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ - ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్మిత కుల ఆధారిత విభజన రాజకీయ కోట పగుళ్లు చూపటం ప్రారంభంమైంది. కీలకమైన మంత్రులే కాక పలువురు శాసనసభ్యులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. చాలా మంది సమాజ్‌వాదిపార్టీలో చేరారు. అంతేకాదు, త్వరలో మరికొంత మంది కూడా రాజీనామా చేస్తారన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా రాజీనామా చేసేవారిలో యాదవేతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన వారేనని భోగట్టా.
   గత కొన్ని సంవత్సరాలుగా యూపీలో అన్ని ఎన్నికలను గెలుస్తూ వచ్చిన పార్టీ బీజేపీ. అంతేకాదు, వ్యవస్థాగతంగా, ఆర్థికపరంగా బలమైన మూలాలు కలిగిన పార్టీ బీజేపీ. అందుకే గత ఐదేండ్లుగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆర్‌ఎస్‌ఎస్‌కి ఒక ప్రయోగశాలగా మారింది. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు నరేంద్ర మోడీ తరువాత ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ను భావిస్తున్నాయి. గతేడాది ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ మేధావి వ్యక్తిగత సంభాషణల్లో భాగంగా నాతో మాట్లాడుతూ ''యోగి ఆదిత్యనాథ్‌ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేకుండానే అతని ఆహార్యం, హిందూత్వ పట్ల అతనికి గల అచంచల విశ్వాసం వల్ల ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం అని పిలవ్వచ్చు'' అని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు అతని నాయకత్వంలోనే బీజేపీ నుండి వలసలు ప్రారంభమయ్యాయి.
   ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఈ వలసలన్నీ ఎలక్షన్స్‌ ముందు సాధారణంగాజరిగే, కోరుకున్న టిక్కెట్టు రాకపోవడం వల్ల జరిగే వలసలేనా? లేక అంతకన్నా లోతైన సంకేతం ఏదైనా ఇందులో ఇమిడి ఉందా? నిజంగా ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ కూటమికి వెనకబడిన తరగతులలోగల సామాజిక పునాది బీటలు వారుతున్నదా? అన్నదే.
మండల్‌ నుండి కమండలానికి
   ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ వ్యూహకర్తలు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిందేమిటంటే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో వలే యూపీలో సైతం మేము ఇతర వెనుకబడిన వర్గాలలో చీలికలు సృష్టించి, వారిని మండల్‌ రాజకీయాల నుండి కమండల రాజకీయాల వైపు, అంటే హిందుత్వ వైపు తేగలిగామని. ఒకవేళ వారన్నది నిజమే అయితే ఇంత పెద్దఎత్తున ఈ వలసలకు కారణం ఏమిటో వారే వివరించాలి. స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌, ధరమ్‌ సింగ్‌సైని వంటి పెద్ద నాయకులు తమ టికెట్లకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఎందుకు తిరుగుబాటు చేశారో వివరించాల్సిన అవసరం ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ కూటమికి ఉంది.
   మతతత్వ వాదానికీ, లౌకికవాదానికీ మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నపటికీ, గత ఏడేండ్లుగా వెనకబడ్డ వర్గాల ప్రజలు హిందూత్వ నుండి దూరం కావటానికి సమాజంలో తమ వాటా పొందటంలో వెనుకబడ్డామని క్రమంగా గ్రహిస్తుండటమే కారణం. సామాజిక న్యాయం తమకు దక్కటం లేదనీ, పరిపాలనలో, ఉద్యోగాలలో కూడా తమ వాటా తమకు దక్కకుండా పోతున్నదన్న విషయాన్ని వారు గ్రహించారు. ప్రజాపాలనలో కూడా తమ భాగస్వామ్యం లేకుండా పోతోందనీ, తాము నామమాత్రంగా మిగిలిపోతున్నామనీ వారు భావిస్తున్నారు. కానీ బీజేపీ నాయకత్వం ఈ సమస్యను గుర్తించడానికిగానీ, పరిష్కరించడానికిగానీ ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనర్గళ ఉపన్యాసాలూ, ఎల్లెడలా కనిపించే సంఫ్‌ు పరివార్‌ యొక్క యంత్రాంగం, పార్టీ దగ్గర ఉన్న లెక్కలేనన్ని నిధులు, అలాగే ఎలక్షన్ల నిర్వహణలో దానికి ఉన్నటువంటి నైపుణ్యం తమను రాబోయే ఎన్నికల్లో కూడా గట్టెక్కిస్థాయని వారు ఎంతగా చెప్పుకున్నప్పటికీ ఈ తిరుగుబాటు మాత్రం వారిని కలవరపరుస్తున్నది.
మసకబారుతున్న బీజేపీ ప్రభావం
   కానీ, నా అంచనా ఏమిటంటే, ఉత్తరప్రదేశ్‌లోని వెనకబడిన వర్గాలలో బీజేపీ అనుకూల హిందూత్వ అనుకూల ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీనికి కారణం కేంద్రంలో బలమైన ఓబీసీ నాయకుడు కనిపించకపోవడం ఒకటైతే, రాష్ట్రంలో కూడా ఓబిసికి చెందిన బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిత్వంలో పూర్తిగా అప్రధానమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. బీజేపీ కూడా కేశవ్‌ ప్రసాద్‌ని అతని మాటల గారడీతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నది. నిజానికి మోడీ స్వయంగా తాను ఓబీసీ అని చెప్పుకున్నప్పటికీ ఓబీసీ వర్గాల ప్రజల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో ప్రజలు ఆయన్ని ఇక ఎంత మాత్రం బీసీల ప్రతినిధిగా భావించటం లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తరువాత ఆయనను కార్పొరేట్ల ప్రతినిధిగానే ఓబీసీ వ్యవసాయక వర్గాల ప్రజలు భావించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతే కాదు, ఆయనను సాంప్రదాయక అగ్రవర్ణాల భావజాల మైన ''హిందూత్వ'' ప్రతినిధిగానే వారు భావిస్తున్నారు. అంతేకాదు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించటం కూడా ఆయనకున్న ఓబీసీ ఇమేజిని పూర్తిగా మసకబార్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల తీవ్ర ఒత్తిడికిలోనై తీసుకువచ్చిన ఇటువంటి రాజ్యాంగేతర సవరణల వల్ల ఓబీసీ వర్గాల యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.
   ఈ తీవ్ర వ్యతిరేకతను సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆ యువత వెలిబుచ్చింది. ఆలిండియా వైద్య కోర్సుల విషయంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లను అమలు పరచడంలో నష్టకరంగా వ్యవహరించిన తీరు వల్ల ఓబీసీ యువతలో బీజేపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత నెలకొని ఉంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యకు వ్యతిరేకంగా తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తీసుకున్న చర్యలకు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ ఓబీసీ యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వైద్య కోర్సుల్లో ఓబీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించడాన్ని హర్షిస్తూ హిందీ మాట్లాడే రాష్ట్రాల ఓబీసీ యువత నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు సాంఘిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. సమాజంలో బలమైన గొంతుక కలిగిన ఓబీసీ నాయకత్వం కూడా బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకోవటానికి మరో కారణం ఏమిటంటే జస్టిస్‌ జి రోహిణి కమిషన్‌ నివేదిక ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి బీజేపీ పూనుకోవడమే.
వ్యవసాయం, జనాభా లెక్కల విషయంలో సమస్యలు
   దేశంలోని మిగిలిన అన్ని వర్గాల వలనే ఓబీసీ ప్రజానీకం కూడా ద్రవ్యోల్బణం, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నది. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలవల్ల యూపీలో ఉద్యోగిత తగ్గిపోయి నిరుద్యోగిత ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రైతాంగంతో పాటు ఉత్తరప్రదేశ్‌ రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నది. అందులో ఓబీసీ రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొన్నదనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాన్ని అణచి వేసిన తీరు పట్ల ఓబీసీ వ్యవసాయదారులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక మూడవదీ మరీ ముఖ్యమైనదీ ఏమిటంటే కులగణన డిమాండును బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చటం. కుల గణనకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వల్ల బీజేపీపై అసంతృప్తిని ర్యాలీల ద్వారా సెమినార్‌ల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఆయా వర్గాలు ఒక్క చోట కాదు వారణాసి, ఘాజీపూర్‌, జాన్పూర్‌, లక్నో వంటి అనేక ప్రాంతాలలో తెలియజేశాయి.
   ఈ కారణాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి తాము నిర్మించామని చెప్పుకుంటున్నా విభజన ఆధారిత, మతవిద్వేష ఆధారిత కోటకు పగుళ్ళు ఏర్పడ్డాయి అని చెప్పక తప్పదు. అయితే సమీప భవిష్యత్తులో ఏం జరుగనున్నది అన్న విషయం చెప్పటం కష్టం. కానీ, రేపటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నిక బీజేపీకి ఎంతమాత్రం నల్లేరు మీద నడక కాదు.
అనువాదం :టి. హరికష్ణ,
- ఉర్మిలేష్‌
సెల్‌:9494037288

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.