Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సామాజిక శాస్త్రాలు-దాస్యబుద్ధి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

సామాజిక శాస్త్రాలు-దాస్యబుద్ధి

సామ్రాజ్యవాద దోపిడీ, ఆధిపత్యం కొనసాగాలంటే మూడో ప్రపంచ దేశాలలోని ప్రజల మనసుల్ని లోబరుచు కోవడం కీలకం అవుతుంది. వలసవాద ఆధిపత్యం వలసదేశంలోని అన్ని రంగాలలోనూ వ్యక్తం ఔతుంది. అయితే ఇక్కడ మనం విద్యావేత్తల మేధస్సులపై వలసాధిపత్యం గురించి, అందులోనూ, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన విద్యావేత్తల గురించి ప్రస్తుతం చర్చిద్దాం...
   మూడో ప్రపంచ దేశాల్లో సమస్యలు ప్రధానంగా సామాజికమైనవి. అందుచేత ఇక్కడ సామాజిక శాస్త్రాలు కీలకమైనవి అవుతాయి. వలస పాలనలో సామ్రాజ్యవాదం సాగించే దోపిడీకి, తాము ఎదుర్కుంటున్న సమస్యలకి ఏ సంబంధమూ లేదనే విధంగా సామ్రాజ్యవాదం ఆ మూడో ప్రపంచ దేశాల ప్రజల మనస్సులను ప్రభావితం చేస్తుంది. (నిజానికి, సామ్రాజ్యవాదుల వలన దేశానికి చాలా ప్రయోజనం కలిగింది అన్న అభిప్రాయాన్ని కూడా కలుగజేస్తుంది). ప్రస్తుత కాలంలోనైతే 'ఇక సామ్రాజ్యవాదం ఎక్కడుంది?' అన్న విధంగా భావించేలా చేస్తున్నది. ఆ క్రమంలో సమాజం ఎదుర్కుంటున్న వివిధ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితికి ఆ మేధావులను తీసుకువస్తుంది.
   సామాజికాభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం మీద ఒక కధనాన్ని ముందుకు తేవడం మనస్సుల్ని లోబరుచుకోవడంలో తొలిమెట్టు. ఇటు వలస దేశాల్లో కాని, అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోగాని జరిగే సామాజిక పరిణామాలకు, సామ్రాజ్యవాదానికి ఎటువంటి సంబంధమూ లేదన్నట్టుగా ఈ కధనం ఉంటుంది. ఆర్థిక శాస్త్రం నుండి ఒక ఉదాహరణను ఇక్కడ ఇవ్వవచ్చు.
   అయితే, 19వ శతాబ్దపు తొలి అర్థభాగంలో (అంటే 1800-1850 మధ్య కాలంలో) ఆఫ్రికా నుండి రెండు కోట్లమందికి పైగా బానిసలు అమెరికా ఖండానికి ఎందుకోసం తరలించబడ్డారో రాబర్ట్‌ సోలోవ్‌ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతం అంగీకరించేవారికి అర్థం కాదు. అలాగే 1850-1914 మధ్య కాలంలో చైనా నుండి, ఇండియా నుండి 5 కోట్ల మందికిపైగా కాంట్రాక్టు కూలీలు భారీ సంఖ్యల్లో అదే అమెరికా ఖండానికి ఎందుకు తరలించబడ్డారో ఈ సిద్ధాంతం వివరించజాలదు. ఇక రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఇండియా, పాకిస్థాన్‌, వెస్ట్‌ ఇండీస్‌ల నుండి బ్రిటన్‌కు, ఆల్జీరియా నుండి, ఇతర ఫ్రెంచి వలసలనుండి ఫ్రాన్స్‌ దేశానికి, టర్కీ నుండి జర్మనీకి ఎందుకు కార్మికులు ఎక్కువ సంఖ్యల్లో తరలించబడ్డారో కూడా అది చెప్పదు. పెట్టుబడి తనకు అవసరమైన కార్మికశక్తి కోసం ప్రపంచంలోని ఓ వైపు నుండి ఇంకో వైపుకు జనాల్ని భారీగా పలు సందర్భాల్లో తరలిస్తూనేవుంది. అంతే కాని, ఏ దేశానికి ఆ దేశంలోని పెట్టుబడిదారులు తమవద్ద కార్మికులకు కొరత ఏర్పడితే దానిని తీర్చుకోడానికి తమ దేశపు సరిహద్దులకే పరిమితమైపోయి వ్యవహరిస్తూ, తమవద్ద పోగుబడిన మిగులును దిగువకు పంపిణీ చేస్తూ కూచోలేదు. కాని ''ప్రధాన ప్రవంతి'' ఆర్థిక సిద్ధాంతాలు మనకు ఇంతవరకూ చెప్పింది ఇదే.
   పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులకి ఎప్పుడూ రిజర్వు సైన్యం (నిరుద్యోగులు) అందుబాటులో ఉంటూనేవున్నారు. దానితోబాటు ఆ పెట్టుబడిదారులకు ఎప్పుడు కావాల్సివచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందుబాటులోనే ఉన్నారు. అంటే తగినంతమంది కార్మికులు లేకపోవడం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎప్పుడూ లేదు. ఏదైనా ఒక దేశంలో కొరత ఉన్నా ప్రపంచంలోని తక్కిన చోట్లనుంచి తెచ్చుకుంటూనేవున్నారు.
   ఆ విధంగా ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్థవృధ్ధి గురించి చాలా అడ్డగోలుగా వక్రభాష్యాలు చెప్తోంది. వాస్తవాలకి పూర్తి విరుద్ధంగా ఉండే విషయాలను చెప్తోంది. ఎందుకిలా చేస్తోంది? పెట్టుబడిదారీ వ్యవస్థను చాలా 'అందంగా' చూపించాలనే తాపత్రయమే దీనికి కారణం. ఆ చిత్రీకరణలో సామ్రాజ్యవాదం అనేది ఎక్కడా కనిపించదు. యుద్ధాలు, స్వాధీనం, హింస వంటివి మచ్చుకైనా అందులో కనపడవు. ప్రధాన స్రవంతి ఆర్థికసిద్ధాంతాలన్నీ ఇదే విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని చాలా అందంగా, లోపరహితంగా చిత్రీకరించడానికి పూనుకుంటాయి. ఆ సిద్ధాంతాలు వాస్తవాలని ఎంత సరిగ్గా వివరించగలవు అనే కొలబద్ద కన్నా. అవి వినడానికి ఎంత బాగుంటాయి అన్నదానిని బట్టే ఆ సిద్ధాంతాలకి ప్రచారం లభిస్తోంది. వాస్తవాన్ని వివరించలేదు కాని, ఆ సిద్ధాంతాల వెనక చాలా మేధస్సు, చాకచక్యం దాగున్నాయని మనం మరిచిపోకూడదు. ఆ మిరుమిట్లు గొలిపే మేధాశక్తి గాని, ఆ చాకచక్యం గాని వాస్తవాలను అర్థం చేసుకోడానికి మనకి తోడ్పడవు. అంతే.
   మరి ఆ సిద్ధాంతాలకి అంత ప్రాచుర్యం ఎలా వచ్చింది? ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినవారు కుట్ర పూరితంగానో, దురుద్దేశాలతోనో వాటిని రూపొందిచారని కూడా మనం చెప్పలేం. మానసిక దాస్యం అనేది కేవలం మూడో ప్రపంచ దేశాల మేధావులకే కాక, సంపన్న, పెట్టుబడిదారీ దేశాల మేధావులకి కూడా వర్తిస్తుంది. ఒకవేళ ఆ మేధావుల్లో ఎవరైనా వాస్తవాలను శోధించడానికి పూనుకుంటే, 'అనుమతించబడిన' హద్దులను అతిమ్రించడానికి సిద్ధపడితే, అప్పుడు వారికి పెద్ద పెద్ద పేరున్న సంస్థల్లో పోస్టింగులు నిరాకరించబడతాయి, లేదా ప్రమోషన్లు ఆగిపోతాయి, లేదా వారి పరిశోధనలు ప్రచురణకు ఎక్కడా స్వీకరించబడవు, లేదా రావలసిన బహుమతులు ఆగిపోతాయి. దాంతో వారు బుద్ధిగా హద్దుల్లో వ్యవహరించడం మొదలుపెడతారు. అంతేకాదు, ఆ హద్దులను చాలా గట్టిగా సమర్థించడానికి పూనుకుంటారు. తక్కినవారిని ఆవలికి నెట్టి 'అవకాశాలను తామే చేజిక్కించుకుంటారు. ఇందులో ప్రత్యేకించి ఏ దురుద్దేశ్యమూ లేదు. ఇది 'లోకరీతి'. అంతే.
   మూడో ప్రపంచ దేశాల్లోని మేధావులలో చాలామందిని సంపన్న పెట్టుబడిదారీ దేశాల యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా నియమించడం ఒక కారణం. ప్రపంచ యుద్ధాలకు ముందు కాలంలో ఇది అరుదు. అటువంటి నియామకాలు జరగడం, లేదా అటువంటి అవకాశాలు ఉండడం వలన ఈ మూడవ ప్రపంచ మేధావులలో చాలామంది ముందే (పెట్టుబడిదారీ) లైన్లోకి వచ్చేస్తారు. వలసపాలననుండి విముక్తి పొందిన అనంతర కాలంలో మూడవ ప్రపంచ దేశాల్లో అనేకమంది మేధావులు తయారయ్యారు. తమ తమ రంగాల్లో పేరు, ప్రఖ్యాతులు తెర్చుకోవాలన్న ఆకాంక్షలు వీరిలో బలంగా ఉంటాయి. ఆ పేరు ప్రఖ్యాతులు సంపన్న పెట్టుబడిదారీ దేశాల మేధావులకు, అక్కడి విద్యా సంస్థలకు ప్రధానంగా అప్పటిదాకా పరిమితం అయివుంటాయి. అందుచేత ఆటోమేటిక్‌గా ఈ మూడో ప్రపంచ దేశాల మేధావులంతా ఆ ప్రభావానికి లోనవుతారు.
   దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందంటే దానర్ధం ఆ యా వృత్తుల్లో ఉండే ఆధిపత్య పరిస్థితిలో కూడా మార్పు వచ్చేసిందని కాదు. ఇప్పటికీ సంపన్న, పెట్టుబడిదారీ దేశాలే ఈ రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ పరిస్థితిలో తమ తమ కెరీర్లలో ముందుకు పోవడం అంటే నచ్చినా, నచ్చకపోయినా సంపన్న పెట్టుబడిదారీ దేశాల సిద్ధాంతాలను ఆమోదించడమే. దీని ఫలితంగా జాతీయోద్యమ కాలంలో ఎంతో కొంతమేరకు కలిగిన మానసికదాస్య విముక్తి కాస్తా ఇప్పుడు రివర్స్‌ అయిపోయింది.
   ఇక నయా ఉదారవాద విధానాలు వచ్చాక సామ్రాజ్యవాదానికి మానసికంగా ఊడిగం చేస్తున్నామనే అంశమే గమనంలో లేకుండా పోయింది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వర్తించే ఆర్థిక సూత్రాలు ఒక మూడో ప్రపంచదేశంలో యధాతధంగా వర్తించవు అన్న స్పృహ కూడా కరువైంది. ఆ విధంగా ఆలోచించడమంటేనే కాలం చెల్లిన భావనలను పట్టుకుని వేళ్ళాడడమన్న అభిప్రాయం బలపడింది. ఆ జాతీయోద్యమ కాలంలో దాదాభారు నౌరోజీ, లేదా రమేష్‌చంద్ర దత్‌ వంటి మేధావులు సామ్రాజ్యవాద దోపిడీ ఏవిధంగా సాగిందో చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనాలను సంపన్న దేశాల యూనివర్సిటీలు కావాలనే పక్కన పెట్టాయి. చాలా యూనివర్సిటీలలో వాటిగురించి తెలియనే తెలియదు. ప్రపంచవ్యాప్తంగా సిలబస్‌ ఒకే విధంగా ఉండాలనుకున్నాక, ఇక్కడ మన దేశంలో కూడా వారి అధ్యయనాల గురించి పట్టించుకోవడం మానేస్తాం. ఆ క్రమంలో సామ్రాజ్యవాదానికి అనుకూలమైన మానసిక దాస్యంలోకి జారిపోతాం.
   ఇప్పుడు జాతీయ విద్యా కమిషన్‌ మన దేశంలోని బోధనాంశాలకు, విదేశీ యూనివర్సిటీల బోధనాంశాలకు మధ్య సారూప్యత, సమన్వయం ఉండాలని కోరుతోంది. అంటే ఇక ఈ మానసిక దాస్యం ఇప్పుడు పూర్తిగా వ్యవస్థీకృతం కానున్నదన్నమాట.
   మానసిక దాస్యం నుండి బైట పడడం అంటే హిందూత్వ జాతీయవాద దురహంకార వైఖరిని స్వీకరించడం కాదు. నిజానికి అటువంటి వైఖరి, మానసిక దాస్యం నుండి బైటకు రావడం - రెండూ రెండు వేరువేరు ప్రపంచాలు. హిందూత్వ జాతీయవాద ధోరణి మానసిక దాస్యాన్ని మరింత పెంచుతుంది. వాస్తవాలను వక్రీకరించడం, మూఢత్వాన్ని బలపరచడం సంపన్న. పెట్టుబడిదారీ దేశాల సామాజిక శాస్త్రాలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ లక్షణం హిందూత్వ జాతీయ వాదానికి అభ్యంతరకరం ఎంతమాత్రమూ కాదు. ఆ సంపన్న దేశాలలో చెలామణీ అయే సామాజిక శాస్త్రాల మూలాలు ప్రాచీన భారతదేశంలోనే ఉన్నాయన్న సర్టిఫికేట్‌ను పొందితే చాలు వీళ్ళకి. కుదిరితే ఆ సర్టిఫికేట్లేవో ఆ సంపన్న దేశాల యూనివర్సిటీలే ఇస్తే మరీ బాగుంటుందనుకుంటారు కూడా. గత ప్రభుత్వాల హయాంలో స్వాతంత్య్రానంతర కాలంలో మన దేశంలో ఉన్నత విద్యారంగంలో నిర్మించుకున్న సంస్థలను, వాటిద్వారా సాధించిన కొద్దిపాటి విజయాలను కూడా నాశనం చేసివేయడంలో వీళ్ళ మూర్ఖత్వం, బుద్ధిమాంద్యం వ్యక్తం అవుతున్నాయి. హిందూత్వ వాదానికి తలొగ్గని సృజనాత్మకతను దేనినీ వీళ్ళు బతకనివ్వడం లేదు. ఈ క్రమంలోనే సంపన్న పెట్టుబడిదారీ దేశాలనుండి వారి సిద్ధాంతాలను, భావజాలాన్ని ఏ విధమైన విమర్శనాత్మక పరిశీలనా లేకుండా ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. తద్వారా ఆ భావాల, సిద్ధాంతాల ఆధిపత్యానికి తలొగ్గుతున్నారు.
   ఇక్కడ మానసిక దాస్యం నుండి బైట పడడం అంటే విదేశాలలోని సామాజిక శాస్త్రాలను పూర్తిగా తిరస్కరించడం కాదు సుమా. ఆ సంపన్న దేశాల సామాజిక శాస్త్రాలను యధాతధంగా, పూర్తి విశ్వాసంతో స్వీకరించడాన్ని వ్యతిరేకించాలి. సామ్రాజ్యవాద దోపిడీని కనపడకుండా మసిపూసిన సిద్ధాంతాలే నిజమైన సామాజిక శాస్త్రాలుగా చెలామణీ కావడాన్ని వ్యతిరేకించాలి. బూర్జువా వర్గానికి మొదట్లో ఆర్థిక శాస్త్రం అవసరంగా ఉండేది. కాని ఆ తర్వాత వారికి ఆర్థిక శాస్త్రం కన్నా వారి ఆధిపత్యాన్ని సమర్థించే సిద్ధాంతమే అవసరం అయిందని కార్ల్‌ మార్క్స్‌ అన్నాడు. అందుకే నిజమైన శాస్త్రంగా ఆర్ధిక శాస్త్రాన్ని పెంపొందించే కర్తవ్యం కార్మికవర్గం భుజాలపై పడింది. దానిని కార్మికవర్గ దృక్పధం నుంచే కొనసాగించాల్సి ఉంటుంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని ఇతర సామాజిక శాస్త్రాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. నిజమైన సామాజిక శాస్త్రాల అభివృద్ధి జరగాలంటే అది వలసవాదదోపిడీకి గురైనవారి దృక్కోణం నుండి జరగాలే తప్ప ఆ వలసదోపిడీని సమర్థించే కోణం నుండి కాదు.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్‌పట్నాయక్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సుందరయ్య వారసత్వాన్ని నిలబెడదాం...
అసాధారణ విప్లవకారుడు హౌచిమిన్‌
వ్యవసాయసమస్యకు ప్రాధాన్యతనిచ్చిన సుందరయ్య
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి
ఇండోనేషియా కమ్యూనిస్టు ఊచకోత వెనుక బ్రిటన్‌!
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య
మానవత్వంలేని పెట్టుబడిదారీ వ్యవస్థ
నెత్తుటి మరక
కేసీఆర్‌ సార్‌... దావత్‌ గట్టిగాచేస్కోవాలే..
యాత్రలు - మాత్రలు
తాజ్‌నుంచి నర్మదదాకా విద్వేష విభజన
ఒక్క చాన్స్‌!
మ్యూజిక్‌ థెరపీ...
అలుసు...
శాఖాహార వినియోగం సాంస్క ృతిక నిర్బంధ ఆచారం
కార్పొరేట్‌ విధానాలను ఓడించాలి...
నా ఆశల్ని మీరెలా ఆక్రమిస్తారు?
మత రాజ్యాల నుండి నేర్చుకునేదేమిటి?
పరిశోధనల్ని పక్కన పెట్టిన విశ్వవిద్యాలయాలు
హేతువాద దృక్పథాన్ని ప్రక్కదారి పట్టించే గీతాబోధన
ప్రణాళికలేని రాష్ట్ర వ్యవసాయ రంగం
'ఇల్లాలి' ఆత్మహత్య..! ఎవరిదీ బాధ్యత!
వందేండ్ల చైనా కమ్యూనిస్టు యూత్‌లీగ్‌...
''ఐపీఓ'' అనగా...
వంటింట్లో మండుతున్న గ్యాస్‌
చావులోనూ విద్వేషమేనా..?
ఆహారం-వలసాధిపత్య వ్యతిరేక పోరాటం
'మధ్యతరగతి'.. అంటే ఎవరు?
ప్రశ్నిస్తున్న 'పత్రం'
త్రికోణ రాజకీయంలో తెలంగాణ

తాజా వార్తలు

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.