Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''ఐపీఓ'' అనగా... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 11,2022

''ఐపీఓ'' అనగా...

                 ఐపీఓ అనగా ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌. ఏదైనా ఒక కంపెనీ మూలధన సేకరణ కోసం తన వాటాలను స్టాక్‌ మార్కెట్‌ ద్వారా వివిధ రకాల వాటాదారులకు మొదటిసారి వాటాలను అమ్మడానికి చేసే ప్రయత్నాన్ని ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ అంటారు. ఈ ఐపీఓ ద్వారా సదరు కంపెనీ ముందుగానే నిర్ణయించుకున్నంతమేరకు మూలధనాన్ని సేకరిస్తుంది. కంపెనీ దగ్గర మొత్తం ఎన్ని వాటాలు ఉన్నాయో, అందులో ఎన్ని వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించాలి అనుకుంటుందో, అట్టి వాటాలను ఏ రకమైన నిష్పత్తిలో రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఇన్సిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, ఫారిన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టర్లు, ఇతరులందరికీ అందజేయనున్నారో సదరు వివరాలన్నీ సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు (సెబి) రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ ద్వారా సమర్పించి అనుమతి పొందవలసి ఉంటుంది.
ఏ కంపెనీ అయినా వాటాల విక్రయానికి స్టాక్‌ మార్కెట్లో రిజిస్టర్‌ అయి ఉండాలి. ఈ స్టాక్‌ మార్కెట్‌, సెక్యూరిటీస్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా నియమనిబంధనల ప్రకారం పనిచేస్తోంది. ఎల్‌ఐసీ 632.5 కోట్ల వాటాలను కలిగి ఉన్నది. ఇందులో 3.5శాతం అనగా 22.1 కోట్ల వాటాలను అమ్మనున్నది. దీని ద్వారా 21వేల కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యవసానంగా ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఏకైక యజమానిగా ఉన్న సంస్థ ఇకనుండి కేంద్ర ప్రభుత్వంతో పాటు వాటాదారులు అందరూ కూడా యాజమాన్యంలోకి వస్తారు.
ఎల్‌ఐసీ ఐపీఓ అనంతరం దాని బిజినెస్‌ మోడల్‌తో పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ ప్యాటర్న్‌ కూడా మార్పు కాబోతున్నది. మెచ్యూరిటీ విలువ కలిగిన కన్వెన్షనల్‌ పాలసీలతో పాటు మరణానంతరం మాత్రమే చెల్లించబడే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల అన్నింటిపై లభించే రాబడిని కలిపి పాలసీదారులకు యజమానికి పంపకం జరిగేది. ఇకముందు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై వచ్చే రాబడిని వాటాదారులకు మాత్రమే చెల్లించాలని చట్టంలో మార్పులు చేయడం జరిగింది. ఇన్నాళ్లుగా సంస్థ సంపాదించిన లాభాల్లో ఐదుశాతం యజమాని అనగా ప్రభుత్వానికి, 95శాతం పాలసీదారులకు పంపకం జరిగేది. ఇకనుండి అది 10 నిష్పత్తి 90గా ఉండనున్నది. ఈ రెండు మార్పుల వలన పాలసీదారుల ప్రయోజనాల కన్నా వాటాదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతున్నది. ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయివేటు కంపెనీలన్నీ అమలుపరుస్తున్నవి. సంపాదిస్తున్న లాభాలలో ఎక్కువ మొత్తాన్ని పాలసీదారులకు ఇవ్వవలసిందిగా ప్రయివేటు కంపెనీలకు చెప్పవలసింది పోయి ప్రభుత్వ కంపెనీని బలవంతంగా తమ లాభాల పంపక విధానాన్ని మార్చుకోమనడం గర్హనీయం.
ఈ ఐపీఓ అనంతరం అంతగా లాభాలకు ఆస్కారంలేని అనేక ఆఫీసులను కుదించే ప్రమాదం ఉన్నది. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు బీమా సౌకర్యాన్ని కల్పించాలన్న జాతీయోద్యమ లక్ష్యం దెబ్బతింటుంది. ఈరోజు ప్రయివేటు కంపెనీల సగటు పాలసీ ప్రీమియం 95 వేల రూపాయలు ఉంటే ఎల్‌ఐసీ సగటు ప్రీమియం 25 వేల రూపాయలు ఉన్నది. అనగా తక్కువ ప్రీమియం చెల్లించే తక్కువ ఆదాయం గల వారికి అత్యంత చేరువలో ఎల్‌ఐసీ మాత్రమే ఉన్నది. సగటు ప్రీమియం ఎక్కువగా ఉన్న చోట లాభాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. అందుచేత ఎల్‌ఐసీ యొక్క బిజినెస్‌ మోడల్‌ లాభాపేక్ష వైపు మరల్చే ప్రక్రియలో తక్కువ ఆదాయం గల వారిని విస్మరించే ప్రమాదం కూడా ఉన్నది. మైక్రో ఇన్సూరెన్స్‌ పేరుమీద నిరుపేదలైన స్వయం సహాయక బృందాలన్నింటికీ కూడా నామమాత్రపు ప్రీమియంకి బీమా సౌకర్యాన్ని ఎల్‌ఐసీ మాత్రమే కల్పిస్తున్నది. గత 65 ఏండ్లుగా, ఎల్‌ఐసీ సేకరించిన పొదుపు నంతా ఎక్కువ శాతం మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా ఇస్తూ వచ్చింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూర్చి పెట్టింది ఎల్‌ఐసీ. రోడ్లు, రవాణా, విద్యుత్తు ప్రాజెక్టులు, మున్సిపాలిటీల మెయింటెనెన్స్‌ల వంటి వాటన్నిటికీ ఎల్‌ఐసీ నిధులను సమ కూర్చింది. వాటాదారుల క్షేమమే ప్రధానమైనప్పుడు మైక్రో ఇన్సూరెన్స్‌లు మౌలిక వసతుల కల్పనలు మరుగునపడి పోవలసిందే.
జీవిత బీమా అనేది దీర్ఘకాలిక కాంట్రాక్టు. అది నమ్మకం కలిగిన సంస్థ చేతిలో ఉంటే మరణానంతరం మిగిలిన వారికి ప్రతిఫలాన్ని కచ్చితంగా చెల్లించే అవకాశం ఉన్నది. ఈ అంశం భారతీయులలో బాగా నాటుకుని ఉండడం వల్లనే ఈ ఇరవై ఏండ్ల ప్రయివేటు బీమా కంపెనీల ఆగమనం అనంతర కాలంలోనూ ఎల్‌ఐసీ 75శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నది. ఇన్సూరెన్స్‌ రంగంలో ఎఫ్‌డీఐని 49శాతానికి పెంచుతూ 2015లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క ప్రయివేటు కంపెనీ కొత్తగా నమోదు కాలేదు. దీనర్థం ప్రయివేటు కంపెనీలను భారత ప్రజానీకం నమ్మే పరిస్థితిలో లేదు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ సెక్టార్లో ఐపీఓకి వెళ్ళిన రెండు కంపెనీలలోని వాటాల రేట్లు తక్కువస్థాయిలోనే ఉన్నవి. బీమా రంగం నిరంతర ఒడిదుడుకులను చవిచూడలేదు కాబట్టి ఈ పరిస్థితి నెల కొన్నది. అందువలన ఎల్‌ఐసీలో ఐపీఓను వ్యతిరేకిం చడం, సంస్థను అత్యంత ఘనంగా ఆదరించడమే ఈ ప్రయివేటీకరణ విధానాన్ని తిప్పికొట్టే వజ్రాయుధం.

- జి. తిరుపతయ్య
  సెల్‌: 9951300016

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విశాల సమాజ ప్రయోజనాల కోసమే...
మరింత బక్కచిక్కిన రూపాయి
సబ్‌ కా సాత్‌ సబ్‌ క సత్తేనాశ్‌?
ఆర్థిక వ్యవస్థలో 'సీఏ'ల పాత్ర
చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సమాజం
అగ్నిపథ్‌ హానికరమైన పథకం
పురుషాధిక్యత ఓ ఎన్నికల పాచిక!
రష్యా, చైనాలపై దాడే జర్మన్‌ జి7 శిఖరాగ్రసభ లక్ష్యం!
బహుళ ప్రజాదరణ పొందిన డిజిటల్‌ కెమెరా
నేను భయపడను అంకుల్‌...
అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.