Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

కార్మిక బంధువు కామ్రేడ్‌ పచ్చిమట్టల పెంటయ్య

కామ్రేడ్‌ పెంటయ్య గీత వృత్తి కుటుంబంలో పుట్టి, బతుకుదేరువు కోసం 45ఏండ్ల క్రితం రామన్నపేట ఏరియా నుండి సూర్యాపేటకు వచ్చారు. మొదట్లో చిన్నపాటి రైస్‌ మిల్లులో హమాలి వృత్తిని ఎంచుకొని జీవనం కొనసాగిస్తూనే కార్మికుల సమస్యలపై, వేతన ఒప్పందం విషయంలో యజమానులతో రాజీలేని పోరాటం చేస్తూ కార్మికులకు బంధువు అయ్యారు. చదువు రాకున్నా, అనుభవంతో రాజకీయాలను ఔపోసనపట్టారు. సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు రాయించడం, అధికారులతో మాట్లాడం, రేట్లపై యజమానులను ఒప్పించి, మెప్పించి, అవసరం అనుకుంటే సమ్మెకు కూడా కార్మికులను సిద్ధం చేసేవారు.
పెంటయ్యతో నాకు 1999 నుండి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ట్రేడ్‌ యూనియన్‌ రంగానికి నీకు తోడుగా ఎవరు ఉంటారని కామ్రేడ్‌ వి.ఎన్‌ పెంటయ్యను అడగగానే, నెమ్మాది అయితే బాగుంటుందని సూచించారు. అప్పుడు కామ్రేడ్‌ విఎన్‌ నన్ను ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో పని చేస్తావా అని అడిగారు. నేను సిద్ధమే అని చెప్పగానే మెదక్‌జిల్లా సంగారెడ్డికి 10 రోజుల శిక్షణ తరగతులకు పంపించారు. కానీ పెన్‌పహాడ్‌ మండల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో మండల పార్టీ బాధ్యతలు చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రతి వేతన ఒప్పందంలో పెంటయ్య నన్ను చర్చలకు తీసుకెళ్ళేవాడు. కార్మికుల సమస్యలపై ఉద్యమాల సందర్భంగా నన్ను తప్పనిసరిగా చేసేవారు. అందుకే పెంటయ్య నాకు ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో మొదటి గురువు. పార్టీ విచ్ఛిన్నం తర్వాత ట్రేడ్‌ యూనియన్‌ రంగాన్ని తన భుజం మీద పెట్టుకొని కొద్దీ రోజుల్లోనే అన్నీ ప్రధాన రంగాలను తిరిగి సీఐటీయూలోకి తీసుకొచ్చి సూర్యాపేటలో అగ్ర భాగాన నిలబెట్టారు. మార్కెట్‌ కార్మికులు, మున్సిపల్‌ కార్మికులు, కూరగాయల మార్కెట్‌ హమాలీలు, పారబోయిల్డ్‌ హమాలీలకు ఏ సమస్య వచ్చినా, అర్థరాత్రి తలుపు కొట్టినా కాదనకుండా వెళ్లేవారు. అప్పగించిన బాధ్యత పూర్తి అయ్యేంత వరకు విశ్రమించేవారు కాదు.
ఆరోపణలకు దూరంగా నిలిచిన కామ్రేడ్‌
స్వార్థం, అవినీతి దరిదాపుల్లోకి రానివ్వని నిజాయితీ గల నాయకుడు పెంటయ్య. 50ఏండ్లుగా కార్మిక రంగంలో పని చేస్తూ ఏనాడూ అవినీతి, ఆరోపణలకు, పార్లమెంటరీ భ్రమలకు గురికాని మచ్చ లేని నాయకుడు పెంటయ్య.
సుందరయ్య నగర్‌ ఇండ్ల స్థలాల పోరాటం
ఇండ్ల స్థలాల పోరాటంలో తన వయస్సును కూడా లెక్క చేయకుండా ముందు భాగాన నిలిచారు. సూర్యాపేటలో ఇండ్లులేని పేదలందరిని సమీకరించి 72,73 సర్వే నెంబర్‌లో 18ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎర్రజెండాలు పాతి ఆరునెలల పాటు ఎడతెరిపి లేకుండా ఎన్నో నిర్బంధాలనెదురుకుని పోరాడారు. ఒకపక్క వందలాది మంది ప్రత్యేక పోలీసు దళాలు పేదల గుడిసెలపై దాడి చేసి, మహిళలు అని కూడా చూడకుండా, మానవత్వం మరిచి అర్థరాత్రి దాడి చేయగా... మరోపక్క ఆ పేదలకు అండగా నిలబడి, వందలాది పోలీసులను ఒక్కడుగా ఎదిరించి పోరాడిన కామ్రేడ్‌ పచ్చి మట్టల పెంటయ్య. ఆ సందర్భంగా జరిగిన అక్రమ కేసుల్లో జైలుపాలయినా పెంటయ్య అధైర్య పడలేదు.
సీఐటీయూ డివిజన్‌ అధ్యక్షుడుగా పెంటయ్య
కామ్రేడ్‌ పెంటయ్య సుదీర్ఘ కాలం సీఐటీయూ సంఘానికి డివిజన్‌ అధ్యక్షుడుగా పని చేసారు. నిరంతరం కార్మికుల చుట్టే నిలిచిన వ్యక్తి. కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు, యజమానులతో వైద్య ఖర్చులు ఇప్పించేంత వరకు పోరాడేవారు. ఆయన వేసిన పునాది వల్ల సీఐటీయూ నేటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. వందలాది మంది కార్మికులను పేరు బెట్టి పిలిచే అరుదైన జ్ఞాపక శక్తి ఆయన సొంతం. ప్రతి కార్మికుని సెల్‌ ఫోన్‌ నెంబర్‌ను చూడకుండా నోటికి చెప్పేవారు. ఉపన్యాసం చెప్పినా సరళమైన భాషలో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరించే వాడు. సుదీర్ఘ కాలం కార్మిక రంగంలో పని చేసిన పెంటయ్య అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఏ ఒక్క రోజూ కార్యక్రమాలకు దూరంగా లేడు. ప్రతి కార్యక్రమంలో ముందుండే వారు. ఆయన ప్రతి ప్రజా సంఘాల కార్యక్రమంలో జెండా పట్టుకొని నిలిచాడు. ఏ మహాసభలు జరిగినా అప్పగించిన పనిని బాధ్యతగా చేసేవారు. ట్రేడ్‌ యూనియన్‌ రంగానికే పరిమితం కాకుండా విద్యార్థి, యువజన, మహిళా, రైతు, కూలి పోరాటాల్లో చురుకుగా పాల్గోని బహుళ సంఘాల నిర్మాణంలో కృషి చేసారు. 2021 మే 10న లాక్‌డౌన్‌లో పెంటయ్య అనారోగ్యంతో మరణించారు. కుటుంబ సభ్యులు లేకున్నా పార్టీ ఆఫిస్‌లోనే తన భౌతికకాయాన్ని ఉంచి దహన సంస్కారాలు చేయడం జరిగింది.
పెంటయ్య అంతిమ యాత్రలో ఆయన అనుచరులం కడదాకా నడిచి జోహార్లు అర్పించగా, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి చితికి నిప్పంటించారు. ఆయన చనిపోయి నేటికీ సవంత్సరం దాటింది. కామ్రేడ్‌ పెంటయ్య ప్రధమ వర్థంతి నేడు సూర్యాపేట లోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో జరుగు తున్నది. కార్మికులూ, పార్టీ కార్యకర్తలూ, నాయకులు జిల్లా నలు మూలల నుండీ తరలివస్తున్నారు. నిజాయి తీకి, కమ్యూ నిస్టు నిబద్దతకూ మారుపేరుగా నిలిచిన కామ్రేడ్‌ పెంటయ్యకు విప్లవ జోహార్లు.

- నెమ్మాది
వెంకటేశ్వర్లు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విశాల సమాజ ప్రయోజనాల కోసమే...
మరింత బక్కచిక్కిన రూపాయి
సబ్‌ కా సాత్‌ సబ్‌ క సత్తేనాశ్‌?
ఆర్థిక వ్యవస్థలో 'సీఏ'ల పాత్ర
చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సమాజం
అగ్నిపథ్‌ హానికరమైన పథకం
పురుషాధిక్యత ఓ ఎన్నికల పాచిక!
రష్యా, చైనాలపై దాడే జర్మన్‌ జి7 శిఖరాగ్రసభ లక్ష్యం!
బహుళ ప్రజాదరణ పొందిన డిజిటల్‌ కెమెరా
నేను భయపడను అంకుల్‌...
అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.