Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

రవాణా బంద్‌ ప్రజాబంద్‌గా మారాలి

మోటారు వాహన చట్టం-2019ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం తేది: 4-10-2021న ఇచ్చిన గెజిట్‌ నెం. జిఎస్‌ఆర్‌ 714(ఇ) రద్దు చేయాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌, లారీ తదితర సంఘాలతో కూడిన జేఏసీ మే 19న ఒక్కరోజు 'రవాణా బంద్‌'కు పిలుపునిచ్చాయి. ఈ జేఏసీలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్‌టియుసి, ఐఎఫ్‌టియులతో పాటు రాష్ట్ర పాలక పార్టీ టీఆర్‌ఎస్‌ అనుబంధ టీఆర్‌ఎస్‌కెవి కూడా భాగస్వామిగా ఉంది.
భారతదేశంలో ప్రమాదాలలో ఏడాదికి 5లక్షల మందికి పైగా గాయపడుతున్నారని, 1.5లక్షల మంది మరణిస్తున్నారని, ప్రజలకు భద్రత కల్పించడం కోసమే ఎం.వి. యాక్ట్‌ 1988 స్థానంలో 2019ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. రోడ్‌ సేఫ్టీ బిల్‌-2014తో ప్రారంభించి, కార్మికవర్గ పోరాటాలతో అనేక రూపాంతరాలు చెందింది. 2017లో బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో ఆమోదింపజేసుకోలేకపోయింది. 16వ లోక్‌సభ రద్దయి, 17వ లోక్‌సభ ఏర్పడడంతో ఎం.వి. యాక్ట్‌ 2017 కూడా రద్దయింది. తిరిగి 2019లో లోక్‌సభలో ప్రవేశపెట్టి, జూలై 23న లోక్‌సభలో ఆమోదం, జూలై 31న రాజ్యసభ ఆమోదం పొంది, 2019 ఆగస్టు 9న రాష్ట్రపతి ఆమోదముద్రతో 2019 సెప్టెంబర్‌ 1 నుండి చట్టరూపంలో అమలులోకి వచ్చింది. ఇప్పుడు ఆ చట్టంలోని అనేక సెక్షన్లకు ప్రత్యేక గెజిట్స్‌ను విడుదల చేసి వాటిని అమల్లోకి తీసుకువస్తున్నారు. అలా ముందుకు వచ్చిందే గెజిట్‌ నెం.714(ఇ). ఈ గెజిట్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేయడానికి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందడానికి ఫీజులను, 15ఏండ్లు వయసు దాటిన వాహనాలకు చెల్లించాల్సిన ఫీజులను నిర్ధేశిస్తున్నది. రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ కోసం అప్లయి చేయడంలో జాప్యం జరిగితే మోటారు సైకిల్‌ అయితే నెలకు రూ.300లు, ఇతర నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలైతే నెలకు రూ.500లు ఫైన్‌గా చెల్లించాలి. 15ఏండ్లు దాటిన వాహనాలు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే మోటారు సైకిల్‌కు రూ.1,000లు, మూడు చక్రాల వాహనమైతే రూ.3,500లు, తేలికపాటి వాహనం అయితే రూ.10,000లు, హెవీ గూడ్స్‌, పాసింజర్‌ వాహనమైతే రూ.12,500లు ఫీజు చెల్లించాలి. వీటితో పాటు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కాలపరిమితి ముగిసిన కాలానికి ప్రతి రోజుకు రూ.50ల చొప్పున చెల్లించాలని నిర్ధేశిస్తున్నది. ఉదాహరణకు ఒక ఆటో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లాప్స్‌ అయి ఒక ఏడాది అయితే రూ.3,500 + 18,250 = రూ.21,750లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహన యజమానులకు తీవ్రమైన భారంగా ఉండడంతో బంద్‌ పిలుపుకు దారి తీసింది.
ప్రజలకు భారంగా మారనున్న అనేక నిబంధనలు
భారత రాజ్యాంగం ప్రకారం రవాణా అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర నిబంధనలు, రూల్స్‌ చట్టాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎం.వి. యాక్ట్‌-2019 ద్వారా ఆ రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం తనకు దఖలు పర్చుకున్నది. రాష్ట్రాల పరిధిలో ఉన్న సేల్స్‌ ట్యాక్స్‌ను జీఎస్‌టీ ద్వారా కేంద్రం తన పరిధిలోకి ఎలా తీసుకున్నదో అలా అన్నమాట. అలాగే టూరిస్టు పర్మిట్‌ నిబంధనలు సరళతరం చేసింది. రూ.15,000 నుండి రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ఏ రాష్ట్రానికైనా, సమయాలతో సంబంధం లేకుండా ఎన్నిసార్లైనా స్టేజీ క్యారేజీలాగా ప్రయాణీకులను ఎక్కించుకొని పోవచ్చు. ఈ నిబంధనల మార్పు ఫలితంగా ఆర్టీసీ బస్‌లకు అవకాశం కల్పించారు.
అలాగే ఈ చట్టం యాప్‌ ఆధారిత సంస్థల ద్వారా నడిచే ''అగ్రిగ్రేటర్స్‌'' సంస్థలను అనుమతించారు. కేవలం యాప్‌ మాత్రమే కలిగిన సంస్థ (ఓలా, ఊబర్‌, ఎల్‌వైఎన్‌కె) వాహన యజమాని, డ్రైవర్‌ నుండి తాను సంపాదించు కున్న దానిలో 35శాతం కాజేస్తున్నాయి. సరుకు రవాణా, ప్రజల రవాణాలోను కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించిన ఫలితంగా ఒకటి, రెండు వాహనాలు కలిగిన యజమానులు ఈ రంగం నుండి బయటకు నెట్టివేయబడ్తున్నారు.
ఇటీవల ఆర్టీసీ సంస్థ ప్యాసింజర్‌ సేఫ్టీ సెస్‌ పేరుతో ప్రతి ప్రయాణికుడి నుండి ఒక్క రూపాయి వసూలు చేస్తున్నది. ప్రమాదాలు జరిగినప్పుడు చెల్లిస్తున్న కాంపెన్సేషన్‌ కోసం ఈ డబ్బులు వినియోగిస్తామని చైర్మన్‌ చెప్పారు. థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ నుండి ఆర్టీసీ ఇప్పుడు మినహాయింపు పొందింది. ఎం.వి. యాక్ట్‌ 2019లోని సెక్షన్‌ 145(ఱ) ప్రకారం థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ను కంపల్సరీ చేశారు. ఇది అమలులోకి వస్తే ఒక టీఎస్‌ఆర్‌టీసీ పైననే రూ.350 కోట్లు వరకు అదనపు భారం పడుతుందని అంచనా. ఇది నేరుగా ప్రజలు భరించాల్సి వస్తుంది.
తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు అయింది. 77 షెడ్యూల్డ్‌ పరిశ్రమలలో కనీస వేతనాలు సవరించమని కార్మికవర్గం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీతాలు పెరగక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్‌టీసీ సంస్థలోని కార్మికులకే ఐదు డీఏలు అమలు కాని పరిస్థితి ఉంది. ఎంవి యాక్ట్‌ 2019లో నిర్ధేశించిన ఫైన్స్‌కు పెరుగుతున్న ద్రవ్యోల్పణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 1న 10శాతం ఫైన్‌ పెరిగేలా నిర్థేశించారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది. రోజూ కష్టపడుతున్నా కార్మికునికి కరువు భత్యం, కనీస వేతనం పొందాలంటే ఆందోళనలు చెయ్యాలి. కానీ ప్రభుత్వం ఒక చిన్న క్లాజ్‌తో ప్రజలపై ఫైన్‌ల భారం పెంచుతోంది.
చట్టంలో నిర్ధేశించిన ఫైన్‌లను రాష్ట్ర ప్రభుత్వం సవరించవచ్చని చట్టం చేస్తున్నది. అయితే కేంద్రం చట్టంలో ప్రతిపాదించిన ఫైన్‌లను తగ్గించడానికి వీలులేదు. కానీ వాటిని 1 నుండి 10 రెట్లు పెంచడానికి మాత్రం అనుమతించారు. అధికారులు ఇచ్చే ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఫైన్‌ను రూ.2,000కు పెంచారు. ఎటువంటి ఉత్తర్వులు ఉన్నాయో దానిలో స్పష్టత ఇవ్వలేదు. ప్యాసింజర్‌ ఓవర్‌లోడ్‌ అయితే ప్రతి ప్యాసింజర్‌కు రూ.1,000లు ఫైన్‌ చెల్లించాలి. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000లు జరిమానా వేస్తారు. ఇటువంటివే అనేకరకాల ఫైన్‌లు పెంచారు. కొన్నింటికి జైలు శిక్షలు కూడా ప్రతిపాదించారు. మన రాష్ట్రంలో ఇప్పటికే అవి అమలులోకి వస్తున్నాయి.
ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్స్‌లోనే చేయించాలి. అవన్నీ కూడా ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే ఏర్పాటు చేసాయి. అలాగే వాహనాల రిపేరింగ్‌ కూడా ఆథరైజ్డ్‌ షోరూంలలోనే చేయించాలి. ఐఎస్‌ఐ మార్కు ఉండి ఆథరైజ్డ్‌ షోరూంలలోని మెటీరియల్‌ వాడాలి. ఇది అమలులోకి వస్తే ప్రతి ఊరిలో రిపేర్లు చేసుకొని జీవనం గడుపుతున్న లక్షలాది మంది మెకానిక్‌లు ఏమైపోతారు? చిన్న చిన్న ఆటోమొబైల్‌ షాపుల ద్వారా జీవనం సాగిస్తున్న వారంతా ఏమైపోవాలి ?
ఇలా వివరించుకుంటూ పోతే ప్రజా వ్యతిరేకమైన అనేక అంశాలు మనకు అర్థం అవుతాయి. మొత్తంగా రవాణా రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడం చట్టం లక్ష్యంగా ఉంది.
రాష్ట్రంలో పాలక పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ మొదట బిల్లు పట్ల వ్యవరేకత తెలిపినా, తర్వాత లోక్‌సభలోను, రాజ్యసభలోను బిల్లు చట్ట రూపం దాల్చేందుకు ఓటు చేసింది. ఈ చట్టంలో ప్రతిపాధించిన ఫైన్‌లు, ఇతర అనేక అంశాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూనే ఉంది. అటువంటి పార్టీ ఈరోజు తన లైన్‌ను మార్చుకొని ఎం.వి. యాక్ట్‌ 2019ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటన చేస్తూ ఆందోళనలో కలిసి వస్తున్నది. ఆ నేపథ్యంలో మే 19న ఈ బంద్‌తోటి పోరాటం ఆగిపోకూడదు. ప్రజా వ్యతిరేకమైన అంశాలలో సమూలమైన మార్పులు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలి. అలా ప్రజలను చైతన్యపరచాలి. అతి త్వరలోనే ప్రజలే స్వచ్ఛందంగా ''రవాణా బంద్‌'' పాటించే రోజు వచ్చేలా చేయాలి.

- పుష్పా శ్రీనివాస్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విశాల సమాజ ప్రయోజనాల కోసమే...
మరింత బక్కచిక్కిన రూపాయి
సబ్‌ కా సాత్‌ సబ్‌ క సత్తేనాశ్‌?
ఆర్థిక వ్యవస్థలో 'సీఏ'ల పాత్ర
చిన్నాభిన్నం అవుతున్న భారతీయ సమాజం
అగ్నిపథ్‌ హానికరమైన పథకం
పురుషాధిక్యత ఓ ఎన్నికల పాచిక!
రష్యా, చైనాలపై దాడే జర్మన్‌ జి7 శిఖరాగ్రసభ లక్ష్యం!
బహుళ ప్రజాదరణ పొందిన డిజిటల్‌ కెమెరా
నేను భయపడను అంకుల్‌...
అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.