Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాలరైతుకు మార్కెట్‌రేటు చెల్లించరా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 21,2022

పాలరైతుకు మార్కెట్‌రేటు చెల్లించరా?

పాల రైతులందరికీ ఛార్జీలు, లాభదాయకమైన ధరను నిర్థారించాలని కోజికోడ్‌లో జరిగిన ఆల్‌ ఇండియా డైరీ ఫార్మర్స్‌ వర్క్‌షాప్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. డెయిరీ సహకార సంఘాలు, ప్రయివేటు కార్పొరేట్‌ డెయిరీల మధ్యవర్తుల ద్వారా పాల రైతులకు లభించే ధరలో ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాలధర సగానికి తగ్గి రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. అయితే పెద్ద పెద్ద డెయిరీ కార్పొరేట్‌, సహకార సంస్థలు ఆకర్షణీయమైన లాభాలను ఆర్జించాయి. పారిశ్రామిక మిగులు విలువ ఆధారిత పాల ఉత్పత్తులను, సహకార సంఘాలతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు పాల ఉత్పత్తిదారులతో వారి నుంచి సేకరించిన పాల నిష్పత్తి ప్రకారం అదనపు ధరకు పంచుకునేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరించి, పాడిపరిశ్రమను చేర్చి, కనీసం రెండు పాల జంతువులు(ఆవు, గేదె) ఉన్న రైతులందరికీ 100రోజుల కూలీ, సహకార సంఘానికి పాలు ఇచ్చేలా చేయాలి. అయ్యంకాళి ఉరబన్‌ ఉపాధి హామీ పథకం (Aఖజు+ూ) ద్వారా కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అమలు చేసిన నమూనా ఇది. ఈ పథకం ప్రకారం పట్టణ ప్రాంతంలోని పాడి రైతులకు ఏడాదికి రూ.32,400 విడుదల చేస్తారు. దీనిని దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తే, అది భారతదేశంలో డైరీ రంగంలో, పాల ఉత్పత్తిలో అద్భుతమైన అభివృద్ధిని తీసుకువస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల జీవన భద్రతను పెంచుతుంది.
ప్రయివేటు డెయిరీ కార్పొరేట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రవేశించడం, విదేశీ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వల్ల డెయిరీ కోఆపరేటివ్‌ల ఉనికికి ముప్పు ఏర్పడుత్నుది. అనేక విదేశీ కంపెనీలు భారతీయ డెయిరీ కంపెనీలతో విలీనమై నేడు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. డెయిరీ కో-ఆపరేటివ్‌లు తమ ప్రభుత్వాల నుంచి భారీ సబ్సిడీని అనుభవిస్తున్న విదేశీ కార్పొరేట్‌ కంపెనీలతో పోటీ పడలేవు. సామ్రాజ్యవాద శక్తుల ఒత్తిడితో పాలు, పాల ఆధారిత ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుమతించడం ద్వారా భారత మార్కెట్‌లోకి వారికి తలుపులు తెరవాలనే ప్రణాళిక నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాలి.
అనేక రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు గోహత్య సమస్యను వర్గీకరణ చేయడం ద్వారా పశువుల వ్యాపారాన్ని నిషేధించాయి, తద్వారా రైతు కుటుంబాల కుటుంబ ఆదాయంలో 27శాతం అందించే పశు ఆర్థిక వ్యవస్థకు విధ్వంసం వచ్చింది. ఈ తెలివితక్కువ చర్య పాడి రైతులపై రెట్టింపు ప్రభావాన్ని చూపింది. పశువుల సంపద నుండి ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. ఈ ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ మతతత్వ వైఖరిని వర్క్‌షాప్‌ తీవ్రంగా ఖండిస్తూ, పశువుల వ్యాపార మార్కెట్‌లను(సంత) వెంటనే తెరవాలని డిమాండ్‌ చేసింది. లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పశువులకు బి మార్కెట్‌ధర చెల్లించి వాటిని సేకరించి, వాటిని ఆవు ఆశ్రయాల్లో పెంచాలని కోరింది.
ఆల్‌ ఇండియా డెయిరీ ఫార్మర్స్‌ వర్క్‌షాప్‌ 14-15 మే 2021న కేరళలోని కోజికోడ్‌లో జరిగింది. 71 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అఖిల భారత కిసాన్‌ సభ, పి సుందరయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా వర్క్‌షాప్‌ నిర్వహించాయి. వర్క్‌షాప్‌ను ఎఐకెఎస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ థావలే ప్రారంభించారు. ఏఐకేఎస్‌ జాయింట్‌ సెక్రటరీ విజూ కృష్ణన్‌ అధ్యక్షతన ప్రారంభోత్సవ సభ జరిగింది. పి మోహనన్‌ మాస్టర్‌, పనోలి వల్సన్‌ మాట్లాడారు.
వివిధ సెషన్లలో డాక్టర్‌ సుధీర్‌బాబు (కేరళ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ళిఖహూూఖరి), డాక్టర్‌ దినేష్‌ అబ్రోల్‌ (ఇన్సిట్యూట్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌లో ఫ్యాకల్టీ), విజయంబ ఆర్‌ (ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఇందర్‌జిత్‌ సింగ్‌, డాక్టర్‌ అజిత్‌ ప్రసంగించారు. నవాలే, రంజినీ బసు, నిధీష్‌ జానీ విల్లట్‌, పి కృష్ణప్రసాద్‌లతో పాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, కర్నాటక, త్రిపుర, మహారాష్ట్ర, బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, హర్యానా, గుజరాత్‌, అస్సాం, యూపీ, మణిపూర్‌ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
పి.కృష్ణప్రసాద్‌, అజిత్‌ నవాలే, పద్మకుమార్‌, మహమ్మద్‌ అలీ సమన్వయకర్తలుగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో ఆర్గనైజింగ్‌ కమిటీని వర్క్‌షాప్‌ ఎన్నుకుంది. ఆల్‌ ఇండియా డెయిరీ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఏర్పాటు పాల సహకార సంఘాలను మెరుగుపరచడానికి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి జోక్యాల కోసం ఈ రంగంలో పోరాటాలను ముందుకు తీసుకువెళుతుంది. ఒక మెమోరాండం డిమాండ్ల చార్టర్‌తో మంత్రిత్వశాఖకు సమర్పించ బడుతుంది. నవంబర్‌ 26 వర్గీస్‌ కురియన్‌ జన్మదినాన్ని పాల రైతుల దినోత్సవంగా జరుపాలని వర్క్‌షాపు పిలుపునిచ్చింది. పశువుల సంతలను నిషేధించే చట్టాలపై సవరణ చేసి వాణిజ్య మార్కెట్‌ను(సంత) తెరవాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్ర స్థాయి సంస్థలను ఏర్పాటు చేసి పాల రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

- మూడ్‌ శోభన్‌
  సెల్‌:9949725951

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...
బొమ్మైతే నా గెలుపు, బొరుసైతే నీ ఓటమి
అగ్నిపథ్‌ సంభావ్య సంఘ్‌సైన్యం
రీసైక్లింగ్‌
మేమంతే..
ప్రతిపక్ష ఐక్యత, కేసిఆర్‌ కేజ్రీవాల్‌ విముఖత
చెల్లని 'పది'
కార్పోరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం
ఉద్యమాల రహదారి మోటూరి
అగ్నిపథ్‌ కాదు అగ్నిగుండం
సంధికాలంలో ఉపాధ్యాయులు

తాజా వార్తలు

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

04:02 PM

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం

03:52 PM

గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

03:50 PM

ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.