Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాశీ, మధుర 'బాకీ', నిరుత్సాహపర్చిన సుప్రీం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

కాశీ, మధుర 'బాకీ', నిరుత్సాహపర్చిన సుప్రీం

'అయోధ్య పహలీ జంకీహై, కాశీ మధుర బాకీ హై' ఇది తొంభయ్యవ దశకంలో బీజేపీ ఆరెస్సెస్‌ పరివార్‌ ముందుకుతెచ్చిన నినాదం, వివాదం. 1992లో బాబరీ మసీదు, రామజన్మభూమి వివాదాస్పద కట్టడం విధ్వంసం తర్వాత పదిహేడేండ్లకు సుప్రీం కోర్టు ఆ స్థలాన్ని హిందూసంస్థలకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇది అయోధ్యకే పరిమితమని, 1991 ప్రార్థనాస్థలాల చట్టం(ప్రత్యేకశాసనం)తో మళ్లీ మళ్లీ ఇలాంటి వివాదాలు ముందుకు తెచ్చే అవకాశం లేదనీ ఆ సమయంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ మరీ మరీ చెప్పారు. అయోద్య వివాదంపై అప్పటికే వాజ్యాలు నడుస్తున్నాయి గనక, రాజకీయంగానూ చాలా పరిణామాలు జరిగాయి గనక దానిపై ఏదో ఒక పరిష్కారం చేసి మిగిలినవివాదాలు రాకుండా చేసుకోవడం శ్రేయస్కరమని చాలామంది సరిపెట్టు కున్నారు. అయితే సంఫ్‌ు పరివార్‌కు అలాంటి నియంత్రణలు నిబంధనలు వర్తించబోవని ఎవరికి తెలియదు? రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం అనే దుర్నీతి ఆగేదికాదని వారాణసిలో గ్యాన్‌వ్యాపి మసీదు తాజా పరిణామాలు దేశాన్ని హెచ్చరిస్తున్నాయి. ఆలోచనాపరులను ఆందోళన పరుస్తున్నాయి. అత్యున్నత న్యాయస్థానం ఇందుకు అడ్డుకట్ట వేయకపోగా ఏదో న్యాయ పరిభాషలో చిచ్చు కొనసాగే పరిస్థితికి దోహదం చేయడం ఇందుకు కారణమవుతున్నది. వారాణసి మెజిస్ట్రీట్‌ ఉత్తర్వులపై మసీదు నిర్వాహకుల తరపున అంజు మన్‌ ఇంతెజామియా కమిటీ సుప్రీంకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని, సమస్యను ఒకేసారి ముగించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పష్టంగా కోరింది. దానికి బదులు జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం కేసును తిరిగి స్థానిక కోర్టులకే బదలాయించింది. కాకపోతే మెజిస్ట్రీట్‌ నుంచి జిల్లా కోర్టుకు మార్చింది. ఈ తతంగం కోసం ఎనిమిదివారాలు సమయం ఇచ్చింది. అప్పటి వరకూ తానిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నది.
విపరీత ప్రచారం, ఉద్రిక్తత
మసీదు కొలను మధ్యలో శివలింగం బయిటపడినట్టు చెబుతున్న ప్రాంతాన్ని భద్రపరుస్తూనే ముస్లింల ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలన్నదే సుప్రీం కోర్టు ఉత్తర్వు! సహజంగానే ప్రార్థనకు వెళ్లేముందు కాళ్లు చేతులు కడుక్కోవడం లేదా స్నానం కోసం ఆ కొలనును వాడేవారు. ఇప్పుడు రెండు డ్రమ్ములలో మసీదు కమిటీ నీళ్లు ఏర్పాటు చేసిందట. ఈ ఉత్తర్వు వల్ల చాలా ఉపశమనం కలుగుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరోవంక మసీదు ప్రాంగణంపై సర్వే జరిపిన కమిషనర్‌ నివేదిక అధికారికంగా వెల్లడించకముందే బయిటకు వచ్చిన శివలింగం చిత్రాలంటూ సోషల్‌ మీడియాలో, మీడియాలో నిండిపోయాయి. అది కొలను మధ్యలో శిల్పాకృతి అన్న కమిటీ వాదన ఎవరూ పట్టించుకోలేదు. అసలు ఈ నివేదిక లీకు తర్వాత మేజిస్ట్రీలు ఆ కమిషనర్‌ న్యాయవాది అజరుమిశ్రాను తొలగించారు. తన కన్నా సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ లీక్‌ చేశాడని అజరు ఆరోపించారు. మసీదు ప్రాంగణాన్ని వీడియో తీసిన దృశ్యాలంటూ అనేకం చక్కర్లు కొడుతున్నాయి. మసీదులో ప్రార్థనకు మామూలుగా 4,000 మంది వరకూ వచ్చేది. ఈ వారం 1200 మందికి పైగా వచ్చారని మరోవైపు కథనాలు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారం చూస్తే పరిస్థితి ఏ దిశలో పయనిస్తున్నదీ, ఎలా చేయిదాటిపోతున్నదీ ఎవరికైనా అర్థమవుతుంది. 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం ప్రార్థనా స్థలాలలో 1947 ఆగస్టు15న అంటే స్వాతంత్ర దినాన ఉన్న యాథాతథ స్థితి కొనసాగాలి. అయోధ్య మినహా మిగిలిన స్థలాలపై ఎలాంటి వ్యాజ్యాలు అనుమతించరాదు. ఒకవేళ జరిగినా అది 1947ఆగస్టు15 పరిస్థితిని పునరుద్ధరించడం కోసం తప్ప అంతకన్నా వెనక్కు వెళ్లకూడదు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాంటప్పుడు అయిదువందల ఏండ్ల కిందట ఔరంగజేబు హయాంలో ఏదో విధ్వంసం జరిగిందన్న వివాదం వారాణసికోర్టు ఎలా స్వీకరిస్తుంది? ఇప్పుడు సుప్రీం కోర్టు తిరిగి అక్కడికే ఎలా పంపిస్తుంది?
మతస్వభావం నిర్ధారణ అంటే?
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన వాదన మరింత ఆందోళన కలిగిస్తుంది. మేజిస్ట్రీట్‌ ఇప్పటికే దాన్ని స్వీకరించి సర్వే చేయించారు. వీడియో తీయించారు. అవి బయిటకు వచ్చేశాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు తప్పుగా అనిపించలేదు. ఒక ప్రార్థనా స్థలం మత నేపథ్యాన్ని లేదా స్వభావాన్ని నిర్థారిస్తే తప్పేమిటని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. మిశ్రమంగా ఉండవచ్చుకదా అని వ్యాఖ్యానించారు. ఒక జోరాస్ట్రియన్‌ ప్రార్థనా స్థలంలో ఒక మూలన సిలువ ఉన్నంత మాత్రాన అది క్రైస్తవ మందిరం కాదు, ఆ సిలువ జోరాస్ట్రియన్‌ కాదు కదా అని కూడా అన్నారు. అయోధ్య వివాదం వంటి దాన్ని చూసిన ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఆశించలేం. ఆపైన ఇచ్చిన ఆదేశం ప్రకారం వారాణసి జిల్లా కోర్టును 1991 చట్టం ఈ పిటిషన్‌కు వర్తించేది లేనిదీ ముందు తేల్చాలని చెప్పారు. నిజంగా తేల్చాల్సింది తామే కాగా ఆ బాధ్యత కింద కోర్టుకు అప్పగించాక ఇక ఆ చట్టానికి విలువేముంటుంది? దీన్ని ఆధారం చేసుకుని హిందూసంస్థల తరపున పిటిషనర్లు కొత్తకొత్త వాదనలు తీసుకొస్తున్నారు. మసీదు నిర్మాణం జరిగినప్పటకీ ఔరంగజేబు లేదా మరొకరు ఆ స్థలాన్ని వక్ఫ్‌ ఆస్తిగా మార్పు చేయలేదని, లక్షల ఏండ్లుగా విశ్వేశ్వరుడి పేరుతోనే ఉందని చూసినట్టు చెబుతున్నారు. ఆలయాలు మసీదులు బౌద్ధజైన ఆరామాలు ఇంకా అనేకం చరిత్ర క్రమంలో పరస్పరం నాశనం చేసుకోవడం మార్చడం వంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి, వాటిలో అధిక భాగం రాజ్యవిస్తరణ కోసం, కొన్ని మత కోణంలోనూ జరిగాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ విధంగా వందల ఏండ్లు గడిచిపోయాక వాటిని తవ్వుతూ కూచోవడం రాజకీయం గాక మరేమిటి? అలా జరగరాదనే కదా, 1991చట్టం చేసింది? సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయమై ఎందుకు ఖచ్చితమైనవైఖరి తీసుకోలేదు? చట్టంలోని మూడు నాలుగు సెక్షన్ల ప్రకారం ఒక ప్రార్థనా స్థలం మతస్వభావ నిర్థారణ తప్పు కాదని సుప్రీం కోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం. దీనిపై ఒక అభిప్రాయం చెప్పే సాహసం మేము చేయలేమని కూడా న్యాయమూర్తి అన్నారు! క్షేత్రస్థాయి పరిస్థితులు శాంతిభద్రతలు కూడా చూడాలి కదా అని ఎదురు ప్రశ్న వేవారు. అంతా న్యాయబద్దంగా జరగాలన్నారు. సివిల్‌ జడ్జి తమ వాదనలు వినకుండానే ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని మసీదు కమిటీ తరపు న్యాయవాది హఫీజీ హమీద్‌ గుర్తు చేశారు. శివలింగం కనిపించినట్టు చెబుతున్న ప్రదేశాన్ని మూసివేశారని, మరి ఇలాగైతే 1991 చట్టం వృథాయేకదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో హిందూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వైద్యనాథన్‌, రంజిత్‌ కుమార్‌ ఆయనకు అడ్డుతగిలి ఆ చట్టమే దీనికి వర్తించదని వాదించారు. అప్పుడే ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రకారం రేపు జిల్లా జడ్జి పిటిషన్‌ స్వీకరించి మరిన్ని చర్యలను అనుమతిస్తే పర్యవసానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ మౌర్యతోసహా మసీదుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎనిమిదివారాల గడువులోపు అక్కడ ఉద్రిక్తతల పెరుగుదల ఎలా ఉంటుందో ఆ ప్రభావం తక్కిన దేశంపై ఎలా పడుతుందో చెప్పగలరా? ఒక వ్యాజ్యాన్ని చట్టం స్పష్టంగా నిరాకరిస్తున్నప్పుడు దాన్ని స్వీకరించి అనవసరంగా సమయం వృథా చేసుకోవడం దేనికని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు స్వయంగా వ్యాఖ్యానించింది. కాని ఇప్పుడు జరిగింది అందుకు పూర్తి భిన్నం, దీనివల్ల ప్రతి పురాతన మసీదులోనూ సర్వేలు నిర్థారణలు అంటూ ఉత్తర్వులివ్వడం తేనెతుట్టను కదల్చడమే. సుప్రీంకోర్టు గట్టిగా వ్యవహరించలేదని హిందూ పత్రిక సంపాదకీయం రాస్తే, వివాదం కొనసాగడానికి కారణమైందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.
మధుర నుంచి మధ్యప్రదేశ్‌ వరకూ!
అది ఈ ఆదేశాలు ఇచ్చిన సమయంలో మధురలో శ్రీకృష్ణజన్మస్థానం వివాదంపై పిటిషన్‌ను జిల్లా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అక్కడ కృష్ణమందిరానికి షాహి ఈద్గాకు మధ్య వివాదం ఉంది. మసీదును తొలగించాలంటూ భగవాన్‌ శ్రీకృష్ణవిరాజ్‌మాన్‌ మిత్ర కృష్ణదేవ్‌ ఆలయం ఆస్థాన్‌ శ్రీకృష్ణజన్మభూమి తరపున పలు పిటిషన్లు దాఖలైనాయి. వీటిని 2020లో ఒక స్థానిక కోర్టు తిరస్కరించగా ఇప్పుడు జిల్లాకోర్టు స్వీకరించింది. ఈ విషయంలో 1968లో అంటే 1991 చట్టానికి ముందే మధ్యవర్తిత్వ ఒప్పందం కుదిరింది గనక ఈ చట్టం వర్తించదని కోర్టు అభిప్రాయపడింది. చట్టంలో సెక్షన్‌4 (3)(బి) కింద స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. రేపు వారణాసి జిల్లా కోర్టు కూడా ఇదే చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రెండు కేసులతోపాటు ఇప్పుడు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కూడా పాతభోపాల్‌ చౌక్‌లోని జామా మసీదు కూడా శివాలయంపై నిర్మించబడింది గనక అక్కడ సమగ్రమైన పురావస్తు సర్వే జరపాలని సంస్కృతి బచావో అనే పరివార్‌ సంస్థ ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చింది. ఆ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్‌తివారి హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రాకు నివేదించడంతో ఆగక కోర్టులోనూ పిటిషన్‌ వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాలతో సహా అనేక చోట్ల వందలాది ప్రార్థనా స్థలాలు వివాద కేంద్రాలుగా మారనున్నాయి. ఇదే బీజేపీ 2024 ఎన్నికల ఎజెండా! 1981-82లో విహెచ్‌పి ఏకత్మతాయాత్ర పేరిట దేశమంతటా మతరాజకీయాలు తీవ్రం చేశారు. 1992లో బాబరీ మసీదును కూల్చేశారు. 2002లో గుజరాత్‌ మారణహోమంతో నరేంద్ర మోడీని తమ శిబిరానికి సేనానిగా ఎన్నుకున్నారు. 2012లో ఆయనను ప్రధానిగా ప్రతిష్టించడానికి ప్రతిపాదన తెచ్చారు. 2022లో కాశీ మధురతో సహా దేశమంతటా ప్రార్థనా స్థలాలను ప్రకంపన లకు గురి చేస్తున్నారు. ఈ విషయంలో పార్లమెంటు చట్టం వ్యతిరేకంగావున్నా దాన్ని గట్టిగా అమలు చేయడంపై న్యాయవ్యవస్థ ఆనాసక్తంగా ఉండటం దురదృష్టకరం. అనర్థదాయకం. అదే గ్యాన్‌వాపి సంకేతం.
- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
ఆలోచించండి మోడీజీ...
బొమ్మైతే నా గెలుపు, బొరుసైతే నీ ఓటమి
అగ్నిపథ్‌ సంభావ్య సంఘ్‌సైన్యం
రీసైక్లింగ్‌
మేమంతే..
ప్రతిపక్ష ఐక్యత, కేసిఆర్‌ కేజ్రీవాల్‌ విముఖత
చెల్లని 'పది'
కార్పోరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం
ఉద్యమాల రహదారి మోటూరి
అగ్నిపథ్‌ కాదు అగ్నిగుండం
సంధికాలంలో ఉపాధ్యాయులు

తాజా వార్తలు

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

04:02 PM

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం

03:52 PM

గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

03:50 PM

ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.