Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆలోచించండి మోడీజీ... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jun 21,2022

ఆలోచించండి మోడీజీ...

మోడీజీ..! ఇస్లాం తీవ్రవాదం ముస్లింలకు ఎంత ప్రమాదకరంగా, అగౌరవం గా మారిందో మీకు తెలుసు! తెలిసికూడా హిందూ జాతీయ తీవ్రవాదం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించివున్న కోట్లాదిమంది హిందువులను అభద్రతకు, అవమానానికీ గురిచేస్తున్నదని ఆలోచించలేక పోతున్నా రెందుకని? కేవలం మీ అధికార భద్రత కోసమేనా? గత సంవత్సరం బంగ్లాదేశ్‌లోని హిందువులపై ఊచకోతలు జరుగుతున్న సందర్భంలో వాటిని ఆపమని మీరన్నప్పుడు బంగ్లాదేశ్‌ ప్రధాని అన్న మాటల్ని గుర్తు చేసుకోండి. 'మా దేశంలోని తీవ్రవాదుల ఉన్మాద చర్యలకు మీ దేశంలో సాకులు దొరక్కుండా జాగ్రత్త పడండి!' అన్నారు. అప్పుడు మీరు కనీసం నోరెత్తలేకపోయారు. కారణం తమరిక్కడ చేస్తున్న నిర్వాకమే కదా మోడీజీ? జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదులను అరికట్టి, కాశ్మీరీ హిందువులకు భద్రత కల్పిస్తామంటూ ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. 'కాశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా తీయించి కాశ్మీరీ పండిట్లపై దాడులకు గత పాలకులు, ముస్లింలే కారకులంటూ కాశ్మీర్‌ హిందువుల రక్షకులం మేమేనంటూ డప్పు కొట్టుకున్నారుగదా? మరి గత 22 రోజుల్లో 9 మంది పండిట్లను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు! దీనికి బాధ్యులెవరు?
'అయ్యా మమ్మల్ని కాపాడండి! లేదా ఎక్కడికైనా వలస వెళ్లి తల దాచుకోనివ్వండి' అంటూ భయంతో పండిట్లు గగ్గోలు పెడుతున్నారు. అయినాసరే మీరు మాత్రం మసీదులు, శివలింగాలు, ఆలయాలు వగైరాలతో నాటి బ్రిటిష్‌ పాలకుల్లా విభజించి, కలకాలం పాలించాలనుకుంటున్నారు కదా? పదవి, అధికారాలే కాదు. మనతో సహా ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు మోడీజీ! కారే రాజుల్‌! ఏలరే రాజ్యముల్‌! వారేరీ మోడీజీ? మీకు చదివే తీరికుండదు. నిజమే! కానీ ప్రకృతిని చూసైనా నేర్చుకోవచ్చు గదా? సూర్యుడు ఒక నక్షత్రం. చుట్టూ వివిధ గ్రహాలు. అవన్నీ ఒక ఉమ్మడి సూర్య కుటుంబంలా, అలాగే వివిధ నక్షత్రాలన్నీ ఒక గెలాక్సీగా సహజీవనం చేస్తున్నాయి కదా మోడీజీ!
ఇక మన భరతమాతను చూసి ఇంకెంతో నేర్చుకోవచ్చు. మనదొక దేశం మాత్రమే కాదు. భిన్న జాతులు, కులమతాలు, వేషభాషలు, వాతావరణాలతో విరాజిల్లుతున్న ఉపఖండం! ఏ మతం వాడు - ఏ కులపు వాడు, ఏ పార్టీ వాడు సాగుచేసినా ఈ నేల పండుతుంది. అంతే కాదు. నాతో మీతో సహా కుల, మత, పార్టీలకు అతీతంగా మరణానంతరం మన దేహాలనూ ఆప్యాయంగా తన గర్భంలో పొదువుకుంటుంది! మన చితిమంటల్ని భరిస్తుంది. అలాంటి పుణ్యభూమి బిడ్డలమైన మన మధ్య హిందూ, ముస్లిం కొట్లాటలేంటి?
అధికారంకోసం పాకులాడే అధమ రాజకీయనేతగా కాదు, కులమతాలకు అతీతంగా భారతీయుడిగ జీవించు! పాలించు! ఇకనుంచైనా కార్పొరేట్లకోసం గాక, కష్టజీవుల కూడు-గూడు-గుడ్డ-విద్య- వైద్యాలకు భరోసా కల్పించి కలకాలం వాళ్ళ గుండెల్లో కొలువుండిపొండి! ''మాటతప్పని శ్రీరాముని భక్తుడినని'' చాటుకుంటున్న మీరు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలు తప్పారో ఆత్మ విమర్శ చేసుకోండి మోడీజీ !
విదేశీ నల్లధనాన్ని తెచ్చి, అందరికీ పంచుతానని వాగ్దానం చేశారు. పనామా-ప్యారడైజ్‌-పండోరా పేపర్లు, భారతీయుల నల్లధనం నిల్వల జాబితాను బయట పెట్టినా, 'ఎవర్నీ వదలమంటూ' ఓ గంభీర ప్రకటన చేయటం తప్ప రూపాయి నల్లధనాన్ని కూడ దేశానికి తెచ్చింది లేదు. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ప్రకటించారు! అవేవీ రాకపోగా మీ హయాంలో కోట్లాది ఉద్యోగాలను కోల్పోయారు ప్రజలు. ప్రపంచం తలెత్తుకు చూసేంతగా వృద్ధిరేటును పెంచుతామన్నారు. కానీ భారత జీడీపీని 1980 దశకం నాటి 5శాతానికి పతనం చేసి నేలకొంగి చూసేలా చేశారు. ఆంధ్రకు ప్రత్యేక హౌదా ఇస్తామన్నారు. మూడేండ్లలో విభజన హామీలు నెరవేర్చుతామన్నారు. ఎనిమిదేండ్లయ్యింది. అతీగతీ లేదు. గ్యాస్‌ సబ్సిడీని తీసేసి నగదు బదిలీ చేస్తామన్నారు. తీరా హుష్‌కాకీ అన్నారు. 'స్వచ్ఛ భారత్‌'ను నిర్మిస్తామంటూ 'కక్ష భారత్‌'ను రూపొందిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. వ్యవసాయ ఖర్చును రెట్టింపు చేశారు. బ్యాంకులకు కార్పొరేట్లు చెల్లించాల్సిన మొండి బాకీలను ముక్కు పిండి వసూలు చేస్తామన్నారు. కానీ వాళ్ళకు లక్షలకోట్లు రుణమాఫీ చేశారు. అలా బ్యాంకు రుణాలెగ్గొట్టిన కార్పొరేట్లకే ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులన్నీ కట్టబెడుతున్నారు. వాటిని కొనుక్కోటానికి తిరిగి వారికి బ్యాంకులచేత అప్పులిస్తున్నారు.
'మా హయాంలో సరిహద్దులు భద్రంగా ఉన్నాయ'ని ప్రకటించుకున్నారు. సరిహద్దులు భద్రంగావుంటే విదేశీ ఉగ్రవాదులు ఎలా దేశంలోకి చొరబడుతున్నారు? కాశ్శీరీ పండిట్లనెలా కాల్చగల్గుతున్నారు? సరిహద్దులు భద్రంగావుంటే మన సైనికుల వాహనాన్ని ఉగ్రవాదులెలా పేల్చేశారు? చిన్న దేశం నేపాల్‌ గూడా, మన భూభాగాన్ని తమ మ్యాప్‌లో చేర్చి పార్లమెంట్లో ఆమోదాన్నెలా పొందగలిగింది?
భారతీయులు తలవంచుకునే పనులేవీ చేయలేదని తమరు ప్రకటించుకున్నారు! కానీ... గోమాంసం తిన్నారన్న నెపంతో జరిపిన ముస్లింల హత్యలను... చర్చిలపై దాడులను నిరసిస్తూ అమెరికాకు చెందిన 'వాషింగ్టన్‌' పత్రిక మిమ్మల్ని దుయ్యబట్టింది. ''మోడీ పాలనలో, భారతదేశపు మీడియా, పౌరసమాజం, ప్రతిపక్ష పార్టీలు, నిరసనకారులు, తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశమనే గుర్తింపును కోల్పోవటానికి ఎక్కువ కాలం పట్టదు'' అని స్వీడన్‌కు చెందిన 'వి డెమ్‌' పరిశోధనాసంస్థ మీ పాలనగూర్చి వ్యాఖ్యానించింది.
రైతు ఉద్యమకారులున్న చోట మీరు ఇంటర్నెట్‌ను తొలగించిన సందర్భంలో వివిధ దేశాలవారే కాక, ''భారత్‌లో మానవహక్కులు నానాటికీ దిగజారుతున్నాయంటూ 'ఐరాస' హక్కుల సంఘం కూడా ఆందోళన వెలిబుచ్చింది!
2013 నాటికి ఏడుదశాబ్దాలుగా గత పాలకులు చేసిన స్వదేశీ, విదేశీ అప్పు మొత్తం రూ.58,59,331 కోట్లు. కాగా మీ ఎనిమిదేండ్ల హయాంలో మీరు చేసిన విదేశీ స్వదేశీ అప్పు మొత్తం రూ.94,58,579 కోట్లు!
అమెరికాలోని 'కాటో' అనబడే పరిశోధనాసంస్థ నివేదిక 2021 ప్రకారం స్వేచ్ఛా సూచికలో భారత్‌ 2013నాటికి ఉన్న 75వ స్థానాన్ని కోల్పోయి... మీ హయాంలో 111వ స్ధానానికి పడిపోయింది. మానవాభివృద్ధి సూచికలో గతంలో 129వ స్థానం నుండి మీ హయాంలో 131వ స్థానానికి పడిపోయింది. పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలకుగాను భారత్‌ 150వ దేశంగా నిలిచింది. మోడీజీ... ఇవన్నీ భారతీయులు తలదించుకునే పనులా? తల ఎత్తుకునే పనులా? ఆలోచించండి మోడీజీ!

- పి. వెంకటేశ్వరరావు
  సెల్‌ : 9849081889

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతరించి పోతున్న చెంచు జాతికి వెలుగు ఎప్పుడు
మధ్యయుగాలలో మతసామరస్య భావన వెల్లివిరిసిందా?
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?
విశ్వనగరాల నివాసయోగ్యతను ప్రభావితం చేసిన కరోనావ్యాప్తి
కమలం కమాల్‌... మహారాష్ట్రలో సంక్షోభం
లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేపట్టాలి
తెరమీది బొమ్మలు
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం
రైతు వ్యతిరేక విధానాలు.. నష్టాలకు దారులు..!
కేరళలో కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలు
హేతువాదం Vs HATE వాదం
స్కూల్‌ ఫీజులపై నియంత్రణ ఏది?
మనిషిని మనిషిగా చూడలేమా?
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?
'అల్లూరి'పై సంఘ్‌పరివార్‌ హఠాత్తు ప్రేమ వెనుక...!
రైతుకు మద్దతు ఎక్కడీ
ద్రవ్యోల్బణం - ధరలు - ప్రజలు
ఈ కొంత కాలం కొలువులేంది?
కొలంబియాలో విరిసిన తొలి ఎర్రమందారం!
బొమ్మైతే నా గెలుపు, బొరుసైతే నీ ఓటమి
అగ్నిపథ్‌ సంభావ్య సంఘ్‌సైన్యం
రీసైక్లింగ్‌
మేమంతే..
ప్రతిపక్ష ఐక్యత, కేసిఆర్‌ కేజ్రీవాల్‌ విముఖత
చెల్లని 'పది'
కార్పోరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం
ఉద్యమాల రహదారి మోటూరి
అగ్నిపథ్‌ కాదు అగ్నిగుండం
సంధికాలంలో ఉపాధ్యాయులు
బైడెన్‌కు 'నవంబరు' దిగులు!

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.