Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

కాశ్మీర్‌ పండిట్‌ల పరిస్థితి ఏమిటి?

మే 12, 2022న కాశ్మీర్‌ పండిట్‌ యువకుడు రాహుల్‌భట్‌ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 25, 2022న టీవీ ఆర్టిస్ట్‌ అమ్రీన్‌భట్‌ ఉగ్రవాదుల ఘాతుకానికి గురైంది. ఆమె వెంట ఉన్న పదేండ్ల మేనల్లుడు తీవ్రగాయాలపాలయ్యాడు. మే 31, 2022 నాడు కుల్గామ్‌ జిల్లాలో రజినిబాల అనే పాఠశాల ఉపాధ్యాయురాలిని పాఠశాలలోనే కాల్చి చంపారు. ఆమె చితి చల్లారకముందే జూన్‌ 2, 2022న శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఒక బ్యాంకు ఉద్యోగి దుండగుల తూటాలకు బలయ్యాడు. 20రోజుల్లో నాలుగు ఘటనలు. గత ఆరునెలల్లో ఇలాంటివి సుమారు ఇరవైవరకు జరిగాయని వార్తలు.
మే 29, 2019న మోడీ ప్రభుత్వం రెండవసారి పదవిలోకి వచ్చింది. రెండవసారి వచ్చి మూడేండ్లు అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆగస్టు 5, 2019 అధికారంలోకి వచ్చిన రెండు నెలల వారం రోజులకు జమ్మూ కాశ్మీర్‌ని రాష్ట్రహౌదా నుండి తప్పించి, జమ్మూ కాశ్మీర్‌, లడాఖ్‌లుగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, ఇప్పుడు కాశ్మీర్‌ యావత్తు ప్రశాంతమైందని చాటుకున్నారు. దాని పేరు చెప్పుకునే బీహార్‌ ఎన్నికలు గెలిచారు. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్నదేమిటి అని చూస్తే, అక్కడి శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని అవగతమవుతుంది.
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, అంటే ఆ ప్రాంతమంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయినా ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉన్నారు. కాశ్మీరీ పండిట్లు, ఇతర హిందువులు వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలకు బలవుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. కాశ్మీరీ పండిట్లు తమకు రక్షణ కరువని, అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ కుటుంబాలలో చాలామంది ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన కింద ప్రభుత్వోద్యోగులుగా ఉన్నారు. వారికి భద్రత కరువైంది. వాళ్ళు సమూహంగా కాశ్మీర్‌ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలాలనుకుంటున్నారు. లేదా తమకు సరైన రక్షణ కల్పించమని వేడుకుంటున్నారు. కానీ వారికి ఆ రక్షణ దొరకటం లేదు. తనకు ఉగ్రవాద బెదిరింపులు వస్తున్నాయని, తనని ట్రాన్స్‌ఫర్‌ చేయమని రజినిబాల ప్రభుత్వానికి విజ్ఞుప్తులు పంపుతూనే ఉన్నా ఆమె విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అలాంటి వాళ్ళు మరెందరో..? అంతే కాదు, రజినిబాల హత్య తరువాత కాశ్మీరీ పండిట్లు ఏకమొత్తంగా బయటపడాలని పెట్టేబేడా సర్దుకుంటుంటే, వాళ్ళు కాశ్మీర్‌ వదలకుండా వాళ్ళ నివాస ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. వాళ్ళ జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించరు. పైగా వాళ్ళని అక్కడ నుండి కదలకుండా పోలీసు పహారా... ప్రభుత్వ ఉద్దేశమేమిటో అర్థంకాకుండా ఉంది.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే... 1990లో కాశ్మీరీ పండిట్లపైఉగ్రవాదుల దాడి జరిగి, వాళ్ళు కాశ్మీరీలోయను వదలి పారిపోయినప్పుడూ, ఇప్పుడూ కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం 85మంది బీజేపీ సభ్యుల సహకారంతోనే నిలబడి ఉంది. ఆనాడు బీజేపీ సభ్యులెవరూ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకోలేదు. అప్పటి జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ జగ్మోహన్‌ బీజేపీకి చెందిన వ్యక్తే. అయినా ఆనాడు ఆయన వారికి రక్షణ కల్పించటం అటుంచి, వాళ్ళని అక్కడినుంచి వెళ్లిపొమ్మని సలహా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కేంద్రంలో 300పైచిలుకు సభ్యులతో పూర్తి మెజారిటీలో ప్రభుత్వం ఉండటమే కాకుండా, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి కాశ్మీర్‌ని తమ అధీనంలో ఉంచుకున్నాక కూడా అక్కడ ఉగ్రవాదం తగ్గకపోగా పెరిగింది. బీజేపీ సమర్థితుడే అయిన ఒక కాశ్మీరీపండిట్‌ మాటల్లో చెప్పాలంటే ఇప్పటి పరిస్థితి 1990 కంటే ఆధ్వాన్నంగా ఉంది. ఇంకా ఎంత కాలం ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంటుందో వేచి చూడాలి.
కాశ్మీరీపండిట్‌లపై ''కాశ్మీర్‌ఫైల్స్‌'' సినిమా తీసిన వివేక్‌ అగ్నిహౌత్రి ఆ సినిమాను 15/16 కోట్లతో నిర్మించి సుమారు 340కోట్లకు పైగా సంపాదించాడని పత్రికల వార్తలు. పైగా ఆసినిమాని అందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రా మంత్రులందరు 'హిందువు అన్న వాడు ప్రతిఒక్కడు చూడవలసిన సినిమా'' అని ప్రమోట్‌ చేశారు. వారిపై సానుభూతి పేరుతో సినిమా నిర్మించిన అగ్నిహౌత్రి ఇప్పుడు కాశ్మీర్‌లో పండిట్లపై జరుగుతున్న మారణహౌమానికి ఎందుకు స్పందించటం లేదు? ఇప్పుడు నోరు పడిపోయిందా..? ఆ వచ్చిన డబ్బుతో ఆయనిప్పుడు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఆ సినిమా కాశ్మీరీ పండిట్లపై సానుభూతి కలిగించలేదుకానీ, ముస్లింల మీద ద్వేషాన్ని మాత్రం రగిలించింది. సినిమా హాళ్ళలోనే ముస్లింలను చంపండి, నరకండి అనే నినాదాలు ఇచ్చారంటే, అది రగిల్చిన విద్వేషాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు కాశ్మీర్‌ ఇలా రగిలిపోతుంటే, ప్రభుత్వం మాత్రం తన రెండవ ప్రభుత్వ మూడేండ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు జల్సాలు చేసుకుంటున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాశ్మీర్‌లోని హిందువులందరికి సరియైన రక్షణ కల్పించాలని, అక్కడ రక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని భారత దేశ ఏకాగ్రత, సమగ్రతను కోరుకునే భారతీయులందరు కోరుకోవడంలో తప్పేమీలేదు.
- ఫీచర్‌  పాలిటిక్స్‌ డెస్క్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరంచేయడం నేరమే
ఏవి ఉచితాలు?
లోన్‌యాప్‌ల ఉచ్చులో యువత
నల్లమలలో మళ్లీ అలజడి
విద్యారంగం పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !
మతతత్వ, కార్పొరేటు విధానాలు... పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
వారసత్వ రాజకీయాలపై బీజేపీ గురివింద నీతి..!
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
ద్వేష పూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలి...
అత్యున్నత న్యాయస్థానం పరస్పర విరుద్ధ పోకడలు
ప్రజారోగ్యం పాలకుల బాధ్యత కాదా!
కుదిపేస్తున్న కుంభకోణంలో దీదీ ఉక్కిరిబిక్కిరి
పౌష్టికాహార స్వాహా...
వాడొచ్చేత్తున్నాడ్రా బాబోయ్‌...
ఒరేయ్‌... బడుద్దాయిల్లారా?
బుల్‌బుల్‌ పిట్ట పడ్డదిరబై..
ప్రజాస్వామిక రాజకీయాలే దేశాన్ని కాపాడతాయి
ఏదీ వరద సాయం..?
శతవసంతాల రావి శాస్త్రీయం
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
దుమాల అమరుల స్మృతిలో...
అప్పుల సునామితో అల్లకల్లోలం
బంగారు తెలంగాణలో కార్మికుల కడుపులు మాడవల్సిందేనా!
ఓటు సరుకుకాదు... హక్కు...
ఈ జీడీపీ వృద్ధి ఎవరికోసం?
పాత లంక.. పాత సారూ
బ్రిటన్‌ అధికార కుమ్ములాటల్లో చైనాపై కేంద్రీకరణ!
ధరణిపేరుతో రైతులను దగాచేస్తున్న ప్రభుత్వం
కంగారూ కోర్టులు

తాజా వార్తలు

07:45 PM

మ‌త్తుమందు ఇచ్చి ముగ్గురు బాలిక‌ల‌పై లైంగిక దాడి..!

07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

03:47 PM

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

03:43 PM

పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్

03:27 PM

మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల

03:12 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

03:06 PM

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

03:02 PM

న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

02:23 PM

సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ

02:18 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

01:09 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

12:56 PM

ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం

12:42 PM

ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం

11:43 AM

లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

11:41 AM

మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి

11:28 AM

నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.