Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jun 25,2022

నయా ఉదారవాద దాడి - రక్షణ రంగం ధ్వంసం

అగ్నిపథ్‌ó్‌్‌ దేశాన్ని తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిశాయి. దేశం మొత్తం ఒకే గొంతుతో దీనిని వ్యతిరేకించింది. అగ్నిపథ్‌ వల్ల యువత భవిష్యత్తు నాశనమవటమే గాక మన దేశ రక్షణకు పెను ముప్పు కలుగుతుందని రిటైర్డ్‌ సైనిక అధికారులు హెచ్చరించారు. అయినా కేంద్ర బీజేపీ సర్కార్‌ వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఆగమేఘాల మీద సైనిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండోవైపు ఉద్యమంలో పాల్గొన్న యువతపై ఫాసిస్టు దమనకాండకు పూనుకుంది. ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసుకోవటానికి వీలు లేకుండా క్రూరమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నది. వ్యతిరేకించే వారిపై తీవ్రమైన అక్రమ కేసులు బనాయిస్తున్నది.
సైన్యంలో తీసుకొచ్చిన నాలుగేండ్ల నియామకాలను ప్రత్యేకంగా చూడకూడదు. గత మూడు దశాబ్దాలుగా దేశంలో అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలలో భాగంగానే చూడాలి. ఇప్పటికే అనేక వ్యవస్థలను, సంస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. కొన్నింటిని పూర్తిగా అమ్మేసింది. మరికొన్నింటిలో భారీగా పెట్టుబడులు ఉపసంహరించింది. రాజ్యాంగాన్ని సైతం సమూలంగా మార్చేయటానికి తీవ్రప్రయత్నం చేస్తున్నది. తన ఫాసిస్టు చర్యలతో ప్రజాతంత్ర శక్తులపై దాడులు చేయటం, మత ఘర్షణలు సృష్టిస్తున్నది.
ఇప్పుడు రక్షణ రంగం మీద మోడీ ప్రభుత్వం దాడి తీవ్రతరం చేసింది. సైన్యాన్ని బలహీనం చేసే చర్యలతో పాటు మొత్తం ప్రభుత్వ రక్షణ సంస్ధలు, రక్షణ పరిశ్రమల ధ్వంసరచనకు పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 16 ప్రభుత్వ రక్షణరంగ సంస్థలను, 41ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు, 52 డిఆర్‌డివో లేబరేటరీలు, నేవల్‌ డాక్‌యార్డులు, షిప్‌బిల్డింగ్‌ సెంటర్లు, వర్క్‌షాపులన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ సంస్థలు దేశ రక్షణకు, సైన్యానికి అవసరమైన రక్షణ ఉత్పత్తులు, యుద్ధనౌకలు, సబ్‌ మెరైన్స్‌ తయారు చేయడం, రిపేర్లు చేయడం చేస్తాయి. దాదాపు ఏడాదికి లక్ష కోట్ల విలువ గల రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తాయి. ఈ కంపెనీల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకుండా ప్రయివేట్‌ సంస్థల నుండి కొనుగోలు చేస్తూ ఈ సంస్థలను దెబ్బతీస్తున్నది. కొన్ని రక్షణ పరిశ్రమలను, సంస్థలను ఇప్పటికే ప్రయివేటీకరణ చేయడానికి పూనుకుంది. బిఇఎంఎల్‌, మిధానీ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, భారత్‌ డైనమిక్స్‌, మజగాన్‌ డాక్‌, గార్డెన్‌ రీచ్‌షిప్‌ బిల్డర్స్‌ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించింది. ఈ రక్షణ సంస్థలన్నింటిలో దాదాపు 5లక్షల మందిపైగా సివిలియన్‌ ఉద్యోగులున్నారు. వీరు చేస్తున్న పనులను కూడా బడా కార్పొరేట్‌ సంస్థలకు అవుట్‌ సోర్సింగ్‌, పిపిపి పేర బదిలీ చేస్తున్నారు.
గడిచిన ఏడు దశాబ్దాల్లో రక్షణరంగంలో ప్రభుత్వ పెట్టుబడితో సాధించిన స్వయం సమృద్ధిని దెబ్బ తీస్తూ రక్షణ రంగాన్ని బడా కార్పొరేట్‌ శక్తుల పరం చేస్తున్నది. 2003 వరకు రక్షణ ఉత్పత్తుల తయారీలోకి విదేశీ, స్వదేశీ ప్రయివేట్‌ సంస్థలకు ప్రవేశం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలోకి 100శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిచ్చింది. టాటా, రిలయన్స్‌, అదానీ, ఎల్‌ అండ్‌ టి, మహేంద్ర, కళ్యాణి, హిందూజా, పుంజ్‌లాయడ్‌ వంటి బడా సంస్థలను రక్షణ రంగంలోకి అనుమతిచ్చారు. 539 రక్షణ లైసెన్స్‌లు ఇప్పటికే ఇచ్చేశారు. ఈ సంస్థలన్ని రక్షణ ఉత్పత్తుల మార్కెట్‌ మొత్తాన్ని తమ వశం చేసుకోవటానికి కాచుకు కూర్చున్నాయి.
ఎందుకంటే భారతదేశం ఏడాదికి సుమారు 2 లక్షలకోట్ల విలువగల రక్షణ పరికరాలను, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌ మెరైన్లు, ట్యాంకులు, ఏరోస్పేస్‌ పరికరాలు తదితర వాటిని కొనుగోలు చేస్తుంది. గత ఎడేండ్ల నుండి అత్యధిక భాగం వీటిని ప్రభుత్వ రంగ సంస్థల నుండికాక ప్రయివేట్‌ సంస్థల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ప్రయివేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి మాత్రమే ఆయుధాలు సరఫరా చేయటానికి పరిమితం కావు. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాల్లో పౌర ఆయుధ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నది. నేడు ప్రపంచ వ్యాపితంగా 87కోట్ల తుపాకుల వంటి అయుధాలు పౌరులు చట్టపరంగాను, అక్రమంగాను వినియోగిస్తున్నారు. పౌర ఆయుధ మార్కెట్టు తొమ్మిది బిలియన్‌ డాలర్లకు చేరింది. మన దేశంలో కూడా ఈ విష సంస్కృతి తీసుకురావటానికి మోడీ-కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి.
ఉపాధిని కూడా దెబ్బతీస్తున్నారు. నాలుగేండ్ల ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉద్యోగాలను తొలిసారిగా ప్రభుత్వమే సైన్యంలోకి తీసుకొచ్చింది. ఈ విధానాన్ని అన్ని రంగాలలో వాయువేగంతో ఇక అమలుచేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.81లక్షలు, రక్షణరంగ సంస్థల్లో 2లక్షల సివిలియన్‌ ఉద్యోగాలు, పారామిలటరీ దళాల్లో లక్షకు పైగా ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో భర్తీ లేదు. గత మూడు దశాబ్దాల్లో లక్షల ఉద్యోగాలు రద్దు చేయబడ్డాయి. ఈ చర్యలు దేశ ఆర్థికాభివృద్ధ్దిని దెబ్బ తీస్తున్నాయి. ఎందుకంటే దేశంలో శాశ్వత ఉద్యోగ వ్యవస్ధ మార్కెట్టులోని సరుకుల డిమాండ్‌కి, సర్వీస్‌ రంగ పురోగమనానికి మూలస్తంభంగా పనిచేస్తున్నది. శాశ్వత ఉద్యోగాలు తగ్గే కొద్ది అర్థిక వ్యవస్ధ మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. వివిధ దేశాల అనుభవం చూస్తే ప్రపంచంలో చాలా దేశాల కంటే ప్రభుత్వ ఉపాధి కల్పనలో భారత్‌ అధమ స్థాయిలో ఉంది. ప్రతి వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగులు నార్వేలో 159, స్వీడన్‌లో 138, ఫ్రాన్స్‌లో 114, బ్రెజిల్‌లో 111, అమెరికాలో 77, చైనాలో 57 మంది ఉన్నారు. భారత దేశంలో మాత్రం కేవలం 16 మంది మాత్రమే ఉన్నారు.
సైనిక వ్యయంపై కోత విధించటానికి బీజేపీ అనేక ఏండ్ల నుండి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అనేక కమిటీలను వేసింది. ఇప్పుడు అగ్నిపథ్‌ ద్వారా అమలకు పూనుకుంది. సైనిక వ్యయంలోనే కాదు అన్ని రంగాల్లో ఈ విధానాన్ని గత మూడు దశాబ్దాల నుండి అమలు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ప్రజా సంక్షేమం, సామాజిక భద్రతపై పెట్టే ఖర్చుల్లో కోత పెట్టడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం అనే త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నారు.
2003 లోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వత్తిడితో ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ద్రవ్య బాధ్యత-బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌అర్‌బిఎం) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం ద్రవ్యలోటు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో 3 శాతానికి మించి ఉండకూడదు.
ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో 14.37 లక్షల మంది సైన్యం ఉంది. పెన్షన్‌ పొందుతున్న రిటైర్డ్‌ సైనికులు 32.35లక్షల మంది ఉన్నారు. వీరుగాక రక్షణ రంగంలోనే సివిలియన్‌ ఉద్యోగులుగా మరో 6.29లక్షల మంది ఉన్నారు. మొత్తంగా రక్షణ రంగంలో సర్వీస్‌లో ఉన్న సైన్యం, పెన్షన్‌దారులు కలిపి 53.06 లక్షల మంది ఉన్నారు.
2022-23లో మొత్తం రక్షణ బడ్జెట్‌ రూ.5,25,166 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో సైన్యం జీతాలకు రూ.1,63,453 కోట్లు (31.12 శాతం), రిటైర్డ్‌ సైనికుల పెన్షన్‌కు రూ.1,19,696 కోట్లు (22.79 శాతం), అయుధాల కొను గోలుకు రూ.1,44,304 కోట్లు, అయుధాల రిపేర్లకు, స్పేర్‌పార్టులకు రూ.40,561 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.57,152 కోట్లు కేటాయించారు. మొత్తం రక్షణ బడ్జెట్‌లో 54శాతం సైనిక శక్తిపై పెట్టాల్సి వస్తుందని బీజేపీ విమర్శిస్తున్నది.
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చేసే మొత్తం వ్యయంలో 2012-13లో రక్షణరంగంపై చేసిన వ్యయం 16.4శాతం అయితే 2022-23లో అది 13.3శాతానికి తగ్గింది. అమెరికా తన స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీలో) రక్షణ రంగానికి 3.7శాతం కేటాయిస్తున్నది. మన దేశం కన్నా చైనా మూడున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది. రష్యా 4.3శాతం, బ్రిటన్‌ 2.2శాతం, పాకిస్థాన్‌ 4శాతం ఖర్చు చేస్తుంటే భారత్‌ 2.7శాతం ఖర్చు చేస్తున్నది. ఈ వాస్తవాలను సమాధి చేసి సైన్య వ్యయంపై విషం జిమ్ముతున్నారు.
గత ఏడేండ్ల నుండి భారత్‌ పరిస్థితి ఏమిటి? మోడీ స్వార్ధపూరిత చర్యల వల్ల దేశ సరిహద్దు ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్నది. ఎప్పుడు ఏ దేశంతో తలపడాల్సి వస్తుందోనన్న భయాందోళనలు కొనసాగు తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాల్సింది పోయి అగ్నిపథ్‌ ద్వారా బలహీన పర్చే దేశద్రోహ చర్యలకు బీజేపీ పాల్పడుతున్నది.
గడిచిన మూడు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర మార్పులకు గురవుతున్నది. ప్రభుత్వ పెట్టుబడితో నిర్మించిన వ్యవస్థలు, సంస్థలు, వనరులన్నీ కొద్దిమంది బడా కార్పొరేట్ల పరమవుతున్నాయి. కార్మిక చట్టాలన్నింటిని బలహీన పర్చి సంపన్నులు, కార్పొరేట్లపై విధించే పన్నులు తగ్గించి సామాన్యులపై పన్నుల భారం పెంచుతున్నారు. మోడీ పదే పదే చెబుతున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దేశం చేరినా ఆ సంపద ఎక్కువ భాగం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అంతరాలు తీవ్రతరమయి ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ఈ నేపథ్యంలో పోగుపడిన సంపదను రక్షించుకోవటానికి ప్రయివేట్‌ సైన్యం అవసరం. అందుకే అగ్నిపథ్‌కు భారత్‌ కార్పొరేట్‌ వర్గాలు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలికాయి. ఇప్పటికే మన దేశంలో కార్పొరేట్‌ కంపెనీలు, సంస్థలన్నీ రిటైర్డ్‌ అయిన పోలీస్‌ ఉన్నతాధి కారులతో నడుస్తున్నాయి. కార్మికులను అణగదొక్కటానికి వీరిని ఉపయోగిస్తున్నారు. రేపు అగ్నివీరులందరినీ ఇదే పనికి ఉపయోగించుకుంటారు. అంతే కాదు. అగ్నివీరుల కోసం కొన్ని కార్పొరేట్‌ శక్తులు కాచుకు కూర్చున్నాయి. ప్రయివేట్‌ కాంట్రాక్ట్‌ సైన్యాన్ని నడపటానికి సిద్ధమయ్యాయి. త్వరలో ప్రయివేట్‌ కాంట్రాక్ట్‌ సైన్యం ఏజెన్సీలను కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ వంటి సామ్రాజ్యవాద దేశాల్లో ఈ పద్ధతి అమలులో ఉంది. మన దేశంలోని అగ్నివీరులను వారి అవసరాల కోసం ఎగుమతి చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమేలేదు. అలాగే వీరిని రాజకీయ, మతోన్మాద, కుల, ఉగ్రవాద, అసాంఘిక శక్తులు ప్రయివేట్‌ సాయుధ బలగాల్లా ఉపయోగించుకుంటాయి. ఇవి సమాజంలో తీవ్ర పరిణా మాలకు దారితీస్తాయి.

- డా|| బి. గంగారావ్‌
  సెల్‌ :9490098792

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరంచేయడం నేరమే
ఏవి ఉచితాలు?
లోన్‌యాప్‌ల ఉచ్చులో యువత
నల్లమలలో మళ్లీ అలజడి
విద్యారంగం పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !
మతతత్వ, కార్పొరేటు విధానాలు... పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
వారసత్వ రాజకీయాలపై బీజేపీ గురివింద నీతి..!
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
ద్వేష పూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలి...
అత్యున్నత న్యాయస్థానం పరస్పర విరుద్ధ పోకడలు
ప్రజారోగ్యం పాలకుల బాధ్యత కాదా!
కుదిపేస్తున్న కుంభకోణంలో దీదీ ఉక్కిరిబిక్కిరి
పౌష్టికాహార స్వాహా...
వాడొచ్చేత్తున్నాడ్రా బాబోయ్‌...
ఒరేయ్‌... బడుద్దాయిల్లారా?
బుల్‌బుల్‌ పిట్ట పడ్డదిరబై..
ప్రజాస్వామిక రాజకీయాలే దేశాన్ని కాపాడతాయి
ఏదీ వరద సాయం..?
శతవసంతాల రావి శాస్త్రీయం
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
దుమాల అమరుల స్మృతిలో...
అప్పుల సునామితో అల్లకల్లోలం
బంగారు తెలంగాణలో కార్మికుల కడుపులు మాడవల్సిందేనా!
ఓటు సరుకుకాదు... హక్కు...
ఈ జీడీపీ వృద్ధి ఎవరికోసం?
పాత లంక.. పాత సారూ
బ్రిటన్‌ అధికార కుమ్ములాటల్లో చైనాపై కేంద్రీకరణ!
ధరణిపేరుతో రైతులను దగాచేస్తున్న ప్రభుత్వం
కంగారూ కోర్టులు

తాజా వార్తలు

07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

03:47 PM

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

03:43 PM

పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్

03:27 PM

మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల

03:12 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

03:06 PM

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

03:02 PM

న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

02:23 PM

సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ

02:18 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

01:09 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

12:56 PM

ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం

12:42 PM

ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం

11:43 AM

లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

11:41 AM

మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి

11:28 AM

నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

11:23 AM

ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..ముగ్గురు జవాన్లు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.