Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jun 28,2022

హామీకి వందరోజులు అమలుకు ఇంకెన్నిరోజులు?

ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటామని మార్చి 15న అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేసి నేటికి వంద రోజులు. అయినా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు ఆర్డర్‌కాపీ అందని దుస్థితి! విధులనుండి తొలగించి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉద్యోగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చిందని సంతోషపడాలో, ఆర్డర్‌కాపీ రాలేదని బాధపడాలో అర్థం గాని అయోమయస్థితిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారించేందు కోసం వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధిహామీ చట్టంలో గత 14 సంవత్సరాలుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు క్షేత్రస్థాయిలో అనేక రాజకీయ వేధింపులుతోపాటు పని ఒత్తిడికి గురయ్యారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, చాలీచాలని వేతనాలు, మరోపక్క ఫీల్డ్‌ అసిస్టెంట్ల మనుగడకే ప్రమాదం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 47, 79 జీఓ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ 2020 మార్చి 12న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,500మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెచేశారు. సమ్మె కొనసాగిస్తున్న దశలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రారంభం కావడం, మరోపక్క సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం మూలంగా సమ్మె విరమించి ఫీల్డ్‌ అసిస్టెంట్లు విధుల్లోకి చేరారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వంపై సమ్మె చేస్తారా? అన్నట్టుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ 2020 మార్చి 18న ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల నుండి తొలగించింది. దీనిపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం డిసెంబర్‌ 2న ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి వీధిలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సైతం బుట్టదాఖలు చేసింది. నాగార్జునసాగర్‌, దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను తిరిగి తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల అనంతరం పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలెక్టరేట్ల ముందు ధర్నాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, బిక్షాటనలు, రాస్తారోకోలు, ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి వంటి పలు రకాల నిరసన కార్యక్రమాలు, చలోఅసెంబ్లీ వంటి మిలిటెంట్‌ పోరాటాలు నిర్వహించారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి పెరగడంతో మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి జూన్‌ 27కు వంద రోజులు పూర్తయ్యాయి. అయినా నేటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. గత వంద రోజుల నుండి ప్రతిరోజూ ప్రజాప్రతినిధులను, మంత్రులను, గ్రామీణ అభివృద్ధి ప్రిన్సిపల్‌ శాఖ అధికారులను కలుస్తూ తమ గోడును వినిపిస్తున్నా ముఖ్యమంత్రికి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల సమస్య పరిష్కరించాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానవతా దృక్పథంతో ఆలోచించి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుంటూ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.

- మట్టిపల్లి సైదులు
  సెల్‌ :8106778287

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరంచేయడం నేరమే
ఏవి ఉచితాలు?
లోన్‌యాప్‌ల ఉచ్చులో యువత
నల్లమలలో మళ్లీ అలజడి
విద్యారంగం పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !
మతతత్వ, కార్పొరేటు విధానాలు... పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
వారసత్వ రాజకీయాలపై బీజేపీ గురివింద నీతి..!
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ
ద్వేష పూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలి...
అత్యున్నత న్యాయస్థానం పరస్పర విరుద్ధ పోకడలు
ప్రజారోగ్యం పాలకుల బాధ్యత కాదా!
కుదిపేస్తున్న కుంభకోణంలో దీదీ ఉక్కిరిబిక్కిరి
పౌష్టికాహార స్వాహా...
వాడొచ్చేత్తున్నాడ్రా బాబోయ్‌...
ఒరేయ్‌... బడుద్దాయిల్లారా?
బుల్‌బుల్‌ పిట్ట పడ్డదిరబై..
ప్రజాస్వామిక రాజకీయాలే దేశాన్ని కాపాడతాయి
ఏదీ వరద సాయం..?
శతవసంతాల రావి శాస్త్రీయం
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
దుమాల అమరుల స్మృతిలో...
అప్పుల సునామితో అల్లకల్లోలం
బంగారు తెలంగాణలో కార్మికుల కడుపులు మాడవల్సిందేనా!
ఓటు సరుకుకాదు... హక్కు...
ఈ జీడీపీ వృద్ధి ఎవరికోసం?
పాత లంక.. పాత సారూ
బ్రిటన్‌ అధికార కుమ్ములాటల్లో చైనాపై కేంద్రీకరణ!
ధరణిపేరుతో రైతులను దగాచేస్తున్న ప్రభుత్వం
కంగారూ కోర్టులు

తాజా వార్తలు

07:03 PM

రేపు టీఎస్ ఎంసెట్‌ ఫలి‌తాలు విడుదల

06:36 PM

స్నేహితులను హత్యచేసిన నిందితుడు అరెస్ట్

06:04 PM

నితీశ్ కుమార్‌కు బీహార్ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ఆదేశాలు జారీ

05:50 PM

ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాలి : రేవంత్ రెడ్డి

05:35 PM

యమునా నదిలో పడవ బోల్తా..!

05:18 PM

డీజే టిల్లు పాటకు డ్యాన్స్ వేసిన మంత్రులు

05:16 PM

న‌గ‌రి కోర్టుకు హాజ‌రైన సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్‌

05:03 PM

ఆ పదాలను నిషేధించిన ఏపీ ప్రభుత్వం..!

04:58 PM

ఏపీలో దారుణం..కోడ‌లిని చంపి..త‌ల‌తో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన అత్త‌

04:47 PM

కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

04:46 PM

ప్రగతి భవన్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం..

04:40 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:57 PM

ఎన్నికల్లో ఉచిత హామీలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

03:54 PM

గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత

03:49 PM

మాలిలో 42 మంది సైనికులు మృతి

03:47 PM

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభం

03:43 PM

పోలీసులకు నారా లోకేశ్ ఫోన్ ఇవ్వడానికి సిద్ధమా : నాగార్జున యాద‌వ్

03:27 PM

మోటో నుండి జీ62 5జీ ఫోన్ విడుదల

03:12 PM

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం

03:06 PM

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

03:02 PM

న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

02:23 PM

సాలు దొర‌- సెలవు దొర ప్రచారంపై స్పందించిన ఈసీ

02:18 PM

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

01:09 PM

కరోనా నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

12:56 PM

ఉపరాష్ట్రపతిగా జగదీప్​ ధన్​ఖడ్​ ప్రమాణ స్వీకారం

12:42 PM

ఇద్దరు పాకిస్థాన్ బాక్సర్ల అదృశ్యం

11:43 AM

లోన్ యాప్‌లను మూడు కేటగిరీలుగా విభజించిన ఆర్బీఐ

11:41 AM

మేడ్చల్ జిల్లాలో బ్యూటిషన్‌పై లైంగికదాడి

11:28 AM

నాగార్జునసాగర్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తివేత

11:23 AM

ఆర్మీ బేస్‌క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి..ముగ్గురు జవాన్లు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.