Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Aug 04,2022

నిర్వీర్యమవుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలు, వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ నిర్లక్ష్యం నిరుపేదల పాలిట పెను శాపంగా మారింది. ప్రజలకు కావలసిన నిత్యవసర వస్తువులను అందించాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ కాస్తా నేడు కేవలం రేషన్‌ బియ్యం పంపిణీ పథకంగా తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో అమ్మ హస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులను పొందిన నిరుపేదలు, ప్రత్యేక రాష్ట్రంలో వాటికి దూరమవుతున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కిరోసిన్‌, పామాయిల్‌, గోధుమలు, చింతపండు, పప్పు, కారం, ఉప్పు, పసుపు వంటి నిత్యవసర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించేవారు. కానీ నేడు ఆ నిత్యవసర సరుకుల పంపిణీకి మంగళం పాడారు. ప్రతి వ్యక్తికి అదనంగా బియ్యం ఇస్తున్నప్పటికీ మిగతా ఎనిమిది రకాల సరుకులు నిలిపివేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థ నీరుగారిపోతోంది. ప్రస్తుతం సివిల్‌ సప్లైశాఖ నుండి లబ్ధిదారులకు బియ్యం మాత్రమే అందిస్తున్నారు. అంత్యోదయ కార్డు దారులకు కొద్దిరోజుల పాటు చెక్కర పంపిణీ చేశారు. ప్రస్తుతం అది కూడా ఇవ్వడం లేదు. ఐదేండ్లుగా పామాయిల్‌ సరఫరా లేక పెరిగిన ధరలతో పేదలు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం మాత్రమే ఇస్తే వచ్చే కమిషన్‌ ఏమాత్రం సరిపోదని మరోపక్క రేషన్‌ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. మండుతున్న నిత్యవసర సరుకుల ధరలతో బతుకు బండి కదలక లబోదిబోమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రజలు ఆదాయ మార్గాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు మాత్రం ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేయాలంటే జనం బెంబేలెత్తుతున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా కేరళ ప్రజాపంపిణీ విధానం
కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ విధానం దేశానికే ఆదర్శంగా ఉంది. ఆ రాష్ట్ర ప్రజల స్థితి గతుల ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థను నాలుగు భాగాలుగా విభజించి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందిస్తూ వామపక్ష ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్నది. పేదవాడి కడుపు నింపేందుకు 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయడం పేదల పట్ల వామపక్ష ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. రేషన్‌ డీలర్లకు ప్రతి సంవత్సరం కమీషన్‌ పెంచుతూ వారి సమస్యలను కూడా చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే పేదలకు పెరిగిన ధరల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

- మట్టి పెల్లి సైదులు
   8106778287

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత రాజ్యాంగ విలువలు - కమ్యూనిస్టుల పాత్ర
బీహార్‌ దెబ్బకు బీజేపీ బేజారు... ప్రతిపక్షం జోరు
సంక్షేమం - అభివృద్ధి
దేశంలో రైతు ఉద్యమాలు - నాడు నేడు
స్వాతంత్య్రానంతర భారత ఆర్థికవ్యవస్థ
థేరోపతి నుండి తిరుపతి వచ్చింది
తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరంచేయడం నేరమే
ఏవి ఉచితాలు?
లోన్‌యాప్‌ల ఉచ్చులో యువత
నల్లమలలో మళ్లీ అలజడి
విద్యారంగం పట్ల ఎందుకీ నిర్లక్ష్యం?
మీడియా కట్టుకథలు, పిట్టకతలను నమ్మని జనం !
మతతత్వ, కార్పొరేటు విధానాలు... పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
వారసత్వ రాజకీయాలపై బీజేపీ గురివింద నీతి..!
ద్వేష పూరిత నెట్‌వర్క్‌ను అరికట్టాలి...
అత్యున్నత న్యాయస్థానం పరస్పర విరుద్ధ పోకడలు
ప్రజారోగ్యం పాలకుల బాధ్యత కాదా!
కుదిపేస్తున్న కుంభకోణంలో దీదీ ఉక్కిరిబిక్కిరి
పౌష్టికాహార స్వాహా...
వాడొచ్చేత్తున్నాడ్రా బాబోయ్‌...
ఒరేయ్‌... బడుద్దాయిల్లారా?
బుల్‌బుల్‌ పిట్ట పడ్డదిరబై..
ప్రజాస్వామిక రాజకీయాలే దేశాన్ని కాపాడతాయి
ఏదీ వరద సాయం..?
శతవసంతాల రావి శాస్త్రీయం
మనువాదుల ఇటీవలి పరిశోధనలు
దుమాల అమరుల స్మృతిలో...
అప్పుల సునామితో అల్లకల్లోలం
బంగారు తెలంగాణలో కార్మికుల కడుపులు మాడవల్సిందేనా!
ఓటు సరుకుకాదు... హక్కు...

తాజా వార్తలు

09:55 PM

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం

09:47 PM

క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు

09:40 PM

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు

09:33 PM

మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్

09:23 PM

నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య

09:08 PM

తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు

09:03 PM

ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం

08:47 PM

రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1

08:39 PM

హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

08:09 PM

2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..

07:58 PM

న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌

07:27 PM

తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌

07:21 PM

రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం

07:14 PM

ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు

06:55 PM

ఏపీలో భూకంపం

06:35 PM

ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!

06:11 PM

పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్

06:06 PM

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

05:33 PM

28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత

05:27 PM

సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌

05:05 PM

కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

04:58 PM

అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి

04:26 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం

04:17 PM

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

03:41 PM

రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు

03:32 PM

దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!

03:04 PM

రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..

02:51 PM

ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం

02:41 PM

నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల

02:36 PM

కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.