Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జంతువైతేనేమిరా... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 20,2022

జంతువైతేనేమిరా...

కోపమొస్తే నేను మనిషిని కాదు... ఈ డైలాగ్‌ ఎవరైనా చెబితే, మరేందిర భై అన్నామనుకొండి అవతలవారు షాక్‌ తింటారు. కాబట్టి నేను మనిషినే అని జనాల దగ్గర ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉండాలి. లేకపోతే నీకు కోపమెందుకు వచ్చింది అన్న విషయం పక్కన పెట్టి, కోపమొస్తే నువ్వేమిటో చెబుతారు అని మా మిత్రుడు అంటుంటాడు. కోపం అన్నది మానవ లక్షణం, మానవ లక్షణమే కాదు కోపం జంతువులకు కూడా వస్తుంది. అయితే మనిషికి కోపం వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. జంతువులది అలా కాదు. వాటిని చూసే వాళ్ళందరికీ వాటి కోపం కనపడదు.
మానవుడు కోతినుండి వచ్చాడని చెబితే మొదట్లో జనాలు ఒప్పుకోలేదు. తిట్టారు, కొట్టేంత పనిచేశారు. అసలామాట అన్నోడికి తెలివుందా లేదా అన్నారు. కడుపుకేమి తింటారన్నారు, ఇంకా ఇంకా ఎన్నో. అయినా ఎన్నో పరిశోధనలు చేసిన ఆ డార్విన్‌ మహాశయుడు ఎవ్వరి మీదా కోప్పడలేదు, నిజమైన మనిషికాబట్టి. తాను చెప్పదలచుకున్నది సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. మనుషు లెందుకు తాము కోతినుండి వచ్చారన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు వీళ్ళకింకా జంతు లక్షణాలు పోలేదేమో అని స్వగతంలో అనుకొని ఉండొచ్చు. ఏమైతేనేం తరువాత కాలానికైనా ఆ పరిశోధనను అందరూ ఒప్పు కున్నారు. కొందరు పైపైకి ఒప్పుకోనట్టు నటిస్తూనే ఉన్నారు. ఎవరి కారణాలు వారివి. ఎవరి లక్ష్యాలు వారివి మరి.
నీకే జంతువు ఇష్టమని అడిగితే ఒక్కొక్కరూ ఒకటి చెప్పొచ్చు. చిన్నయసూరి కథలు విన్నోళ్ళైతే నక్క తప్ప ఇంకోదాన్ని తనకిష్టమని చెప్పొచ్చు. తోడేలూ అలాంటిదే, దాని పేరూ చెప్పరు చాలా మంది. ఇక ఎన్నికలప్పుడు, ఓట్లకోసం అడుక్కునేటప్పుడూ ఫలానా జంతువుపై ప్రేమ పెరిగిపోతుంది కొందరికి. అదే జంతువు ప్లాస్టిక్‌ కవర్లు తిని రోడ్డుపక్కన చనిపోతున్నా మామూలు రోజుల్లో పట్టించుకోరు. అప్పుడు జంతువులన్నీ ఒక్కటే అన్న సమైక్య భావం వాళ్ళ మనసుల్లో ఉంటుందేమో.
ఇప్పుడు కోతిని జంతువు అనాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. ఇరవై మార్కుల ప్రశ్న. పరీక్షలో ఓ బిట్టు తప్పుపోతే పరవాలేదు కాని ఇరవై మార్కుల ప్రశ్నకు జవాబు తప్పుగా రాస్తే ఇంకేమన్నా ఉందా? పరీక్ష పోదూ..!! అందుకే పరీక్షలో పాసయ్యేందుకు నానా పరేషాన్‌ పడి మనకు సమజైంది మనం రాయాలి. ఇంకా వీలైతే ఓ అడిషనల్‌ షీట్‌ తీసుకొని మళ్ళీ రాయాలి. పేపరెక్కువ వాడితే అడవులు తరిగిపోతాయి అన్న విషయం కూడా రాయాలి. లేకపోతే నీ పరీక్షే పోతుంది. ఒకటో రెండో అడిషనల్‌ షీట్లు తీసుకొని వాటిని దారం కట్టి పెడితే పరీక్ష పాసై పోయినట్లే. ఇది అపోహ మాత్రమే, రాసిన దాంట్లో ఎంతో కొంత విషయం ఉండాలన్నది మార్కులు మంచిగా తెచ్చుకొనే వాళ్ళు చెప్పే మాట. వాళ్ళు ఇచ్చిన బుక్‌లెట్‌లో మాత్రమే రాసినా పాసైతారు. అలా కాని వారి పరిస్థితి కొంత కష్టంగానే ఉంటుంది. అడవులు తరిగిపోయి అందులోని జంతువులు మానవుల మీదికి వస్తున్నాయి అన్న విషయం కూడా మనం గమనించాలి. మనకంటే ఈ ప్రపంచం మీద జంతువులే ముందు పుట్టాయి. ఈ విషయం కూడా దిమాక్‌లో ఎప్పుడూ ఉంచుకోవాలి.
ఇక మనిషికోసమని మందులు, వ్యాక్సిన్లు తయారు చేస్తారు. అలా కనిపెట్టిన దానిని సీదా మనిషికి ఎక్కించరు. మొదట జంతువుల మీద పరీక్ష చేస్తారు. అవి బతికి బట్టకడితే తరువాత బట్ట కట్టే మనుషుల మీద పరీక్ష చేస్తారు. అలా మనిషి మీద ప్రయోగించాక సదరు మనిషి ఎలా ఉన్నాడు అని చూస్తారు. బాగా ఉన్నాడా సరి, లేక పోతే ఆ మనిషికేమైంది అన్నది చూస్తారు. ఇది మామూలుగా సమయమున్నప్పుడు చేసే పని. అలా కాకుండా అటు ఒక వైరసు ప్రపంచాన్ని వణికిస్తూ పోతుందనుకుందాం, ఏదో చేసినట్టు కనిపించాలి కాబట్టి మందు లేదా వ్యాక్సిన్‌ కనిపెడుతున్నారు త్వరలో ఆ విషయం బయటపెడతామని చెబుతారు. ఆహార విషయాల్లో క్షణాల్లో తయారయ్యే నూడుల్సు లాటి ఇన్‌స్టంటు అహారాలు ఉన్నట్టే, మందులనూ వ్యాక్సిన్లనూ ఇన్స్టంటుగా కొద్ది కాలంలోనే తయారు చేయాలి. అదే అసలు పరీక్ష. లేదంటే ఎన్నికల్లో పరీక్ష తప్పుతారు. అదే అసలు పరీక్ష. ఇందాక పరీక్షలో ఇరవై మార్కుల ప్రశ్న గురించి అనుకున్నాం. పక్కనున్నవాళ్ళు దయదలిస్తే వారి దాంట్లో కాపీ కొట్టి రాయాలి. అప్పుడు తనకు ఏ చదువు రాకపోయినా పాసైతాడు. అలా ఇంకో దేశం తయారు చేసిన వ్యాక్సిన్‌ తెప్పించుకోవచ్చు. అది కాపీ లాంటిదని భయపడి సొంతంగ రాస్తే పాసవ్వచ్చు లేదా పరీక్ష పోవచ్చు. ఈ ఇన్‌స్టంటు పరిశోధనలూ అంతే, మందు కరెక్టా కాదా అని చూసుకొనే సమయం లేకుండానే ఎక్కించేయడమే. అంతగా పోతే కొందరి ప్రాణాలు పోతాయి అంతే అని పెద్దోళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే అవి తమ ప్రాణాలు కాదు కాబట్టి. ఎటూ వైరస్‌ సోకి పోతారు దాని బదులు ఇంకో విధంగా పోతే ఏం అని ప్రశ్నించే వారినే ఎదురు ప్రశ్న వేయవచ్చు. ఎంతైనా వైరస్‌ పట్టిన మెదళ్ళు కదా.
జగదీశ్‌ చంద్రబోస్‌ గారు ఒక అడుగు ముందుకేసి జంతువులకే కాదు ఈ ఫీలింగ్సు, మొక్కలకు, చెట్లకు కూడా ఉంటాయి అని నిరూపించారు. జంతువుల్లాగే వాటికీ గుండె కూడా ఉంటుందన్నాడాయన. మనుషులకు, జంతువులకే విలువనివ్వని మనుషులు కొందరు మొక్కలకు, చెట్లకు విలువనిస్తారా. ఇతర గ్రహాల మీద కన్నేసి ప్రయివేటు కృత్రిమ ఉపగ్రహాలను నింగిలోకి వదులుతున్న రోజులివి. అంతా వ్యాపారమే. తమకు లాభం తెచ్చేదేదైనా చేస్తారు కాని నష్టం కలిగించేది చేయరు. ఏఏ గ్రహాల మీద ప్రాణం ఉందో తెలుసుకోవాలన్న తపన పెరింగిందిప్పుడు.
జంతువులను ప్రేమించాలి, గౌరవించాలి వద్దనకూడదు. మనుషులు ఆహారం ఏది తినాలి అన్న విషయం కూడా నిర్ణయించేచోట మాంసాహారం తినేవాళ్ళు ఏది తినాలి అని కూడా ముందే నిర్ణయమైపోయి ఉంటుంది. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉందా అంటే లేదు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూ. అయినా అక్కడ కంగారూ మాంసం అనేక రూపాల్లో తింటారు. అసలు తమ కడుపు నింపే జంతువును గౌరవించాలనే తలంపు వారికి రావడమే గొప్ప. అలా చేశాక దానిని తినడం మానేశారా, లేదు కదా!! జంతువుల మీద ప్రేమ వేరు, మనుషుల మీద ద్వేషంతో వాటిపై కలిగే ప్రేమ వేరు. మనుషులనే జంతువుల్లా చూస్తున్నవాళ్ళకు వాటిపై ప్రేమ ఉందంటే ఎలా నమ్మగలం చెప్పండి!! జంతువైతేనేమిరా మనిషైతేనేమిరా అనుకునే వాళ్ళను ఇంకా మనుషులుగా చూడటమే మన మనుషులు చేస్తున్న తప్పు. అన్నమైతేనేమిరా? సున్నమైతేనేమిరా? మరి ఈ పాడుపొట్టకు అన్నమే తిందాము రా! అనేవాళ్ళే కాని నిజంగానే సున్నం పెడితే ఎవరైనా తింటారా చెప్పండి. అలాంటి అపర వేదాంతులను నమ్మడమెలా... ఆలోచించండి... జంతువైతేనేమిరా మనిషైతే నేమిరా మన ఓటు బ్యాంకుకు పనికొస్తే చాలురా అన్న మాడ్రన్‌ దినాల్లో ఉన్నాం.

- జంధ్యాల రఘుబాబు
  సెల్‌:9849753298

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచశాంతిని కాపాడుకుందాం...
విశ్వగురువు
లెనిన్‌ను చదువుతూనే ఉండాలి!
లెనిన్‌... మరో ప్రపంచపు విజయ గీతిక
లెనిన్‌ కావ్యం
బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు!
వందే భారత్‌లో వంద అబద్ధాలు
ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం
67ఏండ్ల జీవిత బీమా జాతీయీకరణ ప్రస్థానం
మూఢత్వాన్ని చెండాడిన వేమన
నేపాల్‌ విమాన ప్రమాదాలకు బాధ్యులెవరు?

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.