Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దర్యాప్తు సంస్థలా..? బీజేపీ వదిలిన బాణాలా..? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 22,2022

దర్యాప్తు సంస్థలా..? బీజేపీ వదిలిన బాణాలా..?

          దేశంలో ప్రస్తుతం అప్రజాస్వామిక, అనైతిక రాజకీయం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నది. బీజేపీ ఇలాంటి రివేంజ్‌ పాలిటిక్స్‌ను ఇప్పటికే దేశవ్యాప్తం చేసింది. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి... తమ పార్టీలోకి వలసలను ప్రోత్స హించడానికి... విననివారిని జైలు పాల్జేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ, సీబీఐలను వినియోగించు కుంటున్నదని అందరికి తెలిసిన విషయమే. 2014 తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ 115కిపైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 120మందికి పైగా రాజకీయ నేతలపై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తుండగా, ఇందులో 115మంది ప్రతిపక్షనేతలే. ఈ సంస్థలు ప్రతిపక్షాలకు చెందిన నాయకులను టార్గెట్‌ చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, 'ఆప్‌' కీలక నాయకులు సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియా, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌, శివసేన కీలక నేత సంజరు రౌత్‌, ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సోదరుడు అగ్రసేన్‌ గెహ్లాట్‌ వంటి నేతలను టార్గెట్‌ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. కర్నాటకలోనూ కాంగ్రెస్‌ జేడీయూ కీలకనేతల ఇండ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. మరోవైపు బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే దాదాపు 20మంది మేధావులు, ప్రొఫెసర్లు, పౌర హక్కుల నేతలను ఎన్‌ఐఏ అరెస్టు చేసి జైళ్లలో పెట్టింది. ఇంకా నల్లవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతు సంఘాల నేతలకు ఉగ్రవాదులతో సంబంధా లున్నాయంటూ ఎన్‌ఐఏ టార్గెట్‌చేసింది. అయితే వేధించడమే తప్ప ఈడీ నమోదుచేస్తున్న కేసుల్లో కన్విక్షన్‌ రేటు (ముద్దాయిలకు శిక్ష పడటం) మూడుశాతం కన్నా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీ ఇలా ప్రతీకార రాజకీయాలను పాల్పడుతున్నందున ఛత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌, కేరళ, మిజోరం, పంజాబ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతిని రద్దుచేశాయి.
మీడియా పైనా..
మీడియాను తన గుప్పిట ఉంచుకోవడానికి బీజేపీ మీడియా సంస్థలపై కూడా సీబీఐ, ఈడీ, ఐటీలతోపాటు స్థానిక పోలీసులను దాడులకు ఉసిగొల్పుతున్నది. గతంలో ఎన్డీటీవీని టార్గెట్‌చేసి, ఆ సంస్థ యజమానులు ప్రణరురారు, భార్య రాధికారారుపై కేసులు నమోదు చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ''ద వైర్‌'' న్యూస్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్లు కె. వేణు, జాహ్నవి సెన్‌, వ్యవస్థాపకుడైన సిద్ధార్థ వరదరాజన్‌ ఇండ్లలో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. డిజిటల్‌ మీడియాను సైతం తన నియంత్రణలో ఉంచేందుకు బిల్లులను తీసుకొస్తున్నది. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ సూచీని పరిశీలిస్తే 180 దేశాలకు గాను భారత ర్యాంకు 150. అదే 2021లో ఇది 142గా ఉంది. 2016లో 133గా ఉంది.
బీజేపీలోకి వెళ్లగానే పునీతులు
ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బీజేపీలోకి వెళ్లగానే పునీతులుగా మారిపోతున్నారు. పార్టీమారాక ఆ నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు ఎలాంటి దాడులు చేయడం లేదు. ఇందుకు అనేక ఉదాహారణలు ఉన్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, టీఎంసీ సీనియర్లు సువేందు అధికారి వంటి నేతలు ఇందుకు ఉదాహారణ. టీడీపీలో ఉన్నప్పుడు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌ అనేక కేసులు ఎదుర్కొన్నారు. వారు బీజేపీలో చేరగానే కేసులన్నీ మాయమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియాపై భూఆక్రమణ కేసులున్నాయి. 2020 మార్చిలో ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసే మూతపడింది. కేంద్రాన్ని ప్రశ్నించేవారిని వేధించడం, తమ పార్టీలో చేరగానే కేసులను పక్కకు పెట్టడం ఆనవాయితీగా మారింది.
ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రులు, కీలకనేతలను టార్గెట్‌చేస్తూ ఈడీ, ఐటీని ప్రయోగిస్తున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలను టార్గెట్‌ చేస్తూ దాడులు చేస్తున్నది. ఎంపీ నామా నాగేశ్వరావు ఆస్తులను అటాచ్‌ చేశారు. లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును తీసుకొచ్చారు. లిక్కర్‌ స్కామ్‌ పేరుతో సీబీఐ కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్నా... దానికి అనుమతి నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ తీసుకొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొరికిన బీజేపీ కుట్రలపై సిట్‌ ఏర్పాటు చేసి బీజేపీ నాయకులు, సన్నిహితులకు నోటీసులు జారీ చేస్తున్నది. బీజేపీ జాతీయ స్థాయి కీలక నేత బీఎల్‌ సంతోష్‌ వంటి కీలకమైన వారు ఇందులో ప్రమేయం కలిగివుండటం గమనార్హం.
ధైర్యంలేని కాంగ్రెస్‌..
ఛత్తీస్‌ఘఢ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయితే కేసీఆర్‌ చూపిస్తున్నటువంటి ధైర్యం కూడా కాంగ్రెస్‌ నేతలు చూపించలేకపోతున్నారు. అదే సమయంలో కేంద్ర సంస్థలన్నీ ఆ పార్టీ నాయకులను టార్గెట్‌ చేస్తూ ముందుకెళ్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ జేబు సంస్థలుగా మారిపోవడం విషాదం. కాగా ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారింది.

- ఫిరోజ్‌ ఖాన్‌
  సెల్‌:9640466464

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచశాంతిని కాపాడుకుందాం...
విశ్వగురువు
లెనిన్‌ను చదువుతూనే ఉండాలి!
లెనిన్‌... మరో ప్రపంచపు విజయ గీతిక
లెనిన్‌ కావ్యం
బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు!
వందే భారత్‌లో వంద అబద్ధాలు
ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం
67ఏండ్ల జీవిత బీమా జాతీయీకరణ ప్రస్థానం
మూఢత్వాన్ని చెండాడిన వేమన
నేపాల్‌ విమాన ప్రమాదాలకు బాధ్యులెవరు?

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.