Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెరికా వైపుగా పెట్టుబడి ప్రవాహం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 22,2022

అమెరికా వైపుగా పెట్టుబడి ప్రవాహం

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండు ముఖ్యమైన ధోరణులు మనకు కనిపిిస్తున్నాయి. రాబోయే మార్పులను ఇవి సూచిస్తున్నాయి. వాటిలో ఒకదాని గురించి చర్చ బాగానే జరిగింది. ప్రపంచం అంతటా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోడానికి వడ్డీల రేట్లను దాదాపు అన్ని దేశాల్లోనూ పెంచడం జరుగుతోంది. దీని వలన ఉత్పత్తి మందగిస్తుంది. దానితోబాటు ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. ఆ విధంగా ఏమీ జరగబోదని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, పాలకులు చెపుతున్నా, వాస్తవానికి జరుగుతున్నది అదే. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం పేరుతో పెట్టుబడిదారీ వర్గం కార్మికుల ఆదాయాలను, ఉపాధి అవకాశాలను దెబ్బ తీస్తోంది. తమ సంపద విలువ పడిపోకుండా కాపాడుకుంటోంది.
ఇక రెండో ధోరణి గురించి చర్చ తక్కువగా జరుగుతోంది. తక్కిన ప్రపంచం నుండి అమెరికా వైపు ద్రవ్య పెట్టుబడి ప్రవహిస్తోంది. దాని వలన తక్కిన దేశాల కరెన్సీలతో పోల్చితే అమెరికన్‌ డాలర్‌ బలపడుతోంది. దీనికి ఒక్క రష్యన్‌ రూబుల్‌ మాత్రమే మినహాయింపు. రష్యాపై ఆంక్షలను విధించిన తర్వాత కూడా రూబుల్‌ బలపడడమే ఇక్కడ విచిత్రం. బ్రిటిష్‌ పౌండు, యూరోలతో సహా ప్రధాన కరెన్సీలన్నీ డాలర్‌తో పోల్చితే బలహీనపడుతున్నాయి. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల కరెన్సీలు, అందునా మన రూపాయి బలహీన పడడం మనకి సంబంధించి ఆందోళన కలిగించే విషయం.
ఈ 2022లోనే మన దేశం నుండి 20,000 కోట్ల డాలర్లు తరలిపోయాయని అంచనా. మన మొత్తం విదేశీ మారక నిల్వలలో ఇది మూడోవంతు. రూపాయి విలువ పడిపోకుండా ఉండాలన్న లక్ష్యంతో మన రిజర్వు బ్యాంకు దాదాపు 10,000 కోట్ల డాలర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయినప్పటికీ మన రూపాయి దాదాపు పది శాతం విలువ కోల్పోయింది.
తక్కిన దేశాల కన్నా అమెరికా తన వడ్డీరేట్లను ఎక్కువగా పెంచింది గనుక పెట్టుబడి అమెరికా వైపు పరుగుతీస్తోందని, అందువలన తక్కిన కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలపడిందని కొందరు నమ్ముతున్నారు. అదే పూర్తి వాస్తవం అయితే అమెరికాతో దీటుగా తక్కిన దేశాలు కూడా వడ్డీ రేట్లను పెంచితే. ఆ దేశాలనుండి ద్రవ్య పెట్టుబడులు బైటకు పోవు అని అనుకోవలసివుంటుంది. వడ్డీ రేట్ల పెంపులోని హెచ్చుతగ్గులు ద్రవ్య పెట్టుబడి ప్రవాహం మీద ప్రభావం చూపుతాయన్నది కొంతవరకూ వాస్తవమే అయినా, అదే పూర్తి నిజం కాదు. పెట్టుబడిదారుల అంచనాలు వారిలో రేకెెత్తే ఆశలు ఇక్కడ కీలకపాత్ర పోషిస్తాయి. తమ సంపద పెరిగే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని మూడో ప్రపంచదేశాలలో ఎక్కువగా పెట్టుబడులు పెడతారు. అటువంటి అవకాశాలు వారికి కనిపించనప్పుడు వారి కేంద్రం అయిన అమెరికాలోకి వెనక్కి తరలిపోతారు. ద్రవ్య పెట్టుబడి అంచనాలను ప్రభావితం చేసే ఒక కీలక అంశం అమెరికాలోని వడ్డీ రేట్లు.
అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయనుకోండి. అప్పుడు మార్కెట్‌లో ద్రవ్యం చాలా చవకగా, తక్కువ వడ్డీకే కావలసినంత అందుబాటులో ఉంటుంది. అప్పుడు దానిని ప్రపంచంలో ఎక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో అక్కడికల్లా తీసుకుపోతారు. అదే మాంద్యం ముంచుకొస్తున్నప్పుడు దానిని అదుపు చేయడానికి పరిష్కారంగా మార్కెట్‌లో పెట్టుబడులు అందుబాటులో లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వడ్డీ రేట్లు పెంచడం అందుకోసమే. అప్పుడు పెట్టుబడులు వెనక్కి అమెరికా మళ్ళిపోతాయి. అమెరికాలో వడ్డీ రేటు సున్నా ఉన్నప్పుడు ఇండియాలో గనుక 3శాతం వడ్డీ రేటు ఉందనుకోండి. అప్పుడు పెట్టుబడులు ఇండియాకు తరలివస్తాయి. అదే అమెరికాలో 6శాతం వడ్డీ రేటు ఉండి ఇండియాలో 9శాతం వడ్డీ రేటు ఉంటే (అప్పుడూ తేడా 3శాతమే) మాత్రం అంత ఎక్కువగా ఇండియాలోకి పెట్టుబడులు ప్రవహించవు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందీ అంటే అప్పుడు పెట్టుబడిదారులకు కాళ్ళు, చేతులు ఆడని స్థితి వస్తుంది.'' లాభం సంగతి ఆనక చూసుకుందాం, ముందు మన సంపదను భద్రంగా కాపాడుకుందాం'' అన్న ధోరణి వారిలో బలంగా ముందుకొస్తుంది. అప్పుడు తమ కాపలాదారు అయిన అమెరికాకు పెట్టుబడులన్నింటినీ తరలిస్తారు. 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు జరిగింది ఇదే. ఆ సమయానికి అమెరికాలో పలు ఆర్థిక లావాదేవీలు రిస్క్‌ ఎక్కువగా ఉండే స్టాక్‌లతో (హెడ్జ్‌ ఫండ్స్‌ వంటివి, తిరిగివస్తాయో రావో తెలియని రుణాలతో కూడినవి) జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఆర్థిక సంక్షోభం ముదరడానికి అటువంటి పెట్టుబడులే కారణం. ద్రవ్య పెట్టుబడులకు అమెరికాలో భద్రత కనిపించని ఆ పరిస్థితుల్లో కూడా అక్కడి నుండి ఇతరదేశాలకు తరలిపోడానికి బదులు, సంక్షోభం బద్దలుకాగానే అమెరికావైపుగానే పెట్టుబడులు ప్రవహించాయి. నిజానికి మన ఇండియాలో ఆ సమయంలో రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెద్దగాలేవు. అమెరికాలో సంక్షోభం బద్దలైనా, ఇక్కడ మనం దాని తాకిడిని తట్టుకోగలిగిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ, ద్రవ్య పెట్టుబడులు ఇండియా వైపు రానేలేదు.
ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లను పెంచడం ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందన్న సంకేతాలను ఇస్తోంది. అందుచేత తక్కిన దేశాలనుండి అమెరికా వైపు ద్రవ్య పెట్టుబడులు ప్రవహించడం మళ్ళీ పెరుగుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందువలన అదనంగా లాభాలు వస్తాయన్న కోరిక ఒక్కటే ఇందుకు కారణం కాదు. ఒకవేళ ఇప్పుడు తక్కిన దేశాలు కూడా అమెరికాతో పోటీ పడి తమతమ వడ్డీ రేట్లను పెంచినా, అమెరికావైపు ద్రవ్య పెట్టుబడులు ప్రవహించడం ఆగదు.
దీని పర్యవసానాలు మూడో ప్రపంచ దేశాలమీద తీవ్రంగా పడతాయి. తమ తమ దేశాల్లో పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా, అంతర్జాతీయంగా కూడా పెరిగిన వడ్డీ రేట్ల కారణంగా సరుకుల ఉత్పత్తికి కావలసిన పెట్టుబడుల లభ్యత తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఉత్పత్తి తగ్గుతుంది. లేదా ఉత్పత్తిలో కొనసాగవలసిన వృద్ధి లేకుండా పోతుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. ఇంకోవైపు తాము ఐఎంఎఫ్‌కు, లేదా ప్రపంచ బ్యాంక్‌కు రుణాల వాయిదాలను చెల్లించడానికి కావలసిన విదేశీ మారకద్రవ్యం మరింత ఖరీదైపోతుంది (డాలర్‌ విలువ పెరిగిపోతున్న కారణంగా). అప్పుడు విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు పెరుగుతుంది. దానిని తట్టుకోడానికి ఆ ప్రభుత్వాలు దారుణమైన స్థాయిలో పొదుపు చర్యలను చేపట్టవలసివస్తుంది. దాని వలన ప్రజల సంక్షేమం మరింత దెబ్బ తింటుంది. తమ వద్దకు సహాయం కోసం వచ్చే దేశాలు ఈ తరహా పొదుపు చర్యలు తప్పనిసరిగా చేపట్టే విధంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ షరతులు పెడతాయి.
తక్కిన మూడో ప్రపంచ దేశాలలో చాలా వాటితో పోల్చితే ఇండియాకు విదేశీ రుణభారం అంత ఎక్కువేమీ కాదు. నయా ఉదారవాద కాలంలో ఇప్పటిదాకా మన దేశానికి రుణం (విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటును భర్తీ చేసుకోడానికి కావలసిన రుణం) సులువుగానే లభిస్తూ వచ్చింది. నయా ఉదారవాద విధానాలను మనదేశంలో అమలు చేయడానికి ముందు ఇక్కడ అనుసరించిన విధానాలు మనదేశంలోకి విదేశీ పెట్టుబడులను అంత తేలికగా అనుమతించలేదు. ఇక్కడ ఉన్న మార్కెట్‌లోకి ప్రవేశించడానికి విదేశీ బహుళజాతి సంస్థలు ఉవ్విళ్ళూరుతూవుండేవి. ఆ సమయంలోనే అమెరికాలో వడ్డీ రేట్ల దాదాపు సున్నా దగ్గరికి చేరాయి. (అక్కడ ఉన్న మాంద్యం నుంచి బైట పడడానికి ఎక్కువ మోతాదులో పెట్టుబడులను పెట్టేలా ప్రోత్సహించాలంటే చౌకగా పెట్టుబడులు దొరికేట్టు చేయాలి. అందుకే అప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించారు). దాంతో ఇండియా లోకి మరికొన్ని మూడో ప్రపంచ దేశాలలోకి పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక్కడ హెచ్చుగా లాభాలు పోగేసుకోడా నికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోడానికి వచ్చాయి.
దీని ఫలితంగా భారతదేశం జీడీపీ వృద్ధిరేటు అంతకుముందు కాలంతో పోల్చితే బాగా పెరిగింది. విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు సమస్య తలెత్తలేదు. అందుకే 2002 నుండి 2012 మధ్య కాలంలో డాలర్‌తో మన రూపాయి మారకపు రేటు చాలా వరకూ స్థిరంగా కొనసాగింది (ఈ జీడీపీ వృద్ధి శ్రామిక ప్రజానీకపు జీవితాలలో ఏ విధమైన మెరుగుదలకూ దోహదం చేయలేదు అన్నది వేరేసంగతి). విదేశీ సంపద చాలా పెద్ద స్థాయిలో తరలివచ్చినందువలన రూపాయి విలువను స్థిరంగా నిలబెట్టడానికి రిజర్వుబ్యాంకు తన విదేశీమారకపు నిల్వలను పెంచింది. లేకపోతే వాస్తవానికి రూపాయి విలువ బాగా పెరిగివుండేది. అదే గనుక జరిగితే విదేశాలనుండి దిగుమతి అయే సరుకులు చౌకగా లభించి స్వదేశీ సరుకుల మార్కెట్‌ను ఆక్రమించివుండేవి. చాలా స్వదేశీ పరిశ్రమలు మూతబడే ప్రమాదం ఏర్పడివుండేది. ఇంకోపక్క మన విదేశీ రుణం బాగా పెరిగివుండేది.
ఇప్పుడు నయా ఉదారవాదపు దశ ఆ పరిస్థితిలో కొనసాగడం లేదు. ఆ దశను దాటిపోయింది. గతంలో వచ్చిన జీడీపీ వృద్ధిరేటు ఇప్పుడు అదే మోతాదులో కొనసాగడంలేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి బాగా క్షీణించడం వలన మన దేశీయ డిమాండ్‌ బాగా దెబ్బతింది. అంతర్జాతీయంగా కూడా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి దెబ్బ తింది. కనీసం ఇప్పుడు తగ్గిన స్థాయిలోనైనా జీడీపీ వృద్ధి కొనసాగాలంటే దానికి విదేశీ చెల్లింపుల ఖాతాలో పెరిగే లోటు ఆటంకంగా తయారవుతుంది.
ఈ విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు గనుక వేగంగా పెరిగిపోతే ఒక దేశానికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, ఒక దేశాన్ని ఆ సమస్య ఎంత వేగంగా కాళ్ళబేరానికి రప్పిస్తుందో చెప్పడానికి మన పొరుగుదేశం శ్రీలంక ఒక ఉదాహరణ. అంతకు ముందు కొద్దిరోజుల క్రితం దాకా అది 'స్వల్ప ఆదాయ' స్థాయి నుండి 'మధ్యస్థాయి'కి ఎదిగిన దేశంగా పరిగణించబడేది. ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ విదేశీ రుణం భరించరానంత స్థాయికి పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్యానికి తీవ్రమైన లోటు ఏర్పడింది. దాని ఫలితంగా అది ఐఎంఎఫ్‌ ముందు చేతులు కట్టుకుని నిలవక తప్పలేదు. ఆ సంస్థ విధించిన ''పొదుపు'' చర్యలను అమలు చేయడానికి అంగీకరించక తప్పలేదు. ఈ విధంగా ఉన్నట్టుండి 'కలిగిన' దేశం కాస్తా 'లేని' దేశంగా దిగజారడానికి కారణం స్థానిక అవినీతి రాజకీయ నాయకుల నిర్వాకమేనని, రాజపక్సే వంటి కపట వేషధారులే కారణం అని సామ్రాజ్యవాద ప్రచారం చెప్పవచ్చు. అటువంటి కపటుల పాత్ర ఎంత ఉన్నప్పటికీ, దాని వెనుక నయా ఉదారవాదం బలవంతంగా రుద్దిన వ్యవస్థీకృత మార్పులు కీలకం అన్నది విస్మరిస్తే పొరపాటు.
కొద్దిమంది ద్రవ్య పెట్టుబడిదారుల, స్పెక్యులేటర్ల దురాశ, వారి ప్రయోజనాలు అత్యధిక మెజారిటీగా ఉండే శ్రామిక ప్రజల జీవన పరిస్థితులను శాసించడం నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానపు ప్రత్యేకత. ఆ కొద్దిమంది స్పెక్యులేటర్లు గనుక ద్రవ్యోల్బణం తాకిడికి గాభరా పడి నిర్ణయాలు తీసుకుంటే అది మూడవ ప్రపంచపు అసంఖ్యాక శ్రామిక ప్రజలకు ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతుంది. విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు సమస్యనుండి బైట పడడానికి ఆ మూడో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు అనుసరించే పొదుపు చర్యల ఫలితంగా ఆ శ్రామిక ప్రజానీకమే బలిపశువులవుతారు. నయా ఉదారవాద విధానాలు ఊపుగా అమలు జరిగినప్పుడు వారికి ఏ ప్రయోజనాలూ కలగలేదు. ఇప్పుడు ఆ విధానాలు పతనమవుతున్నప్పుడు సైతం దానికి వారే బలిపశువులు అవుతున్నారు.
(స్వేచ్ఛానువాదం)

- ప్రభాత్‌ పట్నాయక్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచశాంతిని కాపాడుకుందాం...
విశ్వగురువు
లెనిన్‌ను చదువుతూనే ఉండాలి!
లెనిన్‌... మరో ప్రపంచపు విజయ గీతిక
లెనిన్‌ కావ్యం
బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు!
వందే భారత్‌లో వంద అబద్ధాలు
ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం
67ఏండ్ల జీవిత బీమా జాతీయీకరణ ప్రస్థానం
మూఢత్వాన్ని చెండాడిన వేమన
నేపాల్‌ విమాన ప్రమాదాలకు బాధ్యులెవరు?

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.