Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చట్టబద్ధమైన పనిపద్ధతులు కావాలి... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 22,2022

చట్టబద్ధమైన పనిపద్ధతులు కావాలి...

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతమున్న కార్మికచట్టాలన్నిటినీ కలిపి నాలుగు లేబర్‌కోడ్‌లుగా మార్చివేసింది. గత పార్లమెంట్‌ సమావేశాలలో వేతన నిబంధనల చట్టం ఆమోదం పొందింది. వీటి ప్రభావం అన్ని రంగాలతో పాటు సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ (ఎస్‌.పి.ఇ-మెడికల్‌ రిప్స్‌) రంగం మీద కూడా పెద్ద ఎత్తున పడుతుంది. ఎన్నో సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ చట్టం-1976ని నిర్వీర్యం చేస్తూ త్వరలో ''వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత మరియు పని పద్ధతులు'' పేరుతో కొత్త నిబంధనను ప్రవేశబెట్టబోతున్నది. అలాగే మరో రెండు నిబంధనలను త్వరలో ఆమోదానికి ప్రవేశబెట్టబోతున్నట్టు తెలిపింది. సామజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించి రెండు కొత్త నిబంధనల ద్వారా కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాసి, బేరసార హక్కులను తొలగించి, దోపిడీని మరింత తీవ్రతరం చేసేందుకు అనుకూలంగా ప్రభుత్వం వీటిని రూపొందించింది. సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ చట్ట సవరణ వల్ల ఇప్పటికే సాధించుకున్న హక్కులను కోల్పోవడమే కాకుండా, మరింత దుర్భర పని పద్ధతులలోకి నెట్టివేయబడతారు. అసలుకే పని పద్ధతులు నిర్ణయించబడని పరిస్థితుల్లో యాజమాన్యాల ఒత్తిడికి... సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కొత్త లేబర్‌ కోడ్లతో వారి జీవన ప్రమాణాలు మరింత దిగజారనున్నాయి. పని పద్ధతుల కొలమానం లేని కారణంగా ఇప్పటికే యాజమాన్యాలు సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులను వేధింపు లకు గురిచేస్తూ కక్ష సాధింపు చర్యలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కార్మికులు సాధించిన హక్కులను కోవిడ్‌ గడ్డుకాలంలో వివిధ మార్గాల్లో లాక్కోవడానికి యాజమాన్యాలు ప్రయత్నించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కోర్టులు పని చేయకపోవడం వంటి కారణాలు యాజమాన్యాలు మరింత దూకుడుగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా, కార్మికవ్యతిరేక విధానాలతో ముందుకు సాగడానికి యజమానులను ప్రోత్సహించింది. వేతనాలు చెల్లించకపోవడం, వేతనాల అక్రమ కోత, బదిలీలు, మూసివేతలు, ఉద్యోగ నష్టం, సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులను వేధించడానికి వివిధ ఆన్‌లైన్‌ వర్కింగ్‌ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. డిజిటలైజేషన్‌ పేరుతో సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులపై అన్ని రకాల దాడులను యాజమాన్యాలు ప్రోత్సహించాయి. ఈ దాడులు ఫీల్డ్‌వర్కర్ల హక్కులపై మొదలైనప్పటికీ... తర్వాత బేరసార హక్కులతో సాధించుకున్న ఒప్పందాలు, కంపెనీ యూనియన్‌ మధ్య కుదిరిన అవగాహనలు రద్దయ్యే దిశగా కొనసాగుతున్నాయి. సమావేశాలు, ఇతర రకాల నిరసనలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు యాజమాన్యాల దాడులు విపరీతంగా పెరిగాయి. ద్వైపాక్షిక ఒప్పందాలను, ఉన్న చట్టాలను పక్కన పెట్టి ఏకపక్షంగా కొత్త పని విధానాలను ప్రవేశపెడుతున్నారు. దాదాపు ప్రతి కంపెనీలోనూ సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులపై కొత్త పని పద్ధతుల ద్వారా డిజిటల్‌ దాడులు జరిగాయి.
లాక్‌డౌన్‌లో యాజమాన్యాలు చాలావరకు తమ ఉద్యోగులను ఇంట్లోనే ఉండాలని, భద్రతను కొనసాగించాలని సూచించాయి. కానీ, వేతనాలు చెల్లించడం మటుకు ఆపేశాయి. ఉద్యోగులు వారి కుటుంబాల ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ పని చేయకుండా, ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, హెడ్‌క్వార్టర్స్‌ మూసివేయడం వంటి అనైతిక చర్యలకు పాల్పడ్డాయి. బదిలీలు, టెర్మినేషన్లు ఈ కాలంలో బాగా పెరిగాయి. ఈ విషయాలను కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ వీటిని నివారించడానికి ప్రభుత్వపరంగా చెప్పుకోదగ్గ ప్రయత్నాలేవీ జరగలేదు.
డిజిటల్‌ మోడ్‌ శాస్త్రీయమైనది కాదని, సేల్స్‌ ప్రమోషన్‌ జాబ్‌లో ఎంప్లారు, డాక్టర్‌ ముఖాముఖి పరస్పర చర్యను భర్తీ చేయడం సాధ్యం కాదని కోవిడ్‌ అనుభవం స్పష్టంగా తెలియచేసింది. కానీ, యాజమాన్యాలు ఇప్పటికీ ప్రతి విషయానికి ఎస్‌పిఇలను బాధ్యులను చేస్తూ బెదిరించడమే కాకుండా వేతన తగ్గింపు, శిక్షాత్మక చర్యలకు పూనుకుంటున్నాయి. యాజమాన్యాలు ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకోవడం, గుర్తింపు పొందిన యూనియన్లతో చర్చించడం లాంటివి చేయకుండా నిరంకుశంగా ముందుకు వెళ్తున్నాయి. టార్గెట్‌ అందుకోవడంలో విఫలమైన సేల్స్‌ ప్రమోషన్‌ ఉద్యోగులను ఇదే టెక్నాలజీతో వేధింపులకు గురిచేస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా సంభాషణలను అనైతికంగా రికార్డ్‌ చేసి, వాటి గురించి విశ్లేషణ పేరుతో లోపాలను ఎత్తి చూపుతూ మరింత వేధింపులకు పాల్పడుతున్నాయి. సేల్స్‌ ప్లానింగ్‌, మార్కెట్‌ ఫీడ్‌బ్యాక్‌ డేటా సేకరణ, సేల్స్‌ సమీక్ష పేర్లతో సాధ్యపడని వివిధ అవాస్తవిక వివరాలను అందించమంటూ యాజమాన్యాలు ఒత్తిడితెస్తున్నాయి. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌లతో పాటు, అది అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, యాజమాన్య అనుకూల విధానాలతో ఉద్యోగులపై దాడులు మరింత పెరుగుతాయి.

- సిహెచ్‌.కుమార్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిద్దాం... ప్రపంచశాంతిని కాపాడుకుందాం...
విశ్వగురువు
లెనిన్‌ను చదువుతూనే ఉండాలి!
లెనిన్‌... మరో ప్రపంచపు విజయ గీతిక
లెనిన్‌ కావ్యం
బుద్ధుడు అవతారమూర్తి కాదు, చారిత్రక పురుషుడు!
వందే భారత్‌లో వంద అబద్ధాలు
ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం
67ఏండ్ల జీవిత బీమా జాతీయీకరణ ప్రస్థానం
మూఢత్వాన్ని చెండాడిన వేమన
నేపాల్‌ విమాన ప్రమాదాలకు బాధ్యులెవరు?

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.