Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుజరాత్‌లో గెలుపుకోసం బీజేపీ ఆరాటం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

గుజరాత్‌లో గెలుపుకోసం బీజేపీ ఆరాటం

నవంబర్‌ 10న గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితా న్యూఢిల్లీలో ప్రకటించినప్పుడు, గుజరాత్‌లో ఏమి జరుగుతుందో ఊహించినప్పటికీ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోయారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 182 సభ్యులు గల శాసనసభకు ప్రకటించిన 160మంది అభ్యర్థుల్లో 38మంది కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన వారే ఉన్నారు. అదే విధంగా 38మంది సిట్టింగ్‌ శాసనసభ్యులకు టిక్కెట్లు ఇవ్వకుండా నిరాకరించారు. కొంతమంది మాజీ మంత్రులు, విజరు రూపానీ లాంటి మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీలోని అధిష్టానం సలహా మేరకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వచ్ఛందంగానే నిరాకరించారు.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నాయకునిగా ఉన్న విజరు రూపానీని తన మంత్రివర్గంతో సహా రాజీనామా సమర్పించాలని సెప్టెంబర్‌ 11న అధిష్టానం ఆదేశించి, ఆ స్థానాన్ని ఎవరూ ఊహించని రీతిలో భూపేంద్ర పటేల్‌కు కట్టబెట్టడంతో పాటు కొత్త వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే ఈసారి గుజరాత్‌లో గెలుపు అంత తేలిక కాదనే విషయాన్ని బీజేపీ అగ్రనాయకులు పసిగట్టారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రివర్గ సభ్యుల్ని మార్చడం అనేది దీర్ఘకాలంగా బీజేపీ వ్యూహంలో భాగంగా ఉంటూ వస్తుంది. 2018లో బీజేపీ మొదటిసారిగా ఉత్తర ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో విజయం సాధించింది, ఇప్పుడు అక్కడ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇటీవల కాలంలో అసాధారణ రీతిలో అక్కడి ముఖ్యమంత్రిని మార్చింది. ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు పాలనాపరమైన మార్పులను చేపడుతుంది. ఆ ప్రకారంగా, కోవిడ్‌ మహమ్మారి అదుపు నిర్వహణ, ఇతర సమస్యలకు సంబంధించిన విమర్శల వెల్లువను తగ్గించేందుకు కొంతమంది సీనియర్ల విషయంలో కూడా మోడీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఇలాంటి నిర్దాక్షిణ్యమైన తొలగింపులను చూసింది.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత శ్రేణి నాయకులను మార్చడం బీజేపీ భయపడుతుందనడానికి ఓ సంకేతం. 1996-98 మధ్య కాలంలో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో పార్టీ చీలిక నాయకుడైన శంకర్‌ సిన్హ్‌ వాఘేలా నాయకత్వంలోని ప్రభుత్వ పాలన మినహాయిస్తే, 1995 నుండి బీజేపీ నిరంతరాయంగా పాలన కొనసాగిస్తున్న రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో శాయశక్తులను ఒడ్డి గెలిచే ప్రయత్నంలో బీజేపీ మునిగి ఉంది.
మోడీ సందర్శనలు, వాగ్దానాలు
మార్చి 2022 నుండి ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరాష్ట్రాన్ని ఇప్పటికే 12 దఫాలు సందర్శించాడు, వాటిలో 10 దఫాలు గత ఆరు నెలల్లోనే (జూన్‌ నుంచి) సందర్శించాడు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి, బీజేపీ మళ్ళీ అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీ సాధించిన ఒక రోజు తరువాత మోడీ మొదటిసారి అంటే మార్చి 11, 12 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో అహ్మదాబాద్‌లో, ఆ పక్కనున్న గాంధీనగర్‌లో రోడ్‌ షోలు నిర్వహించి, గుజరాత్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల విజయంతో ప్రయోజనం పొందే స్పష్టమైన సూచిక ఇది.
రోడ్డు షోలు, బహిరంగ సభలు, సమావేశాలతో పాటుగా తన స్వంత రాష్ట్రానికి 1.18లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మించతలపెట్టినట్లు ప్రధాని అప్పటికే ప్రకటించాడని మీడియా నివేదికల ఆధారిత ఒక అంచనా సూచిస్తోంది. ఇది ఆయనకు కొత్తేమీ కాదు. బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆయన అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆ వాగ్దానం పని చేస్తుందా లేదా అనేది అనిశ్చితం. ఎందుకంటే, అలాంటి ప్రకటనలు, ప్రారంభో త్సవ వేడుకలు చేసుకున్న బీహార్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలవలేదు కానీ ఇతర అనేక రాష్ట్రాల్లో గెలిచింది.
అయినా ఇలాంటి సన్నివేశాల ప్రధానమైన లక్ష్యం, ప్రధానమంత్రికి ప్రజల్లో మంచి ప్రచారాన్ని సాధించడం. అయినా, బీజేపీకి ఓట్లు సంపాదించిపెట్టే ఏకైక వ్యక్తిగా నరేంద్ర మోడీ తనను తాను ప్రకటించుకుంటున్నాడు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో, ''మీరు ఓటు వేయడానికి వెళ్లినపుడు, బీజేపీ అభ్యర్థిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కేవలం 'కమలం' గుర్తును మాత్రమే గుర్తుంచుకోండి. నేను మీ వద్దకు 'కమలం' గుర్తుతో వచ్చాను. మీరు 'కమలం' గుర్తును ఎక్కడ చూస్తే, అదే బీజేపీ, మోడీ మీవద్దకు వచ్చాడని అర్థం'' అని బహిరంగంగా ప్రకటించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న ఒక పార్టీకి చెందిన నాయకుడు, దేశానికి ప్రధానమంత్రి, తాను తప్ప ఎవరిదీ ఏమీ లేదని ఓటర్లకు చెప్పాల్సి రావడం వింతగానూ, అసహజంగానూ, అసాధారణంగానూ ఉంది.
డిసెంబర్‌ 5, 8 తేదీల్లో జరగనున్న ఎన్నికలకు వారం, పది రోజులకు ముందు కూడా (ఎన్నికల నిబంధనలు ఉన్న కారణంగా వివిధ ప్రాజెక్టుల ప్రకటనలు ఆగినప్పటికీ) మోడీ గుజరాత్‌లో మరికొన్ని ఎన్నికల ప్రచార పర్యటనల్లో పాల్గొంటారు.
హిందూత్వ కార్డు
బీజేపీ హిందూత్వ పాలనా నమూనాను రూపొందించి, నిర్మించిన ఒక ప్రయోగశాల గుజరాత్‌. రాష్ట్రాన్ని కబళించిన ముస్లిం వ్యతిరేక హింస జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలు సమీపించినప్పుడు, పాలక పార్టీ పదే పదే తన మతోన్మాద ఎత్తుగడలను ఉపయోగిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 2002 బిల్కిస్‌ బానో కేసులో గ్యాంగ్‌ రేప్‌ చేసి, హత్యలు చేసిన 11మంది నేరస్థులను ఈ సంవత్సరం ఆగస్టు నెలలో సత్ప్రవర్తన గల వ్యక్తులనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వారు వాస్తవానికి జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నారు. కేంద్రం కూడా వారి విడుదలను అంగీకరించిందని తరువాత తెలిసింది. ఇలాంటి చర్యల పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఇవి హిందూత్వ భావాలను ముందుకు తీసుకొని పోయేందుకు దోహదం చేస్తున్నట్టు కనపడుతుంది.
తరువాత, రాష్ట్రంలో యూనీఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ''అమలు చేసేందుకు'' ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆరెస్సెస్‌, బీజేపీ నాయకత్వంలోని హిందూత్వ మద్దతుదారుల ఆసక్తికరమైన విషయం. ఇది మైనారిటీలను బోనులో పెట్టే నినాదంగా మారింది. ఒకే రాష్ట్రంలో అలాంటి అమలు చట్టబద్దం కానప్పటికీ, ఇటీవల కాలంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే విధమైన ప్రకటనలు చేశాయి. పౌరసత్వ సవరణ చట్టం కింద గుజరాత్‌ రాష్ట్రం లోని ఆనంద్‌, మెహసానా జిల్లాల్లో పౌరసత్వం మంజూరు చేసే అధికారాన్ని ఆ జిల్లాల కలెక్టర్లకు కట్టబెడుతూ కేంద్రహౌం మంత్రిత్వశాఖ ఇటీవల ఒక ప్రకటన జారీ చేసింది. ఈ చట్టం ముస్లి మేతర మతవిశ్వాసాలు గల వారికి పౌరసత్వాన్ని వేగంగా మంజూరు చేస్తుంది కాబట్టి దేశ వ్యాప్తంగా ముస్లింల పట్ల వివక్షతతో కూడిన వ్యతిరేకతను ఈ చట్టం వేగంగా కూడగట్టింది.
ఈ బహిరంగ ప్రకటనలు ఏమి సాధించాలను కుంటున్నాయో చాలా స్పష్టం: ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో హిందూత్వ ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2002లో జరిగిన హింస తరువాత గుజరాత్‌ రాష్ట్రంలోని ముస్లింలు ఇప్పటికే ఉపశ్రేణీకృత వర్గంగా (మార్జినలైజ్డ్‌) ఉన్నారు. తరువాత కాలక్రమంలో వివక్షత వారిని శిక్షిస్తూనే ఉంది. ప్రజల్లో అసంతప్తి మరోవిధంగా ముందుకు వస్తుందని బీజేపీ భయపడుతుంది కాబట్టి, ఈ ఎన్నికల్లో తన హిందూత్వ పునాది చెదిరిపోకుండా ఉండే హామీ కోసం శాయశక్తులా కృషి చేస్తుంది.
గుజరాత్‌లో అసంతృప్తి
''గుజరాత్‌ మోడల్‌'' వైఫల్యం చెందిందని రుజువు చేసే పరిణామాలు గడచిన ఐదేండ్లలో అనేక చోటుచేసుకున్నాయి. గత 2017 ఎన్నికల సమయంలో పటీదార్‌ ఆందోళన చాలా ఉధతంగా నడిచింది. దీనికి నాయకత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌ అనే యువకుడ్ని తరువాత బీజేపీ ప్రభుత్వం జైలులో పెట్టింది. జైలు నుండి విడుదలైన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. కానీ చివరికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంట పెట్టుబడి ఖర్చులు పెరిగి, పంటకు మద్దతు ధర పొందకుండా నష్టపోయిన రైతుల అసంతృప్తి వ్యక్తీకరణే ఈ పటీదార్‌ ఆందోళన. గుజరాత్‌ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక కార్మికులు అతి తక్కువ కనీస వేతనాలు పొందుతున్నారు. గుజరాత్‌ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సమయంలో సమర్పించిన సామాజికార్థిక సమీక్ష ప్రకారం, గుజరాత్‌ 2020-21లో ద్వితీయ రంగం నుండి 43శాతం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌ డీపీ) గల అభివృద్ధి చెందిన పారిశ్రామిక రాష్ట్రం. అయినప్పటికీ, కార్మికులకు వేతనాలు తక్కువ, పని చేస్తున్న ప్రాంతాలు ఇబ్బందికరంగా ఉండడం, ఉద్యోగ అభద్రత, ఇంకా పరిష్కారం కాని సమస్యలతో రాష్ట్రంలో పారిశ్రామిక కార్మికులు సతమతమవుతున్నారు.
కోవిడ్‌ మహమ్మారిని నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ తీరు పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. జనవరి 17, 2022 నాటికి కోవిడ్‌ కారణంగా 10,164 మంది మరణించారని గుజరాత్‌ అధికారికంగా ప్రకటించినప్పటికీ, తరువాత ఫిబ్రవరి 3,2022 నాటికి 1,02,203 దరఖాస్తులు అందాయనీ, అందుకుగాను 87,045 దరఖాస్తులను ఆమోదించి, 82,605 కుటుంబాలకు 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆరోగ్య సంరక్షణా విధానం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరులే కారణాలు. విజరు రూపానీని ముఖ్యమంత్రిగా తొలగించడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన నిధుల లేమి ప్రజలను, ముఖ్యంగా అణగారిన వర్గాలను వెంటాడుతోంది.
దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కూడా తీవ్రమైన కష్టాలను, వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఈ వర్గాలకు చెందిన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ వైపు లేదా పట్టణ ప్రాంతాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్‌ అత్యంత ఎక్కువగా పట్టణీకరణ చెందిన రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌ జనాభాలో సుమారు 43శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మార్బీ విషాదం సూచించిన విధంగా, పట్టణ స్థానిక సంస్థలు (అవినీతి, శిక్షల లేమితో) గ్రూపులుగా విడిపోతున్నాయి. కాబట్టి ప్రజలు రాష్ట్రంలోని పాలక పార్టీకి వ్యతిరేకంగా ఆగ్రహంతో ఉన్నారు. తీవ్రమైన అసంతప్తితో ఉన్న వివిధ స్రవంతులకు చెందిన ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు కాబట్టి, ఈ వెతుకులాట బీజేపీ వర్గాల్లో భయానికి కారణభూతమైంది.
మూలం: సుబోధ్‌ వర్మ
అనువాదం:బోడపట్ల రవీందర్‌,
సెల్‌:9848412451

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీవు నేర్పిన విద్యయే నరేంద్ర భాయి!
పాలకుల విధానాలు... వ్యవసాయ సంక్షోభం
ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..?
చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.