Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎఫ్‌.టి.ఎక్స్‌ పతనం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

ఎఫ్‌.టి.ఎక్స్‌ పతనం

ఎఫ్‌టిఎక్స్‌ (ఫ్యూచర్స్‌ ఎక్స్ఛేంజ్‌) నవంబర్‌ 11న మూతబడింది. ఎఫ్‌టిఎక్స్‌ అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌గా ఉంది. చాలామంది ఈ పరిణామాన్ని 2008 ఆర్థిక సంక్షోభం కాలంలో జరిగిన లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ (పెట్టుబడుల బ్యాంకింగ్‌ సంస్థ) పతనంతో సరిపోల్చుతున్నారు. అధికారిక ఆర్థిక వ్యవస్థలో ఆనాడు లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ సంస్థ పతనానికి ఎంత ప్రాముఖ్యత ఉండిందో, ఇప్పుడు (అనధికారిక) క్రిప్టో కరెన్సీ వ్యవస్థలో అంతటి ప్రాముఖ్యత ఉందని వారు భావిస్తున్నారు. నిజానికి నవంబర్‌ 11 కన్నా మునుపే క్రిప్టో కరెన్సీ విలువలు చాలా పెద్ద స్థాయిలో పడిపోయాయి. 2021 చివరికి అన్ని రకాల క్రిప్టో కరెన్సీల మొత్తం విలువ రెండు లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. 2022 పెప్టెంబర్‌ వచ్చేసరికి అది కాస్తా సగానికి సగం పడిపోయింది. ఇప్పుడు తాజాగా ఎఫ్‌టిఎక్స్‌ పతనం మొత్తం వ్యవస్థని మరింతగా దెబ్బ తీయనుంది.
శామ్‌బ్యాంక్‌మాన్‌ ఫ్రైడ్‌ అనే ఎంఐటి విద్యార్థి (మసాచుసెట్స్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) 2019లో ఈ ఎఫ్‌టిఎక్స్‌ను స్థాపించాడు. అందులో ఒక తరహా క్రిప్టో కరెన్సీని ఇంకో క్రిప్టో కరెన్సీతో మార్పిడి చేసుకోవడం, క్రిప్టో కరెన్సీని గ్యారంటీ పత్రాలతో మార్పిడి చేసుకోవడం (ఫియట్‌ మనీ) వంటివి చేపట్టారు. అంతే కాక. ఎఫ్‌టిటి అనే తమ స్వంత క్రిప్టో కరెన్సీని జారీ చేయడం, క్రిప్టో కరెన్సీతో ఫ్యూచర్లు, డెరివేటివ్‌ల వంటి స్టాక్‌ ఆధారిత లావాదేవీలను నిర్వహించడం వంటి కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఆ విధంగా చాలా విధాలుగా ఆ సంస్థ బ్యాంక్‌ మాదిరిగా వ్యవహరించింది. డాలర్లు గాని, యూరోలు గాని అక్కడ జమ చేస్తే భవిష్యత్తులో ఎక్కువ మొత్తాలను చెల్లిస్తామన్న హామీతో లావాదేవీలు చేపట్టారు. దాంతో ఈ సంస్థను స్థాపించిన మూడేండ్లలోనే ప్రపంచంలో అయిదవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌గా ఎదిగింది. సమకూర్చుకున్న సంపద ప్రకారం రెండవ అతిపెద్ద క్రిప్టో సంస్థగా తయారైంది.
ఇంత అసాధారణ రీతిలో ఎదగడానికి వెనుక ఆ సంస్థచేసిన అనేక రకాల ప్రయత్నాలు ఉన్నాయి. డెమాక్రటిక్‌ పార్టీకి అతి పెద్ద మొత్తంలో (ఒక్క జార్జ్‌ సోరోస్‌ విరాళమే అంతకన్నా ఎక్కువ) విరాళం ఇచ్చింది. పలు క్రీడా కార్యక్రమాలను స్పాన్సర్‌ చేసింది. షాకిల్‌ ఒ నీల్‌ (బాస్కెట్‌బాల్‌ క్రీడలో ప్రముఖుడు) నోమీ ఒసాకా (ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి)లతో కార్యక్రమాలు నిర్వహించింది. ''ఉక్రెయిన్‌ సహాయ నిధి'' పేరుతో క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలను స్వీకరించింది. ఆ విరాళాలు అనంతర కాలంలో కీవ్‌ (ఉక్రెయిన్‌ రాజధాని)లోని నేషనల్‌ బ్యాంక్‌లో గ్యారంటీల రూపంలోకి మార్చడం జరుగుతుందన్న హామీ ఇచ్చింది.
ఎంత నాటకీయంగా ఎదిగిందో, అంతే నాటకీయంగా ఈ ఎఫ్‌టిఎక్స్‌ పతనం చెందింది. శామ్‌ బ్యాంక్‌మాన్‌ ఫ్రైడ్‌ యజమానిగా ఉన్న ఆలమెదా అనే సంస్థ ఎఫ్‌టిఎక్స్‌ సంస్థ విడుదల చేసిన ఎఫ్‌టిటి అనే క్రిప్టో కరెన్సీని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది. ఈ ఆలమెదా బ్యాలెన్స్‌షీట్‌ వివరాలు బైటకు పొక్కడంతో ఆ ఎఫ్‌టిటి విలువ పెద్దగా పడిపోనున్నది అన్న భయాందోళన మార్కెట్‌లో కలిగింది. ఎఫ్‌టిఎక్స్‌కి పోటీదారుగా ఉన్న బైనాన్స్‌ అనే మరో క్రిప్టో కరెన్సీ నిర్వాహక సంస్థ తనవద్ద ఉన్న ఎఫ్‌టిటి నిల్వలను ఈ భయాందోళనల కారణంగా అమ్మడం మ్రొదలెట్టింది. దాంతో అసలు పతనం మొదలైంది. ఒక బ్యాంక్‌ విషయంలో ఏ విధంగా పతనం సంభవిస్తుందో, అదే విధంగా ఇక్కడా జరిగింది. పతనం వెనుక కారణం కూడా ఒకేమాదిరిగా ఉంది. ఎఫ్‌టిటిల విలువ పడిపోకుండా నిలబెట్టాలంటే వాటిని ఎప్‌టిఎక్స్‌ స్వయంగా కొనుగోలు చేయాల్సివుంటుంది. అలా కొనుగోలు చేయడానికి తనవద్ద ఉండే రిజర్వు ఆస్తులను అమ్మాల్సివుంటుంది. ఆ విధమైన రిజర్వు ఆస్తులు తగిన మోతాదులో ఎఫ్‌టిఎక్స్‌ వద్ద లేవు. నిజానికి శామ్‌ బ్యాంక్‌మాన్‌ ఫ్రైడ్‌ నడుపుతున్నది ఒక తరహా చీటీ కంపెనీ వంటిదే. ప్రజల వద్దనుండి డిపాజిట్లు సేకరించి వేరే మార్గాలకు ఆ సొమ్మును మళ్ళించడం దాని సారాంశం.
ఎఫ్‌టిఎక్స్‌కు పోటీదారుడైన బైనాన్స్‌ తొలుత ఎఫ్‌టిఎక్స్‌ను కొనివేయాలనే అనుకుంది. కాని, తర్వాత వెనక్కి తగ్గింది. ఇక ఎఫ్‌టిఎక్స్‌ను పతనం నుండి కాపాడడానికి జోక్యం చేసుకోమని (2008 సంక్షోభంలో అమెరికన్‌ ప్రభుత్వం ప్రకటించిన బెయిల్‌ ఔట్‌ ప్యాకేజి మాదిరిగా) జో బైడెన్‌ను కోరడం ఈ సందర్భంలో సాధ్యం కాదు. ఎందుకంటే అసలు క్రిప్టో కరెన్సీ రంగం మీదకు వచ్చిందే ప్రభుత్వం జోక్యం గాని, లదుపు గాని ఆర్థిక లావాదేవీలపై ఉండకూడదనే వాదనతో కదా! దాంతో ఇక ఎఫ్‌టిఎక్స్‌ దివాలా ఎత్తిందని ప్రకటించడం వినా వేరే మార్గం లేకపోయింది. శామ్‌బ్యాంక్‌మాన్‌ ఫ్రైడ్‌ నవంబర్‌ 11న చేసిందదే.
లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ ఉదంతానికి, ఎఫ్‌టిఎక్స్‌ వ్యవహారానికి ఉన్న పోలిక సరిగ్గా ఇక్కడే ఆగిపోతుంది. గృహ నిర్మాణ రంగంలో వృద్ధి నిరంతరం కొనసాగుతుందన్న అతి అంచనాలు, మరోపక్క గృహ రుణాల పారు బకాయిలను కప్పిపుచ్చే విధంగా సాగిన స్టాక్‌ లావాదేవీలు అమెరికాలో ''హౌసింగ్‌ బబుల్‌'' పెరగడానికి, ఆ తర్వాత అది పేలిపోడానికి కారణమయ్యాయి. ఆ హౌసింగ్‌ రుణాల స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టిన లెV్‌ామాన్‌ బ్రదర్స్‌ పతనానికి అది దారి తీసింది. అటువంటి స్టాక్‌లలో లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ సంస్థ ఏ బాధ్యతా లేకుండా అజాగ్రత్తగా పెట్టుబడులు పెట్టిందని అనుకోడానికి లేదు. ఎందుకంటే పారుబకాయిలలో ఏవి తిరిగి వస్తాయో, ఏవి రావో తెలుసుకోవడం కష్టం. అన్నింటినీ కలగలిపి స్టాక్‌లుగా మార్కెట్‌లో విడుదల చేయడమే దానికి కారణం.
ఈ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పతనం వ్యవస్థలో తలెత్తిన లోపం అని ఆ తర్వాత ఉదారవాద ఆర్థిక వేత్తలు చెప్పబూనుకున్నారు. అంటే భవిష్యత్తులో ఆ విధంగా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించినట్టు అనుకోవాలి. కాని అసలు విషయాన్ని వారు కప్పిపుచ్చడానికే ఆ విధంగా చెప్పారు. నిజానికి నయా ఉదారవాద వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం ఆ తప్పుడు పాలసీని అనుసరించబట్టే ఆర్థిక రంగంలో ఒక ఊపును తీసుకువచ్చింది. (రియల్‌ ఎస్టేట్‌లో ఆస్తుల విలువను కృత్రిమంగా పెంచడం) అంటే లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ పతనం నయా ఉదారవాద విధానం అమలులో అంతర్భాగమే.
క్రిప్టో కరెన్సీ వ్యవహారం మాత్రం నయా ఉదారవాద విధాన వ్యూహంలో అంతర్భాగం కాదు. అది ఆ విధానానికి వెలుపలనుంచి వచ్చి తగులుకున్న ఒక వ్యవహారం. అందుచేత ఇప్పుడు క్రిప్టో కరెన్సీ లేకుండా పోతే నయా ఉదారవాద విధానానికి వచ్చే నష్టం ఏమీ లేదు. లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ పతనం మాదిరిగా ఇది నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కుదిపివేయదు. క్రిప్టో కరెన్సీ అనేది ప్రభుత్వం ప్రమేయం లేకుండా మార్కెట్‌లోకి వచ్చిన ఒక సరుకు లాంటిది. నిజానికి ప్రభుత్వ జోక్యం ఏమీ లేకుండా ఉండడమే దానికి ఆ ఆకర్షణ తీసుకొచ్చింది. చట్టానికి దొరకకుండా సాగే పలు లావాదేవీలకు ప్రభుత్వ జోక్యం ఒక అవరోధం. ఈ క్రిప్టో వ్యవహారం జోలికి ప్రభుత్వం రాదు. నిజానికి ఆలమెదా అనే ఒక సంస్థ ఉన్నట్టు, దానికి శామ్‌బ్యాంక్‌మాన్‌ అధిపతిగా ఉన్నట్టు ఎఫ్‌టిటిలను కొనుగోలు చేసిన చాలామందికి తెలియనే తెలియదు. ఎఫ్‌టిఎక్స్‌ అకౌంట్లను కూడా చాలాకాలం ఆడిట్‌ చేయడం జరగలేదు. అందుకే శామ్‌బ్యాంక్‌మాన్‌ ఆటలు అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతూవచ్చాయి. ఆలమెదా సంస్థ బ్యాలెన్స్‌షీట్‌ వివరాలు బైటకు పొక్కడంతో వ్యవహారం బైటపడింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రానికి వెలుపల, ఆ వ్యవస్థ నియంత్రణ లేకుండా సాగే చీకటి వ్యాపారంలో ఒక అంతర్భాగమే ఈ క్రిప్టో కరెన్సీ వ్యవహారం. ఈ చీకటి వ్యవహారాల నుండి పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా చాలా ప్రయోజనాలు పొందుతూవుంటారు. తమ తమ తప్పుడు వ్యవహారాలకు కావలసిన నిధులను ఈ చీకటి వ్యాపారం నుండే సమకూర్చుతూవుంటారు. అయితే, ఈ చీకటి లావాదేవీలు పెట్టుబడిదారీ విధానంతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయిందని భావించకూడదు. ఇటువంటి చీకటి వ్యవహారాలతో ముడిపడి వున్నందువల్లనే పెట్టుబడిదారీ విధానం చెడిపోయిందని, ఇటువంటి వ్యవహారాలు లేకుండాపోతే అంతా సవ్యంగానే నడుస్తుందని అనుకోవడం తప్పు. మార్క్స్‌ చెప్పినట్టు పెట్టుబడిదారీ విధానమే అక్రమ ప్రాతిపదికన ఏర్పడిన వ్యవస్థ.
ఎఫ్‌టిఎక్స్‌ దివాలా ఎత్తినట్టు ప్రకటించాక అమెరికన్‌ ప్రభుత్వం దానిని ఆదుకోడానికి ఎటువంటి చర్యలనూ ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించదు. గతంలో లెV్‌ామాన్‌ బ్రదర్స్‌ పతనం అయినప్పుడు ఒబామా ప్రభుత్వం ఏకంగా 13లక్షల కోట్ల డాలర్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విధంగా జరగలేదు. ప్రభుత్వం ఏ విధంగానూ తన వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని చెప్పిన క్రిప్టో... వ్యాపారంలో దివాలా ఎత్తినప్పుడు మాత్రం ప్రభుత్వ జోక్యం కోరడం ఆ సంస్థకు ఏ విధంగా సాధ్యం అవుతుంది? ప్రభుత్వం కూడా ఏ విధంగా జోక్యం చేసుకోగలుగుతుంది? అధికార పార్టీకి భారీ విరాళాలను ఇచ్చినంతమాత్రాన జోక్యం చేసుకోడం సాధ్యమేనా?
నిజానికి ఇటువంటి మోసపూరిత లావాదేవీలే ఆ చీకటి వ్యాపారం పట్ల ఆకర్షణ లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ పతనం నయా ఉదారవాద విధానం అనుసరించే వ్యూహంలో అంతర్భాగం. అదే ఎఫ్‌టిఎక్స్‌ దివాలా తీయడం అక్రమ పద్ధతులలో నడిచే ఒక చీకటి వ్యాపారంలో జరిగిన మోసం. అదే ఆ వ్యాపారం పట్ల ఆకర్షణ కలగడానికి కారణం.
''ఉక్రెయిన్‌ సహాయ నిధి'' పేర ఎప్‌టిఎక్స్‌ సేకరించిన నిధులలో వాస్తవంగా ఎంత భాగం ఉక్రెయిన్‌ కు చేరిందో, ఆ నిధిని స్థాపించిన అసలు లక్ష్యం కోసం ఖర్చు జరిగిందో, లేదో తెలియాలని ఇప్పుడు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏ విధమైన పారదర్శకతా లేకుండా, ఏ విధమైన జవాబుదారీ తనమూ లేకుండా సాగిన ఈ వ్యవహారం గురించి ముక్కలు ముక్కలుగా అక్కడక్కడా తెలిసిన మేరకు సమాచారం వెబ్‌ పేజీలలో కనిపిస్తూవుంది. ఇంకా ఇటువంటి ప్రశ్నలు ఇకముందూ రాకమానవు. నిజానికి ఆ ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఎటువంటి శక్తుల ఆధ్వర్యంలో నడుస్తోందో, దానిని సమర్థించే పశ్చిమ దేశాల మద్దత్తుదారుల స్వభావం ఏమిటో, ఎఫ్‌టిఎక్స్‌ వంటి అక్రమ సంస్థలు ఉక్రెయిన్‌కు సహాయం చేయాలనే పేరుతో నిధులు సేకరించడానికి ఆ పశ్చిమదేశాల ప్రభుత్వాలు ఎందుకు అనుమతించాయో ఊహించుకోవచ్చు.
ఎఫ్‌టిఎక్స్‌ పతనం క్రిప్టోకరెన్సీ వ్యవస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఎఫ్‌టిఎక్స్‌ పతనం వలన చాలామంది నష్టపోయివుంటారు. కాని అంతమాత్రాన్నే మొత్తం క్రిప్టో కరెన్సీ వ్యవస్థే అంతరించిపోతుందని అనుకోవద్దు. ఈ ఉదంతం తర్వాత ప్రభుత్వాలు ఏ విధమైన పాలసీని క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో చేపడతాయో చూడాల్సివుంది. చైనా ప్రభుత్వం కొంతకాలం నుండీ క్రిప్టో కరెన్సీని నిషేధించింది. మన భారత ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీని నిషేధించే చట్టాన్ని తీసుకురానున్నట్టు 2021లో ప్రకటించింది. కాని ఇంతవరకూ తీసుకురాలేదు. అవినీతిపరుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న మక్కువ సంగతి అందరికీ తెలిసినదే. బ్యాంకు అప్పుల్ని ఎగ్గొట్టిన ప్రయివేటు వ్యక్తులకు ఏ విధంగా క్షమించిందో మనం చూశాం. అందుచేత క్రిప్టో కరెన్సీని నిషేధించే చట్టాన్ని తీసుకువస్తుందా అన్నది అనుమానమే. ఆ అనుమానమే గనుక నిజం అయితే అంతకన్నా బాధాకరం అయినది ఇంకొకటి ఉండబోదు.
(స్వేచ్ఛానువాదం)
- ప్రభాత్‌ పట్నాయక్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీవు నేర్పిన విద్యయే నరేంద్ర భాయి!
పాలకుల విధానాలు... వ్యవసాయ సంక్షోభం
ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..?
చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''

తాజా వార్తలు

07:03 PM

ప్రగతిభవన్‌ గేట్లను.. కచ్చితంగా బద్దలు కొడతాం : రేవంత్‌ రెడ్డి

06:51 PM

ప్రధాని మోడీ డిగ్రీ కేసు..తీర్పు రిజర్వ్‌ చేసిన గుజరాత్‌ హైకోర్టు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.