Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ పురస్కార ప్రదానం గురజాడను గౌరవించడమా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

ఈ పురస్కార ప్రదానం గురజాడను గౌరవించడమా?

''చాందసత్వపు చీకటులు తొలగించి,
లోకపు రీతి మార్చగ ఆధునిక భావాలదివ్వెల
వెలుగులందించి అభ్యుదయ పథమందు జాతిని
నడుపగా చేబూని కలమును
ఆయుధముగా ప్రయోగించిన కవీ, జోహారు''
ఈ రోజు గురజాడ వర్థంతి. ఈ సందర్భంగా 'గురజాడ సమాఖ్య' వారు చాగంటి వారికి గురజాడ పురస్కారాన్ని ఇవ్వడం పట్ల తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది. ఒక మహనీయుని పేరుతో పురస్కారం ప్రకటించాలంటే ఆ మహనీయుని భావజాలానికి అనుగుణ్యమైన వారినే ఎంపిక చేయడం సమంజసం. ఒక మహౌన్నతమైన వ్యక్తి పేరుతో పురస్కారం ఏర్పాటు చేయడమెందుకంటే వారి ఆశయాల్ని కొనసాగించడానికీ, వాటిని ప్రజల్లో వ్యాపింపజేయడానికీ. కానీ గురజాడ భావజాలానికీ, ఆలోచనలకీ వారి సంస్కరణ భావాలకూ వ్యతిరేకమైనవారిని, ఎంపిక చేయడం గురజాడ అభిమానులకు సహజంగానే బాధ కలిగించింది. గతంలోనూ ఇలా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ పత్రికా ముఖంగా తమ అసమ్మతిని తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అయినా పురస్కార ప్రదాతలు తమ చర్యల్ని సమర్థించుకోడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వారి సమర్థింపుల కోసం గురజాడ దైవభక్తుడనీ, సంప్రదాయ వాదనీ చెప్పుకొచ్చారు. అందుకు ఆధారం కన్యాశుల్కంలోని చివరి అంకంలో సౌజన్యారావు పంతులు చేతిలోని భగవద్గీత, తులసికోట అట! తులసికోట ఉంటేనో, దేవుడి పటం ఉంటేనో ఆ వ్యక్తి ఆస్థికుడని, భక్తుడని నిర్ణయం చేసేయడమేనా? కథలోనో, నాటకంలోనో, నవలలోనో సృజనకారుడు ఎన్నో పాత్రల్ని సృష్టిస్తాడు. ఆ పాత్రల అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా భావించడం సరైందేనా? ఒక పాత్ర హంతకుడైతే రచయితని హంతకుడని నిర్ధారణ చేసేస్తారా? ఆయా పాత్రల సామాజిక స్థాయిననుసరించి సంభాషణల ద్వారా తాను నమ్మిన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు. అంత వరకే. కన్యాశుల్కం నాటకంలో 'గిరీశం గురజాడే' అన్నవాళ్ళున్నారు. 'గురజాడే సౌజన్యారావు పంతుల'న్నవాళ్ళూ ఉన్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు చేసేసారు..! ఇంకా నయం 'మధురవాణి' ఆడవేషం వేసుకున్న గురజాడే అని అనలేదు, రక్షించారు!
గురజాడ జీవించినన్నాళ్ళూ ఛాందసుల విమర్శల్ని ఎదుర్కొంటూనే వచ్చాడు. గ్రాంధికవాదుల అవహేళనల్ని, వెటకారాల్ని, వారి వికారాల్ని సహిస్తూనే తన ఉద్యమాన్ని కొనసాగించి విజయగర్వంతో తలెత్తి నిలబడ్డాడు. తాను భౌతికంగా లేనప్పుడూ వదల్లేదాయనను కొందరు. 'గురజాడ మరణించాకే జీవించడం ప్రారంభించార'ని కృష్ణశాస్త్రిగారంటే ... అలా గురజాడ జీవించడం ఇష్టం లేని, అతని భావజాలంతో ఏకీభవించలేని కొందరు తమ పాండిత్యమంతా రంగరించి కుస్తీలు పట్టి జబ్బసత్తువకొద్దీ సంగతి వ్యాసాలు లోకమ్మీదకొదిలిన సంగతి ఇప్పటి గురజాడ సాంస్కృతిక సమాఖ్య వారికి తెలీదా? ఆ వ్యాసాలకు ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేసారా ఎవరైనా? అయినా అతడు గురజాడ. ఆ గురుజాడ ఎవరూ చెరపలేనిది.
గురజాడ ఆస్థికుడని చెపుతున్న వారు ఈ గురజాడ మాటల్ని చదివితే ఏమంటారో! ''అందరు దేవుళ్ళూ ఒక్కరే అయితే ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?'' (దేవుళ్ళారా మీ పేరేమిటి?)
''కార్యకారణ సంబంధ జ్ఞానం శూన్యమైనప్పుడు ఏది జరిగినా అది కాకతాళీయం, వేళావిశేషం, విధికృతం, యాదృచ్ఛికం అని వ్యక్తులు ఊహించి సంతృప్తిపడతారు. ఆలోచనకు చోటివ్వరు.'' ''అంధవిశ్వాసాలు ప్రమాదకరమైనవి. ప్రశ్నించే స్వభావం లేనప్పుడు గుడ్డి నమ్మకాలు కలుగుతుంటాయి. మనల్ని ఛాందసత్వం ప్రశ్నించనీయదు.''
''క్షుద్రదేవతారాధన, ఉపాసన అనే మూఢ విశ్వాసాలను కలిగించి కొందరు దొంగ వేదాంతులు చేసే ఘోర కృత్యాలకు లెక్క లేదు. 'వేదాంతులొస్తున్నారు, చెంబులూ ముంతలూ జాగ్రత్త' అన్న సామెత ఊరికే పుట్టలేదు.'' (గురజాడ 'తనలో తాను' శీర్షిక నుండి)
''చంద్రవంశపు పట్టమహిషలను పుండాకోరులైన బ్రాహ్మణులకు బాహాటంగానే తార్చినట్లు కనిపిస్తుంది. బాహాటంగా జరిగినవే ఇలా ఉంటున్నప్పుడు ఇంక రహస్యంగా ఎన్ని దుర్మార్గాలు, అవినీతి చర్యలు, దోషాలు జరిగాయో కదా? మీ ఇతిహాసాలను, పురాణాలను వొక్కసారి చదివి చూద్దూ.'' (మునిసుబ్రహ్మణ్యం గారికి 21.5.1909న ఉదకమండలం నుంచి గురజాడ రాసిన ఉత్తరం నుండి)
''వివాహసంస్థ పురోగతికి దోహదం చేసిన మాట నిజమే, అయితే వివాహబంధాన్ని తెంచుకోరాదనే నియమం చెప్పనలవిగాని కన్నీటి గాథలకు కారణం. ఈ సత్యాన్ని మనమెవరమూ విస్మరించలేము.'' ''మగవాళ్ళ అధికారం కింద, పెత్తనం కింద బానిసలుగా ఆడవాళ్ళు ఎలా పడివున్నారో, ఎంత మగ్గిపోతున్నారో నేనూహించుకోగలను.''
(మునిసుబ్రహ్మణ్యం గారికి ఉదకమండలం నుండి 2.6.1909న రాసిన ఉత్తరం నుంచి) పైన ఉదహరించిన వాక్యాలు చదివాక కూడా గురజాడ ఆస్థికుడనే అంటారా?
''పుస్తకంబులలోని మాటలు విస్తరించుచు ననుభవమ్ముల
తత్వమెరుగక శుకములగుదురు వొట్టి శాస్త్రజ్ఞుల్‌...''
''వెర్రి పురాణగాధలు నమ్మజెల్లునె పండితుల్‌'' అని గాలిపోగేసే మాటలని నమ్మొద్దంటున్నాడు గురజాడ. గురజాడను అభిమానించేవారయితే, అనుసరించే వారయితే తప్పకుండా ఆలోచించేవారు. ఇప్పుడీ అసమ్మతి అవసరమయ్యేదే కాదు !
చాగంటి కోటేశ్వరరావు గారు పండితులు, పురాణాల్ని ఆపోసన పట్టినవారు. గొప్ప ధారణాశక్తి గలవారు. ఆ శక్తి ఎవరికి ఉపయోగమనుకుంటే వారు స్వీకరిస్తారు. అతని ప్రతిభకు తగ్గట్టు, ఆ భావజాలానికి అనుగుణ్యమైన అపూర్వమైన గొప్ప పురస్కారం ఇచ్చి, గౌరవిస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండేదికాదు గదా..! సంతోషించే వారు కూడా. 'గురజాడ' పురస్కారం అన్నారు గనకనే ఇదంతా.
''ఆధునిక కవితా వథూటికి అందచందములద్ది, వన్నెలు
దిద్ది ముత్యాల్‌ సరములమరగ జేసి వాడుక భాషలో
ప్రజల మాటను ప్రాణసమముగ నెంచి, మూఢత్వమును దృంచగ
జనం కోసము ఉద్యమించిన కవీ జోహారు..''
- గంటేడ గౌరునాయుడు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీవు నేర్పిన విద్యయే నరేంద్ర భాయి!
పాలకుల విధానాలు... వ్యవసాయ సంక్షోభం
ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..?
చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''

తాజా వార్తలు

05:51 PM

మరి కొద్ది గంటల్లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ – డీ2 ప్రయోగం..

05:31 PM

ఎమ్మెల్యే రాజా సింగ్ కు త్రుటిలో ఘోర ప్రమాదం..

05:27 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు విద్యార్థులు మృతి

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.