Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉద్యోగుల తొలగింపు సంక్షోభాన్ని పరిష్కరిస్తుందా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

ఉద్యోగుల తొలగింపు సంక్షోభాన్ని పరిష్కరిస్తుందా?

గత వారం పది రోజుల్లో ట్విట్టర్‌ 50శాతం ఉద్యోగులను (12 వేల మందిని), అమెజాన్‌ 10 వేల మందిని, ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని మెటా కంపెనీ 3 వేల మందిని తొలగించాయి. ఇంతేకాదు, లక్ష పదిహేను వేల మంది పని చేస్తున్న ఇంటెల్‌ 20శాతం, స్నాప్‌ 20శాతం, రాబిన్‌హుడ్‌ 13శాతం ఉద్యోగులను, సేల్స్‌ఫోర్స్‌ 2 వేల మందిని, ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ 2,500 మందిని, మైక్రోసాఫ్ట్‌ వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. వీరు కాకుండా మరో లక్ష మంది లే ఆఫ్‌ల ద్వారా పని, జీతం లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వివిధ కంపెనీలు కొత్త నియామకాలకు ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఆఫర్‌ లెటర్లు ఇచ్చి, జాయినింగ్‌ లెటర్లు ఇవ్వకుండా సుమారు లక్ష మంది భవిష్యత్తును ఆందోళనలో ఉంచాయి. టిసిఎస్‌ సంస్థ ఉద్యోగులకు లే ఆఫ్‌ ప్రకటించ నున్నదని వార్తలు వస్తున్నాయి. మూన్‌ లైటింగ్‌, ఫేక్‌ సర్టిఫికెట్స్‌ లాంటి పేర్లతో గత సెప్టెంబర్‌ నుండి ఐ.టి ఉద్యోగుల తొలగింపు భారీగా పెరిగింది. ఈ విషాద క్రమం ఇంతటితో పూర్తయినట్లు కాదు. అసలు మాంద్యం ప్రభావం ముందుంది అంటున్నారు నిపుణులు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు రానున్న ప్రమాద హెచ్చరికలు చేసేస్తున్నాయి. 'ఉన్న డబ్బును కార్లకు, టీవీలకు, జల్సాలకు ఖర్చు చేయకండి...' అంటూ పెట్టుబడిదారీ ఆర్థికవేత్త లతో పాటు అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ లాంటి దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలు ఆపత్కాల ప్రవచనాలు చేస్తున్నారు. ఈ ప్రళయం మనలను తాకదు అంటూ చెప్పిన మన దేశ పాలకులు, ఆర్థిక నిపుణులు ఇప్పుడు గొంతులు సవరించుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌ లో రిజర్వు బ్యాంక్‌ నిర్వహించిన ఒక సెమినార్‌లో సాక్షాత్తు ఆర్‌బిఐ గవర్నర్‌ రానున్నది ముప్పేనని, అందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. అంతే తప్ప ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా పరిష్కరించాలి? అని పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండదు. అందుకే సమస్యలన్నింటికీ ఉద్యోగుల తొలగింపే పరిష్కారమనుకుంటారు.
ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది ?
క్లుప్తంగా అర్థం చేసుకోవాలంటే సరుకుల ఉత్పత్తికి, వాటి వాడకానికి మధ్య ఏర్పడే వ్యత్యాసమే సంక్షోభానికి మూల కారణం. ఉత్పత్తి అయిన సరుకులన్నీ ఎందుకు అమ్ముడు పోవంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తికి ఉపయోగించే యంత్రాలు, పరికరాలు, ముడి సరుకు, ఇంధనం లాంటి ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా మారి కొద్దిమంది చేతుల్లోకి చేరాయి. ఉత్పత్తి కోసం అయిన మొత్తం శ్రమ ఖర్చుకు సరిపడ వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం శ్రామికుల (మేధో శ్రమ, శారీరక శ్రమ) నుండి అదనపు విలువను కొల్లగొట్టి సంపన్నులు అవుతారు. ప్రజలు బికారులు అవుతారు. అందువల్ల ఉత్పత్తి అయిన సరుకులన్నింటిని ప్రజలు కొనలేరు. దీంతో సరుకుల నిల్వ ఏర్పడుతుంది. ఈ నిల్వలను అమ్ముకోవడానికి పెట్టుబడిదారులు అనేక ఎత్తులు వేస్తారు. ఉత్పత్తి తగ్గిస్తారు, కొత్త యంత్రాలతో తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. వీటివల్ల కార్మికుల తొలగింపు పెరుగుతుంది. చిన్న చిన్న పరిశ్రమలు, ప్రభుత్వాల ఆశీస్సులు లేని పరిశ్రమలు పెద్ద కంపెనీల పోటీకి నిలబడలేక దివాళా తీస్తాయి. లేదా పెద్ద కంపెనీలలో విలీనం అయి పోతాయి. దీనివల్ల మరికొంత మంది ఉపాధి కోల్పోతారు. అప్పటికే ఉన్న నిరుద్యోగులకు వీరు తోడవుతారు. ఇలా ఉపాధిలేని వారి కొనుగోలు శక్తి తీవ్రంగా తగ్గిపో తుంది. పెట్టుబడిదారీ సంక్షోభం మరింత తీవ్రమై ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం
ప్రపంచ అభివృద్ధి 2021లో 6.0శాతం నుండి 2022లో 2.7శాతానికి, 2023లో 2.3శాతానికి తగ్గిపోతున్నట్లు 2022 అక్టోబర్‌లో ఐఎంఎఫ్‌ ప్రకటించిన ప్రపంచ ఆర్థిక నివేదిక తెలిపింది. గత పది సంవత్సరాల్లో ఇదే అత్యంత బలహీనమైన ప్రపంచ అభివృద్ధి. 2023 అక్టోబర్‌ నాటికి అమెరికాలో ఆర్థిక మాంద్యం రావడం నూరు శాతం జరగవచ్చునని బ్లూమ్‌బెర్గ్‌ అంచనా వేసింది. ప్రపంచ ద్రవ్యోల్బణం 2021లో 4.7శాతం నుండి 2022లో 8.8శాతానికి పెరుగుతుందని అంచనా. 2008లో ప్రపంచ ఆర్థిక సంస్థలు కుప్పకూలిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేకపోతుంది. ప్రపంచ జీడీపీ వృద్ధి 2009లో 5.4శాతం ఉండగా, 2019 నాటికి 2.8శాతానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రావడం తో ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా పతనమయ్యాయి. కరోనా పోయినా ప్రపంచ అభివృద్ధి మాత్రం 2.7శాతం దగ్గరే నిలిచి పోయింది. మన దేశంలో 2019-20లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రూ.71,28,238 కోట్లు ఉంటే, 2021-22 నాటికి రూ. 68,11,471 కోట్లకు పడిపోయింది. 2023 నాటికి 8.7శాతం అభివృద్ధి సాధిస్తామని మార్చిలో రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. నెలలు గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య క్షీణిస్తున్నది. ఏప్రిల్‌లో 7శాతం, అక్టోబర్‌లో 6.5శాతానికి తగ్గించుకున్నారు. మార్చి వచ్చే నాటికి ఈ సంఖ్య రూపాయి విలువ లాగా ఎక్కడి వరకు దొర్లుతూ పోతుందో చూడాలి.
కార్పొరేట్లకు ప్యాకేజీలు ఇస్తే...
ప్రజల కొనుగోలు ఎలా పెరుగుతుంది ?
పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కరోనా పైకి నెట్టి, ప్రపంచ కుబేర సంస్థలు వివిధ దేశాల ప్రభుత్వాల నుండి ఆర్థిక ప్యాకేజిల (ఉద్దీపన పథకాలు) పేరుతో భారీగా ప్రజల సంపదను కాజేశాయి. అమెరికా 1.9లక్షల కోట్ల డాలర్లు (1.9 ట్రిలియన్‌ డాలర్లు), యూరోపియన్‌ యూనియన్‌ 1.8లక్షల కోట్ల యూరోల (2.2 ట్రిలియన్‌ డాలర్లు) ప్యాకేజీలలో కార్పొరేటు కంపెనీలు అత్యధికం దోచుకున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రకటించిన ప్యాకేజీల విలువ 16.9 ట్రిలియన్‌ డాలర్లు ఉంటుందని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. మన దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దీపన పథకాలలో భాగంగా కార్పొరేట్‌ పన్ను రేటును 30శాతం నుండి 22శాతానికి తగ్గించింది. కరోనాకు సంబంధం లేకుండానే గత ఐదు సంవత్సరాల్లో 10.72లక్షల కోట్ల బడా కార్పొరేట్‌ రుణాలు రద్దు చేశారు. ఇది కాకుండా 13 కంపెనీలు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.4.5లక్షల కోట్ల రుణాలను కేవలం 1.61 లక్షల కోట్లకు 'సెటిల్‌' చేశారు. ఫలితంగా కరోనా కాలంలో ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉంటే కార్పొరేట్‌ దిగ్గజాలు మాత్రం మరింత బలపడ్డాయి. ముఖేష్‌ అంబానీ, ఆదానీలు గంటకు రూ.90 కోట్లు సంపాదిస్తూ ప్రపంచ కుబేరులుగా మారారు. దేశంలోని 24శాతం మంది భారతీయులు నెలకు రూ.3000 కంటే తక్కువ ఆదాయం పొందు తుంటే వారి కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుంది? 2019 నాటికి దేశంలో 18.7కోట్ల మంది నిరుద్యోగులుగా ఉంటే 2022 నాటికి 20.5కోట్లకి పెరిగారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తంలో పేదరికంలోకి దిగజారిన పేదల సంఖ్యలో భారతదేశంలోనే 60శాతం మంది ఉన్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 2021లో 68లక్షల మంది వేతన జీవులు ఉపాధి కోల్పోయారు. 2013లో ఉద్యోగాలు ఉన్న భారతీయుల సంఖ్య 44 కోట్లు ఉంటే 2021 నాటికి 38 కోట్లకు పడిపోయింది. ఈ కారణాల వల్లనే ప్రపంచంలోనూ, భారత దేశంలోనూ ఆర్థికసంక్షోభం మరింత తీవ్రమవుతుంది.
దేశంలో ఐ.టి రంగం
దేశంలో ఐ.టి ఉద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ వ్యాపార లావాదేవీలు పెరగడంతో భారతదేశంలోని ఐ.టి కంపెనీల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి. కంపెనీలు భారీగా లాభపడ్డాయి. భారత ఐ.టి రంగం అభివృద్ధిని చూసి ఇదంతా మాగొప్పే అని కేంద్ర పాలకులు భుజాలు చరుచుకున్నారు. దేశంలోని ఐ.టి కంపెనీల్లో అతి పెద్దవైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ రెవెన్యూలో దాదాపు 80శాతానికి పైగా ఉత్తర అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. ఈ దేశాల్లో వచ్చే సంక్షోభ ప్రభావం భారత ఐ.టి రంగంపై తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 18శాతం నియామకాలు ఐ.టి రంగంలో తగ్గాయి. ఇది కేవలం ఐ.టి రంగానికే ఇది పరిమితం కాలేదు. విద్యా రంగానికి చెందిన ఎడ్‌టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగి స్తున్నాయి. వేదాంతు, లిడో లెర్నింగ్‌, అన్‌ అకాడమీ లాంటి ఎడ్‌ టెక్‌ కంపెనీలూ ఇదే తరహాలో తొలగింపులు తీవ్రం చేశాయి. అలాగే బ్లింకిట్‌ 1600 మందిని, కార్స్‌ 24 కంపెనీ, ట్రెల్‌, మీషో, ఫ్రంట్‌ రో, ఫార్‌ ఐ, రూఫీక్‌, లిడో లాంటి అనేక కంపెనీలు ఉద్యోగుల్ని తొలగి స్తున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింతగా తగ్గి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తున్నది. అయినప్పటికీ ఈ విపత్తు గురించి మన పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉద్యోగుల తొలగింపునకు, వేతనాల కుదింపునకు, పెన్షన్‌ సౌకర్యాల కోతలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలు పెరుగుతున్నాయి. సంక్షోభం ప్రపంచ వ్యాప్తమైనపుడు పోరాటాలూ ప్రపంచ వ్యాప్తం అవుతాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే ఈ సంక్షోభం గురించి అధ్యయనం చేసే శక్తులు పెరుగుతున్నాయి. ఈ వ్యవస్థ సమూల మార్పు కోసం అనేక కొత్త తరాలు, కొత్త పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగ స్వాములు కావడం అభ్యుదయ శక్తుల కర్తవ్యం.

- వి. రాంభూపాల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

09:23 PM

రూ. 3 ల‌క్ష‌లు చోరీ చేసిన మ‌హిళ‌లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.