Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉన్నతమైన భారత రాజ్యాంగ పీఠిక | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2022

ఉన్నతమైన భారత రాజ్యాంగ పీఠిక

రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను తెలుపుతుంది. 1946లో రాజ్యాంగ పరిషత్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన 'రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం' పీఠికకు ఆధారంగా పనిచేసింది. గ్రాన్‌ విల్లే ఆస్టిన్‌ తన 'ది కార్నర్‌ స్టోన్‌ ఆఫ్‌ ఎ నేషన్‌: ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌' గ్రంథంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగ విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. ఏ రాజ్యాంగానికైనా పీఠిక ప్రాణం వంటిది. రాజ్యాంగానికి గల వివిధ లక్ష్యాలను, ఆశయాలను రాజ్యాంగంలో చెప్పబడిన అంశాలను పీఠిక స్పష్టంగా తెలియ చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు వివిధ ఆదర్శాల సమ్మేళనంగా పీఠికను తయారుచేశారు. ఉదాహరణకు పీఠికను రూపొందించడంలో ఐక్యరాజ్య సమితి చార్టర్‌ను, ఐరిష్‌ రాజ్యాంగంలోని అంశాలను, ఫ్రెంచి విప్లవ నినాదాలను, అమెరికా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. రాజ్యాంగ నిర్మాతల మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి పీఠిక పని చేస్తుందని, రాజ్యాంగంలో అన్ని అంశాలు ఎందుకు చేర్చబడ్డాయో విశద పరుస్తుందని బెరుబారి కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 'మనం ఎంతో కాలం ఏమి కలగన్నామో పీఠిక తెలియజేస్తుంది' అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. 'పీఠికకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఇచ్చారని, బ్రిటిష్‌ పాలనలో ఏ ఆశయాల కోసం, ఏ వాంఛల కోసం జాతి పోరాడిందో వాటన్నింటి ప్రతిరూపమే పీఠిక' అని జస్టిస్‌ షెలాత్‌, జస్టిస్‌ గ్రోవర్‌ అభిప్రాయపడ్డారు.
'భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని ఒక సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయులమై ఉన్నాం. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని, భావాల్లో, భావ ప్రకటనలో, మత విశ్వాసంలో, ఆరాధనలో స్వాతంత్య్రాన్ని, వ్యక్తిగత హౌదాలో అవకాశాల విషయంలో సమానత్వాన్ని చేకూర్చి, ప్రజల మధ్య సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తామని తీర్మానిస్తూ, వ్యక్తి గౌరవానికి, జాతి సమగ్రతకూ రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తూ, 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగాన్ని చర్చించి ఆమోదించి మనకు మనం సమర్పించుకుంటున్నాం' అని పీఠిక చెబుతోంది.
భారతదేశం 1947కు ముందు సార్వభౌమాధికారం గల రాజ్యం కాదు. పీఠిక ద్వారా భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా ప్రకటించుకుంటూ, బాహ్యంగా తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటూ, అంతరంగికంగా వ్యక్తులపైన, సంస్థలపైన తన సంపూర్ణాధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కామన్‌వెల్త్‌ సభ్య దేశంగా ఉన్నా దాని సార్వభౌమాధికారానికి ఎలాంటి భంగమూ వాటిల్లదు.
ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో భారతదేశం పెద్దది. రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థను చేపట్టి... 21ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. ప్రజల్లో ఎక్కువశాతం నిరక్షరాస్యులైనా ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా నడుస్తున్నది.
లౌకిక, సామ్యవాద పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. లౌకికం అంటే మత వ్యతిరేకత అని అర్థం కాదు. భారతరాజ్యంలో ఏ మతమూ రాజమతంగా ప్రకటించబడదు అని, అన్ని మతాల వారికి సమానమైన అవకాశాలు, స్వాతంత్య్రాలు కల్పించాలి అని. ఒక్క మాటలో చెప్పాలంటే మతానికి రాజ్యంతో సంబంధం లేదు అని, అది పౌరుని సొంత విషయం అని అర్థం. సామ్యవాదానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, సమన్యాయాన్ని అందించడంలో రాజ్యమే కీలక పాత్ర నిర్వహించాలి అని దానికర్ధం.
గణతంత్రం అంటే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవితో సహా ప్రభుత్వంలో అన్ని పదవులు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులే నిర్వహిస్తారు. స్వదేశీ సంస్థానాలన్నీ భారత రాజ్యంలో విలీనం కావడంతో రాజరికం పూర్తిగా రద్దయింది. అందువల్ల భారతదేశం పీఠిక ద్వారా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది.
భారత రిపబ్లిక్‌ ప్రజలందరికీ ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం సమకూరుస్తామని చెప్పింది. దానికోసమే రాజ్యాంగం నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను ప్రవేశపెట్టారు. అనేక విషయాల్లో స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పింది. దానికనుగుణంగానే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రవేశపెట్టారు. ప్రజలందరికీ ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో సమాన అవకాశాల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి.
రాజ్యాంగ సవరణ
పీఠిక గురించి ఇప్పటికి ఒక్క రాజ్యాంగ సవరణ మాత్రమే చేయబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
పీఠిక గురించి కేసులు
పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని 1960లో బెరుబారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బెరుబారి అనేది భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఒక ప్రాంతం. ఈ భాగంపై భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మార్పిడి విషయమై వచ్చిన వివాదంలో రాష్ట్రపతి 143వ నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు సలహాను కోరారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు 1960 మార్చి 14న పీఠిక రాజ్యాంగంలో భాగం కాదని తీర్పు చెప్పింది. ప్రసిద్ధి చెందిన కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో... పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రి ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ కన్జూమర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌ కేసులో సుప్రీం కోర్టు... పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగంగా పేర్కొంది.
డి.ఎస్‌ నకరా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 1982 కేసులో సుప్రీం కోర్టు సామ్యవాద లక్ష్యాన్ని వివరించింది. సామ్యవాదం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక, సామాజిక జీవన ప్రమాణాలను పెంచడం, అసమానతలను రూపుమాపడం, కార్మికులకు, ఉద్యోగులకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సరైన జీవన ప్రమాణాలను సమకూర్చడమేనని తెలిపింది.
ఎక్సల్‌ వేర్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని సామ్యవాద ప్రాముఖ్యతను వివరించి పరిశ్రమలను ప్రభుత్వ పరం చేయడం, జాతీయీకరణ చేయడం ద్వారా సామ్యవాదాన్ని సాధించవచ్చని పేర్కొంది. ఎస్‌.ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా 1994 కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ 'లౌకికతత్వం' భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా పేర్కొంది.

- కె.ఎస్‌.లక్ష్మణరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.