Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎర్రజెండా నీడన పేదల గృహప్రవేశాలు... | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

ఎర్రజెండా నీడన పేదల గృహప్రవేశాలు...

''మహిళలు పోరాటం చేస్తే ఇండ్ల జాగాలొస్తాయా? అధికారంలో మేమున్నాం ఎర్రజెండాను నమ్ము కుంటే పోలీస్‌ కేసులవుతాయి. జైలుకెళతారు'' అంటూ అధికార పార్టీ నాయకుల బెదిరింపులను ఒకవైపు... ''అర్థరాత్రి బుల్డోజర్లతో మీ గుడిసెలను కూల కొడతాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తామ''ంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుల బెదిరింపులు మరొకవైపు... వీటికి తోడు అనేక నిర్బంధాలను, దౌర్జన్యాలను అనునిత్యం ఎదుర్కొంటూ రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజలు మొక్కవోని దీక్షతో పోరాడారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిది నెలలు రాత్రి, పగలు తేడా లేకుండా కొనసాగించిన అసాధారణమైన ఈ గుడిసెల పోరాటం అపూర్వ విజయం సాధించింది. నవంబర్‌ 22న భాజ భజంత్రీలు, కోలాటాలు, పూల హారతుల వంటి కోలాహాలాలతో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు ఇతర నాయకులతో కలిసి పేదలు గృహప్రవేశాలు చేశారు. మహనీయుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌గా కాలనీకి నామకరణం చేశారు.
ఫలించిన పదేండ్ల ఒంటరి మహిళల పోరాటం
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సర్వే నెంబర్‌ 294లో ఉన్న ఎకరం ఇరవై గుంటల ప్రభుత్వ స్థలాన్ని పేదల ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని గత పదేండ్ల నుండి పోరాటం కొనసాగుతున్నది. గతంలో అంబాల స్వరూప, లోకిని స్వరూప నాయకత్వంలో పేదలు గుడిసెలు వేశారు. గ్రామంలో ఉన్న భూస్వామ్య పెత్తందారులు అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలుకు పంపారు. మిగతా వారిని బెదిరించి, ఆ భూమిని పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలుపుకున్నారు. ఏ రాజకీయ నాయకుల దగ్గరకి వెళ్ళినా ఒంటరి మహిళలుగా ఉన్న వీరికి సహాయ నిరాకరణే ఎదురైంది తప్ప ఆదరణ దొరకలేదు. చివరికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఇచ్చిన ధైర్యంతో భూస్వాములు ఆక్రమించిన భూముల్లో తిరిగి ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసారు. ఇందులో 190 కుటుంబాలు ఉంటే వీరిలో 40 కుటుంబాలకు పైగా ఒంటరి మహిళలవి కావడం గమనించదగిన అంశం. మండల కేంద్రంలోని హౌటల్లలో రోజువారి కూలీతో పాటు పాచి పనులు, ప్రయివేట్‌ దవాఖానా, విద్యా సంస్థలలో స్వీపర్లుగా పనిచేసే ఈ ఒంటరి మహిళలంతా అట్టడుగు వర్గాలకు చెందిన వారే. చిన్న వయసులోనే వివిధ కారణాలతో తమ భర్తలను కోల్పోయిన వీరిలో భారమైన కిరాయిలు తట్టుకోలేక పిల్లలతో పగటిపూట హౌటల్‌లో పని చేసి, రాత్రిపూట స్థానిక బస్టాండ్‌లో బస చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. చదువురాని నిరక్షరాస్యులైన వీరి ఒకే ఒక్క కోరిక తమ నివాసానికి ఓ ఇల్లు కావాలని. ఈ కోరికే అనేక బెదిరింపులను, నిర్బంధాలను ఎదుర్కొని నిలబడేటట్లు చేసింది. పనికి పోతే ఇండ్ల జాగా పోతుందేమో అనే భయంతో ఒక్క పూట భోజనం చేసి పోరాటంలో పాల్గొన్నవారు అనేక మంది ఉన్నారు.
పుస్తెలతాడు అమ్మి ఇండ్లు కట్టిన పేదలు -
సంఘీభావంగా కదిలి వచ్చిన గుడిసె వాసులు
20మందితో ప్రారంభమైన ఈ భూపోరాటం 190 కుటుంబాలకు విస్తరించింది. పక్కా ఇండ్లు కట్టాలనే సంఘం నిర్ణయం మేరకు తమ మెడలో ఉన్న పుస్తెల తాళ్లు అమ్మి ఇండ్లు కట్టిన వారే అధికంగా ఉన్నారు. కొద్దిమంది గిరి గిరి బ్యాంకుల దగ్గర వడ్డీలకు అదనంగా కొంత నగదును తెచ్చుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ పోరాట స్ఫూర్తి ఆధారంగా ఐదు మండలాలకు ''ఇండ్ల స్థలాల భూ అక్రమణ పోరాటం'' ఎగబాకింది. భీమదేవరపల్లి మండలం, వేలేరు మండలం, ఐలోని మండలం, హసన్పర్తి మండలం, హన్మకొండ అర్బన్‌ మండలాలలో వేలాదిమంది సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేశారు. వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో పోరాడి నిర్మించుకున్న పేదల గృహప్రవేశాలకు సంఘీభావంగా ఇతర మండ లాలలోని గుడిసె వాసులు వేలాది మంది కదిలి రావడం చూసిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు... స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు నిర్బంధం ప్రయోగించైనా గృహప్రవేశాలను ఆపాలని చూసారు. అయినా పేదల ప్రతిఘటన ముందు వారు వెనక్కి తగ్గక తప్పలేదు. రానున్న కాలంలో కరెంటు, తాగు నీరు, డ్రైనేజీ, రహదారులు వంటి కనీస సౌకర్యాల కోసం ఇదే ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని పోరాట కమిటీ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వానికి కనువిప్పు కావాలి
దసరాకు లక్ష డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తాం, వచ్చే సంక్రాంతికి కట్టిన ఇండ్లు లబ్ధిదారులకు అందిస్తాం అనే పాలకుల మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇందుకు ఈ పోరాటమే ఓ నిదర్శనం. మరొకవైపు ''డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టడం సాధ్యం కాదు, ఇంటి స్థలం ఉంటే మూడున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామ''ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇండ్ల స్థలాలు లేని పేదలను మరింత అభద్రతాభావంలోకి నెట్టింది. సంవత్సరానికి లక్ష ఇండ్లు చొప్పున ఎనిమిది లక్షల ఇండ్లు ప్రభుత్వం ఈపాటికే నిర్మించి పేదలకు ఇవ్వాలి. ఆ పని చేయకపోగా కట్టిన ఇండ్లను కూడా పేదలకు ఇవ్వకుండా తాళాలు వేసి ఉంచడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నది. తక్షణమే కట్టిన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలి. పేదల ఆక్రమణలో ఉన్న భూములను గుర్తించి పట్టాలు ఇవ్వాలి. లేదంటే ప్రజలే పోరాడి సాధించుకుంటారని నిరూపిస్తోందీ ప్రజా విజయం. ఈ విజయానికి జేజేలు పలుకుదాం.

- బుర్రి ప్రసాద్‌
  సెల్‌:9490098901

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.