Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రూపాంతర అనుసరణ వ్యవసాయం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

రూపాంతర అనుసరణ వ్యవసాయం

పర్యావరణ మార్పుల మూలకారణాల నిర్మూలన మన చేతుల్లోలేదు. సామ్రాజ్యవాద దేశాల కబంధ హస్తాల్లో బందీగా ఉంది. అందుకే మనం ఉపశమన పద్ధతులు పాటించాలి. ఇవి వాతావరణ మార్పు నష్టాలను కొంతమేరకు తగ్గించగలవు. పెరిగిన భూతాప నేపథ్యంలో ఆహార భద్రత కోసం వ్యవసాయంలో రూపాంతర అనుసరణ తప్పనిసరి. ఒక వ్యవస్థలో విస్తత మార్పులను రూపాంతర అనుసరణ అంటారు. వ్యవ సాయంలో ఈ ప్రక్రియను వ్యవ సాయ రూపాంతర అనుసరణ అంటారు.
ఐక్యరాజ్యసమితి 'ఆహార వ్యవసాయ సంస్థ' నివేదిక ప్రకారం, వాతావరణ మార్పుల కారణంగా 69 కోట్ల ప్రజలు ఆకలితో ఉన్నారు. వాతావరణ మార్పు వలన దారిద్య్రరేఖ దిగువకు లాగబడిన 10 కోట్ల మందిలో రైతులు, పశువుల కాపరులు, గ్రామీణ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. వాతావరణ మార్పు ప్రపంచ ఆహార వ్యవస్థలను బలహీనపరుస్తోంది. ఆకలిని పెంచుతోంది. లక్షలాది రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు కలిగిస్తోంది. సాగు నీటి వసతులు తగ్గి అనేక పంట భూములు బీళ్ళుగా మారాయి. ఈ భూముల్లో తక్కువ నీటితో, కేవలం తగ్గిన వర్షపాతంతోనే పెరగగల వ్యవసాయ వనాలు పెంచవచ్చు. తక్కువ నీటితో పండే పంటలు పండించవచ్చు. చైనా రైతులు అధిక మోతాదులో పంటల బీమాలు తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో తీర ప్రాంతాల మొక్కలు పర్వత ప్రాంతాలకు చేరాయి. ప్రపంచ వ్యాపితంగా మొక్కలు మొలకెత్తే, పుష్పించే రుతువులను మార్చుకున్నాయి. పక్షులు వాతావరణ అనుకూల ప్రదేశాలకు తాత్కాలికంగా వలస పోతాయి. ప్రకృతి విపత్తులు, కరువుల వలన, 2030 నాటికి, చైనా ప్రధాన ఆహార పంటలయిన వరి, గోధుమ, మొక్క జొన్నల దిగుబడి 8శాతం తగ్గుతుందని అంచనా. పెరుగుతున్న భూతాపంలో వ్యవసాయం వృద్ధిచెందదు. అతి ఉష్ణ ప్రదేశాలు, తీర ప్రాంతాలు, పాక్షిక సారహీన వేడి ప్రాంతాలు, పూర్తి సారహీన వేడి ప్రాంతాలు, గడ్డకట్టే నదీపరివాహక ప్రదేశాలు, మంచు కొండల ప్రాంతాలలో వ్యవసాయం అసలు కుదరదు. ఈ ప్రదేశాలలో వ్యవసాయ మనుగడ కోసం, మానవాళి ఆకలి తీర్చడానికి వ్యవసాయ వ్యవస్థలు రూపాంతరం చెందాలి.
లాభాపేక్షలేని ప్రపంచ పరిశోధన సంస్థ 'ప్రపంచ వనరుల సంస్థ' పరిశోధనలు, విశ్లేషణలు, భాగస్వామ్య విధానాలతో పర్యావరణ మార్పులో వ్యవసాయ స్థిరత్వ పద్దతులు తెలియచేస్తుంది. 2050కి ప్రపంచ ఆహార అవసరాలు 50శాతం పెరుగుతాయని, వ్యవసాయ ఉత్పత్తులు 30శాతం తగ్గుతాయని, పర్యావరణ మార్పుకు అనుగుణంగా తమ పరిస్థితులను మార్చుకోలేని జనాభా 100కోట్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా. అభివృద్ధిచెందుతున్న దేశాలలో కోట్లాదిగా చిన్న, సన్నకారు రైతులున్నారు. పర్యావరణ మార్పు వల్ల వీరికి నష్టాలు ఎక్కువ. వ్యవసాయ పరికరాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞాన, ఆర్థిక వనరులు వీరికి అందుబాటులో లేవు. ప్రపంచ వనరుల సంస్థ తన నివేదికలో ఆహార వ్యవస్థలు అపాయంలో ఉన్నాయంది. దీర్ఘకాల సుస్థిర ఆహార భద్రతకు వ్యవసాయంలో రూపాంతర అనుసరణ అవసరాన్ని నొక్కి చెప్పింది. కరువు-నిరోధక రకాల పంటలతో, నీటిపారుదల మార్గాలతో పంటల దిగుబడిని పెంచవచ్చు. వాతావరణ మార్పులకు, వాటి ప్రభావాలకు ప్రతిస్పందనగా వ్యవసాయ వ్యవస్థల ప్రాథమిక లక్షణాలను మార్చాలని రూపాంతర అనుసరణ వ్యవసాయం నిర్దేశిస్తుంది. ఆ వ్యవసాయంలో మూడు కీలక చర్యలను గమనిద్దాం.
మొదటిది- నిర్దిష్ట రకాల పంటల, పశువుల ఉత్పత్తి కేంద్రాల, ప్రజల వినియోగానికి అనుకూలంగా మార్చే కార్ఖానాల, సంతల భౌగోళిక ప్రదేశాలను మార్చడం. ఉదాహరణకు, కాఫీ తోటలకు అనానుకూలంగా వేడిగా మారుతున్న వర్షాభావ మధ్య అమెరికా దేశం కోస్టారిక కాఫీ రైతులు కాఫీకి బదులుగా నిమ్మ జాతి పండ్ల తోటలు పెంచుతున్నారు. మిట్టపల్లాల తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా గోధుమ, టెఫ్‌ (ఆఫ్రికా తృణ ధాన్యాలు) వంటి ప్రధాన పంటల సాగు ఎత్తయిన శీతల ప్రదేశాలకు మారింది. రైతులు కాఫీ, టెఫ్‌ స్థానంలో మొక్కజొన్న విస్తృతంగా పండిస్తున్నారు.
మారుతున్న పర్యావరణ వ్యవస్థ, తగ్గిన నీటి వసతి, సాగు భూములకు అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తి అనుసంధానం రూపాంతర అనుసరణ రెండవ అంశం. ఉదాహరణకు, చైనాలో, లవణక్షార (సెలైన్‌-ఆల్కలీ) లక్షణాలను భరించే సముద్రనీటి వరిని అభివృద్ధి చేశారు. భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నా, భారీ ఉప్పు సాంద్రత గల సముద్ర ప్రాంతాల్లో ఇది ఉపయోగకరం. సముద్రనీటి వరికి లోతైన వేర్లుంటాయి. మొక్కలు పొడవుగా పెరుగుతాయి. నీటి ప్రవాహానికి కొట్టుకుపోదు. నీటి మట్టం పెరుగుతున్నా సముద్రపు నీటిలో మునగదు. మునిగినా ఆటుపోట్లు తగ్గగానే పైకిలేచి పెరుగుతుంది. దుబారు ఎడారులలో పెంచిన ఈ వరిని చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యవసాయ నిపుణులు, జూన్‌ 2019లో పరిశీలించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడిని గమనించారు.
నిర్దిష్ట ప్రాంతంలో ఉత్పత్తి చేసి, వినియోగ అనుకూలంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్చే కొత్త పద్ధతులను, సాంకేతికతలను కొత్త ప్రాంతాలకు అనువర్తించడం రూపాంతర అనుసరణ మూడవ అంశం. ఉదాహరణకు ఇండియాలో కొన్ని ప్రాంతాల కూరగాయల రైతులు తమ ఉత్పత్తులను తీవ్ర తుఫానుల నుండి రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో వృక్ష సంరక్షణశాలలను (పాలిహౌస్‌- ప్లాస్టిక్‌ గ్రీన్‌ హౌస్‌) ఉపయోగిస్తున్నారు. ఇవి విస్తృత స్థాయిలో కూరగాయల ఉత్పత్తికి, నీటి వనరుల సంరక్షణకు వీలు కల్పిస్తాయి.
రూపాంతర అనుసరణ వ్యవసాయంలో చైనా విజయవంతమైన ప్రయోగాలు చేసింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనడానికి మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు జరగాలి. సాంకేతిక సమాచారం, భూమి వంటి కీలక వనరులు కలిగిన సంపన్న రైతులే రూపాంతర అనుసరణ వ్యవసాయం చేయగలుగుతున్నారు. పేద రైతులకు అదనపు మద్దతు అవసరం. కొత్త రకాల పంటలు, పశువుల ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక జ్ఞానాన్ని స్థానిక రైతులకు నేర్పడానికి ఎక్కువ పెట్టుబడి కావాలి. ఈ రూపాంతర మార్పుల అమలుకు పేద రైతులను ప్రోత్సహించడానికి మరింత ఆర్థిక వనరులు, విధాన మద్దతు అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే చిన్న, సన్నకారు, దళిత, కౌలు, మహిళా రైతులకు ఈ అవసరాలు ఎక్కువ.
ఆహార వ్యవస్థల్లో రూపాంతర మార్పుల అభివృద్ధికి, రూపాంతర అనుసరణ వ్యవసాయ విధానాల అమలుకు ప్రభుత్వాలు దీర్ఘకాలిక నిధులను, రుణాలను సమకూర్చాలి. రూపాంతర అనుసరణ వ్యవసాయాన్ని పేద రైతులు సొంతంగా చేయలేరు. ఆహార వ్యవస్థలలో రూపాంతర అనుసరణ అనువర్తింపు, విస్తరణలకు ప్రభుత్వాల మద్దతు, ఆర్థిక, పరిశోధనా సంస్థల నుండి తగిన చర్యలు, సహాయ సహకారాలు అవసరం. ఆహార భద్రత పెంపునకు, నష్టాల, అపాయాల, స్థాన మార్పుల ప్రమాదాల తగ్గింపునకు వ్యవస్థలు, రైతులు, వ్యవసాయ కార్మికులు కలిసిమెలిసి పనిచేయాలి.

- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
  సెల్‌:9490204545

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.