Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓ రాజకీయ రహస్యం! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

ఓ రాజకీయ రహస్యం!

''బీజేపీ పాలనలో రానున్నవి మరింత చీకటి రోజులేనని భయమేస్తుంది!'' అంటున్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ ఖట్టూ... ఎందుకంటే? 2016లో నోట్ల రద్దు, 2017 నుండి జీఎస్టీ బాదుడు ద్వారా ఐదులక్షల పరిశ్రమలు మూతబడి, కోట్లాది మంది ఉద్యోగాలనూ, ఉపాధినీ కోల్పోయారు. అలా 2018 నుండి పతనమార్గం పట్టిన భారత వృద్ధిరేటు 2022 నాటికి బంగ్లాదేశ్‌ వృద్ధిరేటుకన్నా కనిష్టస్థాయికి పడిపోయిందని అంతర్జాతీయ నివేదికలు గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.
రుణ మాఫీలు, పన్ను రాయితీల ద్వారా కార్పొరేట్లకు లక్షలకోట్లు కట్టబెట్టి, నిత్యావసరాలూ, ఇంధన ధరల పెంపు ద్వారా ప్రజల నడ్డివిరిచింది కాక, ఇంకా లోటు పూడక లక్షల కోట్లు అప్పు చేసింది మోడీ ప్రభుత్వం! గత 70ఏండ్లలో చేసిన అప్పు 52లక్షల కోట్లు కాగా, ఈ ఏడేండ్లలో అది 152లక్షల కోట్లకు చేరింది! ఇది మన జీడీపీలో 62శాతంగా ఉందని, ఆర్థికశాఖ 2022 నివేదికలో ప్రకటించింది.
కాంగ్రెస్‌ అవినీతిలో మునిగింది, నాకవకాశమివ్వండి, ''నేను తినను - తిననివ్వను - ప్రజల సంపదకు కాపలాదారుగా ఉంటాను'' అంటూ గద్దెనెక్కిన మోడీ దేశ సంపదనంతా తన మిత్రులైన కార్పొరేట్లకు తినిపిస్తూ ప్రపంచ కుబేరులుగా ఎక్కదీస్తున్నాడన్నది జగమెరిగిన సత్యం! అంతేగాదు 'కేంద్ర నిఘా సంస్థ' ఇచ్చిన 2021 నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటా వెల్లువెత్తిన 'అవినీతి ఫిర్యాదులు' అక్షరాలా 'లక్షా తొమ్మివేదివేల రెండొందల పద్నాలుగు (1,09,214). ఇక వీరు అవినీతిని అడ్డుకుందెక్కడా, దేశ సంపదకు కాపలా కాసిందెక్కడీ భారత్‌లో ఏటా కార్పొరేట్లు 85వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొడుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన 'రుబిక్‌ సంస్థ' ప్రకటించింది. అంతే కాదు, భారత్‌లో సగటున రోజుకు 100కోట్ల బ్యాంకు రుణాలు ఎగవేస్తున్నది కూడా ఈ కార్పొరేట్లేనని మరికొన్ని అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ''రఫెల్‌ను మించిన భారీ స్కాం పంటల భీమా పథకమనీ, తద్వారా 'రిలయన్స్‌' - ఎస్సార్‌' వంటి భీమా సంస్థలకు వేలకోట్ల లబ్ధిని చేకూర్చింది మోడీ ప్రభుత్వమని'' ప్రముఖ సామాజిక వేత్త 'పాలగుమ్మి పద్మసాయి' ప్రకటించారు. ''అవినీతి నిర్మూల నావతారం''గా బీజేపీ చెబుతున్న మోడీ హయాంలో... 'అవినీతి వామనావతారంలా విస్తరిస్తుంది' అనటానికి ఇంతకన్నా నిదర్శనాలేం కావాలంటున్నారు విశ్లేషకులు!
'థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌' అను ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ ''వరల్డ్‌ మోస్ట్‌ డేంజరస్‌ కంట్రీస్‌ ఫర్‌ వుమెన్‌'అను 2018 నివేదికలో భారత్‌ను మొదటిస్థానంలో, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌, సిరియా, సౌదీ అరేబియాలను ప్రకటించింది. 'బేటీ బచావో' అంటున్న మోడీ పాలనలో ఆయన స్వరాష్ట్రంలో గర్భిణీ యువతితో సహా ఒక ముస్లిం కుటుంబ స్త్రీలందరినీ అత్యాచారం చేసి, హత్యగావించిన మూకలను క్షమాభిక్ష పేరిట విడుదల చేయటమేగాక, పూలదండలు, వీరతిలాకలు, మంగళహారతులతో స్వాగతించిన దృశ్యాలు సదరు నివేదిక అక్షర సత్యమని రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే 'మన్మోహన్‌ ప్రభుత్వం అనే పెనం మీంచి, మోడీ ప్రభుత్వం అనే పొయ్యిలో పడ్డారు భారతీయులు' అనిపిస్తుంది.
అయితే మోడీ విధానాలు చేసిన గాయాల బాధ తెలియకుండా జనానికి 'ద్వేషరాజకీయమత్తు'ను ఇంజెక్టు చేస్తున్నది బీజేపీ! నాడు హిట్లర్‌ జాతి విద్వేషానికి యూదులనెంచుకున్నట్లు నేడు మత ద్వేషానికి ముస్లింలను - కుల ద్వేషానికి దళితులను బలిపశువులను చేస్తోంది బీజేపీ! అగ్రరాజ్యాల పట్ల భయంతో 'క్రైస్తవుల' పట్ల బహిరంగ ద్వేషాన్ని ప్రదర్శించలేక పోతున్నారు..!
ముస్లింలను ద్వేషింపజేయటం ద్వారా మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టాలన్నదే వీరి వ్యూహం. అంతే తప్ప హిందువులను ఉద్దరించాలన్న ప్రేమగానీ, బాధ్యతగానీ వీరికి లేవుగాక లేవు! ప్రజలు కూడ 'మత విద్వేషం అనే మత్తు'లో మునిగి తేలుతూ, తమ బాధలకు మోడీ విధానాలే కారణమన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారని సామాజిక, మానసిక నిపుణులు వక్కాణిస్తున్నారు!
ఇదంతా చూస్తుంటే నాకు బాల్యనుభవం ఒకటి గుర్తుకొస్తోంది. ''ఆఫీసర్‌ చివాట్లు పెట్టినప్పుడల్లా ఇంటికొస్తూనే అమ్మను చెడతిట్టాక గాని శాంతించేవాడు నాన్న! నాన్నమీద కోపంతో నన్ను రెండుపీకి, నేనేడుస్తుంటే ఊరటపొందేది అమ్మ! ఆ కోపంతో బయటికెళ్ళి వాకిట్లో పడుకున్న కుక్కపిల్లను కర్రతో ఒక్కటేసేవాణ్ణి... కుయ్యో, కుయ్యో మంటూ అది పరుగెడుతుంటే అప్పుడు ఉపశమనం కలిగేది నాకు. బీజేపీ ద్వేషరాజకీయ రహస్యాన్ని, ఇలాంటి మన బాల్యానుభవంతో చక్కగా గ్రహించవచ్చు.

- పాతూరి వెంకటేశ్వరరావు
  సెల్‌: 9849081889

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చైనా బెలూన్‌ కూల్చివేత ఉదంతం : నీవు నేర్పిన విద్యయే అమెరికా!
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?
మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌
బట్టబయలైన అదానీ అవినీతి సామ్రాజ్యం
నేనొక పూలచెట్టునవుతాను
త్రిపుర ఎన్నికలపై దేశం దృష్టి
ఆదానీ వాదం...!
ముందు మీ పని.. ఆ తర్వాత నా పని...
ఆ విగ్రహాన్ని కూలిపోనియద్దు!
సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.