Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'అ' వారు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

'అ' వారు

పొద్దున్నే లేచి పేపర్‌ చూస్తే ఓ వార్త ఆకట్టుకుంది యాద్‌గిరిని. వీరేశలింగం పంతులు అవార్డు యోగీస్వరరావుకు ఇస్తున్నామని ఓ సంస్థ ప్రకటించింది. ఆయననే ఎందుకు సెలెక్టు చేశారు, ఆయన వితంతు వివాహాలు జరగరాదని, అది సమాజానికి హితం కాదని టీవీల్లో చెబుతూ ఉంటాడు కదా! అని కొందరు విమర్శించారు. అయినా సరే మేము ఇచ్చి తీరతామని, వెనక్కిపోయే ప్రశ్నే లేదని ఆ సంస్థ వారు ప్రకటించారు. అది తీసుకునే యోగీస్వరరావు కూడా తనకు వీరేశలింగం పంతులు పేరుమీద ఇస్తున్న అవార్డు తాను తీసుకోవచ్చా లేదా అన్న ఆలోచన కూడా చేసినట్టులేదు అని కొందరన్నారు. కాదు అదే పనిగానే ప్రజల ధ్యాస మళ్ళించడానికి ఈ అవార్డు ఇస్తున్నారని, వచ్చే సంవత్సరం ఈయనకే జాతీయ స్థాయిలో రాజా రామమోహన రారు అవార్డు కూడా ఇస్తారనీ తెలియవచ్చింది.
సరే ఎవరెట్టా పోతే నాకేంటని ఆఫీసుకు పోయాడు యాద్‌గిరి. అక్కడా ఈమాటలే మాట్లాడుతున్నారు. తానూ ఆ అవార్డు ఇవ్వకూడదన్నాడు, దానికున్న విలువ పోతుంది కదా! అనీ అన్నాడు. తన సీటుకు ఆపక్కా, ఈపక్కా కూచునే వాళ్ళే తనపైన ఎగిరెగిరి పడుతున్నారు. వామ్మో ఇదేదో మళ్ళీ తమని రెండు గ్రూపులుగా చేసే విషయంలా అనిపించి లైట్‌గా తీసుకొండి అనేసి ఆపేశాడు ఆ టాపిక్‌. అప్పటికి సమస్య తీరింది కాని ఈ మధ్య జరుగుతున్న సంఘటనల్ని చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుంది అని యాద్‌గిరికి గుబులు పట్టుకుంది. ఇంటికొచ్చాడన్న మాటే కాని రోజులా హుషారుగా లేడు. సరేలే ఆఫీసులో గొడవేదైనా జరిగి ఉంటుందిలే అని అతని శ్రీమతి కూడా ఏమీ అనలేదు. తనకిష్టమైన ఆలూ కూర చేస్తే కూడా ఏమీ అనకుండా తినేశాడు.
మరుసటిరోజు ఉదయమూ లేచి పేపర్‌ తీశాడు. ఈసారి నోబుల్‌ బహుమతులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్లికేషన్లు పెడుతోందని, వాటి వివరాలు ఎవ్వరికీ తెలియకుండా తాము తెచ్చి వేస్తున్నామనీ చాలా గోప్యంగా ఈ సమాచారం సేకరించామని నేడేనేడే పత్రిక ప్రకటించింది. ఇదంతా పచ్చి అబద్దమని ప్రభుత్వం చెప్పే అవకాశాలు ఉన్నాయనీ అందు లోనే రాశారు. మన గిరి ఆ అవార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అన్న అంశాలను చదవడం మొదలుపెట్టాడు.
వైద్యంలో ఇచ్చే నోబెల్‌ బహుమతి ఆచార్య కుందన్‌ దవానీకి ఇవ్వాలని, శస్త్ర చికిత్సల గురించి మన పుస్తకాలెన్నో పరిశీలించి, పరిశోధించి రాసిన పుస్తకం మానవ జాతి చరిత్రలో, మానవ వైద్య చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయిందని అందుకే ఆయన పేరు ఎంపిక చేశామనీ రాశారందులో. ఎన్నో వందల వేల సంవత్సరాలకు ముందే మనవాళ్ళు ఆపరేషన్లు చెశారనీ రాశాడు.
ఇక భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ప్రొఫెసర్‌ కూర్మారావుకు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది. ఎందుకంటే, కొన్ని కృత్రిమ ఉపగ్రహాహాలను కక్ష్యలోకి వదిలేముందు రోజు ఏదో సమస్య వచ్చిందనీ, ఆ సమస్య పోవడానికి ఆయన వరుసగా ఐదారు గుళ్ళలో పూజలు చేయించాడని, ఇతర మతాల వారిని కూడా ప్రార్థనలు చేయమని అడిగాడని, ఆ తరువాత ప్రయోగించిన ఉపగ్రహాలు జుయ్యిమని, రివ్వుమని ఆకాశంలోకి ఎగిరిపోయాయని అందుకే ఈ అవార్డుకు ఆయనే అర్హుడనీ ప్రకటించారు. వాటిని తయారు చేసిన శాస్త్రవేత్తలను మరిచారని ఎవరో అడిగితే, ఫైనల్‌గా ఈయన చేసిన పూజలవల్లే ప్రయోగం విజయవంతమైందని నిర్ణయించాలని నిర్ణయించారని తెలిసింది.
ఇక రసాయన శాస్త్రంలో అప్పుడెప్పుడో రామర్‌ పిళ్ళై ఆకుపసరుతో కనిపెట్టిన పెట్రోలే కాక ఇంకా వివిధ రాష్ట్రాల్లో అలాంటివాటి వివరాలు సేకరించి అవన్నీ కలిపి పెట్రోలు తయారు చేస్తే దానికి తిరుగుండదని రాసిన పుస్తకం ముందు వివిధ దేశాల ప్రయోగాలు నిలబడలేవనీ చెబుతున్నారు. అప్పుడు గల్ఫ్‌ దేశాలవాళ్ళే మన గడ్డం పట్టుకొని, తమ గడ్డానికీ మన గడ్డానికి ఉన్న తేడాని చూసి తామూ మనలాంటి గడ్డమే ఉంచుకుంటే బాగుంటుందని అనుకుంటారని, ఆవిధంగా ముందుకుపోయేలా రాసిన ఆ పుస్తక రచయిత ఆమ్లారావుకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్‌ గ్యారెంటీ అనీ నిర్ణయించారట.
ఇక ఖగోళ శాస్త్రంలో ఓ విప్లవాత్మక సందేశాన్నిచ్చిన శుక్రదేవాచార్య పేరు పరిశీలనలోకొచ్చిందని, అదే మన దేశం పేరును నిలబెడుతుందనీ అన్నారన్నారు. ఇంతకీ ఆయన రాసిన పుస్తకమేమి, అందులోని విశేషాలేమిటి అని చూస్తే యాద్‌గిరి గుండె ట్యాంక్‌ బండ్‌ చెరువయ్యింది. సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడూ తిరుగు తున్నారని కనిపెట్టిన సిధ్ధాంతం తప్పు అని నిర్ణయించాడాయన. భూమిచుట్టే సూర్యుడు తిరుగుతున్నాడని, అది కనిపెట్టిన శాస్త్రవేత్తలే కరెక్టు అని, అలాగే భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందనీ శుక్రదేవాచార్య ప్రయోగాలు కొన్ని నిరూపిస్తున్నాయని, అందుకాయన ప్రత్యేకమైన టెలిస్కోపును కూడా కనిపెట్టాడనీ ఇక ప్రపంచ ఖగోళ శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతుందనీ అంటున్నారు. ఇక సాహిత్యంలో నోబెల్‌. యాద్‌గిరి ఒకచేత్తో గుండెను, ఇంకో చేత్తో పేపరును పట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. చేతబడులపైన, ఇంకా అలాంటి మంత్ర విద్యలపైన ఎంతో సమాచారాన్ని సేకరించి రాసిన నవల మంత్రోదయం పుస్తకానికి గాను వెన్నెలూరి రాజేంద్రనాథ్‌కు ఇవ్వాలని, ఈ నవల ప్రపంచ నవలా చరిత్రలోనే ఒక మేలుమలుపుగా మిగులుతుందనీ రాసుకొచ్చారు. మన యాద్‌గిరి తన గుండెను రెండు చేతులతో పట్టుకొని పేపర్‌ బండమీద పెట్టి మరీ చదవడం షురూ చేసినాడు.
ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మివేసి ఇద్దరు ముగ్గురి ఆస్తులు పెంచిన ఆర్థికశాఖ మంత్రికి ఆర్థికశాస్త్రంలో ఎన్నో ప్రభుత్వాలను అర్ధాంతరగా పడగొట్టి తమ జెండా పాతిన బహుత్‌ఝాకు రాజనీతి శాస్త్రంలో, అలాగే ఎన్నో రైళ్ళను తగులబెట్టించిన ప్రియతమ నాయకుడికి ప్రపంచమంతా యుద్ధాలు చేయించిన అమెరికా ప్రెసిడెంటు బాష్‌బాష్‌కు కలిపి సమ్యుక్తంగా నోబెల్‌ శాంతి బహుమతికి నామినేషన్‌ పంపాలని నిర్ణయించారు. యాద్‌గిరి కళ్ళు తిరుగుతున్నారు, కాళ్ళు వణుకుతున్నారు, నోరెండి పోతోంది, చేతులు కాళ్ళూ నీలుక్కుపోయి కంట్రోల్‌ తప్పుతున్నారు, గట్టిగా అరిచాడు
''ఇదంతా మోసం, అశాస్త్రీయం, అప్రజాస్వామికం, ఇదంతా నియంతలు ఆడుతున్న ఆట, నేను వ్యతిరేకిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను'' అంటూ అరుస్తున్నాడు.
యాద్‌గిరి పిల్లలు, భార్య అతని మొహంపై నీళ్ళు చల్లుతున్నారు, ఏదో కలవరిస్తున్నాడని
''హమ్మయ్యా, ఇది కలా...''
''ఇలాగే నిద్రపోతే నిజమవుతుంది'' అంది అతని శ్రీమతి.

- జంధ్యాల రఘుబాబు
   9849753298

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?
జిన్‌, జియాన్‌, ఆజాదీ - ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా!
ధనవంతులదేనా భారతం..!
ప్రపంచంలో భారత్‌ స్థానం ఎక్కడీ
ఆడబిడ్డల్ని బతకనిద్ధాం
నువ్విక్కడ... నేనక్కడ...
వెంకన్న రాలే..!
ప్రజాసంక్షేమం - వక్రభాష్యాలు
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?
మహాసమీకరణ - లౌకికశక్తుల ఏకీకరణ

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.