Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముప్పయేండ్ల విధ్వంసం - విజృంభించిన మతతత్వం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

ముప్పయేండ్ల విధ్వంసం - విజృంభించిన మతతత్వం

             భారతదేశ చరిత్రలో మరచిపోకూడని రాజకీయ దురంతానికి గుర్తు 1992 డిసెంబరు ఆరవతేదీ. రామజన్మభూమి/బాబ్రీమసీదు వివాదాస్పద స్థలంగా పేరొందిన కట్టడాన్ని మతోన్మాద మూకలు నేలమట్టం చేసిన రోజు. భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం లౌకికతత్వం, శాసనబద్ద పాలన కుప్పకూల్చిన రోజు. అప్పటి నుంచి ఈ మూడు దశాబ్దాలలో జరిగిన పరిణామాలన్నీ కూల్చిన ఆ కట్టడం పునాదులపై సాగుతున్న రాజకీయ విన్యాసాలే. ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వమూ దానికి ముందు పాలనచేసిన వాజ్‌పేయి ప్రభుత్వమూ ఆ శిథిలాలపై లేచిన మతోన్మాద సౌధాలే. వామపక్ష లౌకిక శక్తులు మినహాయిస్తే దేశంలోని అవకాశవాద అధికార దాహపూరిత రాజకీయ రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు దీన్ని అనుమతించి కొనసాగనిచ్చాయి. ఇదంతా చేసింది బీజేపీ, దేశం నెత్తిన కూచుంటే వారలా చేసేందుకు అవకాశమిచ్చిన కాంగ్రెస్‌ అస్తిత్వం కోసం తంటాలు పడుతున్నది. ఇప్పుడు ఆ మసీదు కూలిన చోట సరికొత్త రామమందిరం వెలసింది. ఏ ఎన్నిక వచ్చినా ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అక్కడ పూజలతోనే ప్రారంభిస్తున్నారు. కానీ డిసెంబరు ఆరు మాత్రం ఘోషిస్తూనేవుంది. అయిదువందల ఏండ్ల చరిత్రను మలుపుతిప్పిన అవకాశవాద చరిత్ర అనుక్షణం దేశాన్ని హెచ్చరిస్తూనేవుంది. ఇక మత విద్వేషమూ, సరళీకరణ అనే గరళీకరణ రెండూ ఒకేసారి ఆరంభం కావడం యాధృచ్ఛికం కాదు. ప్రపంచీకరణ పేర ప్రజాప్రయోజనాలు ఫణం పెట్టడంలో మతవాదులు ముందుంటారు. ఆ విధానాల విషమ ఫలితాలను విభజన విద్వేషాలవైపు మరలిస్తారు. ఇదొక కపట ద్వంద్వనీతి.
రాముడి పేర రాజకీయం
అయోధ్య అంటే యుద్ధం లేనిది అని అర్థం. అదే పెద్ద రణరంగ స్థలిగా మారిపోవడం రాజకీయ క్రీడల ఫలితమే.. గతంలో తెల్లజాతి పాలకులూ తర్వాత ఆరెస్సెస్‌ బీజేపీ కూడా ఈ సమస్యను విభజన రాజకీయాలకు సాధనంగానే చేసుకోవడం వాస్తవం. హిందూ మతగ్రంథాలు గాని, బాబర్‌ పాలించిన నాడు భారతదేశం సందర్శించిన యాత్రీకుల కథనాలు గాని, ఆయన స్వంత జ్ఞాపకాలలో గాని అక్కడ మందిరాన్ని పడగొట్టిన వూసు లేదు. నాటి పురాణాల్లో అయోధ్యకు అంత ప్రాధాన్యత ఇచ్చిందీలేదు. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనబడే 1857 వరకూ అయోధ్యలో వివాదస్పద స్థలానికి సంబంధించి ఎలాంటి సమస్యా లేదు. ఉన్న స్వల్ప వివాదాలు పెరిగిందీ లేదు. తర్వాత బ్రిటిష్‌ అధికారులు వ్యూహాత్మకంగా ఈ చిచ్చు రాజేశారు. 1855 వరకూ అక్కడ హిందూ ముస్లింలు కలిసే పూజలు చేసుకుంటుండేవారు. 1886లో కూడా మసీదు ద్వారం వెలుపల చబూత్రా ఉన్న చోటనే రాముడు జన్మించాడంటూ కోర్టులో వాజ్యం నడిచింది. ఆ వ్యాజ్యాన్ని ఆనాడే కోర్టు తోసి పుచ్చింది. కాబట్టి బాబరీ మసీదు ఉన్న చోటనే రాముడు జన్మించాడంటూ దాన్ని పడగొట్టి గుడి కడితేనే రామభక్తి అవుతుందని చెప్పడం ప్రతీకార రాజకీయాల పర్యవసానమే. అయోధ్యలో పదికి పైగా రామాలయాలుంటే ప్రతి చోటా రాముడి జన్మస్థానమనే చెబుతుంటారు. కౌసల్యా మందిరం కూడా ఉంది గనక ఆయన జననం అక్కడే జరిగిందని కూడా భావించే అవకాశం ఉంది. ఇంతా చేసి రాముడు పూజలందుకునే పురాణ పురుషుడే గాని చారిత్రిక కోణాలతో తేల్చదగిన రాజు కాదు. అలా గాక పురాణాలలో లెక్కల ప్రకారం త్రేతాయుగం అనుకుంటూ ఎనిమిది లక్షల ఏండ్ల కిందటి కాలానికి వెళ్లాలి. అప్పుడు ఈ భూమండలం ఏ రూపంలో ఉందో కూడా తెలియదు. కాబట్టి మౌలికంగా భక్తి విశ్వాసాలకు సంబంధించిన ఈ సమస్యను చరిత్రతో రాజకీయాలతో ముడివేయడమే పెద్ద వ్యూహం. 1949లో చీకటిరాత్రి రహస్యంగా రామ లక్ష్మణుల విగ్రహాలను ఆ ఆవరణలో ప్రతిష్టించిన తర్వాత కూడా నాటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ సరిగ్గానే స్పందించారు. అది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీయకుండా తాళాలు వేయించారు. అప్పటి నుంచి వివాదం కొత్త మలుపులు తిరుగుతూ ఎనభైలలో బీజేపీ మత రాజకీయాలతో పాటు మరింత తీవ్రమవుతూ వచ్చింది. 2010లో బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చిన లక్నో హైకోర్టు కూడా విగ్రహాలను అక్రమంగా అక్కడకు చేర్చారనే వ్యాఖ్యానించింది.
అవకాశవాద రాజకీయాలు
1986లో బీజేపీ పాలంపూర్‌లో అయోధ్య సమస్యను కీలకమైందిగా చేపట్టిన తర్వాతే సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. శిలాన్యాస్‌లు, రథయాత్రలూ దాన్ని మరింత వేడెక్కించాయి. రాజగురువుల్లా సాధు సంతులను ముందు పెట్టుకుని రాజకీయ ప్రహసనం నడిచింది. ఇంతటి ఉద్రిక్త నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఫైజాబాద్‌(అయోధ్య) మేజిస్ట్రీట్‌ ఇచ్చిన అరకొర తీర్పును ఆధారం చేసుకుని ఆఘమేఘాల మీద వివాదాస్పద కట్టడం తలుపులు తెరిపించాడు. ('షాబానూ కేసులో ముస్లిం మత ఛాందసులను సంతృప్తి పరచిన దానికి విరుగుడుగా హిందూ చాందసులను సంతృప్తి పరచేందుకు ఇదొక ఎత్తుగడగా భావించారు. అందుకే 1989లో రాజీవ్‌ గాంధీ ఎన్నికల ప్రచారం కూడా రామరాజ్యం నినాదంతో అయోధ్య నుంచే ప్రారంభించాడు. ఈ రాజకీయాలు ఆయన కన్నా బీజేపీకే ఎక్కువ మేలు చేయడంతో బీజేపీ బలం రెండు సీట్ల నుంచి దాదాపు 90కి చేరింది. అయినా వామపక్షాల కారణంగా బీజేపీ అధికారానికి దూరంగావుండి విపి సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని బయిటనుంచే బలపర్చవలసి వచ్చింది. ఆ పరిస్థితి తట్టుకోలేక, ఆ పైన మండల్‌ సిఫార్సుల అమలును ఆమోదించలేక బీజేపీ నేత అద్వానీ రామరథ యాత్ర రాజకీయ దావానలం రగిలించారు. అత్యాధునికమైన టయోటా కారులో గుజరాత్‌లోనే మొదలైన ఆ రథయాత్ర నిర్వహణ తొలి బాధ్యత మోడీ చేపట్టారు. రాముడిని దేవుడి స్థాయి నుంచి తమ పార్టీ రాజకీయ చిహ్నంతో పాటు రథంపై చిత్రించుకుని ఉత్తరాది రాష్ట్రాలలో దారుణమైన మత కలహాలకు కారణమైనాడు. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలోనే ఒక ప్రముఖ జాతీయ నాయకుడు మతపరమైన వివాదాన్ని విస్తృత ప్రచారానికి వాడుకోవడం అది మొదటి సారి. చివరకు ఆయనను అరెస్టు చేయగానే కాంగ్రెస్‌తో కలసి బీజేపీ విపి సింగ్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఈ ప్రచారంలో హిందీ పత్రికా ప్రపంచం కూడా యథాశక్తి పాత్ర వహించింది. ఇన్ని కారణాల వల్ల 1991 ఎన్నికలలో బీజేపీ బలం మరింత పెరిగి 1992 డిసెంబరు 6న బాబరీ మసీదును కూలదోసే స్థితి వచ్చింది. నాటి ప్రధాని పివి నరసింహారావుకు దీన్ని నిరోధించేందుకు అన్ని పార్టీలూ కలిపి అధికారం ఇచ్చినా చిటికెన వేలు కదల్చకుండా కూల్చివేతను అనుమతించారు. పదవీ విరమణ తర్వాత దీనిపై బృహగ్రంథాలు వెలువరించి మరీ సమర్థించుకోడానికి పాకులాడాడు. అయినా ఆనాటి కళంకం చెదిరిపోయేది కాదు. అయితే అసలు అపరాధం మాత్రం ఆరెస్సెస్‌ బీజేపీ సంఫ్‌ు పరివార్‌దేనన్నది చారిత్రిక సత్యం. దాని వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అంతర్జాతీయంగానూ దేశ ప్రయోజనాలకు హాని కలిగింది. మీడియా కూడా దాడులకు గురైంది. మరోపదేండ్లకు 2002లో రగిలిన గుజరాత్‌ మారణకాండ నరేంద్రమోడీని దేశాధినేతగా తీసుకొచ్చే పరిస్థితి కల్పించింది.
ముదిరిన మతవిద్వేషం
ఈ మూడు దశాబ్దాలను తీసుకుంటే బాబరీ మసీదును బూచిగా చూపి పెరగడం తొలిదశ, మలి దశాబ్దంలో గుజరాత్‌ మారణకాండతో ఫాసిస్టు తరహా రాజకీయాలు తేవడం, 2019 ఎన్నికల ప్రాంగణంలో అయోధ్య తీర్పు సంఫ్‌ు పరివార్‌ శక్తులకు అనుగుణంగా దీనికి పరాకాష్ట. మూడవ దశాబ్దంలో అత్యధిక కాలం వారి రాజ్యమే సాగుతుండటం ఒకచరిత్ర క్రమం. మోడీ హయాంలో అసహన రాజకీయాలూ, రాష్ట్రాల హక్కులపె ౖప్రత్యక్ష దాడి, రాజ్యాంగ ముసుగులోనే మతచిహ్నాలను ప్రతిష్టించడటం చూస్తున్న వాస్తవమే. అయోధ్య పహలీ చాకీ హై, కాశీ మధుర బాకీ హై అన్న సంఫ్‌ు పరివార్‌ ఇప్పుడు వారణాసిలోని జ్ఞానవ్యాపి మసీదు విషయలంలోనూ ఇదే రాజకీయ ఎత్తుగడ అనుసరిస్తున్నది. బాబరీ విధ్వంసానికి ముందే పివి ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రార్థనా స్థలాల చట్టం కూడా కొరగాకుండా పోయింది. లక్నో హైకోర్టులో మొదలైన ఆ కేసు సుప్రీం కోర్టువరకూ వచ్చింది. ఆ చట్టం ప్రకారం అయోధ్య వివాదం సుప్రీం తీర్పు ప్రకారం పరిష్కరించాలని, మిగిలిన అన్ని ఆలయాలలోనూ 1947 ఆగస్టు15న ఉన్న యథాతథ స్థితి కొనసాగాలని నిర్దేశించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో సహా చాలా చోట్ల ఆలయాల చుట్టూ రాజకీయ వివాదాలు ముసురుతున్నాయి. ఏపీలో మాట్లాడితే తిరుపతి, రామతీర్థం, అంతర్వేది అంటూ ఏకరువు పెడుతున్నారు. తెలంగాణలో బీజేపీ చార్మినార్‌లో కట్టిన భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరే సగం రాజకీయం నడిపిస్తున్నది. అయోధ్యలో అక్కరకు వచ్చిన సుప్రీంతీర్పు శబరిమల విషయంలో సహించరానిదైపోయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి కూడా జడ్జిల నియామక ప్రక్రియపై ప్రత్యక్షంగా దాడి చేయడం న్యాయవ్యవస్థను లొంగదీసుకునే ప్రయత్నమేనని వేరే చెప్పనక్కరలేదు.
2023 అఖరుకు అయోధ్య రామమందిరం గర్భగుడి పని 15శాతం పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌ రామ్‌ ప్రకటించారు. మిగిలిన గుడితో కలిపి చూస్తే మొత్తం సగం నిర్మాణం అయిపోయినట్టేనన్నారు. 2023 ఆఖరుకు ఆలయం పూర్తి చేసి 2024 మకర సంక్రాంతినాడు రాముడి విగ్రహ ప్రతిష్టాపన పూర్తిచేసి భక్తులను అనుమతిస్తామని చెప్పడం రాబోయే ఎన్నికల షెడ్యూలుతో సరిగ్గా సరిపోతుంది. కనుక దేశంలో అయోధ్య పరిణామాల ప్రభావం ఆగిపోయిందనుకుంటే పొరబాటు. దాన్ని ఒక సరికొత్త మతోన్మాద ముప్పు పెరుగదలకు ఆరంభంలాగానే చూడవలసి ఉంటుంది. అయితే వామపక్షేతర పార్టీలలో అనేకం, అలాగే సాధారణ సమాజం కూడా మత రాజకీయాలు రాజ్యాంగానికి విరుద్ధమనీ, వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగకరంగా మారాయని గుర్తిస్తున్నారా? అంటే లేదనేచెప్పాలి. వ్యక్తుల ఆహార విహారాది విషయల్లోనూ వస్త్రధారణలోనూ, మహిళలపైమైనార్టీలపై వివక్షలోనూ ఆంక్షలు గుప్పిస్తున్నారు. ఆఖరుకు కరోనా కరాళ వేళలోనూ ఈ మత విద్వేషాలు రగిలించే కుటిలత్వానికి పాలకులు పాల్పడగలిగారు. చాపకింద నీరులా ప్రజల మెదళ్లలో మతతత్వాన్ని జొప్పిస్తున్న ఈ శక్తులే రాజకీయ రంగంలో బాహాటంగానే హిందూత్వను ప్రయోగిస్తున్నారు. అయోధ్య విషయంలో చేసినట్టే ఇప్పుడు దేశచరిత్రనంతటినీ తిరగరాయాలని మోడీ పిలుపునిస్తున్నారు. అంటే అవాస్తవా లతో కొత్త తరాల బుర్రలు కలుషితం చేయబోతున్నారు. అందుకు అంగీకరించని అద్యయనశీల మేధావులను రాజకీయ శక్తులను వేటాడి వేధిస్తున్నారు. రాష్ట్రపతి భవనంలోనూ, విందుల్లో మాంసాహారం ఉండొద్దని బీజేపీ ఎంపి బిల్లు తెస్తున్నారు. కాషాయాంబరదారులైన దళారులు ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు దిగిపోతున్నారు. ఒకప్పుడు రామాయణ్‌ సీరియల్‌ను ఆరెస్సెస్‌ వారు ఉపయోగిస్తే, ఇప్పుడు భారీతెరపై తెలుగు బాహుబలి ఆదిపురుషుడుగా అవతరిస్తున్నారు. ఆ అవతారం మోడీజీ మూడోపాదం మోపే ప్రచార సన్నాహంలో భాగమే. జి20 సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడమే గాక మోడీ మా ప్రాణమిత్రుడని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తున్నాడు. అప్పటి అద్వానీని మించిన అధికార బలంతో ఆధ్మాత్మిక వత్తాసుతో మోడీ సమస్త రంగాలను మతతత్వ పూరితం చేస్తున్నది. నాడు లౌకిక పార్టీల ఉపేక్ష పివి నరసింహారావు సర్కారు అవకాశవాదం ఈ పరిస్థితికి కారణమైందని గుర్తుచేసుకుంటే ఇప్పుడు అప్రమత్తత అవసరం తలకెక్కుతుంది. ఏ మాత్రం ఉపేక్షించినా అప్పటి బాబరీ మసీదు విధ్వంసాన్ని మించి ఇప్పుడు భారత దేశ మతసామరస్య పునాదులనే పెకిలించే ప్రమాదం విరుచుకు పడుతుంది. అదే డిసెంబరు ఆరు ప్రత్యేక హెచ్చరిక.

- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ!
'కోతల' బడ్జెట్‌
నీ స్మరణే ఓ ప్రేరణ
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?
2023-24 వ్యవసాయ బడ్జెట్‌లో కోతలు
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ
పాత పెన్షన్‌ విధానంపై బీజేపీ ప్రభుత్వదాడి
వారికేం తెలియదు!
రష్యా-జర్మనీలను శాశ్వత శత్రుదేశాలుగా మార్చే అమెరికా కుటిల పన్నాగం!
మీడియా స్వేచ్ఛకు భంగం
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు
పలక పగిలిపోయింది
''అద్దె సరుకులు'' - సామ్రాజ్యవాదం
మారుతున్న ఉపాధి సంబంధాలు
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి
''పుష్ప విలాపం''
త్యాగం చేద్దాం రారండి..
చేదు గుళికలు
హాట్సాఫ్‌..!
గవర్నర్‌ ప్రసంగం రాజ్యాంగబద్ధమైనది
ప్రయివేటుతో అభివృద్ధి... ఉద్యోగాలు సాధ్యమేనా?
బడ్జెట్‌ ఎవరి కోసం?
'ఆన్‌లైన్‌' డిబెట్‌
ఎవరు దేశభక్తులు? ఎవరు దేశద్రోహులు?
దారిదీపం
పొంచివున్న ఆర్థిక హింస
రవాణా కార్మికుల సంఘర్ష యాత్ర - అనుభవాలు
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
కేజీబివీలలో బోధనేతర సిబ్బంది బాధలు తీరేదెపుడు?

తాజా వార్తలు

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.