Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

ఉపాధిహామీ ఉసురుతీస్తున్న కేంద్రం

            దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు స్వాతంత్య్రానంతరం చట్ట ప్రకారం పనికి హామీ కల్పించిన ఏకైక చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీని ద్వారా దేశంలోని సుమారు 50కోట్ల మందికి పని హక్కు కల్పించాల్సి ఉన్నప్పటికీ నేటికి 33 కోట్ల మందికి కూడా పని ఇవ్వలేని స్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పేదలకు విస్తరించాల్సి ఉండగా క్రమంగా కుదించబడు తున్నది. ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో ఒకటి రెండు సంవత్సరాలు మినహా ఈ పథకానికి నిధులను భారీగా తగ్గిస్తూ వచ్చింది. దీనివల్ల పని దినాలు తగ్గాయి. చేసిన పనికి నెల నుండి మూడు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. మతతత్వ రాజకీయాల చాటున కార్పొరేట్‌ అనుకూల విధానాలను వేగంగా అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మెరుగు చేయడం కాదు, కుదించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఉపాధి హామీ చట్టం నేపథ్యం
2005 ఆగస్టు 23న దేశ పార్లమెంట్‌ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం వచ్చిన రెండు నేపథ్యాలను కావాలనే పాలక పార్టీలు, ప్రధాన మీడియా విస్మరిస్తుంటాయి. అందులో ఒకటి, నాటి ప్రజల జీవన పరిస్థితులు. రెండు, రాజకీయ పరిణామాలు. స్వాతంత్య్రానంతరం పాలకవర్గాలు అమలు చేసిన ఆర్థిక విధానాలు అంతిమంగా ఒకవైపు కొద్దిమంది దగ్గర సంపద పోగుబడడానికి, మరోవైపు పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిపోవడానికి కారణ మయ్యాయి. ఈ పరిస్థితుల నుండి పాలకులు బయటపడడానికి ఎద్దులు, బండ్లు, ధోవతి, బియ్యం, సహకార రుణాల లాంటి సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఈ పథకాలన్నీ తాత్కాలిక ఉపశమనాలే కావడంవల్ల ప్రజల జీవన విధానాన్ని మార్చలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో 1991లో పి.వి.నరసింహారావు నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేసింది. దీంతో ప్రజలను పెనం నుండి పొయ్యిలోకి తోసినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజల హక్కు గా ఉపాధి హామీ చట్టం రావలసి వచ్చింది.
రెండవ నేపథ్యం, రాజకీయ పరిణామాలు. ఆర్థిక విధానాల దుష్ఫలితాలు రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులకు దారితీస్తాయి. పాలక పార్టీల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యలపై నిత్యం పనిచేసిన వామపక్షాల బలం చట్టసభల్లో గణనీయంగా పెరిగింది. 2004లో వామపక్షాల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదు. వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యూపీఏ-1 సంకీర్ణ ప్రభుత్వం కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా పరిపాలించాల్సి వచ్చింది. అందులో గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి.
ఉపాధి చట్టం ఉద్దేశ్యం- అమలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ముఖ్యంగా రెండు లక్ష్యాలు కీలకమైనవి. ఒకటి గ్రామీణ పేదలకు ప్రతి ఆర్థిక సంవత్సరం కనీసం వంద రోజుల పనిని చట్టం ప్రకారం కల్పించడం, పేదల జీవితాలకు కనీస భద్రతను ఇవ్వడం. రెండు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయా లను కల్పించడం. చట్ట ప్రకారం అర్హులందరికి పనులు కల్పించి, అందుకవసరమైన నిధులను కేటాయించి ఉంటే గ్రామీణ ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు వచ్చి ఉండేది. అయితే పాలక పార్టీలకు ఈ చట్టాన్ని అమలు చేయడం ఇష్టంలేదు కాబట్టే చట్టం అమలులోకి వచ్చిన 17 సంవత్సరాల తర్వాత కూడా పనికి అర్హత ఉన్న వారిలో కేవలం 35 కుటుంబాలకు కూడా వంద రోజుల పని కల్పించబడడంలేదు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనం కూలీలకు ఇవ్వాలంటే... ఉపాధి హామీ చట్టానికి ప్రస్తుత కూలీల సంఖ్యకు అనుగుణంగా రూ.ఒక లక్ష 20వేల కోట్లు కేటాయించాలి. కాని ఈ సంవత్సరం రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గత సంవత్సరం బకాయిలు రూ.8 వేల కోట్లు ఉన్నాయి. అంటే కేవలం రూ.65 వేల కోట్లు. ఈ చట్టం అమలుకు అవసరమైన నిధుల్లో సగం కూడా కేటాయించ కుండా ప్రభుత్వం తన వర్గబుద్ధిని చాటుకుంది. కష్టజీవులకు చట్టప్రకారం నిధులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన మిత్రులైన కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో బ్యాంకు అప్పుల రద్దు, ప్రత్యక్ష, కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, వివిధ రాయితీల కింద సుమారు రూ.లక్షన్నర కోట్లు కట్టబెట్టింది. బీజేపీ అధికారంలోకి రాకముందు 2013-14లో వంద రోజులు పూర్తి చేసిన కార్మికుల సంఖ్య 4,70,000 ఉండగా, 2014-15లో 2,50,000, 2015-16 నాటికి 1,70,000 మందికి తగ్గిపోయింది. ప్రస్తుతం 2,10,000 ఉంది. సగటు కూలీ పనిదినాల సంఖ్య 2013-14లో 46 రోజులు ఉండగా, 2014-15లో 39 రోజులకు తగ్గింది. ప్రస్తుతం 33రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారు. కేరళలో సీపీఐ(ఎం) నాయకత్వం లోని వామపక్ష ప్రభుత్వం మాత్రమే ఉపాధి కూలీలతో పాటు, వ్యవసాయ కూలీలకు రోజు కూలీ రూ.600 అమలు చేస్తున్నది. దేశంలో గ్రామీణ పేదలతో పాటు, పట్టణ పేదలకు కూడా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ. ఈ మధ్యనే రాజస్థాన్‌ ఈ దిశగా చర్యలు తీసుకుంది. వ్యవసాయ రంగంలోకి వచ్చిన ఆధునిక యంత్రాలు గ్రామీణ ప్రజల వ్యవసాయ పనిదినాలను తగ్గించి వేస్తున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం 15 రాష్ట్రాల్లో 57.8శాతం మంది మహిళలు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. ఇందులో కేరళ, తమిళనాడు అగ్రభాగాన ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌లోగాని, ఉత్తరప్రదేశ్‌లోగాని తామ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం, 100రోజుల పని దినాలు, ఎందుకు అమలు కావడంలేదు? పట్టణ పేదలకు పని ఎందుకు కల్పించడంలేదు?
పాలక పార్టీల స్వభావం
బయటకు ఎన్ని మాటలు చెప్పినా పాలక వర్గ పార్టీలన్నింటికీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం ఇష్టం లేదు. కారణం తమ వెనుక ఉన్న పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాల ప్రయోజనాలు. పేదలకు పని హక్కుగా ఉండకూడదనేది ప్రపంచీకరణ విధానం. శాశ్వత ఉద్యోగాలను తొలగించే విధానాలను అమలు చేస్తున్న పాలక పార్టీలు గ్రామీణ పేదలకు పని హక్కును చిత్తశుద్ధితో అమలు చేస్తారని ఊహించలేం. అంతేకాదు, ఉపాధి హామీ వల్ల వస్తున్న సామాజిక మార్పులు కూడా వీరు అంగీకరించడంలేదు. అందుకే ఈ చట్టం పట్ల ఈ వర్గాలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. వీరి స్వభావానికి అను గుణంగా ప్రభుత్వాలు ఈ నిధులను ఇతర పనులకు మళ్లించడం, యంత్రాలతో పనులు చేయించడం, అవినీతిని పరోక్షంగా ప్రోత్సహించడం జరుగుతున్నది. చట్ట ప్రకారం పేదలు తమ పనిహక్కును కోల్పోవడం అంటే వారు జీవించే హక్కును కోల్పోవడమే. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న రోజుల్లో గ్రామీణ ప్రజల వినియోగ వ్యయం 8.8శాతం తగ్గింది. ఆహారంపై చేసే సగటు వ్యయం భారీగా తగ్గిపోయింది. దీని ప్రభావం గర్భణీ స్త్రీలు, పిల్లలపై స్పష్టంగా ఉంది. పేదల్లో 68శాతం మంది గర్భణీ స్త్రీలు రక్తహీనతతో, 42శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కార్మిక చట్టాలను, రైతుల హక్కులను కాలరాస్తున్న కేంద్రప్రభుత్వం వ్యవసాయ కూలీల ఉపాధి హామీ చట్టం ఉసురు తీస్తున్నది. కార్మిక, కర్షకుల ఐక్యత ద్వారానే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించ గలం. అందుకే విశాల ఐక్యత, విశాల ఉద్యమాలే పరిష్కారం.
- వి. రాంభూపాల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.