Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వందే భారత్‌లో వంద అబద్ధాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

వందే భారత్‌లో వంద అబద్ధాలు

          వందే భారత్‌ అంటూ, 130 కిలోమీటర్ల వేగంతో అత్యంత ఫాస్ట్‌గా గమ్యానికి చేరుస్తుందంటూ రైల్వేశాఖ ప్రకటించింది. దేశ ప్రధానమంత్రితోపాటు ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్‌ అందరూ పండగవేళ ఆ రైలు గురించే మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన పండగ వచ్చిందని ప్రధానమంత్రి అభివర్ణించారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేమిటంటే... సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు 905రూపాయల ఛార్జీ ఉంది. సాధారణంగా సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో చార్జి 172రూపాయలే కాగా, అవి గమ్యస్థానానికి ఆరుగంటల్లో చేరుస్తాయి. వందే భారత్‌ రైలుకు సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు నాలుగు గంటల సమయం పడుతోంది. ఇతర రైళ్లకు, వందే భారత్‌కు తేడా కేవలం రెండు గంటలు మాత్రమే. ఆ రెండుగంటల సమయం కోసం అదనంగా 725రూపాయలా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. కేవలం వందే భారత్‌ అనేది రైలు లోపల ఇంటీరియర్‌ డెకరేషన్‌కు తోడు కొద్దిపాటి అదనపు వేగం మాత్రమే కలిగివుంది. అందుకే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో విమానం స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని ఊదరగొట్టినప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించినంత స్పందన కానరావడం లేదు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు నడిపే సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ అతి ముఖ్యమైనది. దీనిలో ఫస్ట్‌ ఎసి, సెకండ్‌ ఎసి, థర్డ్‌ ఎసి కోచ్‌లు ఉంటాయి. అన్నీ స్లీపర్‌ బెర్తులే. దురంతోలో ఫస్ట్‌ ఎసి టికెట్‌ ధర 2,800 రూపాయలు, సెకండ్‌ ఎసి 2,300 రూపాయలు, థర్డ్‌ ఎసి 1,630రూపాయలుగా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ కూడా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 10గంటల 10నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. ఇక వందే భారత్‌ రైలు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు 3,170 రూపాయలుగా ఉంది. ఇందులో స్లీపర్‌ బెర్తులు ఉండవు. అన్నీ చైర్‌ సీటింగ్‌ మాత్రమే ఉంటాయి. సికింద్రాబాద్‌ నుంచి 8.30గంటల ప్రయాణంతో విశాఖకు చేరుకోవచ్చు. దురంతోతో పోల్చుకుంటే గంటా 40నిమిషాలు ముందుగా వందేభారత్‌లో ప్రయాణించవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత సగటు ప్రయాణికుడు వందేభారత్‌ కంటే దురంతో వైపే ఆసక్తి చూపిస్తున్నాడు. గంటన్నర వ్యత్యాసానికి అంత డబ్బు చెల్లించి, అదీ స్లిపర్‌ బెర్తులు లేకుండా చైర్‌లో కూర్చొని వందేభారత్‌లో వెళ్లే కంటే ఇతర సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణించడం మేలని ప్రయాణీకులు భావిస్తున్నారు. వందేభారత్‌లో 1,128 సీటింగ్‌కు కాను 1,050 సీట్లు చైర్‌కార్‌ సదుపాయంతో ఉన్నాయి. మిగిలినవి ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు కేటాయించారు. వందేభారత్‌ రైలులో ప్యాంట్రీ కార్‌ లేదు. అయినా ఆహారం ఇస్తామంటూ ముందుగానే టికెట్‌తో కలిసి డబ్బులు తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్లాసులో ఏకంగా 400రుపాయలు వరకు చార్జీ చేస్తున్నారు. ఈ రైలులో ఆహార పదార్థాలను వేడి చేసుకునే సదుపాయం తప్పితే కనీసం కాఫీ పెట్టడానికి కూడా ఏర్పాట్లు లేవు. కానీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు టికెట్ల రేట్లు వింటే మాత్రం గుండె గుభేల్‌ మంటోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి పది రోజుల ముందు బుక్‌ చేసుకుంటే విమానం టికెట్‌ 3,900 రూపాయలకే లభిస్తుంది. ప్రయాణ సమయం గంట మాత్రమే. అదే వందే భారత్‌ రైలులో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌కి 3,170 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రయాణ సమయం 8.30గంటలు. ఇంకో 700 రూపాయలు అదనంగా పెడితే విమానం ఎక్కి ఏకంగా ఏడు గంటల సమయం ఆదా చేసుకోవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ రైలు గూర్చి సొల్లు ప్రచారం ఆపాలి. 1988లో ప్రవేశపెట్టిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ గరిష్ట వేగం గంటకు 110 నుంచి 150 కిలోమీటర్లు. ఆ తర్వాత 2016లో గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. దాని గరిష్ట వేగం 110 నుంచి 160 కిలోమీటర్లు. ఇప్పుడు నూతనంగా వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ను కూడా 2019లోనే ప్రవేశపెట్టారు. కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాలకు రావడానికి నాలుగేండ్లు పట్టింది.
సామాన్యుడు దీంట్లో ప్రయాణం చేయలేడు సరిగదా కనీసం ఊహించను కూడా ఊహించ లేడు. మామూలు ఎక్స్‌ప్రెస్‌ రేటు కంటే దీని ధర మూడు రెట్లు ఎక్కువగా ఉన్నది. రాజమండ్రి నుండి సికింద్రాబాద్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ బెర్త్‌ 325 రూపాయలు, వందే భారత్‌ రైలులో 1425 రూపాయలు. అందులో 350 రూపాయలు భోజన ఖర్చు. సామాన్యులెవరూ దీనిని భరించలేరు. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణ సమయం 8 గంటల 25 నిమిషాలు. వందేభారత్‌లో 6 గంటల18 నిమిషాలు. మరి ఈ మాత్రం దానికి అంత భయంకరమైన రేటు పెట్టాలా! ఇంత సొల్లు ప్రచారం చేయాలా! ఇకపోతే స్వదేశీ పరిజ్ఞానం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గు లేకపోతే సరి. స్వదేశీ పరిజ్ఞానాన్ని, ప్రయోగాలని పూర్తిగా పక్కన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆఖరికి విగ్రహాలు తయారు చేయడానికి కూడా పక్కనున్న దేశాలకి కాంట్రాక్ట్‌ ఇస్తున్నవారు వందేభారత్‌ స్వదేశీ పరిజ్ఞానమని గొప్పలు చెప్పుకుంటే ఆశ్చర్యమేముంది? అయినా ఇతర దేశాల్లో ఈజిప్టులో గంటకు 230 కిలోమీటర్లు, మొరాకొలో 320 కిలోమీటర్లు, జపాన్‌లో 374 కిలోమీటర్లు, ఫ్రాన్స్‌లో 357 కిలోమీటర్లు, స్పెయిన్‌లో 400 కిలోమీటర్లు, చైనాలో 420 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న రైళ్ళను ఉపయోగిస్తుంటే మనం గంటకు 300 కిలోమీటర్ల వేగాన్నైనా ఎప్పటికి చేరుకుంటాం? ఒకవేళ చేరుకుంటే సామాన్యుడు ప్రయాణించగలడా?

- యం.ఎ. జబ్బార్‌
  సెల్‌: 9177264832

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.