Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లెనిన్‌ను చదువుతూనే ఉండాలి! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2023

లెనిన్‌ను చదువుతూనే ఉండాలి!

            కామ్రేడ్‌ లెనిన్‌ యావత్తు కృషిని రెండు కీలక అంశాలనుండి ప్రారంభిం చాడు. ఒకటి - 'మార్క్సిజం యొక్క శక్తి (బలం) అది నిజం అనే వాస్తవంలో ఉంది'. రెండవది - మార్క్సిజం పిడివాదం కాదు. అది ఆచరణకు కరదీపిక. ఆయన సైద్ధాంతిక అవగాహన, విప్లవ కార్యాచరణకు యివే ప్రాతిపదికలు.
            లెనిన్‌ గురించి 125సంవత్సరాలుగా ప్రపంచం చర్చిస్తూనే ఉంది. పెట్టుబడిదారీ ప్రపంచం ఆయన పేరు వినగానే ఉలిక్కిపడుతూనే ఉంది. శ్రామిక జనం జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఉంటారు. కేవలం 30సంవత్సరాల జీవితంతో (1893-1923) మార్క్సిస్టు సిద్ధాంత ఔన్నత్యాన్ని, శాస్త్రీయతను, అనివార్యతను ఎల్ల దేశాలకు, ఎల్ల కాలాలకు దాని ప్రాసంగికతను చెవులు చిల్లులు పడేలా వినిపించాడు. అంతేకాదు మతం, కులం, జాతి, రంగు, భాష, ప్రాంత, లింగం పేరిట మనిషిని మనిషి దోచుకోని ఓ నూతన సమాజాన్ని ఓ పెద్ద భూభాగంలో ఆవిష్కరింపజేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా సోషలిజం వైపు తిప్పేశాడు.
ఈ పువ్వు పుట్టగానే కాదు, రాలిన తర్వాత కూడా...
రష్యాలోని ఓ మధ్యతరగతి ప్రగతిశీల కుటుంబంలో లెనిన్‌ (వ్లాదిమిర్‌ ఇల్విచ్‌ ఉల్యనోవ్‌) జన్మించాడు. లెనిన్‌ తండ్రి ఇల్యా ఉల్యనోవ్‌ పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే మనస్తత్వం ప్రభావం ఆయన పిల్లలందరి మీద పడింది. అలాగే లెనిన్‌ తల్లి మారిమా. లెనిన్‌ అన్న అలెగ్జాండర్‌ విప్లవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటం వలన జార్‌ ప్రభుత్వం ఉరితీసి చంపింది. లెనిన్‌ సోదరి అన్నాని నిర్భంధించింది. లెనిన్‌కి అన్న అలెగ్జాండర్‌ అంటే అమితమైన ప్రేమ. 'మా అన్న ఏమి చేసివుండేవాడు అదే నేను చేస్తాను' అని చెప్తూ ఉండేవాడు. 'అలెగ్జాండర్‌ వీర మరణం పొందాడు. ఆయన విప్లవ బలిదానం నా మరో సోదరుడు వ్లాదిమిర్‌ (లెనిన్‌)కి వెలుగు బాటయ్యింది' అని వారి సోదరి అన్నా పేర్కొంది. ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ మార్క్సిజాన్ని తనకు పరిచయం చేసింది తన సోదరుడు అలెగ్జాండర్‌ అయినప్పటికీ ఆయన ఎంచుకొన్న ఉగ్రవాద నరోడ్నిక్‌ మార్గం సరైంది కాదని లెనిన్‌ నిర్ణయానికి వచ్చాడు. తండ్రి, ఆ తరువాత అన్న చనిపోయారన్న దుఃఖాన్ని దిగమింగాడు. చదువుపై అపారమైన శ్రద్ధ పెట్టాడు. అమోఘమైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నప్పటికీ 'రాజద్రోహి' అలెగ్జాండర్‌ తమ్ముడు కాబట్టి ఆయనకు డిగ్రీలో బంగారు పతకం యివ్వడానికి అధికారులు భయపడ్డారు. కజన్‌ విశ్వవిద్యాలయం మీటింగ్‌ హాల్లో జరిగిన సభలో విద్యార్థులు అభివృద్ధి నిరోధక నిబంధనలను విశ్వవిద్యాలయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ''ప్రస్తుత పరిస్థితులలో ఈ యూనివర్సిటీలో చదువు కొనసాగించడం నాకు సాధ్యం కాదని భావిస్తున్నాను. ఈ ఇంపీరియల్‌ కజన్‌ యూనివర్సిటీ విద్యార్థుల లిస్టు నుండి నా పేరు తొలగించాల్సిందిగా కోరుచున్నాను'' అని లేఖ రాసి పంపాడు. అయన్ని ప్రభుత్వం అరెస్టు చేసింది. తోటి కామ్రేడ్స్‌కు అప్పుడు తన ముందున్న ఏకైక మార్గం విప్లవం అని తేల్చి చెప్పాడు. ప్రభుత్వం ఆయన్ని కోకుష్కినో అనే సుదూర గ్రామానికి ప్రవాసం పంపింది. ఆయనపై పోలీసు నిఘా పెట్టింది. ఆయన సోదరి అన్నా అప్పటికే పీటర్సబర్స్‌ నుండి వెలివేయబడి అక్కడికి చేరుకుని ఉంది.
అప్పటికి లెనిన్‌ వయస్సు కేవలం 17సంవత్సరాలు
ఆ గ్రామంలో ప్రవాసం ఉండగానే ఆయన ''పీటర్సబర్గ్‌ జైలులో ఉన్నప్పుడు కన్నా, సైబీరియాలో వెలివేతలో ఉన్నప్పుడు కన్నా ఈ గ్రామంలో ఉన్న సంవత్సరంలోనే ఎక్కువ పుస్తకాలు చదివాను'' అన్నారు. చదవడం, నోట్సు రాసుకోడం నిత్యకృత్యం. రష్యన్‌ విప్లవ కారుల రచనలను లోతుగా అధ్యయనం చేశాడు. సంవత్సరం తరువాత వచ్చినా కజన్‌ యూనివర్సిటీ ఆయన్ని తిరిగి తీసుకోవడానికి నిరాకరించింది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటే పాస్‌పోర్టు యివ్వవద్దని పోలీసుశాఖ ప్రభుత్వానికి రాసింది. అయినా వీటన్నింటినీ అధిగమించి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు. 1892లో సమారా ప్రాంతీయ కోర్టులో న్యాయవాదిగా చేరాడు. అక్కడే మార్క్సిస్టు స్టడీ సర్కిల్‌ ప్రారంభించాడు. ''నిరాడం బరత, తెలివి తేటలు, అమితమైన విజ్ఞానం, నిలకడగా నిష్కర్షగా ఉండటం, ఆత్మగౌరవం ఈ 23సంవత్సరాల యువకుడిలో కలబోసి ఉన్నాయని'' ఆయన మిత్రుడు ఐ.లాలయన్స్‌ జ్ఞాపకాలలో రాసాడు. కార్మికవర్గ అంతిమ విజయంలో అపారమైన విశ్వాసం, అత్యంతలోతైన మార్క్సిస్టు అవగాహన ప్రజాబాహుళ్యపు కీలక సమస్యల పరిష్కారానికి మార్క్సి జాన్ని అన్వయించడం ఆయన ప్రావీణ్యత ఆయనకు రష్యన్‌ విప్లవ కారులలో గుర్తింపు తెచ్చాయి. ఆయన కొద్ది కాలంలోనే విప్లవ పార్టీ నిర్మాణ అవశ్యకతను గుర్తించాడు. ''ఒక విప్లవ కారుల సంస్థను యిస్తే రష్యాని మేం తిరగతిప్పుతాం'' అనే వారు. అప్పటికే రష్యాలో కార్మికోద్య మం ఊపందుకున్నది. కార్మికులకు రాజకీయ విద్య అందిం చడంపై పూర్తి శక్తినంతా వినియోగించడం ప్రారంభించాడు.
శాస్త్రీయ సోషలిజం-కార్మికోద్యమం-సాంఘిక విప్లవం
ఈ మూడు అంశాల ప్రాధాన్యతనూ, మూడింటిని అనుసంధానం చేయడం యొక్క ప్రాధాన్యతనూ ప్రత్యేకించి అందుకు విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ ఆవశ్యకతనూ మార్క్స్‌, ఏంగెల్సుల తరువాత, వారిద్దరి స్థాయిలో అవగాహన సామర్ధ్యం కలిగిన వ్యక్తి కామ్రేడ్‌ లెనిన్‌. కమ్యూనిస్ట్‌ లీగ్‌ ఏర్పాటు, మొదటి ఇంటర్నేషనల్‌, రెండవ ఇంటర్నేషనల్‌ (1864), పారిస్‌ కమ్యూన్‌ (1871), నాటికి ప్రపంచం అంతా విస్తరించివున్న వలస విధానం-పరిష్కారాలు, కమ్యూనిస్టు ప్రణాళిక రచనలో, వారిద్దరి యితర రచనలన్నింటిలో ఈ మూడు అంశాల ప్రాధాన్యత, వాటిని అర్థం చేస్కోవడానికి వారు వినియో గించిన శాస్త్రీయ విశ్లేషణ, ఈ క్రమంలో రూపొందించబడ్డ అత్యంత శాస్త్రీయ, ఆధునిక వర్గ పోరాట సిద్ధాంతం- మార్క్సిజాన్ని కామ్రేడ్‌ లెనిన్‌ 'అవపోసన' పట్టాడు. కామ్రేడ్‌ లెనిన్‌ యావత్తు కృషిని రెండు కీలక అంశాలనుండి ప్రారంభించాడు. ఒకటి - 'మార్క్సిజం యొక్క శక్తి (బలం) అది నిజం అనే వాస్తవంలో ఉంది'. రెండవది - మార్క్సిజం పిడివాదం కాదు. అది ఆచరణకు కరదీపిక. ఆయన సైద్ధాంతిక అవగాహన, విప్లవ కార్యాచరణకు యివే ప్రాతిపదికలు. అందుకే యితర హేమాహేమీ మార్క్సిస్టు సిద్ధాంతకారులు ఎవరూ అర్థం చేసుకోలేకపోయిన 20వ శతాబ్దం నాటికి ఆవిష్కరించబడ్డ ఓ నూతన చారిత్రక దశ సామ్రాజ్యవాద దశను ఆయన గుర్తించాడు. 'పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాదం' అనీ, 'ఇది సోషలిస్టు విప్లవాల దశ' అని, దీనితో 'నూతన యుగం' ఆరంభం అయ్యిందని నిర్వచిం చాడు, నిరూపించాడు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాడు. కామ్రేడ్‌ స్టాలిన్‌ ''లెనినిజం అంటే సామ్రాజ్యవాద కాలపు మార్క్సిజం'' అన్నారు. ఎలాగైతే అనేక అశాస్త్రీయ, ఊహాజనిత సోషలిస్టు సిద్ధాంతాలకు, పొరపాటు అవగాహనలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో శాస్త్రీయ సోషలిస్టు (మార్క్సిస్టు) సిద్ధాంతాన్ని మార్క్స్‌, ఏంగెల్సులు రూపొందించారో అలాగే లెనిన్‌ 20వ శతాబ్ధం (19వ శతాబ్ది చివర నుండి - మార్క్స్‌, ఏంగెల్స్‌ మరణానంతరం) నాటి అనేక మార్క్సిస్టు మేధావుల అవకాశవాద, రివిజనిస్టు, దుందుడుకు చర్యలను నిష్కర్షగా చిత్తు చేయడం ద్వారా మార్క్సిజాన్ని మరింత అభివృద్ధి చేశాడు లెనిన్‌. మార్క్సిజానికి పర్యాయపదంగా 'మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతం'' అయింది.
విప్లవ సిద్ధాంతం-విప్లవ కార్యాచరణ-సాంఘిక విప్లవం
20వ శతాబ్ధం ప్రారంభం నాటికి అనేక దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటాలు, రష్యాలో ఓ ప్రక్క తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, క్రూరమైన జార్‌ ప్రభువుల పాలన. మరో ప్రక్క బద్దలవుతున్న రైతాంగ అసంతృప్తి, కార్మికుల సుదీర్ఘ సమరశీల పోరాటాలు. ఈ సందర్భంగా (1902) 'గ్రామీణ పేదలకు' అని ఆయన రాసిన పుస్తకం గురించి చెప్పుకోవాలి. అందులో లెనిన్‌ కార్మికవర్గ పార్టీ ఏమి సాధించాలని కోరుకుంటున్నది. కార్మిక వర్గంతో గ్రామీణ పేదలు ఎందుకు కలవాలి అన్న అంశాన్ని చాలా వివరంగా, సరళంగా రాశాడు. వర్గపోరాటంపై మార్క్సిస్టు అవగాహన అశేషంగా ఉన్న గ్రామీణ పేదలకు ఎక్కందే కార్మికవర్గ విప్లవం ముందుకుపోదన్న నాటి చారిత్రక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని, దాన్ని ప్రధాన కర్తవ్యంగా ఎంచుకుని రాసిన చిన్న పుస్తకం అది. అలాగే క్రూరమైన భూస్వామ్య వ్యవస్థనూ, దాని అవశేషాలను నిర్మూలించే కర్తవ్యం వదిలేసి విప్లవ ప్రతీఘాతంగా పెట్టుబడిదారీ వర్గం తయ్యారయింది. కాబట్టి, సామ్రాజ్యవాద దశలో ఆ కర్తవ్యం విప్లవ కార్మికవర్గంపై ఉందని చెప్పి మార్క్సిస్టు ఎత్తుగడలకు ఓ క్రొత్త అంశాన్ని జోడించాడు లెనిన్‌. ఇలా అయన నాటి అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులలో వచ్చిన ప్రతి మార్పుని గమనించాడు. వాటిపై స్పష్టమైన అవగాహన యివ్వడం ద్వారా తరతరాల కమ్యూనిస్టులకూ మార్క్సిజం ఒక పిడివాదంగా చేయకుండా, దాని విప్లవ స్వభావానికి ద్రోహం చేయకుండా, కరదీపికగా స్వీకరిస్తూ ముందుకు పోయే పరిస్థితిని చూపించాడు. 1917 నవంబర్‌ 7 తొలి శ్రామిక విప్లవం జయప్రదం అయిన తరువాత దాన్ని పుట్టుకలోనే అంతం చేయాలని చర్చిల్‌ యిచ్చిన పిలుపును త్రిప్పికొడుతూ ''బోల్షివిక్‌ పసిగుడ్డు హెర్క్యులస్‌ అంత బలంతో పుట్టిందన్న విషయం అర్ధం చేసుకోవడం లేదు... ఈ పసిగుడ్డు అయిన సోవియట్‌ రిపబ్లిక్‌ అంతర్జాతీయ, జాతీయ ప్రతీఘాత విప్లవ రాక్షసుల్ని మట్టి కరిపించింది. ఆ విధంగా అక్టోబర్‌ విప్లవం ద్వారా ప్రతిష్టించబడ్డ సోవియట్‌ సోషలిస్టు వ్యవస్థ సృష్టి, అది సృష్టించే ప్రకంపనాలు సర్వాంతర్యామిగా మారాయి'' అని లెనిన్‌ ప్రకటించాడు. ఒక మహిళా ఉగ్రవాది కాల్చిన కాల్పుల్లో గాయపడి 1924లో ఒక కార్మికవర్గ మేధస్సు ఆగిపోయింది.
నిజం. నేడు రష్యాలో సోషలిజం లేదు. ఎంత గింజు కున్నా సామ్రాజ్యవాదం తాను పైచేయి సాధించానని ఎంత విర్రవీగినా ప్రపంచ గమనం దాని కోరికకు భిన్నంగా సాగుతున్నది. సోషలిస్టు దేశాలైన చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలు అప్రతిహతంగా ముందుకు పోతున్నాయి. మరోప్రక్క లాటిన్‌ అమెరికాలో వామపక్ష పార్టీలు అధికారం లోకి వస్తున్నాయి. ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీల్లో కార్మిక పోరాటాలు విజృంభిస్తున్నాయి. క్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోలేని స్థితిలోకి జారిపోయింది. ఈ స్థితిలో లెనిన్ని చదవడం, చర్చించడం, ఆ మహౌన్నత విప్లవ నేతను అనుసరించడం మన బాధ్యత. కర్తవ్యం.

- ఆర్‌ రఘు
  సెల్‌:9490098422

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.