Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విశ్వగురువు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2023

విశ్వగురువు

శంకర్‌కు పొద్దున్నే పేపర్‌ చదివినప్పటి నుండీ కిందా మీద పడుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? అని ఇప్పటికి కొన్ని వందల సార్లు తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ సమాధానం మాత్రం రావటం లేదు. ఎవరినైనా అడగటానికి మనస్కరించటం లేదు! ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు! పార్వతి భర్త తిరుగుళ్ళు చూసి విషయం ఏమిటో అడుగుదామని అనుకుంది! కానీ ఎందుకో ఆగిపోయింది! శంకర్‌ మాత్రం తిరుగుతూనే ఉన్నాడు!
ఇంతలో కృష్ణ వచ్చాడు! శంకర్‌ కృష్ణ చిన్ననాటి సన్నిహిత మిత్రులు! కృష్ణ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పార్వతి వచ్చి కృష్ణను పలకరించి టీ కూడా ఇచ్చింది! కాని శంకర్‌ మాత్రం కృష్ణను గమనించనే లేదు! కృష్ణ ఆశ్చర్యపోతున్నాడు! శంకర్‌కి ఇంత పరధాన్యం ఎట్లా వచ్చింది! అనుకున్నాడు.
ఇక తప్పని సరై తానే పలకరించాడు! ''ఒరేయి ఏమిట్రా? అట్లా తిరుగుతున్నావు?'' అని అడిగాడు.
అప్పుడు కృష్ణను చూశాడు!'' ఏరా ఎంతసేపైంది! పార్వతీ! మీ అన్నకు టీ తీసుకురా?'' అన్నాడు శంకర్‌.
''ఆఁ చల్సూల్లే! నీవు, నీ మర్యాదలు! వచ్చి అరగంటైంది! మా చెల్లెలు టీ తెచ్చింది! తాగాను! ఇంకా ఐదు నిమిషాలైతే భోజనమే పెడుతుంది! కాని నా ప్రశ్నకి సమాధానం చెప్పు! ఎందుకలా తిరుగుతున్నావు?'' అన్నాడు కృష్ణ.
శంకర్‌ చప్పున వచ్చి, కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నాడు. శంకర్‌ చేతులు వణుకుతున్నాయి! కృష్ణ ఆశ్చర్యపోతూ శంకర్‌ మొహంలోకి చూశాడు! శంకర్‌ కళ్ళలో సన్నటి నీటి చారికలు! కృష్ణ ఆశ్చర్యపోయాడు! శంకర్‌కి ఇంత బాధ కలిగించిన విషయమేమిటా అని ఆలోచిస్తున్నాడు.
''ఒరేరు కృష్ణా! ఏమిట్రా ఈ అన్యాయం?'' అంటూ వార్తపత్రికలు కృష్ణముందు వేశాడు! అది చూసిన కృష్ణకు ఏమీ అర్థంకాలేదు! ఏమిటన్నట్లు చూశాడు!
''ఇదిగో ఈ వార్త చూడు! మన దేశంలో విదేశీ యూనివర్సిటీలు పెట్టొచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందట!'' అంటూ మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శంకర్‌!
''ఇదిగో మీరు కళ్ళు తుడుచుకోండి!'' అంటూ ఒక పెద్ద టర్కీ టవల్‌ తెచ్చి ఇచ్చింది! పార్వతి.
ఆ టవల్‌ విసిరి కొట్టాడు శంకర్‌! ''నా బాధ నీకు వేళాకోళంగా ఉందా! ఆఁ!'' గరుమన్నాడు.
''ఇంతకీ నీ బాధేంటో చెప్పు'' అన్నాడు కృష్ణ అనునయంగా.
''భారతదేశమంటే ఏమిటి! విశ్వగురువు! సకల చరాచ విశ్వంలోని విజ్ఞానమంతా ఈ పవిత్ర భూమిలోనిదే! నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, పంచమ వేదమైన భారతం, ఇంకా భగవద్గీత ఇక్కడే పుట్టాయి. ఈ భూమిని జ్ఞాన భూమిగా మార్చాయి.'' అని శంకర్‌ అంటుండగానే పార్వతి అందుకున్నది.
''ఈ జ్ఞానభూమిలో లేని విజ్ఞానమేదో ఆ విదేశీ యూనివర్సిటీలల్లో ఉందేమో!'' అన్నది.
పార్వతిని కొట్టినంత పని చేశాడు శంకర్‌.
''మూర్ఖులారా! ఏం తెలుసే నీకు! ఈ భూమి మీద మొదట విమానాలు వాడింది రావణాసురుడు అంటే త్రేతాయుగంలోనే విమానాలు అది కూడా 13 రకాల యుద్ధ విమానాలు వాడారు!'' అన్నాడు శంకర్‌!
''ఇక్కడే విమానాలు అప్పుడెప్పుడో వాడితే రాఫెల్‌ విమానాలు ఎందుకు కొన్నారండీ!'' మెల్లిగా అన్నది పార్వతి. ఈసారి కొట్టాలనే ప్రయత్నించాడు శంకర్‌! కాని కృష్ణ అడ్డుకున్నాడు.
''సరేలే! ప్రస్తుత విషయానికి రా!'' అన్నాడు కృష్ణ.
''అదేరా నా బాధ! మన వేదభూమిలో తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు సాందీపని లాంటి మహామునుల ఆశ్రమాలు విజ్ఞాన భండాగారాలు ఉండగా మళ్ళీ విదేశీ యూనివర్శిటీలు ఎందుకు అనుమతించాలి?'' ఆవేశంగా ప్రశ్నించాడు శంకర్‌.
పార్వతీ, కృష్ణ పెద్దగా నవ్వారు!
''ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నావు!'' అడిగాడు కృష్ణ.
శంకర్‌ తికమక పడ్డాడు! అవును! ఈ ప్రశ్న ఎవరిని అడిగినట్లు? కృష్ణ, పార్వతులను అడిగినట్టా లేక అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినట్టా! కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం అన్న ఆలోచనలే తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇతరులు ఇలాంటి ప్రశ్నలు కేంద్రాన్ని, కేంద్రంలోని పార్టీని అడిగితే తాను వారి నోరు మూయించేవాడు! కాని ఇప్పుడు తన నోరు మూతపడిపోయింది!
మిత్రుడి అంతర్మధనాన్ని గమనించి పార్వతికి సైగ చేశాడు కృష్ణ! పార్వతి వెళ్ళి అందరికీ మంచి టీ తీసుకువచ్చింది!
''ఏమిటీ పరిస్థితి! నాకెప్పుడూ ఎదురవ్వని దుస్థితి!'' బయటికే అనేశాడు శంకర్‌.
అనునయంగా మిత్రుడి భుజం తట్టాడు కృష్ణ.
''అవున్రా! నేను ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి పనిని చాలా బలంగా సమర్థించాను! దానికి కారణం ఒకటే! మన దేశ సంస్కృతీ, ఇక్కడి విజ్ఞానం ఎంతో గొప్పవనీ వాటిని పునరుజ్జీవింప చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని బలంగా విశ్వసించాను. గత ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు విదేశీ తొత్తులనీ, విదేశీ భావజాలంతో బతుకుతున్నాయనీ నమ్మాను! కాని మొదటిసారిగా నాకే వైరుధ్యం కొరసపడింది! మనదేశంలో ఎంతో విజ్ఞానం ఉంటే విదేశీ యూనివర్సిటీలు ఎందుకు? మనదేశంలో విజ్ఞానం అవాస్తవమా లేక కేంద్ర ప్రభుత్వ విధానం తప్పా?'' అన్నాడు శంకర్‌.
నీకెదురైన వైరుధ్యం దేశంలోని ప్రజలందరికీ ఎదురైతూనే ఉన్నది! కాని దాన్ని మతపరమైన దుష్ప్రచారం. భావజాలం కమ్మెస్తున్నది! దాంతో రెండోవైపు కొట్టుకుని పోతున్నారు! పెద్ద నోట్లు రద్దుతో నల్లధనం వస్తుందని లేకపోతే 50రోజుల్లో ఉరితీయవచ్చునంటూ ఒక వంక ప్రకటిస్తూనే మరోవంక రద్దుచేసిన రూ.1000 నోటుకు పెద్దదైన రూ.2000 ముద్రించటంలో వైరుధ్యం లేదా! జై జవాన్‌, జై కిసాన్‌ అంటూనే అగ్నివీరుల తయారు చేయటం, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకుని రావటం మనం చూడలేదా! అంతెందుకు? నిన్న వందేభారత్‌ రైలు పూర్తి స్వదేశీ తయారీ అంటూనే నేమెన్స్‌ కంపెనీ స్పేర్‌పార్టు వాడటం లేదా? ఈ విషయాల లోతుపాతులు మనం అర్థం చేసుకోకుండా, వాట్సప్‌ యూనివర్సిటీ పరిశోధనలుఫాలో అయిపోతున్నాం!'' అన్నాడు కృష్ణ.
నిజమే! మనం జీవితంలో ప్రభుత్వ విధానం వల్ల ఇబ్బందికి గురి అవుతుంటే! మరో పక్క పాకిస్థాన్‌, చైనా వ్యతిరేకతలు, హైందవ మతానికి ప్రమాదం అంటూ చర్చలు మొదలవుతున్నాయి. వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి! అన్నాడు శంకర్‌.
- ఉషాకిరణ్‌, సెల్‌:9490403545

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.