Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

నేతాజీ వారసత్వాన్ని దొంగిలించ గలరా?

ఈ నెల 23వ తేదీన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని కలకత్తాలో నిర్వహించేందుకు భారత జాతీయోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యంలేని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) సన్నద్ధమవుతుందని తెలిసి నేతాజీ కూతురు అనితా బోస్‌ మండి పడింది. తన తండ్రి వామపక్షవాది అనీ, ఆరెస్సెస్‌ భావజాలానికి, ఆయన ఆలోచనలకు ఎలాంటి పొంతన లేదని అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ పోషించిన వీరోచిత పాత్ర ఫలితంగా వచ్చిన గొప్ప పేరును ఉపయోగించుకునే ప్రయత్నంలో భాగంగా ఆరెస్సెస్‌ ఆ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె చెప్పిన విధంగా ఎలాంటి పొంతనలేని ఆ రెండు భావజాలాలను పరిశీలిద్దాం.
భారతదేశంలో 1920, 30 దశకాలలో వామపక్షం బలపడటంతో దేశంలో సామ్యవాద ఆలోచనలు వేళ్ళూనుకోవడం ప్రారంభమైంది. సామ్యవాదం (సోషలిజం), యువతకు ఆమోదయోగ్యమైన విధానంగా అవతరించింది. నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌లు వారి ఆలోచనలకు ప్రతీకలుగా కనిపించేవారు. 1936, 1937లలో నెహ్రూ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం, ఆ తర్వాత రెండేళ్లకు సుభాష్‌ చంద్రబోస్‌ ఆ పదవిని చేపట్టడం కాంగ్రెస్‌లో బలపడుతున్న వామపక్ష ధోరణులకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.1939లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి వామపక్ష ప్రతినిధిగా పోటీ చేసిన సుభాష్‌ చంద్రబోస్‌ 1580 ఓట్లలో 1377 ఓట్లు తెచ్చుకొని పట్టాభి సీతారామయ్యను ఓడించాడు.
హిందూ మహాసభ నాయకుడైన వీడీ సావర్కర్‌, ఆరెస్సెస్‌, బీజేపీ భావజాలాన్ని సూచించే 'హిందూత్వ' అనే పదాన్ని వాడుకలోకి తెచ్చాడు. భారతదేశం పవిత్ర భూమిగా, పితృభూమిగా కలిగి ఉన్న వారికి మాత్రమే చెందుతుందని సావర్కర్‌ పేర్కొన్నాడు. మన దేశానికి చెందిన ముస్లింలు, క్రైస్తవులు హిందువులుగా గుర్తించబడరనీ, ఇతరుల వలె వారి హిందుస్థాన్‌ పితృదేశం అయినప్పటికీ పవిత్ర దేశం మాత్రం కాదనీ, వారి పవిత్ర దేశం అరేబియా లేదా పాలస్తీనాలు అని తన రచన ''ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ''లో సావర్కర్‌ పేర్కొన్నాడు.
హిందూ, ముస్లింల ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయని చెప్పడం కన్నా పెద్ద అబద్ధం ఏమీ లేదని నేతాజీ అభిప్రాయ పడ్డాడు. హిందూ, ముస్లింల ప్రయోజనాలు ఒకే విధంగా ఉండవని చెపుతున్నవారు నిజం మాట్లాడడం లేదనీ, అన్ని మతాలవలె ఇస్లాంకు కూడా భారతదేశంలో స్థానం ఉందన్నాడు. ప్రతి మతానికి సంబంధించిన చరిత్ర, సాంప్రదాయాలు, ఆదర్శాలతో పరిచయం ఉండాల్సిన అవసరం ఉందనీ, భిన్న మతాల సంస్కృతి మత సామరస్యానికి, ఐక్యతకు మార్గం వేస్తుందని నేతాజీ అభిప్రాయం. మతపరమైన సాంప్రదాయం, సాంస్కృతిక సహవాసానికి పెద్ద అడ్డంకి అనీ, దానికి లౌకిక, శాస్త్రీయ విద్యే పరిష్కారమని నేతాజీ భావించాడు.
ఇందుకు భిన్నంగా మైనారిటీలను జాతి వ్యతిరేకులని, తీవ్రవాదులని ముద్ర వేస్తూ, వారిని విదేశీయులుగా, అక్రమ చొరబాటు దారులుగా ఆరెస్సెస్‌, బీజేపీ నాయకులు వారిపై విషం చిమ్ముతున్నారు. బీజేపీ నాయకులు, సంఫ్‌ు పరివార్‌ శక్తులు మైనారిటీలను కాల్చివేయాలనీ, నిర్దాక్షిణ్యంగా చంపెయ్యాలని బహిరంగంగా పిలుపునిస్తున్నారు. ఇలాంటి పిలుపులు ప్రజలను మత పరంగా విభజించడానికి మాత్రమే దారి తీస్తాయి.
బ్రిటిష్‌ వారి రాకకు ముందు భారతదేశంలో రాజకీయ క్రమాన్ని వివరించే సందర్భంలో ముస్లిం పాలన గురించి తప్పుగా మాట్లాడితే చరిత్రలో రుజువులు ఉంటాయి. ఢిల్లీలోని మొగల్‌ చక్రవర్తులు లేదా బెంగాల్‌ ముస్లిం రాజులు ఎవరి గురించి మాట్లాడినా, వారి సామ్రాజ్యాలను హిందూ ముస్లింలే కలిసి పాలించారు. వారి ముఖ్యమైన కేబినెట్‌ మంత్రులు, జనరల్స్‌ అంతా హిందువులే. హిందూ చీఫ్‌ కమాండర్స్‌ సహాయ సహకారాలతోనే భారతదేశంలోని మొగల్‌ సామ్రాజ్యం సంఘటిత పడింది. పైన పేర్కొన్న విధంగా హిందూ ముస్లింల ప్రయోజనాలు భిన్నమైనవనే ప్రచారాన్ని నేతాజీ కొట్టి పారేశాడు.
దేశ విభజన విషయంలోనూ బీజేపీ నాయకులు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్‌పై భారతదేశం విజయం సాధించి 50ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మత ప్రాతిపదికన భారతదేశ విభజన ఒక చారిత్రక తప్పిదం అని వ్యాఖ్యానించారు. కానీ ఈ చారిత్రక తప్పిదానికి ఎవరు బాధ్యులు?
1923లో ''ఎసెన్షియల్స్‌ ఆఫ్‌ హిందూత్వ'' పేరుతో, 1928లో ''హిందూత్వ:హూ ఈజ్‌ ఏ హిందూ?'' పేరుతో ప్రచురించిన తన రచనలో హిందూత్వ భావాలను వ్యక్తం చేసిన సావర్కరే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన హిందువులకు ప్రత్యేక దేశాన్ని డిమాండ్‌ చేస్తూ ముస్లింలీగ్‌ కంటే ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఈ వైఖరికి భిన్నంగా దేశ విభజనను నేతాజీ పూర్తిగా వ్యతిరేకించారని ఆయన సైన్యంలో మహిళా రెజిమెంట్‌కు అధినేత్రిగా పని చేసిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌, హుమా ఖురేషికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విభజన అనేక విభజనలకు దారి తీస్తుంది కాబట్టి, నేతాజీ తన అభిప్రాయాలను అంతకు ముందే గాంధీ, నెహ్రూలకు తెలియజేశారని కెప్టెన్‌ సెహగల్‌ అన్నారు.
హిందువులంతా ఒక జాతి అనే విషయాన్ని వివేకవంతులెవరూ ప్రశ్నించరనీ, జనాభాలో హిందువులే అధిక సంఖ్యాకులుగా ఉన్నారనే విషయాన్ని ఆమోదించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనీ, కాబట్టి భారతదేశంలోని విదేశస్థులు హిందూ సంస్కృతి, భాషను స్వీకరించాలనీ, హిందూ మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలనీ, లేకుంటే వారి హక్కులను, సౌకర్యాలను, ఉనికిని వదులుకొని హిందూమతంలో కలిసిపోవాలనీ లేదా హిందూ జాతికి లోబడి ఉంటూ దేశంలో ఉండవచ్చని ఆరెస్సెస్‌ మరో సిద్ధాంతకర్త గోల్వాల్కర్‌ తన రచన ''విరు ఆర్‌ అవర్‌ నేషన్‌ హుడ్‌ డిఫైన్డ్‌''లో పేర్కొన్నాడు.
భారతదేశం ఒక గొప్ప దేశంగా మారాలని మనం కోరుకుంటే ఒక ప్రజాస్వామిక సమాజపు పునాదులపై ఒక రాజకీయ ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనీ, కులం, జాతి, పుట్టుకలపై ఆధారపడే ప్రత్యేక హక్కులు, సౌకర్యాలేవీ ఉండకూడదనీ, కులం, మతం, జాతితో నిమిత్తం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలని నేతాజీ తన రచన ''ఇండియన్‌ స్ట్రగుల్‌''లో పేర్కొన్నాడు.
ఆరెస్సెస్‌, హిందూ మహాసభలు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి చాలా విశ్వాసంగా ఉన్నాయి. సావర్కర్‌ రాజకీయ ఖైదీగా అండమాన్‌ జైలులో ఉండి నవంబర్‌ 14, 1913లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టాలని పిటీషన్‌ పెట్టుకున్నాడు. ప్రభుత్వం తనపై దయదలచి క్షమాభిక్షను ప్రసాదిస్తే, ప్రభుత్వానికి విధేయునిగా ఉంటూ ఏ స్థాయిలోనైనా ప్రభుత్వానికి సేవ చేసుకుంటానని ఆ పిటీషన్‌లో పేర్కొన్నాడు. కానీ నేతాజీ జైలు నుంచి విడుదల కావడం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రాధేయపడలేదు. అంతేకాదు, భగత్‌సింగ్‌, చంద్రశేఖర ఆజాద్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌, అశ్ఫఖుల్లా ఖాన్‌, రాజ్‌ గురు, రోషన్‌ సింగ్‌, సుఖ్‌ దేవ్‌ లాంటి విప్లవ యోధులెవరూ క్షమాభిక్ష కోసం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రాధేయపడలేదు. కానీ వీరందరి కన్నా ఆరెస్సెస్‌, బీజేపీలకు సావర్కర్‌ గొప్ప దేశభక్తుడట. అందుకనే అండమాన్‌లోని పోర్ట్‌ బ్లెయిర్‌ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు.
బ్రిటిష్‌ వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టేందుకు సింగపూర్‌లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ నాయకత్వ బాధ్యతల్లో ఉన్న నేతాజీ సైన్యాన్ని చేర్చుకునే పనిలో ఉంటే... సావర్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌లు బ్రిటిష్‌ వారితో చేతులు కలిపారు. హిందూ మహాసభ అధ్యక్షునిగా సావర్కర్‌ దేశంలోని హిందువులంతా లక్షల సంఖ్యలో సంఘటిత హిందూ హృదయాలతో బ్రిటిష్‌ సైన్యంలో, నావికాదళంలో, వైమానిక దళంలో చేరాలని పిలుపునిచ్చాడు. కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే హిందూ మహాసభ కృషి ఫలితంగా లక్ష మంది హిందువులు బ్రిటిష్‌ సాయుధ సైన్యంలో చేరారు. ఇది నేతాజీని వెన్నుపోటు పొడవడం కాదా?
ఆరెస్సెస్‌, బీజేపీలు భారతరాజ్యాంగ పీఠికలో పేర్కొనబడిన సోషలిజం అనే పదాన్ని ఎగతాళి చేస్తూ, కమ్యూనిస్టులను జాతి వ్యతిరేకులుగా పేర్కొంటున్నారు. నేతాజీ బోల్షెవిక్‌ విప్లవం గురించి చాలా ఉన్నతమైందిగా భావించి, భారతదేశ భవిష్యత్తు కూడా అలాంటి విప్లవంతో ముడిపడి ఉంటుందని భావించాడు. 20వ శతాబ్దంలో రష్యా కార్మికవర్గ విప్లవం, కార్మికవర్గ ప్రభుత్వం, కార్మిక వర్గ సంస్కృతిలో విజయం సాధించడం ద్వారా సంస్కృతి, నాగరికతలను సుసంపన్నం చేసిందని నేతాజీ ''ద ఇండియన్‌ స్ట్రగుల్‌''లో పేర్కొన్నారు. కార్ల్‌మార్క్స్‌, లెనిన్‌, కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అధికార విధాన ప్రకటనల్లో వ్యక్తం చేసిన విధంగా కమ్యూనిజం, జాతీయ స్వాతంత్య్రోద్యమ పోరాటానికి పూర్తి మద్దతు ఇచ్చి, దాని ప్రాపంచిక దృక్పథంలో భాగంగా ఆ పోరాటాన్ని గుర్తించడం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశాడు.
కాబట్టి, ప్రతి విషయంలో నేతాజీతో విభేదించేవారు, ఆయన వారసత్వాన్ని దొంగిలిస్తామంటే అది సాధ్యపడే విషయం కాదు. ఆయన అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా స్వేచ్ఛను కోరుకున్న ఈ దేశ ప్రజల హృదయాల్లో ఉంటాడు కానీ, అతని భావాలను మంటగలుపుతూ, అతని కీర్తి, ప్రతిష్టలను మాత్రం ఉపయోగిం చుకోవాలని ఆరాటపడే వారి హృదయాల్లో మాత్రం కాదు.

- బోడపట్ల రవీందర్‌
  సెల్‌:9848412451

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.