Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర

          రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు ఆంబేద్కర్‌, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ ప్రజలను హెచ్చరించారు. ''పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రాజ్యాంగం చెడ్డదైనా మంచిగా మారుతుంది. రాజకీయ పక్షాల మీద రాజ్యాంగ వ్యవస్థల పనితీరు ఆధారపడుతుంది. దేశం మతాతీతంగా ఉండాలి. మతం రాజ్యాన్ని అతిక్రమిస్తే స్వాతంత్య్రం దూరమవుతుంది'' అని ఆంబేద్కర్‌ అంటే... ''పాలకులు యోగ్యులు, సమగ్రతా నిబద్దులు, గుణవంతులయితే లోప యుక్త రాజ్యాంగాన్ని ఉత్తమంగా మార్చగలరు'' అన్నారు రాజేంద్ర ప్రసాద్‌. భవిష్య ప్రజాప్రతి నిధుల చిత్తశుద్ధి, పాలనా విధానాలపై వీరికి ఆరోజే అనుమానం కలిగింది.
          ''భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోడానికి, పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రం చేకూర్చుటకు, వారి వ్యక్తిగౌరవం, జాతి ఐక్యత, అఖండతలను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించి 26 నవంబర్‌, 1949న రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.'' సుప్రీంకోర్టు ఈ పీఠికను రాజ్యాంగ మౌలిక సిద్దాంతంగా ప్రకటించింది. చట్టాలు, రాజ్యాంగ సవరణలు పీఠికలోని అంశాలకు కట్టుబడి ఉండాలన్నది. రాజ్యాంగ ముసాయిదా, నిర్మాణ సభల్లో మితవాదులు ఆనాడే ఆంబేద్కర్‌కు అనేక అడ్డంకులు కల్పించారు. ఈనాడు ఏకంగా అధికారమే చేపట్టి రాజ్యాంగానికి హైందవ తత్వాన్ని పులుము తున్నారు.
          గత ప్రభుత్వాల రాజ్యాంగ అపసవ్యంలో నేరస్తుల రాజకీయీకరణ, రాజకీయ నేరమయం పెరిగాయి. రాజ్యాంగ పీఠిక అశ్రద్ధ చేయబడింది. సామాజికదృక్పథం, త్యాగంతో నిండ వలసిన రాజకీయాలు లాభసాటి లూటీ వ్యాపారంగా మారాయి. రాజ్యాంగ విలువలు దిగజారాయి. ఇందిర 1975లో రాజ్యాంగ అధికరణ 352(1)తో ఎమర్జెన్సీ విధించారు. దీనితో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బలహీన పడ్డాయి. నియంతృత్వ పోకడ మొదలైంది. కాని సంఫ్‌ు అంటరానితనం పోయింది. తన భావజాలాన్ని ప్రచారంచేసింది. జనసంఫ్‌ు, సంఫ్‌ు పరివార్‌ సంస్థలు బలపడ్డాయి. జనతా ప్రభుత్వంలో అధికారం దక్కింది. ఆ తర్వాత ఇందిరకు, సంఫ్‌ుకు క్విడ్‌ ప్రోకో కుదిరింది. అది ఇందిరకు సహకరించింది. ఆమె సంఫ్‌ు గంగాజల్‌ యాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ కమిటీల్లో, చర్చల్లో జనసంఫ్‌ుకు ప్రాతినిధ్యం కల్పించారు. రాజీవ్‌ హిందువులను దువ్వడానికి హిందుత్వ మెతక వైఖరి వహించారు. అయోధ్య ఆలయ తలుపులు తెరిపించారు. అయోధ్య నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించి మందిర్‌ నిర్మిస్తామన్నారు. షాబానో మనోవర్తి సుప్రీంకోర్టు తీర్పును తిరగతిప్పి ముస్లిం మగాళ్ల కోసం చట్టం చేశారు. ఆ తరువాతి ప్రధాని నరసింహారావు బాబ్రీ మసీదు కూల్చివేతకు మౌనంగా సహకరించారు. అయోధ్య మందిర్‌ నిర్మాణం, అలౌకిక పాలనకు పునాదివేశారు. వాజపేయి ప్రజల ఆస్తుల అమ్మకాలను చట్టబద్దంచేశారు. ప్రభుత్వ సంస్థ లను కారుచౌకగా ప్రయివేట్లకు అమ్మారు. విద్యా లయాల్లో అశాస్త్రీయాంశాలను ప్రవేశపెట్టారు. విద్యావ్యవస్థ కాషా యీకరణతో రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథానికి నీళ్ళొదిలారు. దేశాన్ని సాంస్కృతికంగా కలుషితం చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరమేధాన్ని సహించి, రాజకీయ మతోన్మాదాన్ని ప్రోత్సహించారు. మతపాలనకు నాందిపలికారు.
          ఆర్‌.ఎస్‌.ఎస్‌. (సంఘ్‌) రాజ్యాంగ మూల సిద్దాంతాలకే వ్యతిరేకం. రాజ్యాంగం స్థానంలో 'మనుస్మృతి' అమలు చేయాలంటుంది. ''రాజ్యాంగంలో మనదైన అంశమేలేదు. మనుస్మృతి ప్రపంచ సమ్మతి, ప్రశంస, యాదృచ్ఛిక విధేయత, అనుగుణ్యతలను పొందింది. రాజ్యాంగాన్ని శుభ్రపరచాలి. ఏకీకృత ప్రభుత్వం ఏర్పరచాలి.'' సంఘ్‌ రెండవ సర్‌ సంఘ్‌ చాలక్‌ గోల్వాల్కర్‌ వ్యాఖ్యానం ఇది. ''రాజకీయాలను హైందవీకరించండి. హిందుత్వాన్ని సైనికీకరిం చండి'' అన్నారు సావర్కర్‌. ఇప్పుడు మోడీ సర్కార్‌ ప్రజా రాజ్యాంగాన్ని పాలక పక్షపాత గ్రంథంగా మారుస్తోంది. సర్వసత్తాక స్థానంలో ఏకసత్తాకం తెస్తోంది. రాజ్యాంగంలో పేర్కొన్న సామ్యవాదం అసమానతలను నిరోధిస్తుంది. లౌకికత్వం రాజ్యాన్ని, మతాన్ని వేరుచేస్తుంది. ప్రజలను సోదరులుగా, మనుషులుగా తీర్చిదిద్దుతుంది. కానీ నేటి ప్రభుత్వం ఈ పదాలను రాజ్యాంగం నుంచే తొలగించాలని ప్రయత్నిస్తోంది. సామ్యవాదం మరిచి అసమానతలను పెంచి కార్పొరేట్ల ప్రభుత్వంగా మారింది. ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలకు తిలోదకాలిచ్చింది. హేతు, భౌతిక, మానవ వాదాలను ప్రోత్సహించటం లౌకిక రాజ్య లక్షణం. గత ప్రభుత్వాల్లో లౌకిక భావం నిర్వీర్యమైంది. బీజేపీ సర్కార్‌ హిందూమత విశ్వాసాన్నే దేశభక్తిగా మారుస్తోంది. లౌకికత్వాన్ని హిందుత్వానికి ముడేసి హిందూత్వనే భారతీ యతగా చెపుతోంది. సంస్థలన్నిటినీ సంఫ్‌ు తాత్వికులతో నింపి, బలహీన పర్చింది. నియం తృత్వ ధోరణలతో రాజ్యాంగాన్ని ఎగతాళిచేసింది. పౌరసత్వ సవరణ చట్టంలో రాజ్యాంగ సమానత్వ అధికరణలు 14-18లను తిరస్కరిస్తుంది. సామాజిక సౌభ్రాతృత్వాన్ని మంటగలిపుతోంది. తన నిరంకుశ స్వేఛ్ఛను, కార్పొరేట్ల దోపిడీ స్వేఛ్ఛను పెంచుకుంటూ ప్రజల స్వేఛ్ఛలను హరిస్తోంది. తమ దుశ్చర్యలను, తాత్వికతను ప్రశ్నించినవారిని తప్పుడు కేసులతో అరెస్టు చేయించి, జాతి నిర్మాతల గౌరవాన్ని కించ పరుస్తోంది. లౌకికత్వం, అంతర్జాతీయత, బహుళ సంస్కృతులతో పూర్వ కీర్తిప్రతిష్టలు నశించాయని ఫాసిజం నమ్మకం. దీనికి మతోన్మాదం తోడ్ప డింది. భారతీయ సౌభ్రాతృత్వం, అంతర్జా తీయ మానవత్వం లేకుండా దేశ సమగ్రత, సమైక్యత లకు సంపూర్ణత లేదు. రాజ్యాంగ మనుగడ లేదు.
           బీజేపీ సర్కార్‌ లక్షల్లో సంఘ్‌ కార్యకర్తలను పోలీసులుగా నియమించుకుందని, న్యాయ వాదులుగా నమోదుచేసుకుందని మంగళూరు బీజేపీ శాసన సభ్యుడు ఏడేండ్ల క్రితమే వెల్లడించారు. ఇప్పుడు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికే తూట్లుపొడుస్తోంది. ఇటీవలి కోర్టు తీర్పులన్నీ బీజేపీ కోరుకున్నట్లే రావడం యాదృచ్ఛికం కాదని బీజేపీ నాయకులే అంటున్నారు. మీడియా పాలకపక్ష కార్పొరేట్ల చేతుల్లో చేరింది. ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే చౌర్యోన్మాదస్వామ్యంగా ప్రజాస్వా మ్యాన్ని మార్చింది. మతవాదం ఫాసిజానికి దారితీస్తోంది. జైళ్ళలో ఉండాల్సినవారు కుర్చీలెక్కి రాజ్యాంగ బాధ్యత మరిచారు. ఆ బాధ్యతను తలకెత్తుకొన్న సమాజ నిర్మాతలను జైళ్ళలో కుక్కారు. గతంలోలేని రీతిలో, స్థాయిలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది.
అంబేద్కర్‌ అనుమానాలు నిజాలయాయి. ఆయన చెప్పినట్టు ఇప్పుడు స్వాతంత్య్రం, రాజ్యాం గాల రక్షణ బాధ్యత ప్రజలదే. ప్రత్యామ్నాయ పార్టీలు సైద్ధాంతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పద్దతులతో ఎదగాలి. విద్యార్థులు, యువత, పౌరులు రాజ్యాంగ హక్కులు, బాధ్యతలు, పౌర జ్ఞానం, రాజ్యాంగ వక్రీకరణ నష్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్గస్వభావం, సామ్యవాదం, ఫాసిజంలపై అవగాహన పెంచుకోవాలి. ప్రజా స్వామ్యం, రాజ్యాం గాలను సమాజానికి అనుసం ధానించి ప్రచారం చేయాలి. బుద్ధిజీవులు రాజ్యాంగరక్షణలో భాగ స్వాములు కావాలి.

సెల్‌:9490204545
ఎస్‌. హనుమంత రెడ్డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.