Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
''పుష్ప విలాపం'' | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

''పుష్ప విలాపం''

జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పుష్పవిలాపం కాదు కాని, బంతి పువ్వులు, గులాబీలు, తెల్ల చామంతులు గొల్లున ఏడ్చాయి. బిల్కిస్‌ బానో రేప్‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను ''పెద్ద మనుసు''తో గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసినందుకే కాదు, విశ్వహిందూ పరిషత్‌వారు ఈ దోషులను తమతో కట్టిన దండలతో సత్కరించినందుకు భోరు మన్నాయి. ఇటువంటి ఘటనలను ఎవరూ మర్చిపోరాదనే ''రిపోర్టింగ్‌ టు రిమెంబర్‌'' (గుర్తుపెట్టుకోడానికే వార్తలు రాయడం) అనే సంస్థ వెలిసింది. తమాషాగా అది స్థాపించిన జాస్మీన్‌ (మల్లెపువ్వు) పథేజా పేరు కూడా మరో పువ్వుపేరుతో ప్రారంభం కావడం కాకతాళీయమే. నిత్యం నాలుగు మాటలు తన బుర్రలో సవ్వడి చేస్తూంటా యంటారామె. అవి 'స్పందించడం', 'తెలుసు కోవడం', 'మనసును తాకడం', 'మానవత్వం'. మనకి మనం కొన్ని విషయాలపై స్పందించి, ఆ స్పందించిన విషయాలను తెలుసుకుని, ఆ తెలుసుకున్న విషయాలను మనసుకు హత్తుకునేలా చేసి, మానవత్వంతో కూడిన అంశాలను ఇతరులతో పంచుకోవాలంటారు జాస్మీన్‌. తనకు తాను కళాకారినిగా చెప్పుకునే జాస్మీన్‌ పథేజా గత 20ఏండ్లుగా తాను సృజనాత్మక పద్ధతుల్లో ప్రజలు మర్చిపోయే (బహుశా ఎప్పుడూ నేర్చుకోని) ప్రపంచంలో పనిచేస్తున్నానంటారు.
ఆలోచనా పూర్వక విషయాల నుండి క్రియాశీలక అంశాల వరకు చర్చించే, తాను సృష్టించిన ''బ్లాంక్‌ నాయిస్‌'' అనే ఫెమినిస్టు సంస్థ తాను బెంగుళూరులో ''సృష్టి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ విద్యార్థిగా ఉన్నప్పుడే పురుడు పోసుకుందని చెపుతారు. పథేజా ఆ సంస్థను తన సొంత ఇల్లుగా భావిస్తారు.
'షీ' రోస్‌
'బ్లాంక్‌ నాయిస్‌' మొట్టమొదట చేపట్టిన అంశం 'ఈవ్‌ టీజింగ్‌'. ఆమె ఒక 'ఈవ్‌టీజింగ్‌ ఫుడ్‌ చార్ట్‌' రూపొందించారు. రోడ్లపై మహిళల్ని 'లాలీపాప్‌', 'చామ్‌ చామ్‌', 'హరిమిర్చి' తమను తాము రక్షించుకునేందుకు కారంపొడి వగైరా పట్టుకు తిరుగుతారు కాబట్టి 'ఆత్మరక్షణ పరికరాల మ్యూజియమ్స్‌' అంటూ బనాయిస్తూంటారని జాస్మీన్‌ పథేజా చెపుతారు. ఇటువంటి వివిధ ఆలోచనలను అమల్లోకి తెచ్చే ఈ 'బ్లాంక్‌ నాయిస్‌' కార్యకర్తలను ఆమె హీరోల్లాగే 'షీరోల'ని పిలుస్తూంటారు.
ఆమె బెంగుళూరు కబ్బన్‌పార్క్‌లో ఒక చిన్న కునుకు తీస్తే, చిన్న అలికిడికి కూడా ఉలిక్కిపడి లేచేది. ఆ సందర్భంలో 'మీట్‌ టు స్లీప్‌' అనే ఆలోచన వచ్చింది. దేశంలో వేల మంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో నిద్రించాలనే ఆలోచన ఆమెకొచ్చింది. మహిళలపై అత్యాచారాలు చేసే వారి చెంప చెళ్ళుమనిపించేలా హింసకి గురైన మహిళల దుస్తులు ఆమె పోగుచేయడం మొదలుపెట్టింది. అటువంటి వాటిని పదివేలు పోగుచేసి ఢిల్లీలోని ఇండియా గేట్‌ సమీపంలో ప్రదర్శించాలని ఆమె స్వప్నిస్తోంది. ఆ రకంగానైనా మహిళలపై హింస తగ్గుతుందేమోనని ఆశిద్దాం...
పూలను, ఆడపిల్లలను ఒకదానికొకటి పర్యాjపదాలుగా రాస్తుంటారు కవులు. కుటుంబాల్లో భారం మోస్తూ, బాధల్ని భరిస్తూ నెట్టుకొచ్చే, నెగ్గుకొచ్చే స్త్రీలైనా పూలైనా విలపించ కుండా చూడటం సమాజం బాధ్యతే!
- ఆరెస్బీ
(ప్రియారమణి హిందూలో రాసిన వ్యాసానికి స్వేచ్ఛానువాదం)

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.