Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

'ఫేక్‌' ఉత్తర్వులతో సోషల్‌ మీడియాపై కత్తి

          ఓడ ఎక్కేవరకూ ఓడమల్లయ్య అన్న పెద్దమనుషులు ఓడెక్కాక ఏమంటారో ఆ సామెత తెలిసిన తెలుగువాళ్లకు బాగా తెలుసు. ప్రధాని నరేంద్రమోడి సర్కారు విధానం అచ్చంగా ఆ సామెతకు నకలుగా తయారైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు ఎన్నికైన మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి రావడానికి సోషల్‌ మీడియాను సోపానంగా వాడుకున్నారు. కార్పొరేట్ల సాయంతో వేలాది మంది యువతను వినియోగించి అహోరాత్రులు ఆయన ఘనతను హోరెత్తించారు. ఉత్తుత్తి ఫొటోలు సృష్టించారు. పాత చరిత్రను మార్చి కొత్త ఇమేజి తేవడానికి తంటాలు పడ్డారు. ఆఖరుకు నరేంద్రమోడీ బీజేపీ కార్యాలయం తుడుస్తున్న ఫొటో, ఛారువాలా కథ, చదువుకున్న పట్టాలు ఏవీ నిజమని నిరూపించుకోలేకపోయారు. ఈపట్టాను గురించిన సమాచారం ఇవ్వవలసిందిగా సంబంధిత సంస్థను ఆదేశించినందుకు తెలుగువాడైన జాతీయ సమాచార హక్కు కమిషనర్‌ డా.మాడభూషి శ్రీధర్‌ను తప్పించారు కూడా. బీజేపీ ఆరెస్సెస్‌ మార్కు అసత్య కథనాలు కట్టుకథలు తట్టుకోలేక వార్తాసంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవలసి వచ్చింది. ప్రత్యేక పరిశోధకులను నియమించి నిరూపించవలసి వచ్చింది. ఇదిగో ఈ ఫొటోను మార్ఫింగ్‌ చేసి కొత్తది తయారు చేశారని, లేదంటే అబద్ధాలతో లేని కథ వండివార్చారని సోదాహరణలతో ఎన్నో కథనాలు బయిటపెట్టారు. తమ నిజస్వరూపం బయిట పెట్టిన వారిపై కక్షసాధింపులకూ వేధింపులకూ పాల్పడిందీ ప్రభుత్వం. ఆల్ట్‌ మీడియా అనే సంస్థ ఇందులో విశేషమైన కృషి చేసింది గనక ఆ సంస్థ అధినేతలలో ఒకరైన మహమ్మద్‌ జుబేర్‌ను జైలుపాలు చేసింది. సరిగ్గా ఇప్పుడు ఆ అనుభవాన్నే మోడీ సర్కారు మరోవైపు నుంచి ప్రయోగించడానికి సిద్ధమైంది. ఫేక్‌న్యూస్‌ ప్రసారం చేస్తే సహించేది లేదని బెదిరించడమే గాక ఏది నిజం ఏది ఫేక్‌ అని నిర్థారించే అధికారం తన చేతుల్లోకి తీసుకుంటున్నది. విమర్శనాస్వేచ్ఛకు, వాస్తవాల వెల్లడికి సాధనాలుగా ఉండాల్సిన మీడియా, సోషల్‌మీడియాలను నియంత్రించేందుకు కొత్త చట్టాలు బిగిస్తున్నది.
ఏమిటీ సవరణ?
సోషల్‌మీడియా ఇంతగా విస్తరించక ముందు ''ఇన్ఫర్మేషన్‌ చట్టం 2000'' పనిచేస్తూ వచ్చింది. ఈ చట్టంలో సెక్షన్‌69(1) కింద ఏదైనా సంస్థ లేదా మీడియా ప్లాట్‌ఫారమ్‌ ప్రకటించిన వార్త దేశానికి హానికరమైనదని, ఉద్రేకాలు పెంచుతుందని భావిస్తే పోలీసులు కేసు పెట్టొచ్చు. నోటీసు ఇవ్వొచ్చు. మారిన పరిస్థితులలో ఆ చట్టం సరిపోలేదని 2019లో ఫేక్‌ వార్తల అదుపునకు తీసుకోవలసిన చర్యలు సూచించేందుకు పిఐబి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేశారు. సోషల్‌మీడియా వ్యాప్తి తర్వాత అంతకు ముందునాటి చట్టం చాలదన్న భావనతో 2021లో కొత్త సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారం బనాయించిన అనేక కేసులు సుప్రీం కోర్టు ముందు విచారణలో ఉన్నాయి. చాలాసార్లు అత్యున్నత న్యాయమూర్తులే వీటిపై విమర్శలు చేశారు. కేంద్రం తన వైఖరి చెప్పాలని తాఖీదులిచ్చారు. కేంద్రం ఆరునెలల గడువు కోరింది. ఈ కాలంలో ఆ ఆంక్షలు అమలులో ఉండవని సుప్రీం ప్రకటించింది. మరోవైపు 2021 సమాచార సాంకేతిక పరిజ్ఞానం నిబంధనల సవరణ ముసాయిదా తీసుకొచ్చింది. దాంతో వ్యూహాత్మకంగా కేంద్రం కొత్త ఎత్తు ఎత్తింది. ఆ ప్రకారం పిఐబి నియమించే ఫేక్‌వార్తల నియంత్రణ కమిటీ లేదా ప్రభుత్వం అందుకోసం నియమించే మరేదైనా కమిటీకి ఏకపక్ష నిషేధ అధికారం కల్పించారు. పైకి చెప్పడానికి ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిరోధించ డానికి ఈ చట్టం తెచ్చామని చెబుతున్నారు గానీ, నచ్చని అంశాల ప్రచురణలను తొక్కిపట్టడం కోసం అంతకన్నా తీవ్రమైన అంశం జోడించారు. సోషల్‌ మీడియా వేదికలలో అంటే యూట్యూబ్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, ఓటిటి వంటివాటిలో వచ్చిన వార్తా కథనాలు(కంటెంట్‌) అవాస్తవమైతే వాటిని తొలగించే అధికారం పిఐబికి ఉంటుందని ఆ సవరణలో ప్రతిపాదించారు. వాటిని తీసేయవలసిందిగా ఆదేశిస్తే మధ్యంతర వ్యవస్థలైన అగ్రిగేటర్లు (అంటే వాటిని నిర్వహించే యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, ఓటిటి సంస్థలు) అమలు చేయవలసి ఉంటుంది. బూటకపు కథనాలు తొలగిస్తే మంచిదే కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అసలు సమస్య అక్కడే ఉత్పన్నమవుతుంది. ఏది నిజమో ఏది బూటకమో నిర్ణయించేది ఎవరు? వాటికి కొలబద్దలేమిటి?
గత అనుభవాలేమిటి?
గతంలో నియమితమైన పిఐబి కమిటీ అనుభవం తీసుకుంటే చాలా దారుణంగా ఉంది. అనేకసార్లు ఈ కమిటీ కొన్ని వార్తలు ఫేక్‌ బూటకమని ప్రకటించింది. కానీ ఈ ప్రకటనలే బూటకమైనాయి. సంఫ్‌ు పరివార్‌ లేదా ప్రభుత్వం విడుదల చేసే ఫేక్‌లు తేల్చడానికి సోషల్‌ మీడియాలో కొందరు కృషిచేస్తూ వచ్చారు. ఉదాహరణకు 2020 డిసెంబరులో కేంద్ర నిఘా విభాగం(ఐబి) తరపున విడుదలైన నియామకాలకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్‌ బూటకమని గొప్పగా ప్రకటించింది. తర్వాత చూస్తే అది అధికారికంగా ఇచ్చిందేనని తేలింది. పిఐబి తన ట్వీట్‌నే తొలగించుకోవాల్సి వచ్చింది. ఇక పరివార్‌ దుష్పచారాలకు లోటేలేదు. కరోనా సమయంలో ఆర్నాబ్‌ గోస్వామి వంటివారు వలస కార్మికులు తరలిపోతున్న ఫొటోను మసీదు బ్యాక్‌గ్రౌండ్‌తో ఇవ్వడం ఎంత కలవరం కలిగించిందో గుర్తుండే ఉంటుంది. కరోనా కాలంలో ఢిల్లీలోని తబ్లీగీ జమాయిత్‌ మర్కజ్‌ ఇస్లామీ సంస్థలో ఏమి జరిగింది? ఈ విషయంలో అప్పట్లో ప్రధానితో సహా చేసిన ప్రకటనలు ఎలావున్నాయి? మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తప్పుడు కథనాలు వదలడంపై చివరకు సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్రాస్‌ ఘటనలోనూ బూటకపు చిత్రాలు వచ్చాయి. నిజమైన ఫొటోలు మార్ఫింగ్‌ ఫొటోలు పక్కపక్కనే చాలాసార్లు ప్రచురితమైనాయి. (ఇలాంటి దారుణమైన అనుభవాలు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నాయి. వాటిలోకి వెళితే ఎవరు ఏమిటి అన్నది మరో వివాదమవుతుంది.) విచిత్రమేమంటే పిఐబి ఏర్పాటు చేసిన కమిటీ ఇలాంటి పరివార్‌ ప్రచారాల జోలికి పోయిందే లేదు. వారు వెల్లడించిన, ఖండించిన కథనాలలో నూటికి తొంభై ప్రతిపక్షాలకు సంబంధించినవే. రాహుల్‌గాంధీ యాత్ర సందర్భంలో ఫొటోలు లేదా ప్రకటనలు, ఇతర ప్రతిపక్షాలు లేదా మీడియా సంస్థల కథనాలు సమాచారాలపైనే ఎక్కడలేని కేంద్రీకరణ చూపించడం అనుభవంలో చూశాం. పిఐబి అనేది మౌలికంగా ప్రభుత్వ విధానాలను లేదా కృషిని ప్రజలకు మీడియాకు తెలియజేయడానికి ఉద్దేశించిన సంస్థ. ఆ సంస్థ ప్రచారంలో పెట్టే, విడుదలచేసే ప్రకటనలు ఎంత వరకు నిజమో తేల్చవలసిన బాధ్యత మీడియాపైన సోషల్‌ మీడియాపైన ఇంకా ప్రతిపక్షాలు ప్రజా సంస్థలపైన ఉంటుంది. దీన్ని అటూ ఇటూ తిప్పి తక్కిన వారిపై నిఘావేసి కంటెంటు తొలగించే అధికారాలివ్వడం తలకిందుల తర్కం. ఉదాహరణకు ఇటీవల ప్రధాని విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జరిగిన కార్యక్రమాలలో తొంభైశాతం శంకుస్థాపనలు మాత్రమే. ఆ విషయం గట్టిగా చెబితే పిఐబి దాడి చేస్తుంది. ఎందుకంటే ఆ శంకుస్థాపనల అంచనాలు మొత్తం వారు అభివృద్ధి కింద చూపిస్తుంటారు. వూరి సైనిక కేంద్రంపై దాడి, పాకిస్థాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వంటివాటిపై విపరీత ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన నిజానిజాలు అడిగితే దేశభద్రతకు ముప్పుంటారు. ఇంకా మాట్లాడితే దేశద్రోహం ముద్ర వేస్తారు. భారత చైనా సరిహద్దులలో పరిస్థితిపై ఏవో కథనాలు వస్తాయి. పూర్తి వివరాలు అడిగితే దాటేస్తారు. ప్రత్యారోపణలు చేస్తారు. ఇలాంటి అనేక సందర్భాలు చూశాం. అసలు పరిశోధనాత్మక జర్నలిజంలో జరగాల్సిందే అది. మోడీ ప్రభుత్వం క్రమంగా ఆ విధమైన పరిశోధనాత్మక జర్నలిస్టులనే వేటాడి ద్రోహుల జాబితాలో చేర్చింది. సర్వాధికారాలు పిఐబికి కట్టబెట్టే కొత్త నిబంధనలు వస్తే గనక ఏలినవారు చెప్పే అసత్యత కథనాలు, లేనిపోని గొప్పలే జనానికి వార్తలవుతాయి. ప్రశ్నించడం పరిశోధించి రాయడం అపరాధమవుతుంది. పిఐబి వాటిని తొలగించాలని ఆదేశి స్తుంది. అంటే ఏ ప్రభుత్వ నిర్వాకాలనూ నిజాలను నిగ్గుతేల్చడం జరగాలో అదే అంతిమ తీర్పరిగా, నియంత్రణ కర్తగా మారిపోతుంది.
తస్మాత్‌ జాగ్రత్త
ఈ కారణంగానే ప్రతిపక్షాలూ మీడియా సంస్థలూ పత్రికా యాజమాన్యాలు, ముక్తకంఠంతో ఒక్క గొంతుతో సమాచార స్వాతంత్యం మెడపై కత్తిలాటి ఈ సవరణలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. ఎడిటర్స్‌ గిల్డ్‌, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌(ఎన్‌బిడిఎ), ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఉయత) అనేక జర్నలిస్టుల సంఘాలు ఈ మేరకు సవివరమైన సోదాహరణమైన ప్రకటనలు చేశాయి. ఒత్తిడి, విమర్శలు పెరిగాక కేంద్ర ప్రభుత్వ ఐటి శాఖామంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కొన్ని సన్నాయినొక్కులతో కొన్ని వివరణలు ఇచ్చారు. ఈ విషయమై విడుదల చేసిన నిబంధనలపై ఫిబ్రవరిలో సంబంధిత సంస్థలతో(స్టేకహేోల్డర్స్‌) చర్చలు జరిపిన తర్వాతే అమలులోకి తెస్తామన్నారు. ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి మాత్రమే జరుగుతుందని అయా శాఖలతో నిర్థారించుకున్నాకే వాటిని తొలగించడం జరుగుతుందని వివరించారు. ఈ సన్నాయినొక్కులు ఎలా ఉన్నా దేశంలో ప్రస్తుత పరిస్థితి, ఆచరణను బట్టి చూస్తే నిస్సందేహంగా మోడీ ప్రభుత్వం మరోసారి సోషల్‌ మీడియా పీక నొక్కడానికి సమాయత్తమవుతున్నదనేది స్పష్టం. కనీస పరిశీలన(స్క్రూటనీ) కూడా లేకుండా పిఐబి చెప్పిందే అమలు చేయవలసి ఉంటుందని ఎన్‌డిబిఎ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఏ విధమైన విమర్శ వచ్చినా ఏదో ఒక పేరుతో అణచివేయ వచ్చు. పైగా డిజిటల్‌ సంస్థలూ ఇంటర్మీడియరీలు సర్కారు వత్తిడికి గురై తలవంచే పరిస్థితి దాపురిస్తుంది. అసలు ఇంతపెద్ద పరిణామం జరిగినా దేశంలో మీడియా సంస్థలైన పత్రికలు ఛానళ్లలో పెద్ద చర్చ లేకపోవడమే అందుకో నిదర్శనం. బడా మీడియా మోడీకి లొబడిపోయిన నేపథ్యంలో సోషల్‌మీడియానే ప్రత్యామ్నాయంగా ఉంది. దాంట్లో అనేక అవాస్తవాలు అవాంఛనీయ ధోరణులు ఉన్నా అనేక వాస్తవాలు కూడా వెలుగుచూస్తున్నాయి. పైగా సోషల్‌ మీడియాలో పౌర చొరవకూ పాత్రికేయుల స్వతంత్రతకూ చోటుంటుంది. తప్పొప్పులు సరిచేయాలంటే మీడియా, సోషల్‌మీడియాలో స్వీయ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు కావాలి గాని అధికారవర్గాలకు నిషేదాధికారాలు ఇవ్వడం అనర్థదాయకం. ఎమర్జన్సీలో విధించిన సెన్సార్‌ను మించిన స్వీయ సెన్సారింగ్‌ మీడియాలో సత్యాలను తొక్కిపడుతున్నదని ఇప్పటికే సాయినాథ్‌ వంటివారు హెచ్చరించారు. ఈ సమయంలో మోడీపై బిబిసి డాక్యుమెంటరీని అడ్డుకున్న తీరు తాజాగా మన కళ్లెదుటే ఉంది. ఈ కొత్త నిబంధనలు రాజ్యాంగం 19(1)(ఎ)అధికరణంలోని ప్రాథమిక హక్కులకూ భావ ప్రకటనా స్వేచ్ఛకూ కూడా ముప్పు తెస్తాయి. అందుకే ప్రజాస్వామ్య ప్రియులెవరైనా ఇందుకు వ్యతిరేకంగా ఎలుగెత్తిపోరాడాలి.

- తెలకపల్లి రవి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.