Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

అమెరికా ఏకధృవ ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు

          అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని మోస్తున్న భూగర్భ పలకలు కదిలి, తిరిగి పడుతున్నాయి. అమెరికా ఆధిపత్యానికి భిన్నమైన క్రమానికి ప్రపంచం తరలిపోతుంది. అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని నేటికీ మోస్తున్న ప్రధాన శక్తులు ఇక నిన్ను మోయలేమని మొరాయిస్తున్నాయి.
ఖతార్‌ ఫిఫా ప్రపంచ పుడ్‌బాల్‌ కప్‌ పోటీలలో మానవాలి మునిగి ఉర్రూతలూగుతున్న సమయంలో, అమెరికా ఆధిపత్యాన్ని ఎనిమిది దశాబ్ధాలు మోసిన ప్రధాన మధ్యఆసియా భూగర్భ పలకైన సౌదీఅరెబీయా చైనా నేతృత్వ ప్రపంచ క్రమానికి కదిలిపోయింది. సౌదీఅరేబియా ఒపెక్‌ వాస్తవ నాయకత్వ దేశం. ప్రపంచంలో అతిపెద్ద ఇందన ఉత్పత్తిదేశం. అమెరికా ఆధిపత్యాన్ని మోస్తున్న మరో ఐరోపా ఖండంలోని భూగర్భపలక జర్మనీ. ఐరోపా యూనియన్‌కు కీలక ఇంజన్‌. ఐరోపాలో జర్మనీ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. ఇది ప్రపంచ నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. నిజానికి ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ఉక్రైయిన్‌ తరపున అమెరికా నాటో కూటమి చేస్తున్న యుద్ధం. జర్మనీ నాటో కూటమిలో ప్రధాన దేశం. ఈ యుద్ధం జరుగుతున్న క్రమంలోనే జర్మనీ అధ్యక్షుడు ఓలప్‌ షోల్జ్‌ ఆదేశ బడా కార్పొరేట్‌ బృందంతో చైనాలో పర్యటించారు. ఈ పర్యటన అమెరికా నాటో కూటమిలో చిచ్చురేపింది. అదీ ఉక్రైయిన్‌ యుద్ధ సమయంలో, రష్యాతో ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యూహాత్మక బంధంవున్న చైనాలో పర్యటించడం ప్రాధాన్య ఆంశం. చైనా అధ్యక్షుడు గ్సి జిన్‌పింగ్‌తో షోల్జ్‌ రోజంతా తీరికలేకుండా చర్చించారు. అమెరికాకు భిన్నంగా ''ఒకే చైనా విధానాన్ని జర్మనీ సమర్థించింది.''
ఇక సుదీర్ఘకాలం అమెరికాతో అంటకాగిన దేశం ఆస్ట్రేలియా. నేడు ఇండోనేషియా బాళీ జి-20 శిఖరాగ్ర సమావేశంలో చైనా వైపు కదిలిపోయింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. నేడు అమెరికాకు విరుద్ధంగా ''ఒకేచైనా విధానంపై యతద స్థితిని ప్రకటించింది.'' ఆల్బనీస్‌ పూర్తిగా దెబ్బతిన్న చైనా ఆస్ట్రేలియా సంబంధాలను నిర్మాణాత్మకంగా వేగంగా పునరుద్ధరిస్తాం అని ప్రకటించారు. అమెరికా దుశ్చర్యలకు మద్దతుదారుగా, అనేక దశాబ్ధాలుగా దానితో అంటకాగుతూ సొంత ప్రజలపై అనేక ఆకృత్యాలకు పాల్పడింది పిలిప్పీన్‌. ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్‌ మొట్టమొదటి విదేశీ పర్యటన చైనాలో కొత్త ఏడాదిలో సాగుతుంది. హైక్వాలిటీ బెల్ట్‌ అండ్‌ రోడ్‌(బిఆర్‌ఐ)లో అనేక ప్రాజెక్టులపై పిలిప్పీన్‌ చైనా ఒప్పందాలు చేసుకుంటోంది. ఇరువురి వాణిజ్యం 38.35బి.డాలర్లు. గత అమెరికా సుదీర్ఘ దుర్నీతికి భిన్నంగా పిలిప్పీన్‌ చైనాలు వైరుధ్యాలు మాని, ఇక అన్నింటిలో సహకారానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయల్‌ మాక్రాన్‌ 2023 మొదట్లోనే చైనాలో పర్యటించనున్నట్లు, బ్రిటిష్‌ పత్రిక గార్డియన్‌ ప్రకటించింది. ఉక్రైయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం చైనా మధ్యవర్తిత్వ పాత్ర నిర్వహించాలని మాక్రాన్‌ పేర్కొన్నట్లు గార్డియన్‌ నివేదించింది. మూడవ పార్టీ(అమెరికా)జోక్యం లేకుండా ద్వైపాక్షిక, చైనా-ఐరోపా యూనియన్‌ సంబంధాలను మరింత ధృడత్వం చేసుకోనున్నట్లు ప్రకటించింది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సౌదీఅరెబియా రాజు, కుమారుడైన వాస్తవ రాజు ఎం.బి.ఎస్‌ ఘశ్రీ స్వాగతం పలికారు. దీనికి కొద్ది నెలల క్రితం ఒపెక్‌ సమావేశంలో సౌదీఅరెబియా రోజుకు రెండు మిలియన్‌ బారళ్ల క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని తగ్గించింది. ఉక్రైయిన్‌ యద్ధక్రమంలో పశ్చిమ దేశాలు, రష్యాపై విధించిన తీవ్ర ఆంక్షలు, 300 బిలియన్‌ డాలర్ల స్తంభనకు ప్రతిచర్యగా రష్యా యూరోప్‌కు గ్యాస్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. సౌదీఅరెబియా రష్యాల చర్యలతో అప్పటికే మండుతున్న ఇందన ధరలు ఆకాశానికి ఎగిసాయి. కోవిడ్‌ కష్టాలతో ప్రపంచం బొప్పికట్టివుంది. మానవాళి ఆహార సరఫరాలో ఉక్రైయిన్‌ కూడా ఒక ముఖ్య దేశం. ఆయుద్ధం ఆహార సరఫరాను విచ్ఛిన్నం చేసింది. ప్రపంచం ఆహార ధరలు అంటుకున్నాయి. ఇలా ప్రపంచ ఆహార ఇంధన ధరల మంటలతో, అమెరికా ఆధిపత్య ప్రపంచం మాకొద్దని, నాటోనుంచి వైదొలగాలని, రష్యాతో సంబంధాలు పునరుద్ధరించాలని యూరప్‌ ఖండంలోని ప్రతిదేశంలో లక్షలాది ప్రజలు వీధుల్లోకొచ్చారు. ఐరోపాలో అమెరికాను మోస్తున్న పాలకుల పీఠాలు కదిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సౌదిఅరెబియాలో పర్యటించారు. జిసిసి శిఖరాగ్ర సమావేశాల్లో తగ్గించిన ఇంధన ఉత్పత్తి పెంచమని వేడుకుంటే సౌదీ మొండిచేయి చూపించింది. ప్రపంచ అధిపతిగా వెలుగొందుతున్న అమెరికాకు నిన్నటి వరకు మోసిన దేశంలోనే పెద్ద పరాభవం జరిగింది. దీనికి పూర్తి భిన్నంగా చైనా అధ్యక్షుడికి అంబరాన్నంటే అట్టహాసంతో సౌదీ స్వాగతం పలికింది. ఈ అనూహ్య మార్పులు అమెరికా ఏకధృవ ప్రపంచాన్ని సవాల్‌ చేస్తున్నాయి.
మధ్య ఆసియా దేశాలన్నీ, ఆధునిక పారిశ్రామిక చరిత్ర కాలమంతా ఇంగ్లాండ్‌ తర్వాత అమెరికాలతో అంటకాగాయి. అరబ్‌ శిఖరాగ్రాలపై ఆధిపత్యమంతా వీరిదే. కానీ ఇప్పుడు తొట్టతొలి చైనా అరబ్‌, జి.సి.సి. శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన మొట్ట మొదటి చైనా అధ్యక్షుడుగా జిన్‌పింగ్‌ చరిత్ర సృష్టించాడు.
ఇంధనం, ఆర్థికం పెట్టుబడులు, ఆధునికత, నూతన సాంకేతికత, ఏరోస్పేస్‌, భాష సంస్కృతులైన ఐదు అంశాలపై పరస్పరం సహకరించు కోవాలని ఈ శిఖరాగ్ర సమావేశాలలో జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. అభివృద్ధి సుసంపన్నతతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ ''అత్యంత కీలక అంశాలపై'' చైనా అరబ్‌ సమాజం ఐక్యంగా సమ్మతితో పనిచేయాలని నిర్ణయించాయి. చైనా ప్రజా రిపబ్లిక్‌ ఏర్పడ్డ తర్వాత ఇది అతిపెద్ద దౌత్య సంఘటనా, అనూహ్యమైన అభివృద్ధి. అత్యున్నత దౌత్య మర్యాదలతో జిన్‌పింగ్‌ సుడిగాలి లాంటి అనేక ద్వైపాక్షిక సమావేశాలు ఈ బహుళధృవ శిఖరాగ్రంను అనుసరించే జరిగాయి. అరబ్‌ జిసిసి ఆర్థికవాణిజ్య లావాదేవీలన్నీ ఇక అమెరికా డాలర్‌లో కాకుడా, చైనా మారకద్రవ్యం రెన్‌మిన్‌బి(ఆర్‌.ఎం.బి)లో జరపాలని నిర్ణయం. చైనా-అరబ్‌ సంబంధాలలో ఇది ఒక యుగ పరివర్తనకు గీటురాయని అరబ్‌ పత్రికలు వర్ణించాయి. ఈ పరిణామాలను అమెరికా అత్యంత ఆందోళనాకరంగా పరిశీలించింది. అమెరికా ఏకధృవ ప్రపంచం క్రింది మధ్యప్రాచ్య భూగర్భపలక తలక్రిందులై మరో క్రమానికి మారుతుందంటున్నారు విశ్లేషకులు. అరబ్‌ చైనా శిఖరాగ్ర సమావేశ సంభాషణ దాని చరిత్రలో అత్యంత కీలకమైనది. 12 అరబ్‌ దేశాలు వేర్వేరుగా చైనాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు చేసు కున్నాయి. 20 అరబ్‌ దేశాలు చైనాతో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సహకారంపై సంతకాలు చేసాయి. 17 అరబ్‌ దేశాలు గ్లోబల్‌ డెవలపింగ్‌ ఇన్సియేటిy ్‌(జిడిఐ)కు మద్దతిస్తున్నాయి. 15 అరబ్‌ దేశాలు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు(ఏఐఐబి)కు మద్దతివ్వగా, 14 దేశాలు చైనా లిగ్యూ ఆఫ్‌ అరబ్‌ స్టేట్స్‌ కోపరేషన్‌ ఇన్సియేటివ్‌ ఆన్‌ డాటా సెక్యూరిటీలో పాల్గొన నున్నాయి. 2021లో జిసిసి ఇరువైపుల వాణిజ్యం 230 బిలియన్‌ డాలర్లకు చేరగా, జిసిసి నుండి చైనా 200 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ దిగుమతి చేసుకుంది. హైటెక్‌ రంగాలైన 5-జి, న్యూఎనర్జీ, స్పేస్‌, డిజిటల్‌ ఎకానమీలపై సహ కరించుకోవాలని నిర్ణయించాయి. చైనా-అరబ్‌ క్లీన్‌ ఎనర్జీ సెంటర్‌, చైనా అరబ్‌ గ్లోబల్‌ నావిగేషన్‌ సిస్టమ్‌, చైనా-ఈజిప్ట్‌ రిన్యూబుల్‌ ఎనర్జీ లాబోరేటరీ, చైనా అరబ్‌ శాటిలైట్‌ సాంకేతిక కేంద్రం ట్యూనిషియాలో నెలకొల్పుతున్నారు. సౌదీ చైనా హువాయితో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ హైటెక్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌కై ఎంవోయు చేసుకున్నాయి. ఈఏడు జరిగే చైనా బిఆర్‌ఐ ప్రపంచ వేదిక నిర్వహణలో అరబ్‌ దేశాలు సహకరించాలని నిర్ణయం. అరబ్‌ సమస్యలపై చైనా విధానం విజయవంతమైందని ఈజిప్ట్‌ ప్రభుత్వ పత్రిక పేర్కొంది. ఆఫ్రికా ఖండంలో నాలుగు దశబ్దాలుగా చైనా అనేక బహుళ ప్రజోపయోగ ప్రాజెక్టులతో చెరగని ముద్రవేసింది. చైనా లాటిన్‌ అమెరికాలో అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఉన్న వామక్ష ప్రభుత్వాలకు దన్నుగా బ్రెజిల్‌లో లూలా విజయం గొప్ప ప్రేరణ. ఇలా ప్రాంతీయ అంతర్గత అంతర్జాతీయ భూభౌగోళిక రాజకీయ మార్పులు శరవేగంతో జరుగుతున్నాయి. ఇవన్నీ అమెరికా ప్రపంచ క్రమానికి కాలం మూడుతుందనే హెచ్చరిక కాదా?
- నైనాల గోవర్ధన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.