Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

హిందూత్వ ఆధునీకరణ సిద్ధాంతం-ఓ మతతత్వ ప్రేరణ

      ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌తో ''ఆర్గనైజర్‌'', ''పాంచజన్యం'' పత్రికల సంపాదకులు జరిపిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను, హిందూ రాజ్యస్థాపన కోసం ఆరెస్సెస్‌ స్థాపకులు హెడ్గే వార్‌, గోల్వాల్కర్‌ల రచనల 2023 ఆధునీకరణలుగా భావించాలి. ''హిందుస్థాన్‌ ఒక హిందూ రాజ్యం. ఈ అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన హిందూ సమాజం, హిందూరాజ్యం, భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరుకొని, ప్రపంచానికి నాయకత్వాన్ని అందిస్తుందని'' భగవత్‌ అన్నాడు. భారతదేశం, బ్రిటిష్‌ వలస దేశంగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌ తన ప్రణాళికను చాలా స్పష్టంగా వివరించింది. నేడు స్వాతంత్య్ర భారత దేశం స్వంత రాజ్యాంగాన్ని కలిగి ఉంది. ఆరెస్సెస్‌ అధినేత అసాధారణమైన వ్యాఖ్యలు, ఆరెస్సెస్‌ ఎన్నటికీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించదనే విషయాన్ని రుజువు చేస్తాయి. నేడు ఆరెస్సెస్‌ ''వనరులు'', ''సమృద్ధి'', ''సాధనాల''ను కలిగి ఉంది. ఆ వనరులు ఏమిటి, ఎలా సమృద్ధిగా ఉంది, ఆ సాధనాలు ఎక్కడి నుండి వస్తున్నాయని అడగడం చట్టబద్దమవుతుంది.
గోల్వాల్కర్‌ విస్తరించిన ''అంతర్గత శత్రువు''
ఈ ఇంటర్వ్యూ ''హిందూ సమాజానికి'' సంబంధించిన చర్చ కోసం ఉద్దేశించినది. కానీ ఆరెస్సెస్‌ చీఫ్‌ ప్రకటించిన 'హిందూ సమాజం' అనే భావనకు భారతరాజ్యాంగంలో చోటు లేదు. ఆయన చెప్పేదాని ప్రకారం ''హిందూ సమాజం 1000 సంవత్సరాలకు పైగా యుద్ధంలో ఉంటుంది కాబట్టి, యుద్ధంలో ఉండేవారు దూకుడుతనంతో ఉండడం సహజం.'' అందువల్ల స్థానిక భూస్వామ్య ఆధిపత్యవర్గాల సహాయంతో, దురాక్రమణ దారులకు, విజేతలకు మధ్య జరిగిన యుద్ధాలను, హిందూ,ముస్లింలకు మధ్య జరిగిన మత యుద్ధాలుగా మార్చారు. చారిత్రక అన్యాయాల పేరుతో నేటి ''హిందువుల దూకుడుతనాన్ని'' న్యాయమైందిగా చెపుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ''ఇది బయటి శత్రువు కాదు కానీ, అంతర్గత శత్రువు. కాబట్టి హిందూ సమాజాన్ని, హిందూధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించుకోడానికి యుద్ధం ఉంటుంది.'' ''భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు వారి విశ్వాసాలను అంటిపెట్టుకొని ఉండాలనుకుంటే, వారి పూర్వీకుల విశ్వాసాలను తిరిగి ఆచరించాలనుకుంటే, వారికెలాంటి ప్రమాదం ఉండదు, వారు భయపడాల్సిన పని లేదు. కానీ అదే సమయంలో ముస్లింలు తమ ఆధిపత్య ప్రసంగ గర్జనలను వదిలిపెట్టాలి. ముస్లింలు భారతదేశాన్ని తిరిగి పాలించబోతున్న ''ఉన్నత జాతి'' అనే కథనాన్ని ముస్లింలు వదిలెయ్యాలి. వాస్తవానికి ఇక్కడ నివసించే వారంతా, వారు హిందువులైనా, కమ్యూనిస్టులైనా ఈ తర్కాన్ని వదిలిపెట్టాలని'' ఆయన అన్నాడు.ఆరెస్సెస్‌ తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టుల వలె రాజీపడని వారిపై దాడి చెయ్యడం, వారిని బెదిరించడం, భయపెట్టడమే ఆరెస్సెస్‌ తర్కం. ''హిందూ జాతికి పూర్తిగా లోబడి ముస్లింలు భారతదేశంలో నివసించవచ్చని'' గోల్వాల్కర్‌ అన్నాడు. భగవత్‌ ప్రకటనలు, చట్టం నుండి తప్పించుకోడానికి సవరించినప్పటికీ ఆరెస్సెస్‌ పరిశీలనలో ముస్లింలను లొంగదీసుకోవడం, సంఫ్‌ు పరివార్‌ నేర పూరిత దాడులను చూసీచూడనట్లుండటం, అంతర్గత శత్రువుకు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ యుద్ధంలో గోల్వాల్కర్‌ ముస్లింలు, కమ్యూనిస్టులు, క్రైస్తవులు శత్రువులనే నిర్వచనం అంతటితో ఆగకుండా ఆరెస్సెస్‌ కథనాలకు అనుగుణంగా లేని హిందువులను కూడా శత్రు జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ నివసించే భారతీయ పౌరులు ప్రశాంతంగా జీవించాలంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా కాక ఆరెస్సెస్‌కు అనుగుణంగా ఉండాలి.
ఆరెస్సెస్‌ ప్రేరేపణలు, ఇస్లామిక్‌ వాదుల సమూహం వారి మత ఛాందస భావాలను, ఆచారాలను వ్యాప్తి చేయడానికి అవకాశం ఇవ్వడం వల్ల ఆరెస్సెస్‌ మత విభజన వ్యూహాలు మరింతగా బల పడ్డాయని సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. ఒక మతతత్వం ఇతర మతతత్వాన్ని బలోపేతం చేస్తుందని సీపీఐ(ఎం) పదేపదే చెప్పే విషయాన్ని ఈ ఇంటర్వ్యూ రుజువు చేస్తుంది.
కుల హింసను పట్టించుకోని ఆరెస్సెస్‌
భగవత్‌ ''హిందూ సమాజపు'' స్వయం నియామక ప్రతినిధిగా ''సమాజం'' తరపున అనాగరికమైన వాదనలు చేస్తూ మాట్లాడతాడు. మతానికి ఎలాంటి సంబంధంలేని హిందూత్వ రాజకీయభావనా కవచాన్ని ప్రకటించడం ఒకటైతే, ఈ దేశంలో అత్యధికంగా ఉన్న ప్రజలంతా హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనేది రెండవది. కానీ మతపరంగా హిందువులైన ప్రజలు ఆరెస్సెస్‌ ఆలోచనలను సమ్మతిం చడం లేదు. ఆరెస్సెస్‌ నాయకునికి దళి తులకు వ్యతిరేకంగా పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యలు అసలు ఒక సమస్యగా కనిపించవు. ''శ్రీరాముడే అన్ని జాతులను, వర్గాలను కలిపి ఉంచు తాడు'' అనేదే కులానికి సంబంధించిన ఏకైక ప్రస్తావన. హిందూత్వ గుర్తింపు నిర్మాణంలో జైశ్రీరామ్‌ నినాదాల్లో, జైశ్రీరామ్‌ ఒక రాజకీయ సాధనంగా మారుతుంటే, దళితులు కుల హిందువుల చేతుల్లో వివక్షతను, హింసను, లైంగిక దాడులను ఎదుర్కొంటున్న వాస్తవాల ప్రస్తావనలను ఎక్కడా ఉదహరించలేదు.
ఆరెస్సెస్‌ అధినేత మాటల్లో లేని
''పేదరికం'' అనే పదం
భగవత్‌ ''శక్తివంతమైన, సంపన్న హిందూ సమాజం'' గురించి మాట్లాడతాడు. అధిక పోషకాహార లోపం, ఆకలితో అధిక జనాభా గల దేశాలలో భారతదేశం గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో అవమానకరమైన స్థానంలో ఉంది. అలాంటి జనాభాలో హిందువులే అధికులు. ఆయన ''సంపన్నం'' గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. భారతదేశాన్ని ధ్వంసం చేస్తున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల గురించి సంఫ్‌ు అధినేత ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆరెస్సెస్‌కు కార్మికులు, రైతులు అనే వర్గాలు లేవు. వారి దృష్టిలో అంతా హిందూ సమాజంగా పిలువబడే దానిలోనే దాగి ఉంటారు. కాబట్టి, ఆదానీ రోజుకు సగటున 1216కోట్ల రూపాయలు, గ్రామీణ మహిళ రోజుకు కేవలం 250రూపాయలు సంపాదిస్తే, ఆరెస్సెస్‌ వారిరువుర్నీ అదే హిందూ సమాజమనే ఒకే వర్గంలో ఉన్నట్లు భావిస్తుంది. ఆరెస్సెస్‌ సృష్టించాలనుకునే ముఖ్యమైన హిందూత్వ గుర్తింపులో భాగంగా ధనికులను, పేదలను గుర్తించడానికి నిరాకరించడం ద్వారా ఆరెస్సెస్‌ అధినేత భారీ అసమానతలను సమర్థిస్తున్నాడు. జనాభాలో అధిక సంఖ్యాక ప్రజల తక్కువ కొనుగోలు శక్తిని ప్రతిబింబించే అధికారిక సంఖ్యలు ఉన్నప్పటికీ, అధిక సంఖ్యాక భారతీయులు అధిక ధరలతో బాధపడుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది ''వినియోగతత్వం'' విధి అనీ, ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తున్నందువల్లే ధరలు పెరిగిపోతున్నాయని సంఫ్‌ు నాయకుడు అభిప్రాయ పడుతున్నాడు. భారతదేశం ప్రస్తుతం మాంద్యం అంచున ఉంది. ఆఖరికి పెట్టుబడిదారీ అనుకూల ఆర్థికవేత్తలు కూడా డిమాండ్‌ను పెంచే విధానాల కోసం ముందుకు పోతున్నారు కానీ, ధరల పెరుగుదలకు ప్రజలే కారణమని ఆరెస్సెస్‌ నేత ప్రజల్ని నిందిస్తున్నాడు.
అదనపు రాజ్యాంగబద్ధమైన అధికారం
ఇంటర్వ్యూలో భగవత్‌ ఆరెస్సెస్‌, దాని స్వయం సేవకులు, రాజకీయాలు, ప్రభుత్వం మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడినప్పుడు మరో అంశం బహిర్గతమైంది. ఆరెస్సెస్‌ ఒక ''సాంస్కృతిక'' సంస్థ అనీ, దానికి రోజువారీ రాజకీయాల్లో ఆసక్తి లేదనీ, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఇష్టం లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాల్లో బలవంతంగా జోక్యం చేసుకుంటుందని అంగీకరిస్తూ ఆయన కట్టుకథను పునశ్చరణ చేశాడు. ''ఇంతకు ముందున్న తేడా ఏమంటే, మా స్వయం సేవకులు అధికార స్థానాల్లో లేరనీ, రాజకీయాల్లో స్వయం సేవకులు ఏమి చేసినా వాటికి మేము బాధ్యత వహిస్తాం. స్వయం సేవకులకు శిక్షణ ఇచ్చిన సంఫ్‌ుకే అంతిమంగా ''కొంత బాధ్యత'' ఉంటుంది. అందువల్ల మా సంబంధం ఏమిటి, ఏ అంశాలను జాగ్రత్తగా కొనసాగించాలి అనే విషయాలను గురించి ఆలోచించాల్సి వస్తుందని'' ఆయన అంటాడు. ఇప్పుడు ''తేడా'' ఏమంటే, ప్రధానమంత్రి గతంలో ప్రచారక్‌గా పని చేశాడు. యూనియన్‌ మంత్రిమండలిలో 71శాతం మంది మంత్రులకు ఆరెస్సెస్‌తో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా చాలా మంది మంత్రులకు ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థలు, సంఘాలతో సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని స్వయం సేవకులపై తన పర్యవేక్షణ ఉంటుందని ఆరెస్సెస్‌ ప్రకటించింది. ఆ ''కొంత బాధ్యత'' అంటే అర్థమేమిటి?''ఇక్కడ అసలు విషయం అంటే రాజకీయ పరిణామాలు మాత్రమే. ఒకవేళ ప్రజలు ఏదో ఒకటి ఆశిస్తూ, వారు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ, వాటిని మాకు తెలియజేస్తే, అప్పుడు సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు, ఒకవేళ వారు స్వయం సేవకులైతే, అంతా మేమే చేసేస్తాం.''
''మేం చేసే'' దానిలోని చికుల్ని చూడండి. సంఫ్‌ులో శిక్షణ పొందిన మూడింట రెండొంతుల మంది మంత్రివర్గ సభ్యుల పర్యవేక్షణ (''కొంత బాధ్యత''), విధానాలలో జోక్యం (శ్రద్ధతో కొన్ని విషయాలు), స్వయం సేవకులైన మంత్రులకు ఆరెస్సెస్‌ సిఫార్సులు (సంబంధిత వ్యక్తుల దృష్టికి తీసుకొని రావడం). అదనపు రాజ్యాంగ బద్ధమైన అధికారం అంటే ఇదే. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరెస్సెస్‌ చెలాయిస్తున్న అధికారం రహస్యమేమీ కాదు. దీనిని ఇప్పుడు ఆరెస్సెస్‌ అధినేతే స్వయంగా చెప్పాడు. ఆరెస్సెస్‌ విధానాన్ని కొనసాగిం చడమెలా, దానికి సంబంధించిన అవగా హనను ఎలా మార్చాలన్నదే ఆరెస్సెస్‌ అదనపు రాజ్యాంగబద్ధమైన అధికారం, దాని ఏకపక్ష విభజన భావజాలం యొక్క లక్ష్యం.''మేము మీడియాను కలుసుకునే సంద ర్భాల సంఖ్యను పెంచాం, ప్రజలకు సేవలందించే కార్యక్ర మాలను ప్రారంభించాం. కోరుకునే ఫలితాల సాధన కోసం మేం సరియైన వ్యూహంతో, సరియైన సమయంలో స్పందిం చాల్సి ఉంటుందనీ,రానున్న రోజుల్లో ఆరెస్సెస్‌ పై పొగడ్తల జల్లు కురిపిస్తూ, దానిపై ఉన్న ద్వేషాన్ని తగ్గించే కథలను గూర్చి వింటామని'' భగవత్‌ చెప్పాడు.
మహిళలను పట్టించుకోని ఆరెస్సెస్‌
హక్కుల ఆధారిత ప్రజాస్వామిక చట్రాన్ని గుర్తించ నిరాకరించడం కూడా మహిళల గురించి చేసిన వ్యాఖ్యల్లో ప్రతిబిం బిస్తుంది. ఆరెస్సెస్‌ వారి దృష్టిలో మహిళ అంటే కుటుంబంలో ఒక భాగం.''మహిళా విముక్తి, మహిళా సాధికారత గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య మహిళలు, స్త్రీ పురుషులు పరస్పరం ఆధా రితంగా ఉండే కుటుంబ జీవనానికి తిరిగి వస్తున్నారని'' భగవత్‌ అంటున్నాడు. ఆరెస్సెస్‌ ఉద్దేశ్యంలో, ఒక స్వతంత్ర మనస్తత్వం, సాధికారత, సమాన హక్కులు గల మహిళకు కుటుంబ జీవితంతో పొసగదట. ఎందుకంటే ఆరెస్సెస్‌ భావజాలం ప్రకారం, కుటుంబంలో మహిళలకు మనువాద విధానాల మార్గదర్శకత్వం ఉంటుంది కాబట్టి, ఎదుర్కొనబోయే హింసతో నిమిత్తం లేకుండా మహిళ సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఇది, ఆరెస్సెస్‌ మహిళా విభాగం ''రాష్ట్రీయ సేవికా సమితి'' చేస్తున్న ప్రచారం. కానీ ఈ సమితి విఫలమైన ప్రణాళిక అని స్వయంగా ఆరెస్సెస్‌ నేత అంగీకరించినట్లు, నేడు సమితికి అంత బలం లేదు. శాఖల ద్వారా నేర్చుకునే మహిళల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారిని సేవికా సమితికి పంపకుండా నేరుగా సంఫ్‌ులోకి ఇముడ్చుకోవడం ఎలా అనే విషయాన్ని ఆరెస్సెస్‌ కసరత్తు చెయ్యాలని ఇప్పుడు ఆయన కొత్తగా చెపుతున్నాడు.
మహిళలను నేరుగా సంఫ్‌ులోకి నియమించుకునేందుకు, ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేసే ప్రజ్ఞాఠాకూర్‌ లాంటి హిందూత్వ దళానికి చెందిన మహిళా సభ్యులు ఆరెస్సెస్‌కు ఆదర్శంగా ఉన్నారు. పిల్లలపై జరుగుతున్న లైంగికదాడులతో పాటు మహిళలపై పెరుగుతున్న హింస, అదనపుకట్నం మరణాలపై సంఫ్‌ు నేత మౌనం వహిస్తున్నాడు. ఆరెస్సెస్‌లోకి మహిళల్ని చేర్చేది మహిళల హక్కుల కోసం కాదు, కానీ ఆరెస్సెస్‌లోకి మహిళలను నేరుగా చేర్చుకోవడం ద్వారా ద్వేషపూరిత భావజాలాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో మాత్రమే.
ఒక లౌకిక, ప్రజాస్వామిక భారతదేశం కోసం స్వాతంత్య్రపోరాట విలువలకు కట్టుబడి ఉండే వారికి, ఆరెస్సెస్‌ అధినేత ఇంటర్వ్యూ ఒక హెచ్చరిక. పెట్టుబడి దారీ వ్యవస్థ విధ్వంసాలు రాజ్యాంగం ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకాకుండా చేయడంతో తిరిగి ప్రతిచర్య శక్తులు పెరిగిపోయాయి. ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఈ శక్తులు మోడీ ప్రభుత్వ అండదండలతో రాజ్యాధికారం పై అదుపును సాధించాయి. దీనికి సమాధానం ప్రత్యా మ్నాయ విధానాల్లో, ప్రజా సమీకరణల్లో, హిందూత్వ ఆధునీకరణ ఎజెండాను ఓడించేందుకు, ప్రతిఘటనాశక్తిని నిర్మించడంలో, పెట్టుబడిదారీ లూటీకి వ్యతిరేకంగా ప్రజల హక్కులను రక్షించే చర్యల్లో ఉంటుంది.

- బృందాకరత్‌
  అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.