Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

పేదల బడ్జెటా..పెద్దల బడ్జెటా?

            తెలంగాణలోని విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్‌ కోచ్‌ ప్యాక్టరీతో పాటు ఆదిలాబాద్‌లో అపార సహజ వన రులను కలిగివున్న సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.
             కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌ పేదలను దోచి పెద్దలకు పెట్టేలా ఉన్నది. ఇది అంకెలగారడీ తప్ప అభివృద్ధికి ఉపయోగపడేలా లేదని విశ్లేషకులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. రూ.45లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆద్యంతం తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదన్న వాదన విద్యావంతులు, మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో బడ్డెట్‌ ప్రతులను రోడ్లపై దహనం చేసి ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. దేశానికి అన్నంపెట్టే రైతు సంక్షేమమే ధ్యేయంగా ఇటీవల కేసీఆర్‌ 'అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌..' అనే నినాదాన్ని దేశానికి సందేశంలా పంపారు. ఆ నినాదం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్‌ను చూసిన తరువాత ప్రజలకు అర్థమవుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి చాలా వరకూ కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర నిరాశ కలిగించింది.ఇది తెలంగాణకు ఉద్దేశపూర్వకంగా చేసిన నష్టమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా బడ్జెట్‌ను నిశితంగా పరిశీలించిన వారికి అందులోని డొల్లతనం తెలుస్తుంది.
అన్నిరంగాల్లో కోతలే..
ప్రధానంగా దేశంలో సుమారు 60కోట్ల మందికి పైగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం అని హర్షం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ పథకానికి జాతీయ హోదాను కానీ, అందుకు సంబంధించిన చర్చ కానీ బడ్జెట్‌లో లేకుండా చేశారు. పాలమూరు ఎత్తిపోతలపై కూడా మాటలేకుండా పోయింది.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎరువులు, ఆహారం, పెట్రో ఉత్కత్తులపై భారీగా సబ్సిడీ కోత విధించి రాబోవు కాలంలో మరింత కష్టాలున్నాయని చెప్పకనే చెప్పారు. ప్రధానంగా ఎరువుల సబ్సిడీని రూ.2,25,220కోట్ల నుండి రూ.1,75,100 కోట్లకు కుదించారు. ఆహార రంగం విషయంలోనూ రూ.2,87,194కోట్ల సబ్సిడీని ఏకంగా 1,97,350 కోట్లకు, పెట్రో ఉత్పత్తులైన గ్యాస్‌, తదితర అంశాలపై రూ.9,171కోట్ల సబ్సిడీని రూ.2,257కోట్లకు కోత విధించారు. ఈ లెక్కన మొత్తం ఈ మూడు రంగాల్లోనే భారీగా 28శాతం సబ్సిడీలకు మంగళం పాడారు. తెలంగాణలో దాదాపు సగటున 55లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తున్నారు. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో పత్తి రైతులకు కష్టకాలంలో మద్దతుగా నిలవాల్సిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)కి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించింది శూన్యమనే చెప్పాలి. ఇక్కడ దేశీయంగా ఉత్పత్తి అవుతున్న పత్తిని కాదనీ, విదేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకోవాలన్న తపన కనిపిస్తోందన్న చర్చ కూడా ఉంది. మద్దతు ధరను కూడా గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా సున్నా చేశారు. క్రమక్రమంగా ఎంఎస్‌పీని కుదిస్తూ వచ్చారు. 2020-21 బడ్జెట్‌లో రూ. 2,288కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం, 2022-23లో రూ.15కోట్లకు కుదించి తాజా బడ్జెట్‌లో ఏకంగా జీరో చేసింది.అంటే భవిష్య త్తులో మద్దతు ధరల విషయంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సాయం ఏమీ ఉండదనే సంకేతాన్ని పంపింది. తెలంగాణలోని విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట్‌ కోచ్‌ ప్యాక్టరీతో పాటు ఆదిలాబాద్‌లో అపార సహజ వన రులను కలిగివున్న సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.

- వనం నాగయ్య, 9441877695

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.