Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

'జ్ఞానాన్ని' మతరహిత స్థాయికి తేవాలి!

           మానవ వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి. ప్రాపంచిక దృక్పథంతో, విశాలభావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం అందించిన ''జ్ఞానాన్ని'' స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు.
            మతం చుట్టూ తిరిగేదే 'జ్ఞానం' అనే ఆలోచన సమాజంలో బాగా నాటుకు పోయింది. ఏ దేశమైనా, ఏ మతమైనా ఇదే భావనని జనంలో స్థిరపరిచాయి. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ జ్ఞానానికీ మతానికీ దూరం పెరుగుతూ వచ్చింది. జ్ఞానం - ఏమతం చుట్టూ ప్రదక్షిణలు చేయదని సర్వ స్వతంత్రంగా ఎదుగుతుందని, తనను నమ్ముకున్న జనం ఎదుగుదలకు తప్పక తోడ్పడుతుందని తేలింది. మనిషి, మనిషిగా మారడానికి - మారి, నిలబ డడానికీ, నిలబడి ఎదగడానికీ జ్ఞానం... అంటే విజ్ఞానం - నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అతణ్ణి ఈర్షా ద్వేషాల నుంచి, అసూయ ప్రతీకారాల నుంచి, మూఢ నమ్మకాల నుంచి బయట పడేసి, నైతిక జీవిగా కొనసాగడానికి దోహదం చేస్తుంది.
మానవ వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి. ప్రాపంచిక దృక్పథంతో, విశాలభావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం అందించిన ''జ్ఞానాన్ని'' స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు. విజ్ఞాన శాస్త్రాన్ని తన సృజనాత్మకతతో సాంకేతిక శాస్త్రంగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యం కేవలం మనిషికే ఉంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగించు కోవాలి. మనిషిలోని స్వార్థం వెర్రితలలు వేస్తే సాంకేతిక పరిజ్ఞానం మానవ వినాశనానికి దారితీస్తుంది. ఆ విషయం కూడా గుర్తుంచుకోవడం మంచిది. 'విజ్ఞానాన్ని, మర రహిత స్థాయికి ఎందుకు తీసుకుపోవాలి? మతం ఉంటే నష్టమేమిటి?' అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు మనం ఈ విధంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అబద్దాలతో నిజాలు జత కట్టవు. వాస్తవాలు ఊహల్లో తేలిపోవు. ఊహాల్లో తేలిపోతే తేలిపోవచ్చు... కానీ, అవి అప్పుడు వాస్తవాలుగా మిగలవు.
మత గ్రంథాలలో ఉన్న స్వర్గ నరకాలకు అడ్రస్‌లు లేవు. భూమి అడుగున ఉన్న పాతాళ లోకానికి వెళ్ళే సొరంగ మార్గం ఎవరికీ తెలియదు. లోకాలన్నింటినీ మోసే ఆదిశేషు పరిమాణం ఎంతో తెలియదు. దానిమీద పవళించే విష్ణుమూర్తి అతాపతా తెలియదు. శిలువెక్కిన ప్రభువు మొబైల్‌ నెంబరేమిటో తెలియదు. పరలోకం ఏ గుగూల్‌ మ్యాప్‌లోనూ దొరకదు. ఆకారమే లేని అల్లాయ కనీసం తన ఇమెయిల్‌ ఐడీ అయినా... ఎవరికైనా ఇచ్చాడా? ఇవ్వలేదే. శతాబ్దాలుగా భక్తులెవరూ తమ దేవీ దేవతల మొబైల్‌ నెంబర్లు సంపాదించలేకపోయారు. గ్రహాలన్నీ దేవతలకు నివాసాలని అంటారు కదా? మరి, రాకెట్లలో గ్రహాంతరయానం చేసే మన 'మానవ మాత్రులకు' వారు ఎక్కడా కనపడరెందుకూ? అయినా, గతంలో విశ్వసించినట్టు గ్రహాలు దేవతల నిలయాలని ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు. ఇక్కడ భూమి మీద సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్లనే కొద్దిమంది పరిపాలకులు కోట్ల మంది జనాన్ని అదుపులో పెట్టగలుగుతున్నారు. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం దేవీ దేవతల మీద పనిచేయడం లేదు. ఎందుకంటారా? వారు నిజంగా ఉంటే పని చేసేది లేని వాళ్ళమీద ఎలా పనిచేస్తుందీ చెప్పండి?
అయితే, అందుకు కారణం కూడా ఉంది. భ్రమ భ్రమలతో కలుస్తుంది. వాస్తవాలు వాస్తవాలతో మాత్రమే అతుకుతాయి. నిన్న రాత్రి నిద్రలో కన్న కలలు ఇవ్వాళ రాత్రికూడా కను - ప్రమాదం లేదు. కానీ, పొద్దున వాస్తవంలో మోటారు సైకిల్‌పై వెళుతూ రాత్రి కన్న కలలు కంటానంటే ఏక్సిడెంట్‌ అవుతుంది. నువ్వు బతికి ఉంటావో లేదో కూడా తెలియదు. ఒక వాస్తవాన్ని భ్రమలతో కలుపుతానంటే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి. వాస్తవాల ఆధారంగా బతికే వాడికే తనకు జ్ఞానం ఉందన్న స్పృహ ఉన్నవాడికే విజ్ఞానం అందుబాటులో కొస్తుంది. మతాల మాయలో పడితే తెలివి తేటలు కాదు గదా మూర్ఖత్వం అబ్బుతుంది! అప్పుడు అందుకు తగిన వేషం ఒకటి వేసుకుని ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు. సిగ్గూ ఎగ్గూ, నైతికత అన్ని వదిలేసినవాడు ఇక ఏం చేస్తాడూ? తోటి మనుషుల్ని మోసం చేస్తాడు. అన్ని మతాల గురువులు, ప్రభోదకులు, ముల్లాలు, పాస్టర్‌లు, పురోహితులు, ప్రవచన కారులు చేస్తున్న పని ఇదే!
పాకే జంతువు నుండి పక్షిరావడం, వానరం నుంచి మనిషి రావడం అనేది వీరు తెలుసుకోరు. తెలుసుకున్నా అర్థం చేసుకోరు. ఆత్మజన్మ, పునర్జన్మల గూర్చిన పరిజ్ఞానమే 'జ్ఞానం' అని అనుకుంటూ ఉంటారు. మనిషి గుండెలో అంగుష్ట దేహం ఉంటుందనీ, మరణించినప్పుడు అది బ్రహ్మ రంధ్రం గుండా బయటికి పోతుందని నమ్మే వీరు, మనిషి కర్మానుసారం అతని చావు పట్టుకలుంటాయని విశ్వసిస్తారు. అంతే కాదు, గత జన్మలో వారు చేసిన మంచీ చెడుల పర్యవసానంగానే వారి తల్లీదండ్రుల నిర్ధారణ జరుగుతుందని విశ్వసిస్తారు. ఆధునిక జన్యుశాస్త్రం చెప్పే వంశ పారంపర్య లక్షణాలు వీరికి విచిత్రంగా తోస్తాయి. ఒకరకంగా అలాంటి విషయాలు నమ్మాలంటేనే వీరికి ఇబ్బందిగా ఉంటుంది. విస్కీ తాగడం అలవాటయిన వాడికి కొబ్బరినీళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెపితే వింటాడా? ఇలాంటి వారి వితండ వాదనలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి.
గతంలో బ్రాహ్మణార్యులు జనాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు వర్గాలుగా విభజించారు. మానవ జాతి అంతా ఒకటే అయినప్పుడు ఈ విభజనలు ఎందుకూ? అని మనమంటాం. అందుకు ''మనుషుల్లో రక్తం గ్రూపులు నాలుగులేవా? అవి ఒక దానితో ఒకటి కలుస్తాయా?'' అని ఎదురు ప్రశ్న వేస్తారు. నిజమే! ఆ అతి తెలివి ప్రశ్నకు సంతోషించాలో లేక ఏడవాలో అర్థం కాదు. ఇది ఒక తప్పు ప్రశ్న. ఎందుకంటే, రక్తం నాలుగు గ్రూపులు మనువాదులు విభజించిన ఆ నాలుగు వర్ణాల వారిలో కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితిలో శూద్రుడి రక్తం బ్రాహ్మణుడికి ఇవ్వొచ్చు. క్షత్రియుడి రక్తం వైశ్యుడికీ ఇవ్వొచ్చు. ఎవరి రక్తం ఎవరికైనా ఇవ్వొచ్చు. కేవలం ఆ రక్తం గ్రూపు కలవాలి అంతే! అంటే ఏమిటీ? మనుషుల రక్తమంతా ఒక్కటే అని కదా? కుల మతాలకు, లింగ భేదాలకు అతీతంగా రక్తం ఒకరిది ఒకరికి ఇవ్వడం జరుగుతున్నప్పుడు మనుషుల్లో భేదం ఎక్కడుందీ? రక్తమార్పిడి ఖండాంతరంగా జరపొచ్చు. ఖండాంతర వివాహాలు చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా జనులందరినీ విశ్వజనులుగానే పరిగణించాలి.
ఇటీవల వంద, రెండు వందల సంవత్సరాల చరిత్ర చూసుకుని మాది గొప్ప వంశం, మా కులం గొప్పది, మా మతం గొప్పది అని విర్రవీగడం హాస్యాస్పదమైన విషయం. ఇంకా వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎక్కడ ఉండేవారో, ఎలా ఉండేవారో, ఎటు నుండి ఎటు వలస వెళ్ళారో, వారి మత విశ్వాసాలేవో, ఎవరు ఎవరిని పెండ్లి చేసుకున్నారో ఎవరికి తెలుసు? అందువల్ల ఏదో రెండు, మూడు తరాల వంశ చరిత్ర చూసుకుని విర్రవీగడం మూర్ఖత్వం అవుతుంది. ఇంకా కొంచెం వెనక్కి వెళితే, అందరమూ ఆ మహా మిశ్రమ మానవ జాతి నుంచి వచ్చిన వాళ్ళమేనని తెలుసుకుంటాం! మానవ వాదులుగా మారడానికి తెలుసుకోవల్సిన మొదటి అంశం - జ్ఞాన గుళిక ఇదే! ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటు న్నామంటే, తాము విశ్వ జనులమని భావించుకునే కొందరైనా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారే మోనని..! మనుషులు ఇలా విభజింపబడి ఉండాల్సిందేనని గట్టిగా విశ్వసించే వారిని, అంధ విశ్వాసాల్లోనే వెలుగులున్నాయని భ్రమించే వారిని మనం ఉన్నఫళంగా ఏమీ చేయలేం. ఆలోచించుకోవడానికి వారికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది.
శుభ్రత కావాలనుకునే వారికి శుభ్రతను ఇవ్వగలం. బురదలో దొర్లే వారిని ఏం చేయగలం? ఆ కంపు ఆ బురద సౌఖ్యంగా ఉందనుకునే వారికి ఏమని చెప్పగలం? మార్పు అంతర్గతంగా వారిలోంచే రావాలి. వారు తమ వివేకాన్ని కొద్ది కొద్దిగా ఉపయోగిస్తూ ఉంటే, తప్పకుండా మార్పు వస్తుంది. దీనివల్ల ఈ సమాజం ఈ ఇరవ ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందో ముందు గ్రహించుకోవాలి. దేవుడు, దయ్యం, ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత, ధాన్యాల వల్ల రాలేదు. కేవలం వైజ్ఞానిక స్పృకీëతోనే, వైజ్ఞానిక పరిశోధనలతోనే వచ్చింది. ఇవే మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయి. మనిషి తను కష్టపడే తత్వాన్ని, నిజాయితీని, నైతికతను వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి. వదిలేయకుండా ఉండగలగడమే జ్ఞానం!
పొరపాటున జనం పెత్తందారీ వ్యవస్థకు లొంగిపోతే గనక, తీరని నష్టాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇక్కడ మరొక పెద్ద ప్రమాదం పొంచివుంది. పెత్తందారీ సంస్కృతి గనక సాంకేతిక శాస్త్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే, అది మానవ స్వేచ్ఛనే హరిస్తుంది. అంతే కాదు, మానవ జాతిని తుదముట్టించే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అంతగా విషమిస్తే వటిని అదుపులోకి తేవడానికి అసలు మనిషే ఉండడు కదా? విజ్ఞాన శాస్త్రం రెండంచుల కత్తి లాంటిది. ఎటు వాడుతున్నాం? ఎంత వాడుతున్నాం? ఎలా వాడుతున్నాం? వంటి తెలియాలి. విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం. దీని మీద మత ఆధిపత్యం ఉండకూడదు. ఎందుకంటే, గతంలో ముక్కు మూసుకుని చేసిన తపస్సుల వల్ల ఎవరూ ఏమీ సాధించలేదు.
ఇక ముందు కూడా సాధించలేరు. సాధించారని చెప్పుకునే మహిమలు కేవలం అసత్యాలు మాత్రమే! ఆ పద్ధతులు మానేసి మనిషి తనలోని స్వార్థాన్ని, కుత్సిత బుద్ధిని తగ్గించుకుంటే సత్వరం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ది గల యువతీ యువకులు హేతు వాదులైతే, నిరీశ్వర వాదులైతే, సైన్సు కార్యకర్తలయితే... వారు రాజకీయంగా ఎదిగి అధికారం చేపట్ట గలిగితే ఈ ప్రపంచం రూపురేఖలు మారతాయి. అప్పుడే మానవత్వం వెల్లి విరిస్తుంది. మతాల పరిధిలో 'జ్ఞానాన్ని' గిరికీలు కొట్టి స్తున్న కుట్రను బద్దలు కొట్టి పైకి ఎదిగితేనే... ఎవరికైనా ''జ్ఞానం - అంటే ఏమిటీ?'' అనే జ్ఞానోదయం అవుతుంది.
- డాక్టర్‌ దేవరాజు మహారాజు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.