Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీ స్మరణే ఓ ప్రేరణ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

నీ స్మరణే ఓ ప్రేరణ

'హయత్‌ లేకె చలో కాయనాత్‌ లేకే చలో
చలో తో సారే జమానేకో సాథ్‌లేకె చలో...'
బతుకు వెంటబెట్టుకు నడుద్దాం, లోకాన్ని వెంట బెట్టుకు నడుద్దాం! మనం నడిస్తే కాలాన్ని వెంటబెట్టుకు నడుద్దాం!
ముందుకు... ముందుకు నడవాలి... లోకాన్ని, కాలాన్ని, కలాన్ని ఎగురే ఎర్రని పతాకాన్ని వెంట బెట్టుకుని గీతంలా ప్రవహించిన మహౌన్నతుడు మఖ్ధూం మొయినుద్దీన్‌. ఆయనను స్మరించుకుని గుండెనిండా చైతన్యాన్ని నింపుకుని మనమూ నడవాల్సిన అవసరముంది. అతనొక వ్యక్తికాదు. నిరంతరం జ్వలించే విప్లవశక్తి. అతను సాయుధ పోరాట యోధుడు. కార్మిక నాయకుడు. కమ్యూనిస్టు నాయకుడు. ప్రజాప్రతినిధి. కవి, కథారచయిత, వ్యాసకర్త, నాటక రచయిత, సాహిత్య విమర్శకుడు. గజల్‌ కవి, శ్రామికుడు, ప్రేమికుడు. హైదరాబాదు నగర చరిత్ర శిల్పం మెడలో అరుణారుణమై మెరుస్తున్న మోదుగుపూల హారం మఖ్ధూం. ఆయనను తలచుకుంటే ఉత్తేజం ఉప్పొంగుతుంది. నేటి మతోన్మాద తిరోమన తిమిర పథగమనంపై నిప్పులు చెరుగుతుంది. అందుకే ఆయన స్మరణలోంచి కొత్త ఖడ్గాన్ని ఎత్తిపట్టుకోవాలి.
ప్రపంచాన ఇటలీలో ముసోలినీ, జర్మనీలో హిట్లర్‌లతో ఫాసిస్టు ధోరణులు ప్రబలుతున్న కాలంలో మఖ్ధూం విప్లవ రాజకీయ జీవితం ఆరంభమయింది. ఆనాటి సోవియట్‌ ఎర్ర సైన్యం ఫాసిజాన్ని తరిమికొట్టినప్పటికీ నేడు మరో వికృతరూపంలో ప్రజల మీద దాడి చేస్తున్నది. మన దేశంలో ఫాసిస్టు తరహా ఆలోచనలు ఆచరణా విస్తరిస్తున్న సందర్భాన మఖ్ధూం కార్యాచరణ మనకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. 1936లోనే కమ్యూనిస్టుగా మారిన ఆయన 1939లో విద్యార్థి సంఘాన్ని స్థాపించి ప్రజాపోరాటాలను నిర్మించాడు. 1940లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపనతో నాయకుడిగా అడుగులు వేసాడు. ఆ క్రమంలోనే ఫాసిస్టు శక్తులు, నాజీలు సోవియట్‌ మీద దాడి చేయటంతో ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికై హైదరాబాద్‌లో సభను నిర్వహిం చాడు మఖ్ధూం. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుడుగా పీడితుల పక్షాన నిలబడి ముందుకు నడిచాడు.
1908 ఫిబ్రవరి 4న జన్మించిన మఖ్ధూంది పేద కుటుంబం. ఐదేండ్ల వయస్సులోనే తండ్రి మరణించగా, పినతండ్రి సంరక్షణలో పెరిగాడు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తితో అధ్యయనం కొనసాగించాడు. హైదరాబాద్‌ సిటీ కాలేజీలో రెండేండ్లు అధ్యాపకుడుగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీ పిలుపుతో ఉద్యమంలోకి వచ్చి చేరాడు. జాతీయ స్థాయిలో గొప్ప కవిగా, రచయితగా పేరుగాంచాడు. అయినా ఉద్యమంలో నిబద్దుడుగా పనిచేశాడు. జైళ్లకెల్లాడు. కార్మికోద్యమంలో పని చేశాడు. రాచరిక నిరంకుశత్వాన్ని ఎదిరించి సాయుధుడై పోరాడాడు. కవితా ప్రేమికుడు, ప్రజా ప్రేమికుడు కావుననే విప్లవ ప్రేమికుడై ప్రజా హృదయాలను చూరగొన్నాడు. ప్రజల కోసమే తన జీవితాన్నంతా వెచ్చించాడు. అశేష ప్రజల బాధలను తన కవనంలో, పాటలో ప్రతిధ్వనించి వారి కోసమే విప్లవ పథాన పయనించిన స్ఫూర్తిమయ జీవితం మఖ్ధూంది.
'గుడి మాటున మత మౌఢ్యపు గోపురాలు నిలిచెనే...
తలల్లోన ఆధ్యాత్మిక రాజ్యం నర్తించెనే...
మాయా భ్రమజ్వాలల్లో మనిషి బానిసయ్యెనే
పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా!
మస్తిష్కంలోన జనం మత్తు మందు నిండెనే
కార్మిక రక్తపు స్రవంతి కట్టలు తెగి పారెనే..
న్యాయ సుగంధనిలాలు నింపుము ఈలోకంలో
బ్రతుకును నడిపించునట్టి పాటలు చెరజిక్కెనే...
చుక్కలాంటి చెలిగళాన సితబల్లెం నాటెనే...
పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే...
ఈ లోకం నీ కోసం ఎంత పరితపించెనో...
ఈ ధరిత్రి నీరాకకు ఎంత నిరీక్షించెనో...
తోరణాలు తీర్చి జనం దారుల్లో నిలిచిరే...
పద పదవే గీతమా'
అని పాడుకున్న మఖ్ధూం ఆనాటి గీతం నేటి మన స్థితికీ అద్దం పడుతోంది. గీతాలను, గళాలను చెరసాలలో బంధిస్తున్న సమయాన మఖ్ధూం పాటను మళ్ళీ మనం ఎత్తుకోవాల్సిందే. తెలంగాణ నీల వీరులగన్న వేల ధీరుల రక్తంతో పదునెక్కిన నేల. జన విముక్తికోసం కుల మతాల కతీతంగా స్వరమెత్తిన నేల. అందుకే... 'చెక్కు చెదరనీ సంకల్పాలకు వందల సలాములు, అమర వీరులను కన్నతల్లికి సహస్ర సలాములు' అని ఈ నేలకు సలాములు పాడాడు ఆయన. ముంచుకొస్తున్న ముప్పును గమనించకపోతే తీవ్ర నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ''ఇప్పుడు లోకంలో భయంకరమైన సుడిగాలులు రానున్నాయి. ఇక పూలేమిటీ పూదోటే ఎగిరిపోనుంది'' అన్న మఖ్ధూం హెచ్చరిక ఇప్పుడు మనకోసమే చెప్పినట్టు అనిపించడం లేదూ! ఆయన స్మరణలో సమాయత్త మవుదాం రండి!
(నేడు మఖ్ధూం మొయినొద్దీన్‌ జయంతి)

- కె. ఆనందాచారి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.