Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'కోతల' బడ్జెట్‌ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2023

'కోతల' బడ్జెట్‌

         కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ప్రచార ఆర్భాట, ఎన్నికల బడ్జెట్‌ తప్ప మరొకటి కాదు. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి ఈ ఆర్థిక సంవత్స రంలో ప్రభుత్వ మూలధన వ్యయాలను రూ.10లక్షల కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. కానీ మూలధన వ్యయాల జాబితాని పరిశీలిస్తే అవి సంపన్నవర్గాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించినవని అర్థమవుతున్నది. నేడు దేశంలో ప్రజల తలసరి ఆదాయం రూ.1,97,468 అయ్యిందని, ఇదేదో గొప్ప ఘనకార్యంగా ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 84శాతం నేడు అప్పులు ఉండడం గమనార్హం. 2004-14 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో వృద్ధి 13.1శాతం కాగా, 2014-23 మధ్య ఇది 9.1 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తం గా చూసుకున్నప్పుడు మన దేశం 144వ స్థానంలో ఉండటం ఆలోచించాల్సిన అంశం. జీవన ప్రమాణాలలో (హెచ్‌డిఐ) చూస్తే 131వ స్థానంలో(191దేశాలలో), హుంగర్‌ ఇండెక్స్‌లలో 101స్థానం (107దేశాలలో) ఉంది. ఇదంతా ఎవరికీ తెలియదన్నట్టుగా వ్యవహ రించడం సరికాదు.కరోనా, నిరు ద్యోగం కారణంగా ప్రజల ఇబ్బందులు పెరిగినా ప్రభుత్వం ఆహార సబ్సిడీల మొత్తాలను పెంచకపోగా భారీగా తగ్గించింది. ఆహారసబ్సిడీ పథకంలో ఏకంగా రూ.90వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేసే చర్య ఒక్కటంటే ఒక్కటీ కూడా బడ్జెట్‌లో ప్రస్తా వనకు నోచుకోలేదు. నిరు ద్యోగం తీవ్రంగా ప్రబలుతున్న వేళ ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలనైనా కేంద్రం పట్టించుకుంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. ఎరువులపై సబ్సిడీని గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.50 వేల కోట్ల మేర తాజా బడ్జెట్‌లో కేంద్రం తగ్గించింది. ఫలితంగా వ్యవసాయం ఇంకా భారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌, జాతీయ విద్యామిషన్‌, జాతీయ జీవనోపాధి మిషన్‌కు ప్రభుత్వం కేటాయిం పులు పెంచలేదు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి నిధులు లేవు. సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలన్న అంశాన్ని కూడా పట్టించుకోలేదు.ఈపీఎస్‌ పెన్షనర్లకు అసలు కేటాయింపులు చేయలేదు.
         ఫైనాన్షియల్‌ రంగంలో మరిన్ని సంస్కరణలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బ్యాంకింగ్‌ రెగ్యు లేషన్‌ చట్టం, బ్యాంకింగ్‌ కంపెనీల చట్టం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాలకు సవరణలు తెస్తామని చెప్పడం అనేది భవిష్యత్తు లో బ్యాంకింగ్‌ రంగ ప్రవేటీకరణకు మార్గం సుగమం చేయడమే. నగరాలు, పట్టణాల మౌలిక సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించని ప్రభుత్వం మరిన్ని సంస్కరణ తీసుకొచ్చేటువంటి ఉద్దేశంలో ఉంది. ఇకపోతే సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఎప్పటిలాగే బడ్జెట్‌లో మొండిచేయి చూపించారు. కోవిడ్‌ మూలంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయినా, వారికి ఎటువంటి ఊరట బడ్జెట్‌లో లభించలేదు. ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు.కొత్త పన్ను విధానంలో స్లాబ్స్‌ మార్చారు. రూ.7లక్షల ఆదాయం దాకా పన్ను లేదనే ప్రకటన కంటి తుడుపు చర్యే అని బడ్జెట్‌ పత్రాలు లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
సంపన్నులకు రాయితీలు..
         దేశంలోని వంద మంది సంపన్నుల దగ్గర రూ.54.12లక్షల కోట్లు, అందులో ఎగువున ఉన్న పది మంది శతకోటీశ్వరుల దగ్గర రూ.27.52 లక్షల కోట్లు పోగుబడ్డాయి. శతకోటీశ్వరులపై ఒకే ఒక్క మారు మూడు శాతం పన్ను వేస్తే ఐదు సంవత్సరాలపాటు హెల్త్‌ మిషన్‌ను నిరాఘాటంగా నిర్వహించ వచ్చు. రెండు శాతం పన్ను వేస్తే రానున్న మూడు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందించడానికి నిధుల కొరత ఉండదు. 2017-2021 మధ్య గాలివాటంగా, అప్పనంగా లాభాలు సంపాదించిన కంపెనీలపై 20శాతం పన్ను వేస్తే రూ.1.79లక్షల కోట్లు వస్తుంది. దీంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50లక్షల మందికి సంవత్సరానికి సరిపడే వేతనాలు ఇవ్వ వచ్చని అదానీ, అంబానీలపై ఒకటి, రెండు శాతం పన్ను వేసినా దేశంలో చాలా సమస్యలను పరిష్కరించ వచ్చునని రకారకాల మార్గాలను ఆక్సాఫామ్‌ నివేదిక సూచించింది. కానీ ప్రభుత్వం ఆవేమీ పట్టించుకోలేదు. కుబేరులపై అదనపు పన్ను వేయ లేదు. పైగా పైపెచ్చు కార్పొరేట్‌లపై సర్‌ చార్జీను 39శాతం నుండి 27శాతంకు తగ్గించారు.
         ప్రభుత్వ రంగసంస్థలు పుట్టిందే చావడానికన్నట్టు, ప్రస్తుత ప్రభుత్వం వాటి పీకనుములే చర్యలు తీసు కుంటోంది. 2014-19 కాలంలోనే రూ.2లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని చేపట్టారు. క్రితం ఏడాది బడ్జెట్‌లో జాతీయ హైవే అథారిటీ, రైల్వే, చమురు, సహజవాయు సంస్థల ఆస్తులను అమ్మేస్తామని ప్రకటించారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు, ఖనిజ వనరులు, బ్యాంకింగ్‌, మైనింగ్‌, ఆర్థిక సర్వీసుల్లో ప్రభుత్వం నామమాత్రంగా కొనసాగనుంది. ఈ ఏడాది కూడా రూ. 60,000కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రాలకూ కోతలే...
         సామాన్య మధ్య తరగతిపై ధరా భారం కొనసాగుతున్నా, ద్రవ్యోల్బణం నివారణకు ఎలాంటి నివారణా చర్యలు లేవు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగే పరిస్థితి ఉన్నా, దాని నుంచి సామాన్యులకు ఊరట నిచ్చే ఎలాంటి చర్యను బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు. ధరల స్టీరీకరణ నిధి ప్రస్తావనే లేదు. అసంఘటిత రంగ కార్మికుల రక్షణకు, కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు నోటి మాటలు తప్ప కేటాయింపులు లేవు. రాష్ట్రాలకు చేసే కేటాయింపుల్లోనూ కోతలు పెట్టి సమాఖ్య స్ఫూర్తిపై దాడిని కొనసాగించింది.14వ ఆర్థిక కమిషన్‌ రాష్ట్రాలకు 42శాతం నిధులు మంజూరు చేయాలని నిర్దేశిస్తే, 2021-22లో 33.2శాతం నిధులు పంపిణీ చేశారు. ఈ బడ్జెట్‌లో కేవలం 30.4శాతం మాత్రమే రాష్ట్రాల వాటాగా ప్రకటించారు. ఒక పక్క నెలకు రూ.1,60,000కోట్లు జిఎస్‌టి వసూళ్ళు పెరిగాయని ఆర్భాటంగా ప్రకటిస్తూ, రాష్ట్రాలకు మాత్రం చట్టబద్ధంగా రావలసిన నిధులను కేటాయించడం లేదు. విద్యుత్‌ సంస్కరణలను అమలు చేస్తేనే, అదనంగా అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇప్పటికే పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించేశారు
ఏతా, వాతా బడ్జెట్‌ ఆసాంతం డిజిటలైజేషన్‌, గ్రీన్‌ ట్రాన్సిషన్‌, కార్పొరైటైజేషన్‌, ప్రధాన మంత్రి పేరుతో పథకాల ఉచ్చారణ తప్ప వేరేవి లేవు. దేశం ముందున్న నిరుద్యోగం, ఉపాధి లేమి, అదుపులేని ధరా భారం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే దృక్కోణం ప్రభుత్వ విధానాల్లో లోపించింది. కనుక, విస్తృత పోరాటాల ద్వారానే, విశృంఖలంగా ముందుకుపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్లెం వేయాలి.

- పి. సతీష్‌
9441797900

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.