Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

గ్రామీణ 'ఉపాధి' చట్టానికి మంగళం?

ఎన్నో ఏండ్లుగా వామపక్షాల పోరాటాలతో నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. యూపీఏలోని నయా ఉదారవాద లాబీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయిన ప్పటికీ ప్రభుత్వం మనుగడ వామపక్షాల మద్దతు మీద ఆధారపడి ఉంది గనుక వామపక్షాలు గట్టిగా పట్టుపట్టడంతో చట్టాన్ని ప్రవేశపెట్టక తప్పలేదు. ఈ చట్టాన్ని 2006 ఫిబ్రవరి నుంచి 200జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. 2007లో మరో 170 జిల్లాలలో అమలు చేసింది.2008 ఏప్రిల్‌లో పూర్తిగా పట్టణ జనాభా కలిగిన జిల్లాలు తప్పించి దేశంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయడం ప్రారంభమైంది. మొదట్లో ఆ చట్టాన్ని కూలీల కడుపు నింపే ఈ చట్టంపై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. 2023-24 బడ్జెట్‌లో చట్టానికి అత్యంత తక్కువగా రూ.60 వేల కోట్ల నిధులు విదిల్చింది. గడిచిన ఐదేండ్లలో ఇదే అత్యల్పం. దేశం లోని అర్హు లైన వారికి చట్టబద్ధంగా 100 రోజుల పాటు పని కల్పించాలంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం కనీసం రూ.2.72 లక్షల కోట్ల నిధులు అవసర మవుతాయని పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ ఎంప్లారుమెంట్‌ గ్యారంటీ (పీఏఈజీ) చెబుతున్నది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలే దాదాపుగా రూ.25 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇది పోను వచ్చే సంవత్స రానికి నికరంగా అందుబాటులో ఉండే నిధులు కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. ఇవి మొదటి క్వార్టర్‌కే సరిపోవని తెలుస్తోంది. అయితే అవసరమైన నిధుల్లో 22శాతం నిధులను మాత్రమే కేంద్రం కేటాయించడం గమనార్హం.
చట్టాన్ని నీరుగార్చేందుకు బీజేపీ యత్నం
మొదటి నుంచీ అమలులో ఈ పథకాన్ని చిన్న చూపు చూస్తూ వచ్చారు. ఒక ఏడాది కాలంలో కేవలం 100 రోజుల పని కల్పించడానికి మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. అది కూడా కుటుంబంలోని ఒక వ్యక్తికి మాత్రమే కల్పిస్తామన్నారు. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, చట్టం ప్రజలకు ఒక ఆర్థిక హక్కును కల్పించింది. ఉపాధి కల్పించడాన్ని ప్రభుత్వం నిరాకరించడం కుదరదు. ఒక నిర్ణీత కాలంలోపు గనుక ఉపాధిని కల్పించకపోతే ఆ ఉపాధి కోరుకున్న వ్యక్తికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నేడు మందబలంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధిని నిరుగార్చేందుకు ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో దీని మనుగడే ప్రశ్నార్థకం గా కనిపి స్తోంది. ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా 613 జిల్లాలలోని 6349 బ్లాక్‌లు, మండలాల్లోని 2.38 లక్షల గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు. దీనికింద 28.49 కోట్ల మంది కూలీల వద్ద 13.19 కోట్ల జాబ్‌ కార్డులున్నాయి. ఉపాధి పొందుతున్న వారిలో 19.18శాతం మంది ఎస్సీలు, 14.96శాతం మంది ఎస్టీలు ఉన్నారు. కానీ ఉపాధిని నీరుగార్చేందుకే బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని రాజకీయనేతలు, మేధావులు ఆరోపిస్తు న్నారు. యేడాది కేడాది పెరుగుదల ఉండాల్సిన నిధుల్లో తగ్గిస్తూ రావడం చూస్తుంటే దీనిపై పట్టింపు లేదనే అర్థమవుతోంది. ఏండ్ల కిందటి నుంచే ఉపాధి చట్టానికి కేటాయింపు రూ.60,000 కోట్ల దగ్గరే ఉండిపోయింది. అంటే పెరిగే ధరలకు అనుగుణంగా నైనా కేటాయింపులను పెంచ లేదన్నమాట.
ప్రతి ఒక్కరికీ ఉపాధి అందుతుందా?
వాస్తవానికి ఉపాధి కోరిన ప్రతీ ఒక్కరికీ ఈ చట్టంలో పని కల్పించాలి. ఎంత మంది ఉపాధి కోరితే అంతమందికీ పని కల్పించేలా కేటాయింపులు కూడా ఉండాలి. కానీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నల్ని కేంద్రం దాటవేత ధోరణి అనుసరిస్తూ వస్తున్నది. 2019-20లో ఆ చట్టం కింద అయిన వాస్తవ ఖర్చు రూ.71,687 కోట్లు. కానీ 2020-21లో కేటాయించింది రూ. 61,500 కోట్లు మాత్రమే. నిజానికి ఆ సంవత్సరంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పట్టణాలలో ఉపాధి కోల్పోయి గ్రామాల బాట పట్టినవారి సంఖ్య చాలా ఎక్కు వగా ఉంది. కొంతమేరకు దీంతో ఉపశమనం పొందారు. 2021-22లో మళ్ళీ బడ్జెట్‌ కేటాయింపు కోత పెట్టి రూ.73,000 కోట్లకే పరిమితం చేశారు. ఇది ఆ ముందటి ఏడాది చేసిన వాస్తవ ఖర్చు కన్నా రూ.38,500 కోట్లు తక్కువ. అయితే నవంబరు 25న ప్రభుత్వం మరో రూ.10,000 కోట్లను కేటాయిస్తామని ప్రకటించింది. కానీ ఇది ఏ మూలకూ చాలదు. నవంబరు 25 నాటికే కూలీలకు రూ.9,888 కోట్లు బకాయి పడింది. ఇప్పుడు అదనంగా కేటాయించినది ఆ బకాయిలకే సరిపోతుంది. మరి ఏడాది పొడవునా చట్టాన్ని ఎలా కొనసాగిస్తారో కేంద్రమే చెప్పాలి. ప్రభుత్వం ఈ చట్టం కింద ఖర్చుపెట్టే నిధుల్లో చాలా వరకు ప్రజల కొనుగోళ్ల ద్వారా జీఎస్టీ రూపంలో చాలావరకు తిరిగి ప్రభుత్వానికే చేరుతున్నదనే సంగతిని గుర్తించాలి. ఈసారి బడ్జెట్లో చట్టానికి సంబంధించి 25శాతం క్షీణత ఉంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో గత సంవత్సరంతో పోలిస్తే 34శాతం తగ్గింపు చేశారు. ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు భిన్నంగా కేటా యింపులలో తగ్గింపు జరుగుతున్నది. చట్టాన్ని నీరు కార్చడం, రాబోయే రోజుల్లో క్రమేణా రద్దు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. దేశంలో ఎంతోమంది ఉపాధి చట్టంపై ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారు. చట్టాన్ని రద్దు చేసే ఆలోచన వస్తుందనే క్రమంలోనే ప్రజలంతా సంఘటితం కావాల్సిన అవసరమున్నది.
- డాక్టర్‌ ముచ్చుకోట సురేష్‌బాబు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.