Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

ఆదానీ, బీబీసీపై మోడీ మౌనమేల?

అదానీ కంపెనీ షేర్లు ఆకాశం నుండి పాతాళానికి, అదానీ రెండోస్థానం నుండి పదోస్థానం దిశగా పతనమార్గం పట్టాడు. తద్వారా భారత బ్యాంకులతో సహా ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభానికి గురతామన్న ఆందోళనకు గురయ్యారు భారతీయులు. మెకన్జీ నివేదికకు కౌంటరుగా 'ఇది నామీద కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీదనే దాడి' అని, ఇది మెకన్జీవారి బూటకపు నివేదికనీ, ఈ సంస్థను అంతర్జాతీయ న్యాయస్థానం బోనులో నిలుపుతామంటూ ఎదురుదాడికి దిగాడు అదానీ! అయినా సరే ఆయన స్థానం, కంపెనీల షేర్లు పతనమార్గాన జారుతూనే ఉన్నాయి. అతనేమైతే ఎవరికేం గాని, అతని షేర్లు గొన్న కొన్న ప్రజలు, అప్పులిచ్చిన బ్యాంకులు, ఎల్‌ఐసీ, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు మునుగుతాయోనన్న భయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి! అయినా ప్రధాని నోరు విప్పటం లేదెందుకని? ఈ విషయంలోనే కాదు, నాటి గుజరాత్‌ మారణకాండకు మోడీ, అమిత్‌షాలనే ప్రధాన కారకులుగా చూపుతున్న బిబిసి వీడియోను గూర్చికూడా నోరు విప్పటం లేదు మోడీ, షాలు!బీజేపీ మాత్రం ఇది మోడీ మీద చేస్తున్న దాడికాదు, భారతదేశం మీద దాడి అని చెబుతోంది. మోడీ షాలకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన భారత సుప్రీంకోర్టు మీద బిబిసి చేస్తున్న దాడి పేర్కొంటోంది. అసలు బిబిసి విశ్వసనీయ సంస్థే కాదు, ఆ వీడియోను పట్టించుకోవాల్సిన పనేలేదు, రానున్న ఎన్నికల్లో మోడీని ఓడించటానికి జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమిది అంటూ ఎదురు దాడికి దిగుతోంది. కానీ బిబిసి వారి మంచి కౌంటర్‌నే ఇచ్చింది.' ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు. నాడు మీరు తొక్కిపెట్టిన వీడియో క్లిప్పింగులను వెలికి తీసి యథాతథంగా రూపొందించిన వీడియోనే ఇది.' చెప్పింది. సాక్షులను, సాక్ష్యాధారాలను కోర్టుముందుకు రాకుండా నిర్బంధించినప్పుడు, సుప్రీం కోర్టు అయినా ఏం చేయలేకనే క్లీన్‌చిట్‌ ఇచ్చిందని,అంత మాత్రాన నేరం ఎలా మాసిపోతుంది? అని గట్టిగానే ప్రశ్నించింది. భారతదేశ మంటే తమకు సదాగౌరవమే. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా గుజరాత్‌ మారణకాండ వంటి దారుణాలు ఎలా కప్పెట్టబడతాయో, ప్రజలకు, ప్రపం చానికి తెలియజెప్పడం కోసమే ఈ వీడియోను విడుదల చేసినట్టు చెప్పింది.
గుజరాత్‌ మారణకాండ..బీబీసీ నిజాలు
ఈ నేపథ్యంలో భారతీయులు కూడా గతాన్ని మననం చేసుకుంటున్నారు. గుజరాత్‌ మారణకాండ నేపథ్యంలో, తన పక్కనే ఉన్న మోడీ సమక్షంలోనే, ''గుజరాత్‌ దుస్సంఘటన విషయంలో మోడీ రాజధర్మాన్ని పాటించలేదని'' మీడియా ముందే అన్న నాటి ప్రధాని వాజ్‌పేయి మాటలు. గత గుజరాత్‌ ఎన్నికల సభలో ''రాష్ట్రంలో అల్లర్లకు కారకులైనవారికి గతంలో మనం గుణపాఠాన్ని చెప్పాం. దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే అదే గుణపాఠం మరోసారి పునరావృతమవుతుంది'' అన్న అమిత్‌షా మాటలూ సదరు మారణకాండకు బాధ్యులు, మోడీ అమిత్‌షాలేనని తెలియజేస్తున్నయి గదా! బ్రిటిష్‌ ప్రభుత్వ నిధులతో నడుస్తున్నదైనా, పారదర్శకంగా వ్యవహరిస్తూ, ప్రపంచ విశ్వస నీయ ఛానెళ్ళలో బిబిసి ఒకటని మేధావులు వక్కాణిస్తున్నారు! అందుకు నిదర్శనాలెన్నో ఉన్నాయి. బ్రిటిష్‌ వలస పాలనలో భారత్‌లో ముఖ్యంగా బెంగాల్లో సంభవించిన కరువుకు లక్షలాది భారతీయుల మరణ దృశ్యాలను చిత్రించి అందుకు నాటి బ్రిటిష్‌ ప్రధాని చర్చిల్‌నే ప్రధాన బాధ్యుడని నిర్భయంగా చెప్పింది బిబిసి! ఇందిరాగాంధీ హయాంలో నిర్బంధానికి గురై, భారతీయ మీడియా మౌనం వహించిన - ఎమర్జెన్సీ దురాగతాలను, భారతీయులతో సహా ప్రపంచ మంతా తెలుసుకోగలిగింది బిబిసి ద్వారానే. నాడు ఇందిర వ్యతిరేక పార్టీల కూటమిలో చేరిన బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలు బిబిసిని ఆకాశానికెత్తారు. సాక్షాత్తూ నరేంద్ర మోడీనే ఒక ఎన్నికల సభలో ''భారతీయ దూరదర్శన్‌ కన్నా బిబిసి ఎన్నోరెట్లు విశ్వసనీయ మైంద''ని ప్రశంసించాడు. మరి నాడు 'ఇందిరయా'గా నేడు 'మోడియా'గా మారిన భారతీయ మీడియా చెప్పలేని నిజాలను బిబిసి ద్వారా తెలుసుకోవటం జాతి విద్రోహమా మోడీ ''అవినీతి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదికారి అన్నదే మోడీ ప్రభుత్వ భావన!'' అని రాష్ట్రపతి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం!...''అవినీతిని ఎంతమాత్రం సహించకండి! ఆత్మరక్షణలో పడక, నిర్భయంగా దాడులు చేయండి!'' అంటూ దర్యాప్తు సంస్థల్ని మీరు ఆదేశిస్తున్న మీడియో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి గదా! మరి అదానీ వ్యాపారాలపై దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయించి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. లేదా ''మెకన్జీసంస్థ వారి నివేదిక'' అబద్ధమనీ, అదానీవి డొల్లకంపెనీలు కావు, వాటివల్ల బ్యాంకులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమేలేదని'' మీడియా ముఖంగా ప్రకటించైనా ప్రజలకు భరోసా కలిగించండి!.మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు?దాని మర్మమెంటో దేశ ప్రజలకు తెలుసులే మోడీజీ.

- పాతూరివెంకటేశ్వరరావు
  8949081889

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:10 PM

శుభ్రత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.