Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

ప్రకృతి ప్రకోపమా... మానవ తప్పిదమా..?

        అక్కడ పేకమేడల్లా కూలిన భవ నాలు... శిథిలాల కిందనే మృతదేహాలు... కొనసాగుతున్న సహాయక చర్యలు... భీతిల్లిన ప్రజలు... ఓవైపు హాహాకారాలు... మరోవైపు ఆర్తనాదాలు... ఇది టర్కీ (తుర్కియే), సిరియాలో మూడు రోజుల కిందట భూ ప్రళయం సృష్టించిన మరణమృదంగం. ఏమిటీ ఘోరం, ఎందుకీ వైపరీత్యం! కారణమేదైనా కావచ్చు. ప్రకృతీ ప్రకోపానికి బలైపోయింది శరణార్థులు, పౌరులు. అక్కడి హృదయవిదారక దృశ్యాలు ప్రపంచాన్ని కంటతడి పెట్టించాయి. కూతుర్ని కోల్పోయి శోకిస్తున్న తండ్రి, బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన తల్లి, తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అక్క చూపరుల గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకా కాళ్లు చేతులు కోల్పోయిన వారు, వెన్నుపూస విరిగి లేవలేని స్థితిలో ఉన్నవారు ఎంతో మంది క్షతగాత్రులు తాము బతికే ఉన్నామని, కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 4700 భవనాలు కూలిపోయాయి. వాటి కింద చిక్కుకున్న మృతదేహాల లెక్క తేలాల్సి ఉంది. మొదట 2,600 చనిపోయి నట్టు వార్తలు వచ్చినప్పటికీ రోజురోజుకూ శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు టర్కీలో 7,108మంది చనిపోగా, సిరియాలో సుమారు 2,530మంది మరణించినట్లు అధికారిక సమాచారం. కానీ దాదాపు 20వేల వరకు మర ణాలు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా. తీవ్రమైన మంచు కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోందని నేషనల్‌ డిజాస్టర్‌, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పేర్కొంది. భూ కంపధాటికి పది ప్రావిన్స్‌ల పరిధిలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు తుర్కియే అధ్యక్షుడు రెసెపె తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించాడు. మే 14 అధ్యక్ష ఎన్నికలు జరిగే ముందు వరకు ఇది అమల్లో ఉండనుంది.
సిరియాకు అందని ఐరాస సాయం
టర్కీలో అనేక రాష్ట్రాలు, ఓడరేవులు ధ్వంసమయ్యాయి. టర్కీకి సాయపడేందుకు భారత్‌ ముందుకొచ్చినా సిరియాకు అందాల్సిన ఐక్యరాజ్యసమితి సాయం నిలిచిపోయింది. దశాబ్ద కాలంగా అంతరంగిక యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతంలోనే తాజాగా భూ కంపం కూడా సంభవించడంతో అక్కడి పరిస్థితి చాలా దారు ణంగా ఉంది. ఇప్పటికే మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరియన్లు ఈ భూ ప్రకపంనలతో చాలానే నష్టపోయారు. చరిత్రను చూసినట్టయితే ఐదు భూకంపాలు మానవాళికి పీడకలలుగా మిగిలాయి. ఇప్పటికి కూడా వాటిని తలుచుకుంటే భయంతో వణికి పోయేవారెందరో! రికార్డుల్లో నమోదైన అతిపెద్ద భూకంపం 1960 మే 22న చిలీలోని బయో-బయో ప్రాంతంలో 9.5తీవ్రతతో భూమి దాదాపు కంపించింది. మానవ చరిత్రలో చవిచూసిన అతిపెద్ద ఉపద్రవాల్లో ఇది కూడా ఒకటి. భూకంపం వచ్చిన రెండు గంటలకు రాకాసి అల ఒకటి భారత్‌లో అండమాన్‌-నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు తీరాలను తాకాయి. జపాన్‌ చరిత్రలో అతిపెద్ద భూకంపం 2011లో నమోదైంది. భారత దేశంలో చూస్తే భూ కంపం తీవ్రత ఆధారంగా నాలుగు భూకంప జోన్లుగా విభజించారు. ఇందులో ఈశాన్య భారతదేశం, ఉత్తర బీహార్‌, పశ్చిమ, మధ్య హిమాలయ ప్రాంతం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ (కాంగ్రా), గుజరాత్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్మూ కశ్మీర్‌ ప్రాంతాలున్నాయి.ఈ జోన్‌ అత్యంత తీవ్ర భూకంపాలు సంభవించే ప్రాంతాలుగా గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే విశాఖపట్నం, హైదరాబాద్‌ సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టు నిపుణులు ప్రకటించారు.
మానవ తప్పిదాలు... భూకంపాలు..?
భూభౌతిక పరిణామ ప్రభావాల వలన భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలు, అగ్నిపర్వతాలలో తలెత్తే మార్పుల ప్రభావం వల్లనే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతిపరమైనవే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టే వీటిని ఏ విధంగానూ నియంత్రించలేకపోతున్నాం. అయితే పైన పేర్కొన్నట్టు భూభౌతిక పరిణామ ప్రభావాలకు తోడుగా మనుషులు చేసే పనుల వల్ల కూడా కొన్ని సార్లు భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వాటిలో ప్రధానమైనది ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీసే అడవులు నరికివేయడం, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, భారీ జల విద్యుత్‌ ప్రాజెక్టులు వంటి మానవ చర్యలు భూమ్యావరణ స్థితికి భంగం కలిగి భూకంపాల రాకకు కారణమవుతున్నాయని నిర్ధాంచారు. దీంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా పరోక్షంగా భూకంపాలకు కారణం కావచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వాతావరణ కాలుష్యంతో పెరుగుతున్న భూతాపం వల్ల భూమి లోలోపలి పొరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అడవుల ధ్వంసం, వాహన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు పర్యావరణంపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతున్నాయి. దీంతో వాతావరణంలో ఆకస్మత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ వరదలకు, సముద్ర మట్టాలు పెరగడానికి దారితీసి భూలోపలి పొరల్లో సాగే అలజడి మరింత వేగవంతం చేయడం ద్వారానే భూకంపాలు వస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విపత్తును తుపాన్ల వలె ముందుగా గుర్తించ గలిగితే ప్రాణ నష్టం జరగకుండా బయట పడవచ్చు. అయితే అటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఇంత వరకూ లేదు. అయితే ఆధునిక పరిశోధనలు ఫలితంగా కొన్ని దేశాల్లో 30 సెకన్ల ముందే భూ కంపాల రాకను గుర్తించే వ్యవస్ధ ఉంది. భారత్‌లో మాత్రం చాలా కాలం వరకూ దీని రాకను తెలుసు కోవడానికి ఉపయో గించే పరిజ్ఞానం కేవలం ప్రాథమిక ప్రకంపనలు గుర్తించేదిగా మాత్రమే అందుబాటులో ఉంది. భూ కంపాలను పసిగట్టే సాంకేతికతను తయారు చేసుకోగలగాలి. అప్పుడే ప్రపంచంలో పరిణతి చెందిన దేశంగా చెప్పుకోవడంతోపాటు అది ప్రజా జీవన విధానానికి భరోసా కలిగించేందుకు దోహదపడుతుంది.

- ఎన్‌. అజరుకుమార్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుల వివక్షను నిరసించిన 'మాలపిల్ల'
పెన్షన్‌ భిక్ష కాదు...హక్కు!
ఓబీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
అమెరికా ఆ యుద్ధాన్ని ఆగనివ్వదు
గొంతు నొక్కుతున్న గోడీ మీడియా...
పెరుగుతున్న ఔషధాల ధరలు.. పేదలపై ప్రభావం
ఎదురుదెబ్బలు తగిలినా ఆగని అమెరికా యుద్ధోన్మాదం!
పెత్తనం కేంద్రానిది... బాధ్యతలు రాష్ట్రాలకు... భారాలు ప్రజలకు...
గూడు చెదిరిన పక్షులు
కుప్పకూలుతున్న అమెరికన్‌ బ్యాంకులు
అదానీ కోసం పార్లమెంటునే తొక్కేస్తున్న ప్రభుత్వం
మోడీకి భారతీయుల ప్రశ్న!
రాహుల్‌ అనర్హత వేటులో అదానీ కోణం
లీకు సాకు షాకు
సంపద సృష్టికర్తలకు పోరాటాలే మార్గం
గర్భసంస్కారాలు - ఒక పరిశీలన
పేపర్‌ లీకేజీలతో పేద విద్యార్థుల భవిష్యత్‌ లాక్‌
హద్దులు లేని హక్కుల పరిరక్షణకు - 'అన్‌హద్‌'
పేపర్‌ లీకేజీలో రాజకీయం
ప్రతిపక్షాలపై దాడికి ఈడీ ఆయుధం
ప్రసార(ట్రాన్స్‌మిషన్‌)చార్జీలు - మోడీ ప్రభుత్వ మాయాజాలం
భారత విప్లవోద్యమ దిక్సూచి షహీద్‌ భగత్‌సింగ్‌
నూతన పద్ధతుల్లోనే కార్మికోద్యమ నిర్మాణం సాధ్యం
ఉక్రెయిన్‌ సంక్షోభం - పశ్చిమ దేశాల ఇరకాటం
శోభకృత్‌ కాలానికి స్వాగతం..
'హిందూ ఆర్థిక వృద్ధి' రేటు - అప్పుడు, ఇప్పుడు
గర్భసంస్కారంతో లోకం తెలియని పిల్లలు
జేజేలు
మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'

తాజా వార్తలు

02:09 PM

ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక విషయాలు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు

01:46 PM

డచ్‌ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు

01:23 PM

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత..

01:22 PM

మస్కిటో కాయిల్ విషవాయువుతో ఆరుగురి మృతి..

12:38 PM

అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి : జానారెడ్డి

12:32 PM

త్వరలో రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్

12:20 PM

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే కోటా నూతన ఎమ్మెల్సీలు..

01:23 PM

ఒక్కసారిగా కుంగిన ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు.. గోతిలో ఇరుక్కున్న సిటీ బస్సు

01:23 PM

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నం.. షర్మిల అరెస్ట్‌

12:04 PM

హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

11:44 AM

అమితాబ్ బచ్చన్‌కు ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కీలక విజ్ఞప్తి

11:39 AM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య...

11:17 AM

ఢిల్లీలోని వాజీపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం...

11:05 AM

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి

10:56 AM

నేను లొంగిపోవట్లేదు.. అమృత్ పాల్ సింగ్

10:45 AM

చిలీలో భారీ భూకంపం...

10:26 AM

దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు

09:23 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు...

09:19 AM

నాగార్జునసాగర్‌లో పోటా పోటీగా రికార్డింగ్ డాన్సులు

08:54 AM

గుడిలో కూలిన మెట్ల బావి పైకప్పు.. 35కు చేరిన మృతులు

08:46 AM

ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం..ఇద్దరు మృతి

08:41 AM

కదులుతున్న క్యాబ్‌లో డ్రైవరుకు గుండెపోటు

08:25 AM

కరాచీలో హిందూ డాక్టర్‌ను వెంటాడి కాల్చిచంపిన దుండగులు

08:15 AM

బలగం సినిమాకు రెండు ఇంటర్నేషనల్‌ అవార్డులు

08:08 AM

వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి

07:52 AM

స్నేహితురాలిని చంపి.. ప్రియుడితో పారిపోయిన యువతికి జీవిత ఖైదు!

07:35 AM

గ్రూప్‌ 1 సహా 6 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ఆన్సర్‌షీట్లు కూడా...

07:28 AM

ఢిల్లీలో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

07:00 AM

నేటి నుంచి ఐపీఎల్‌-16వ సీజన్ ప్రారంభం...

06:29 AM

అరగంటలో 5,450 పిడుగులు.. ఐదుగురి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.