Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Mar 17,2023

కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు

(నిన్నటి సంచిక తరువాయి)
బొగ్గు దిగుమతులు, పునరుత్పాదక ఇంధన వనరుల భారం
మోడీ సర్కార్‌ ఆరు శాతం వరకు విదేశీ బొగ్గును స్వదేశీ బొగ్గుతో కలిపి విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవాలని చెప్పింది. విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ గత జనవరిలో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు వాటి అవసరాలలో 10 నుండి 15శాతం వరకు స్వదేశీ బొగ్గును రైలు - రోడ్‌ - రైలు పద్ధతిలో రవాణా చేసుకోవాలని కూడా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలను, ఎన్టీపీసీని ఆదేశించింది. దీనివల్ల బొగ్గు రవాణా ఖర్చులు, రైల్వే యార్డులు, షిప్‌యార్డ్‌లో బొగ్గును దించటం, మళ్ళీ ఎక్కించటం, తదితర అనవసర ఖర్చులు తడిచి మోపెడవుతాయి. థర్మల్‌ విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతాయి. ఆయా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు వాటి ప్రాజెక్టులకు కేటాయించ బడిన బొగ్గును సాధ్యమైన మేరకు త్వరితంగా, తక్కువ ఖర్చుతో రవాణా చేసుకునే మార్గాలను ఎంచుకోకుండా మోడీ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎందుకు నిర్దేశించి నట్లు? అదానీ హస్తగతమైన ఓడ రేవులకు వ్యాపారం కోసం మోడీ ప్రభుత్వం ఈ తుగ్లక్‌ నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాన్ని పాటించకపోతే, అవసరమైన రైల్వే వ్యాగన్లను బొగ్గు రవాణాకు కేటాయించ బోమని కూడా కేంద్రం బెదిరిస్తున్నది.
డిస్కాములు వినియోగ దారులకు సరఫరా చేసే విద్యుత్లో కనీసం ఎంతశాతం మేరకు పునరుత్పత్తి అయ్యే విద్యుత్‌ను (సౌర, పవన, ఇతర సాంప్రదాయేతర విద్యుత్‌) కొనుగోలు చేసితీరాలో కేంద్రం నిర్దేశిస్తున్నది. విద్యుత్‌ నియంత్రణ కమిషన్లు ఇందుకు రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేస్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీఆర్‌ఓ) ఉత్తర్వులను నియతకాలికంగా జారీ చేస్తూ, డిస్కాములు కనీసం ఎంత శాతం మేరకు ఆర్‌ఈని కొనుగోలు చేయాలో నిర్దేశిస్తున్నాయి. అధికంగా ఉన్న ఆ కనీస శాతానికి మించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌ఈ కొనుగోలుకు డిస్కాములతో దీర్ఘకాలిక పీపీఎలు చేయిస్తున్నాయి. వీటికి రెగ్యులేటరీ కమిషన్లు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఎన్టీపీసీకి చెందిన వ్యాపార విభాగం ఎన్‌వీవీఎల్‌, ఎస్‌ఈసీఐ వంటి సంస్థల ద్వారా ఆశ్రిత పెట్టుబడి దారుల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయించి, రాష్ట్రాల డిస్కాములకు కేంద్రం అమ్మిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్ధ ప్రయోజనాలకు ఆ విద్యుత్‌ కొనుగోలుకు దీర్ఘకాలిక పీపీఎలు చేయించి, కమిషన్ల ఆమోదం పొందు తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మక్కుతో, ఇలా అవసరానికి మించి విచక్షణా రహితంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేయిస్తున్నందున వినియోగ దారులపై విపరీత భారాలు పడుతున్నాయి. ఆర్‌ఈని తప్పని సరిగా కొనుగోలు చేసితీరాలన్న నిబంధన అవసరం లేకపోయినా కొనితీరేందుకు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించాలని ఆదేశించి, ఆ ప్రాజెక్టులకు ఆ మేరకు స్థిరచార్జీలను డిస్కాములు చెల్లించాల్సి వస్తున్నది. ఆ విధంగా, అవసరంలేని ఆర్‌ఈ కొనుగోలుకు అధిక చార్జీలు చెల్లిస్తూ, మరోపక్క, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు ఉత్పత్తి తగ్గించినందుకు స్థిరఛార్జీల చెల్లింపు రూపంలో వినియోగ దారులపై రెండు విధాలుగా భారాలు మోపుతున్నాయి. ఆర్‌ఈ పీక్‌ డిమాండ్‌ను తీర్చలేదు గనుక, ఒక పక్క భారీగా మిగులు విద్యుత్‌ ఉన్నా, డిస్కామ్లు ఎక్సేంజీల ద్వారా అధిక ధరలకు అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఆర్‌ఈ కొనుగోలువల్ల తమకు ఏడాదికి రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నదని, ఆర్‌ఈ కొనుగోలు కోసమే తగ్గిస్తున్న ఉత్పత్తిలో 90 నుండి 95శాతం మేరకు థర్మల్‌ విద్యుత్‌ ఉంటున్నదని, ఏపీ డిస్కామ్లు పలుమార్లు ఎపీఈఆర్‌సికి నివేదించాయి. 2022-23 సంవత్సరానికి తెలంగాణ డిస్కామ్లు 5159 మిలియన్‌ యూనిట్లను ఎక్సేంజీల ద్వారా కొన్నాయి. తెలంగాణ డిస్కాములు 2023-24 సంవత్సరానికి ప్రతిపాదించిన విద్యుత్‌ విక్రయాలు 62970 మిలియన్‌ యూనిట్లను ఆర్‌ఈ లభ్యత 17375, 27.59శాతం అవుతుంది. అదే సంవత్సరానికి 13441 ఎంయూ మిగులు విద్యుత్‌ లభ్యతను చూపుతూ, ఆర్‌ఈని అనవసరంగా కొనటంవల్ల వినియోగదారులపై నివారిం చదగిన భారాలు పైన వివరించిన విధంగా పడుతూనే ఉంటాయి. ఇలాంటి భారాలన్నీ విద్యుత్‌ ఛార్జీల పెంపు, ట్రూ-అప్‌ ఛార్జీల రూపంలో పడుతున్నాయి.
-ఎం వేణుగోపాలరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్క్సిస్టు మహారథికుడు నంబూద్రిపాద్‌
గర్భ 'సంస్కారం'
విప్లవ యోధ కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం
కాలిగిట్టెల శబ్దం
ప్యారిస్‌ కమ్యూన్‌: ఒక గమనం! ఒక గమ్యం!
కార్మిక-కర్షక పోరాటాలను ఉధృతం చేయండి
హేతువాద కవిత్వం రాసిన సంప్రదాయ కవి
భూమి, భుక్తి, విముక్తి ధీరుడు కామ్రేడ్‌ ఠానునాయక్‌
ఛాందసం
హయ్యర్‌ పెన్షన్‌పై సుప్రీం తీర్పును అమలు చేస్తారా?
కేంద్ర విధానాలతో విద్యుత్‌ భారాలు
వలస శవం
'పరీక్షా' కాలం!
త్రిపురలో బీజేపీ హింసాకాండ
ఇరాన్‌ - సౌదీ ఒప్పందం: అమెరికా కుట్రలకు ఎదురుదెబ్బ !
అతడు ప్రేమికుడు
ప్రకృతి వనరులు - సామ్రాజ్యవాదం
చిన్న సినిమా... సంస్కారం
విద్యాశాఖలో సంక్షోభం తొలగేదెన్నడు?
మోడీని కాదంటే ఈడీ...
ఉందంటే.. లేదనిలే..!
బలమైన ప్రతిపక్షం అత్యావశ్యకం
సహజ వనరులు, ఖనిజ నిక్షేపాలు వరమా?శాపమా?
పత్రికా సమావేశం.. ఓ జర్నలిస్టు అనుభవం!
పాకిస్థాన్‌ సంక్షోభం... ఒక పరిశీలన
మనుగీతలపై యుద్ధం చేసిన యోధురాలు సావిత్రి బాయి
మత్తు ముంగిట దేశ భవిష్యత్తు..!
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ హింసాకాండ
సుప్రీం కమిటీపై కందకులేని అనుమానం కాషాయ దరళాలకెందుకు?
యుద్ధం - మానవాళి(కి) శాపం

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.