Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్థానిక సంస్థలకు నిధులేవి..! | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

స్థానిక సంస్థలకు నిధులేవి..!

- మందకోడిగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు
- రైతు వేదికలు, పల్లె ప్రకృతివనాలకు అందని నిధులు
- జాడ లేని ఆర్థిక సంఘం నిధులు
- పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలు
- ఆందోళనలో సర్పంచ్‌లు
             నిధులు లేమీతో స్థానిక సంస్థలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ అభివృద్ధి కోసం పథకాలు బాగానే ఉన్నప్పటికీ.. అమలు తీరులో మాత్రం సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన వైకుంఠదామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణాలు, క్రీడా ప్రాంగాణం వంటి పనులు పూర్తి చేసిన గుత్తెదార్లకు గడువు ముగిసినా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారం తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పనులు చేసేందుకు గుత్తేదారు ఎవరు ముందుకు రాకపోవడంతో చేసేది ఏమీ లేక సర్పంచులు గుత్తేదారుల అవతారమెత్తి పనులు చేశారు. పనుల కోసం చేసిన అప్పులు కుప్పలే వారి మెడకు పెద్ద గుదిబండగా మారాయి.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో కొత్త పనులకు టెండర్లు పిలిచినా చేసేందుకు ముందుకు రావడం లేదు. మన ఊరు- మన బడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఆ నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదారులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ పథకం ముందుకు సాగడం లేదు. ఎమ్మెల్యేల అనుచరులు, వారి బంధువులు, రాజకీయ, అధికార పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారు. సాధారణ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతరులు చేసిన పనులకు మాత్రం బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారు. అదేమంటే ప్రభు త్వం నుంచి నిధులు మంజూరు కాలేదని, వచ్చిన వెంటనే చెల్లిస్తామని జిల్లా ట్రెజరీ ఆఫీసర్లు చెప్పుతుండటం గమ నార్హం. ఇలా పాత బకాయిల కోసం డీటీఓ ఆఫీసుకు రోజు కు కనీసం పది మంది కాంట్రాక్టర్లు వచ్చి పోతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయితీలు ఉండగా, వీటి నిర్వహాణ కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 2022 ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.28 కోట్లు మంజూరు కాగా, 2021-22 ఆర్థిఖ సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.59 కోట్లు మంజూరైంది. ఇది కాకుండా 2021-22 ఆర్థిక ఏడాది మొత్తం గ్రామ పంచాయితీ నుంచి 99 శాతం అంటే రూ.23.93 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. పారిశుధ్య నిర్వహాణ, హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం, సిబ్బంది వేతనాల చెల్లింపు, సహా ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటి వరకు 556 కంపోస్ట్‌ యార్డులు, 557 శ్మశాన వాటికలు, 865 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 83 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించారు. ఇందుకు ఒక్కో రైతు వేదిక భవనానికి రూ.22 లక్షలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ పనులు దక్కించుకుని, పనులు పూర్తి చేసిన వారికి ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆశించిన మేర నిధులు రావడం లేదని చెప్పుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చే గుత్తేదార్లకు అధికారుల నుంచి వేదింపులు తప్పడం లేదు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను గతంలో తన వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఎకౌంట్‌లో జమ చేసేది. దీనికి రాష్ట్ర ప్రభు త్వం కూడా చెల్లించాల్సిన వాటాను కలిసి జిల్లా ట్రెజరీలకు బదిలీ చేసేది. అటు నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేసిన గుత్తేదార్లకు డబ్బులు చెల్లించేవారు. అయితే కేంద్రం తన వాటాగా కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన పనులకు కాకుండా ఇతర పథకాలకు మళ్లీస్తుండటాన్ని గుర్తించింది. చేసిన పనులకు కేంద్రం తన వాటా ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదనే అపవాదును కేంద్రంపైకి నెట్టేస్తున్నాయి. కేంద్రం ఈ అంశాన్ని గుర్తించింది. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా చెల్లించే మొత్తాన్ని నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన నిధులను కూడా నేరుగా ఆయా పంచాయతీ ల ఖాళాల్లో జమ చేయాలని నిర్ణయించి, ఆ మేరకు బ్యాంకుల్లో ప్రత్యేక అకౌంట్లను కూడా తెరిపించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతా ల్లో జమ కావాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా రావడం లేదు. దీంతో బిల్లుల చెల్లింపు కూడా ఇబ్బందిగా మారింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తెలంగాణాలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
'ఎంవీఎఫ్‌ సేవలు అభినందనీయం'
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫి
వ్యవసాయాన్ని పండగలా మార్చిన సీఎం కేసీఆర్‌
భాషా పండితుల సమస్యలు పరిష్కరించాలని నిరసన
సాంసంగ్‌ ఎస్‌ 23 సిరీస్‌
సెక్రటేరియట్‌ బదిలీలను రద్దు చేయాలి
ఆత్మగౌరవ భవనాలను త్వరలో పూర్తి చేస్తాం
హైదరాబాద్‌లో 'డబుల్‌ డెక్కర్‌' బస్సులు
ఆడబిడ్డలను పుట్టనిద్దాం-బతుకనిద్దాం
గండిపేట్‌లో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తాం
నారాయణపురం బస్సును పునరుద్ధరించాలి
వార్డుల్లో కంటివెలుగు ప్రారంభం
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని
నేటితో ముగియనున్న అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు
సమ సమాజ నిర్మాణంలో యువకులు భాగస్వాములు కావాలి
సేవాలాల్‌ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
వీర్తుస గ్రీన్‌ విండ్స్‌తో ప్రకృతి ప్రేమికుల కలసాకారం
ఆటల పోటీలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయి
ప్రభుత్వ భూములను కాపాడాలి
కాట్రాంతండాలో సుంకిరెడ్డికి అపూర్వ స్వాగతం
ఇ.పట్నం బరిలో టీడీపీ
అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
విష్ణు సహస్ర ఆగ్రోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రారంభం
పాస్‌పోర్టుతో పాటు విలువైన వస్తువులు అందజేత
గొర్రెల పథకంలో నగదు బదిలీ అమలు చేయాలి
పేద ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి
ఘనంగా కేఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ జన్మదిన వేడుకలు

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.