Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
సామాజిక సేవే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచటమే ధ్యేయంగా వైద్య వృత్తిని, సాహితీ సేద్యాన్ని కృష్ణక్క మాధ్యమంగా మలుచుకున్నారని ప్రము ఖులు ప్రశంసించారు. శ్రీ త్యాగరాయ గానసభలో యువకళావాహిని సాం స్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ రచయిత్రి డాక్టర్ కేవీ కృష్ణ కుమారి రచించిన గ్రంథాల ఆవిష్కరణ సభ జరిగింది. అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్ సశేషం సంపు టిని ఆవిష్కరించి మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలంది స్తున్న కృష్ణక్క సాహితీ వ్యాసంగం ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు చేపట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణ వందే కృష్ణం సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యా యని ప్రశంసించారు. కర్మయోగి సంపుటిని ఆవిష్కరించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టీస్ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణక్క సలహాలు, సూచనలు ఒక వారపత్రికలో ధారవా హికంగా ప్రచురితమై ఎందరో పాఠకులకు గైడ్‌గా ఉపయోగపడ్డాయన్నారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించి భద్ర కళ్యాణం సంపుటిని ఆవిష్కరించారు. కృష్ణక్క వందే కృష్ణం సశేషం అడియో సీడీని ఆవిష్కరించారు. సభా కార్యక్రమానికి తొలుత డీఏ మిత్ర, వీకే దుర్గ, పద్మశ్రీ పవన్‌కుమార్ పాడిన పాటలు ఆలరించాయి. వైకే నాగేశ్వర్‌రావు కార్యక్రమం నిర్వహించగా లంకా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానం చేశారు.