Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జీవన తాత్పర్యం... | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

జీవన తాత్పర్యం...

             ఏ ప్రాంతం వారైనా వారి వారి సంస్కృతి సంప్రదాయాలు, స్థానికంగా వారు మాట్లాడుకునే భాష, పద ఉచ్ఛారణలో, ఆత్మ, ఆత్మీయత,ప్రేమ, బంధాలు, బంధుత్వాలు ఉంటాయి. దానినే మాండలీకం అంటాం. తెలుగు రాష్ట్రాలలో, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మాండలీకం ఉంది. పుట్టిన ఊరు, పెరిగిన పరిసరాలు కుల వృత్తులలో వాళ్ళు రోజూ వాడే పరికరాలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించిన పనిముట్లు, వీటన్నింటి గురించి ఆయా ప్రాంతాల్లో పలుకుబడిలో ఉన్న భాషలో మాట్లాడుకుంటారు. ఆ భాష ఎంత సహజంగా ఉంటుందో, అంతే మట్టి గుభాళింపు వస్తుంది. అదే ఉత్తర తెలంగాణలో పలుకుబడిలో ఉన్న భాష.
             ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌ దగ్గర పోతారం (ఎస్‌) చిన్న పల్లెటూరు. 1962, అక్టోబర్‌ 17 న, ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కవి, సాహితీవేత్త, అన్నవరం దేవేందర్‌. తండ్రి దశరధం ఉపాధ్యాయులు, తల్లి కేదారమ్మ గృహిణి. చదువు పోతారం (ఎస్‌), అంతకపేట, హూస్నాబాద్‌, హన్మకొండలలో జరిగింది. చిన్నప్పుడు తాతయ్యతో, పొలానికి వెళ్లి, అక్కడ వ్యవసాయ పనులు చేసేవాడు. అప్పటి నుంచి కుల వృత్తుల జీవితాలను దగ్గరి నుంచి చూడడం వల్ల, ఈయన ఎంతో ప్రభావితం చెందారు. కుల వృత్తులు చేసుకునే వారందరికీ వ్యవసాయంతో, సంబంధం ఉండేది. పంట పండితేనే వడ్లు, బియ్యం, డబ్బులు.ఒక్క వ్యవసాయం భరోసా తోనే, అనేక మంది జీవితాలు కొనసాగేవి. అలా గ్రామాల్లో మాట్లాడుకునే భాషను, మాట మాటలో ఉన్న మాధుర్యాన్ని వట్టబట్టుకున్నారు అన్నవరం దేవేందర్‌. జీవగడ్డ సాయంకాల దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వహించారు. ఆ తరువాత పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగిగా, అటు తర్వాత కవిగా, రచయితగా, సాహితీవేత్తగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పటికీ సాహిత్య ప్రపంచంలో కవితా వింతనాలు జల్లుతూ, వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఈ మధ్య ప్రచురించిన ''జీవన తాత్పర్యం'' కవితా సంకలనాన్ని నాకున్న పరిజ్ఞానం మేరకు సమీక్షించే ప్రయత్నం చేస్తాను.
ఇల్లు అంటేనే అమ్మ ముఖచిత్రం. అమ్మ అంటేనే ఇంటి ప్రపంచం... ఎంత గొప్ప వ్యక్తీకరణ. చందమామను చూపిస్తూ, అన్నం ముద్దను నోట్లో పెట్టడం అమ్మ ఎత్తుగడ, కవిత్వ ప్రారంభ పదాలన్నీ, ఆ గోరు ముద్దల శిల్పమే అద్భుతం కదా.
ప్రకృతిలో, నేల, ఆకాశం, ఎండ, వాన, మంచు, అడవి, చెట్టు, పూవులు, వీటిని ఎప్పుడు చూసినా కొత్తగానే కనిపిస్తాయి. కానీ మనం వాటి మీద దృష్టి కేంద్రీకరించం. తెల్లవారితే సూర్యుడు వస్తాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడన్న అభిప్రాయంలో ఉంటాం. కానీ ఒక కవి కోణం నుంచి ఉదయాన్ని చూస్తే, చాలా అద్భుతంగా వుంటుంది. ఆకాశం నుంచి సూర్యుడు మనకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తాడు. ఒక మంచి రోజుకి స్వాగతం పలుకుతాడు. నిద్ర లేచి దర్వాజా బయటికి వచ్చాక, నేలను తాకిన కాళ్ళు, వాటితో పాటు, దేహం, మట్టి తరంగమై పులకరిస్తుంది. వాకిట్లో వేసిన ముగ్గులు చూస్తుంటే, గొప్ప కళాఖండం మన ఇంటి కడప ముందు చిత్రించినట్లుంటుంది. మొక్కలకు నీళ్ళు పోస్తుంటే, పచ్చని ఆకులు నాతో ముచ్చట పెట్టినట్లు ఉంటుంది.పందిరి మీద బచ్చలి తీగను అందుకుంటుంటే, ''చెక్కిలి గిల్‌'' అయితది. బంతి పూలు చిరునవ్వుతో, జల్లులు కురిపిస్తాయి. ఇదీ ''పొద్దున్నే లేస్తే'' కవిత. కవి ప్రతి సందర్భాన్ని చూసే కోణం అసాధారణమైనది. అన్నవరం పల్లెల్లోని, ప్రకృతి అందాలను, తన రోజుని తనదైన శైలిలో ఆవిష్కరించారు.
తన పదవ తరగతి క్లాస్మేట్‌ కూతురు అచ్చం అమ్మ నోట్లో నుండి ఊడి పడ్డట్లు ఉన్నట్లు ''అచ్చం''కవితలో చాలా బాగా చెప్పారు.గుర్తుకు రాని ఆకారం,మనో ఫలకం లోపల ఎక్కడో పరిచయమున్న ముఖం. పన్ను మీద పన్ను మెరుపు... నవ్వుతుంటే తెల్లని పలు వరస. చెంప మీద సొట్ట, నొసల మీద చెమట... మాటలు జల జల పారే సెలయేరు... ఇదీ ఆయన అద్బుత వర్ణణకు ప్రతీక.
అమ్మమ్మ ఇంటికి పోయి రావాలె, అమ్మ అంబాడిన నేలను తాకి రావాలె.. మేన మామలతో మాట్లాడితేనే బంధుత్వం తీగల బలం తెలుస్తోంది అంటారు కవి అన్నవరం తన ''పోయి రావాలె'' కవితలో! మనమందరం చాలా వరకు అమ్మమ్మ ఇంట్లోనే పుట్టాం. పెరిగి పెద్దయ్యాక ప్రతి పండుగ సెలవులకు వెళ్ళడం అందరం చేసాం. కానీ పొట్ట తిప్పల కోసం నగరాలకు వలస బోయి, పండుగలకు, పబ్బాలకు కూడా సొంత ఊరికి పోయే పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ కవిత చదువుతుంటే ప్రతి మనిషి ఏదో కోల్పోయినట్లనిపించడం సహజం.
''కవి చెట్టు''కవితలో కవిత్వం విరబూసిన మహా వృక్షం అంటారు.చూపునిచ్చిన కళ్ళకు కన్నీళ్ళతో, కడగడమే అమ్మ నయనాలలో డ్రాప్స్‌ వేయడం అంటూ తన బాధను వ్యక్తం చేసారు. ప్రతి కవితలో తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు స్థానికతకు చెందిన భాష.. ఆ భాషలో, యాస మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
కవిత్వంలో జీవ భాష ఉపయోగించే అన్నవరం దేవేందర్‌ ఇతర రచనలు తొవ్వ, నడక, మంకమ్మ తోట లేబర్‌ అడ్డ, బుడ్డా పర్కలు- నానీలు, బొడ్డు మల్లె చెట్టు, ఫార్మ్‌ లాండ్‌ ఫ్రాగ్రేన్స్‌- ఇంగ్లీషులోనికి అనువదించారు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత, బువ్వ కుండ- దీర్ఘ కవిత, ఇంటి దీపం,వరి గొలుసులు, గవాయి, ది అన్‌ ఈల్డింగ్‌ స్కై, ఇవి కాకుండా వ్యాసాలు మరో కోణం (సామాజిక వ్యాసాలు), ఊరి దస్తూరి (తెలంగాణ సాంస్కృతిక చిత్రణ, కాలమ్స్‌).
చివరిగా ఈ పుస్తకంలోని ''నీలోకి నీవే''కవిత గురించి కొంచెం మాట్లాడాలి, ప్రతి మనిషిలో ఎంతో అంత అహం, ఇగో, నేనే గొప్ప, నాకే అంతా తెలుసు అన్న ఫీలింగ్‌ ఉంటుంది. అలాంటి వారి గురించి... నీలోకి నీవు ఒక్కసారైనా తొంగి చూడు, గుండె గోడల్లో ఏమైనా కొవ్వు పేరుకొని ఉండొచ్చు. నీ అంతరాత్మ కుహరంలో, ఒకసారి చెయ్యిపెట్టి దేవులాడుతుండు, నీ అహంకార మాటలతో, ఎవరినైనా నొప్పించి వుంటే, ఆ బుడిపెలు వేళ్ళకు తగలవచ్చు... దంతాలకు అంటిన అబద్దాల గార, శరీరానికి పట్టిన పాపాల జిగట, నీ మస్తిష్కంలోని, మాలిన్యపు మబ్బులు కరిగిపోతే కానీ, ఆత్మావలోకపు పుష్పం వికసించదు... ఎంత శక్తివంతమైన వ్యక్తీకరణ. మొత్తం ఈ పుస్తకం గురించి కవి, సాహితీవేత్త వేణు సంకోజు మాటల్లో చెప్పాలంటే, అన్నవరం దేవేందర్‌ తనను తాను పుటం పెట్టుకొని శక్తివంతమైన రచన చేసారని అంటారు.
ప్రజా సమూహంలోని జీవ భాషలోనే, అక్కడి సంస్కృతి సంపన్నమౌతుందని ఆలోచిస్తాడు అన్నవరం. వస్తువు దాన్ని దర్శించే గుణం, వ్యక్తీకరించే పరికరాలు, అందులోని జీవజీవాలు ఇవి అన్నవరం కవిత్వానికి తోరణాలు అని నారాయణశర్మ అన్నట్లు గొప్ప పుస్తకం ఇది.

- ప్రమోద్‌ ఆవంచ, 7013272452

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.