Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విలక్షణ బాలల కథకులు 'పుప్పాల కృష్ణమూర్తి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

విలక్షణ బాలల కథకులు 'పుప్పాల కృష్ణమూర్తి'

           బాల సాహిత్య రచన కేవలం పుస్తకాలు అచ్చు వేసుకోవడం కోసమో లేక పేరు కోసమో కాక తమ బాధ్యతగా, అత్యంత ప్రేమగా రాస్తున్న ఎందరో కవులు, రచయితలు ఇవ్వాళ్ళ తెలుగునాట ఉన్నారు. గతంలో వచ్చిన మూస కథల్లా కాక నిన్న మొన్నటి కథల పాత్రలున్నప్పటికీ ఆధునిక దృక్పథంతో, వైజ్ఞానిక స్పృహ, హేతువు వంటివి ప్రధానంగా చేసుకుని ఇవ్వాళ్ళ రచనలు ఎక్కువగా వస్తున్నాయి. అలా రాస్తున్నవారిలో కథా రచయిత, బాలల కథా, నవలాకారులు పుప్పాల కృష్ణమూర్తి మొదటి వరుసలో ఉంటారు.
           పుప్పాల కృష్ణమూరి 10 అగస్టు, 1961 లో నల్లగొండ జిల్లాలో పుట్టారు. పుల్లమ్మ- సుబ్బయ్యలు తల్లిదండ్రులు. పంచాయత్‌రాజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. 1981లో కళాశాల విద్యార్థిగా తన తొలి రచనతో కళ్ళు తెరిచిన పుప్పాల, కథా రచయితగా వివిధ సామాజిక అంశాలపై తనదైన దృష్టితో దాదాపు నూటా యాభైకి పైగా కథలు రాశారు. వివిధ సమస్యలపై నలభైకి పైగా వ్యాసాలు రచించారు. ఇవేకాక యాభై గల్పికలు, నాటికలు రాశారు. 'జీవిత చిత్రం', 'స్వేచ్ఛ, సౌందర్యం' వీరి కథా సంపుటాలు. 'విషవలయం' గల్పికల పుస్తకం. వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నారు. వాటిలో, సాక్షి, జాగృతి, నవ్య వార పత్రికలు ఉన్నాయి. నవ తెలంగాణ నిర్వహించిన పోటీల్లో ముచ్చటగా మూడుసార్లు 2017, 2018, 2019లో వరుసగా బహుమతులు అందుకున్నారు పుప్పాల.
వ్యాసకర్తగా, కథకులుగా ప్రసిద్ధులైన పుప్పాల బాలల కోసం రాసిన రచనల లిస్టు చాంతాడంత పెద్దది. బాధ్యత తెలిసిన ఈ బాలల రచయిత వద్ద ఏ మంత్ర దండం ఉందో... ఇప్పటికీ పిల్లల కోసం ఎనమిది వందల కథలు రాశారు. ఒక నవల రాశారు. వీరి కథలన్నీ సంపుటాలుగా, పుస్తకాలుగా వచ్చాయి. ఎక్కువగా నవ తెలంగాణ ప్రచురణ సంస్థ రంగుల్లో వీరి కథా సంపుటాలు ప్రచురించడం విశేషం. తొలి బాలల కథా సంపుటి 2004లో 'బుడి బుడి నడకలు' పేరుతో వచ్చింది. అటు తరువాత, 'మోసం', 'పాలపిట్ట' సంపుటాలు రాగా, జానపద కథలు 'పిట్టగూడు'గా తెచ్చారు. 'ముల్లా నసీరోద్దీన్‌ కథలు' పునఃకథనం చేసి అదే పేరుతో ప్రచురించారు.
ఇటీవల 'బుడ్డోల్ల కథలు' శీర్షికన రంగుల్లో వచ్చిన పుప్పాల కథా సంపుటాలు వీరికి ఎక్కువగా పేరుతెచ్చి పెట్టాయి. అవి 'తన కోపమే తన శత్రువు', 'జాతకం తెలిసినవాడు', 'దోసకాయలు-సొరకాయలు', 'వంతెన', 'జంతువుల స్నేహం', 'అల్లరి హద్దు మీరరాదు'. నిరంతరం పిల్లల కోసం తపించిరాసే పుప్పాల రాసిన ఇతర బాలల కథా సంపుటాలు 'వెన్నెల వాకిలి', 'రాజహంస' మొదలగు పదమూడు సంపుటాలు తెచ్చారు. పిల్లల కోసం రాసిన నవల 'ఇద్దరు మాంత్రికులు'. ఇవేకాదు, ఈ కథల మాంత్రికుని జోలెలో అచ్చుకోసం మరో పది సంపుటాలకు సరిపడా కథలు ఉన్నాయి.
వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధమున్న పుప్పాల కృష్ణమూర్తి తన మిత్రులతో కలిసి హుజూర్‌ నగర్‌లో 'స్పందన' సామాజిక అధ్యయన వేదికను నిర్వహించారు. 2020 నుండి కోదాడ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. బాల సాహితీవేత్తగా రాజీవ్‌ విద్యా మిషన్‌ నిర్వహించిన 'జాబిలి' పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నారు. అపారమైన సాహిత్య సృజనచేసిన వీరి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. 'జాబిల్లి'. 'జీవిత చిత్రం' కథా సంపుటాలపై తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్‌ పరిశోధనలు జరగగా, 'పుప్పాల కృష్ణమూర్తి జీవితం-సాహిత్యం' అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి పరిశోధన జరుగుతోంది.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం మొదలుకుని వివిధ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న పుప్పాల కథలను రాయడంలో తనదైన ఒక విలక్షణ పద్ధతిని ఏర్పరచుకున్నారు. పాత్రలు సంప్రదాయ కథల్లోనివి, నేటి బాలబాలికలు, సమకాలీన పెద్దలు అయినా విషయాన్ని నేరుగా, పిల్లలకు హత్తుకునేలా చెప్పడం ఈయన కథల్లో చూస్తాం. అన్నింటికి మించి బాలల కోసం రాయాల్సిన భాష, వస్తువు, విషయం వంటివాటిపట్ల వీరికి చక్కని అవగాహన ఉంది. అది వీరి మెజారిటీ రచనల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన 'బుడ్డోల్ల కథలు' బాలల కథకునిగా పుప్పాల కృష్ణమూర్తిని గొప్పగా చూపెడతాయి. కేవలం వస్తువు, కథల వంటివే కాక ముద్రణ విషయంలో కూడా ఇవి ప్రత్యేకమే. అందమైన ఆర్ట్‌ పేపర్‌తో, నాలుగు రంగుల్లో, అందమైన చక్కని బొమ్మలతో వచ్చిన ఈ కథల పుస్తకాలు పిల్లలకు కాదు పెద్దలకు నచ్చుతాయి. ఇందులోని కథలు కూడా అలాంటివే. ఉద్యోగ విశ్రాంత జీవితం గడుపుతూనే అవిశ్రాంతంగా పిల్లల కోసం రాస్తున్న పుప్పాల కథల పుట్టలోంచి మరిన్ని మేలిమి కథల కోసం చూస్తూ.... జయహో! బాల సాహిత్యం.

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.