Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలల రంగస్థల నాయకుడు 'మధిర బాబ్లా నాయక్‌' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Oct 09,2022

బాలల రంగస్థల నాయకుడు 'మధిర బాబ్లా నాయక్‌'

            తొంభయ్యవ దశకానికి ముందు పాఠశాల ఉత్సవాలు, వార్షికోత్సవాల వంటి కార్యక్రమాల్లో నాటికలు తప్పనిసరిగా వుండేవి, కాబట్టి అచ్చులోనూ అందుబాటులో ఉండేవి. ఇటీవల ఆ కొరత కొంత వుందన్నది నిజం. ఈ లోటును కొంత బర్తీ చేస్తూ పిల్లల కోసం చక్కటి నాటికలు రాసి తాయిలంగా అందించినవారిలో 'మధిర బాబ్లా' గా ప్రసిద్ధుడైన ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రమావత్‌ బాబురావు, లేదా మధిర బాలోత్సవాల బాబ్లా ఒకరు. తన స్వీయ రచనల విషయంలో పరిచయాలకు, వేదికలకు దూరంగా ఉండి రాయడం, అచ్చువేయడం, ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో తృప్తి చెందే బాబ్లా అచ్చమైన బాల సాహిత్యకారుడు.
            నాకు తెలిసి తెలుగులో బాల సాహిత్యాన్ని రాస్తున్నవారిలో 'గోర్‌మాటి' (బంజారాలు) వేళ్ళ మీద లెక్కించే సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో నాకు మధిర బాబ్లా పేరొక్కటే కనిపి స్తోంది. ఒకవేళ ఇతరులు ఇంకా ఉన్నట్టయితే సంతోషించాల్సిన ముచ్చట. మాతృభాష తెలుగు కాకున్న, తెలుగులో నాటక కర్తగా, ప్రయోక్తగా, ఆర్గనైజర్‌గా, దర్శకులుగా రాణిస్తున్నాడీ విశ్రాంత బ్యాంకు మేనేజర్‌. మధిర బాబ్లా తన తండ్రి యాదిలో 'శ్రీ రామభక్త సీతయ్య కళా పరిషత్‌' ద్వారా ప్రతి సంవ త్సరం నవంబర్‌ నిర్వహించే 'మధిర బాలోత్సవాలు' కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ ఉత్సవాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ మన బాబ్లా కావడం విశేషం.
బాబ్లా తనకు ఇష్టమైన రంగస్థలాన్ని బాల సాహిత్యానికి నేపథ్యంగా మలచుకోవడం తెలుగు పిల్లల సుకృతం. ముచ్చట గా మూడు నాటికా సంపుటాలు బాలలకు అందించారు. తాను చేసే ప్రతి పనిలో తన తండ్రి 'రామభక్త సీతయ్య' ప్రస్తావన లేనిదే ఏదీ చేయడు. దశాబ్దాలుగా వేదికలపై, పరిషత్తుల్లో పౌరాణిక, సాంఘిక నాటకాలు చూస్తున్న, ఆడుతున్న బాబ్లా ఆ ఆనందం ఒక్క పెద్దలకే ఎందుకు దక్కాలి? పిల్లలకు కూడా ఆ రసానందం కావాలన్న ఆలోచనలతో పిల్లల కోసం నాటికా రచన ప్రారంభించాడు. అలా ఆయన ఆలోచనలలోంచి వచ్చిన తొలి బాలల రచన, 'పిల్లల నాటికలు', ఇది పౌరాణిక, సాంఘిక నాటికల సమాహారం. ఇందులో ఆరు పౌరాణిక లఘు నాటికలు, ఒక నాటకం, పన్నెండు సాంఘిక నాటికలు ఉన్నాయి. 'పాదుకా పట్టాభిషేకం', 'బలిచక్రవర్తి... గురువు అనుగ్రహం', 'భక్త మార్కండేయ.. శివభక్తి' వంటి విషయాలు, కథలను తరతరాలుగా మనల్ని తీర్చిదిద్ధినట్టే బాలలను కూడా ప్రభావితం చేస్తాయి. మధ్యపాన నిషేధాన్ని 'సోమరసం' వంటి పౌరాణికాంశాలతో చెప్పడం విశేషం.
పిల్లల కోసమే బాబ్లా తెచ్చిన మరో నాటిక సంపుటి, పూర్తి సాంఘిక నాటికల మాహారమైన 'సందేశాత్మక సాంఘిక నాటికలు'. పుస్తకం పైన 'బాల రంగస్థలం-బాల సాహిత్యం' అని రాయడం, 'ఇది పిల్లలకోసమే సుమా!' అని ప్రేమగా చెప్పడం కనిపిస్తుంది. ఇందులో అనేక సాంఘిక, సామాజిక అంశాలు, అక్భర్‌-భీర్భల్‌కు సంబంధించినవి ఉన్నాయి. ఆయనే చెప్పుకున్నట్టు, 'మన చుట్టూ ఉన్న సమస్యల్ని, పెద్దలు చెప్పే నీతి వాఖ్యాలకు సంభాషనలను జోడించి, సమాజాన్ని సన్మార్గం వైపు మళ్ళేలా ముగింపు ఇస్తూ, నాటికలు తయారయ్యాయి.' ఇందులోని నాటికలన్నీ సామెతలు, ప్రసిద్ధ పలుకులను భూమికగా చేసుకుని రాసినవి కావడం విశేషం. 'నా పాపాలు పంచుకుంటారా?', 'కాకి- పిండిపదానం', 'దేవడు వరం అందిస్తే...', 'పులి-బంగారు కంకణం', 'చెరపకురా చెడేవు', 'విధి లిఖితం-చిలుక ప్రాణం', 'ఎవరు తీసిన గోతిలో వారే...', 'దెయ్యం ఏడ్చింది' వంటి పేర్లు ఆ విషయాన్ని తెలపడమే కాకా ముందే కథపట్ల అవగాహనను కలిగిస్తాయి. పాత్రల రూపకల్పన, బాలల స్థాయిలో సంభాషణలు నడిపిన విధానం నాటికలకు అందాన్ని తేవడమేకాక, నాటికల పట్ల పిల్లలకు ఒక ఆకర్షణను కూడా కలిగిస్తాయీ రచనలు.
మూడవ పుస్తకం 'బాల సాహిత్యం-పిల్లల పౌరాణిక పద్య నాటికలు'. ఇది కూడా ఆశ్చర్చమే. పద్యాలు, రాగాలు, ఒక్కో పాత్రను ముగ్గురు నలుగురు పోషించే పౌరాణిక నాటకాలను పిల్లలకోసం కూర్చడమంటే అది కత్తిమీద సాము వంటిదే. ఆ సాములో బాబ్లా విజయడయ్యారు కూడా. ఇందులోని 'హరిశ్చంద్ర, భక్త ప్రహ్లాద, త్రిజట స్వప్నం, భక్త పోతన, బాలవర్ధి, తెనాలి రామకృష్ణుడు' వంటి నాటికల పేర్లు చూడగానే వాటిని చూసాక పిల్లల్లో కలిగే పరివర్తన కనిపించడంతో పాటు, వీటిని మధించి, కుదించి, మార్పులు చేర్పులు చేసిన రచయిత సాహసం కూడా తెలుస్తోంది. ఒక ప్రసిద్ధ రచనను అనువాదం చేస్తున్నప్పుడు, సంక్షిప్తీకరి స్తున్నప్పుడు, లేదా దానిని ఇతర రూపాల్లోకి తెస్తున్నప్పుడు మూలం చెడకుండా, భావం కుంగకుండా, అసలు రచన అందం తగ్గకుండా తేవాలి. అప్పుడే ఆ రచన అందరి మన్ననలు పొందుతుంది. అన్నీ ఇందులో చూడొచ్చు. అత్యంత సరళమైన పద్యాలు ఇందులో పెట్టాడు బాబ్లా. పిల్లల కోసం నాటికలు, నాటకాలు రావడం లేదని వాపోతున్న సమయంలా తెలంగాణ నేలమీంచి ఒకే రచయిత మూడు నాటికల పుస్తకాలు తేవడం తెలుగు బాల సాహిత్యంలో కొత్త చేరికనే కాదు, ఒక కొత్త పుట. తన మనవల్లాంటి పిల్లలకు చక్కని నాటికల తాయిలం అందించిన రమావత్‌ బాబ్లా అభినందనీయుడు. జయహో! నాయ(క్‌)కా!

- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

తాజా వార్తలు

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.